Brundavanive Song Lyrics – Gam Gam Ganesha (2024) | Sid Sriram

బృందావనివే పాట యొక్క లిరిక్స్‌ను (Brundavanive Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన గం గం గణేశా (Gam Gam Ganesha) అనే తెలుగు సినిమాలోని పాట. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, ఇమాన్యువెల్, ప్రగతి శ్రీవాస్తవ్, నయన్ సారిక, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, అర్జున్ రాజ్ తదితరులు నటించారు. ‘బేబి’ (2023) లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఇది అవ్వడం వల్ల ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. బేబి సినిమాలో భగ్న ప్రేమికుడిలా కనిపించిన ఆనంద్, ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించి, ఇమ్మాన్యుయెల్ తో కలిసి చేసే కామిడి జనాలకు నచ్చింది. ఆనంద్ దేవరకొండ సినిమాల జాబితాను ఒకసారి చూస్తే తెలిసేది ఏమిటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈయన మొదటి సినిమా ‘దొరసాని’ 2019లో విడుదలైంది. తర్వాత ప్రతీ సంవత్సరం ఏ గ్యాప్ లేకుండా వైవిధ్యమైన వివిధ కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ ఉన్నాడు.

ఈ ‘గం గం గణేశా’ సినిమా విషయానికి వస్తే ఇది 31 మే 2024న థియేటర్స్ లలో విడుదలైంది. తర్వాత జూన్ 20, 2024నుంచి ‘అమేజాన్ ప్రైమ్ వీడియోలో’ స్ట్రీమ్ అవుతా ఉంది. ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళితే, అప్పటి సినిమాలో 100, 200 రోజులు సినిమా థియేటర్స్ లలో ఆడుతుండేవి. కాని ఇప్పటి సినిమాలు శుక్రవారం రిలీజ్ అయితే వచ్చే శుక్రవారానికల్ల శెడ్ కు వెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే రెండు మూడు వారాల పాట ఆడుతున్నాయి. ఈ గం గం గణేశా చిత్రం కూడా అంతే ఒక వారం కూడ థియేటర్ లలో ఆడలేదు. సినిమా రిలీజ్ అయ్యి 15 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు అది చిన్న సినిమాన పెద్ద సినిమాన అని ఆలోచించరు. అందుకే ఎవ్వరైన ఎడాపెడా సినిమాలు తీసుకుంటూ వెళ్ళడం కంటే, మంచి కథను నమ్ముకుని కొద్దిగా లేట్ అయిన పర్లేదు మంచి సినిమాలు తీయాలనే కోరుకునే టి.ఎఫ్.ఐ బానిసలలో నేను ఒకడ్ని.

ఈ సినిమాలో దాదాపు ఐదు పాటలు ఉంటే వాటిలో ‘బృందావనివే’ పాట సూపర్ డూపర్ హిట్ అయి ట్రెండింగ్ లో నిలిచింది. ఈ పాటను చిత్రబృందం “లవ్ సాంగ్ ఆఫ్ ది సీజన్” అని ప్రమోట్ చేసింది. దానికి తగ్గట్టుగానే పాటలో ప్రాణం ఉంది మరియు లవ్ ఫీల్ కూడా ఉంది. ఈ పాటను పాడింది సిద్ శ్రీరామ్ మరియు చైతన్య భరద్వాజ్. మంచి మంచి హిట్ పాటలు సిద్ శ్రీరామ్ పాడుతున్నాడ లేక, సిద్ శ్రీరామ్ పాడే పాటలు హిట్ అవుతున్నాయా అనేది నాకైతె అర్థ కాలేదు. ఏదో ఒకటో రెండు పాటలైతే పోనీలే అని వదిలేయడానికి, మొత్తం అన్నీ పాటలు హిట్ లిస్ట్ లో నిలిచే సామర్థ్యాన్ని కలిగినవే ఉన్నాయి. అది నిజంగా సిద్ యొక్క అదృష్టమనే చెప్పాలి.

ఇక ఈ పాటకు రచించింది వెంగీ సుధాకర్. అలాగే ఈ పాటకు సంగీతంతో పాటు సిద్ శ్రీరామ్ తో స్వరాన్ని కూడా కలిపింది చైతన్య భరద్వాజ్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు ఎందుకంటే ‘ఆర్.ఎక్స్ 100 (2018)’ సినిమాకు సంగీతం అందిచింది ఈయనే. ఆ సినిమాలోని అన్ని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పేదేముంది. ముఖ్యంగా పిల్లారా పాటైతే ఎవర్ గ్రీన్ పాట. అలాంటి మ్యూజిక్ కంపోజర్ ఈ గంగం గణేశా సినిమాకు కూడా సంగీతం అందించాడంటే, ఎన్నేళ్ళయిన గుర్తుండిపోయే కొన్ని పాటలైన ఇచ్చి ఉంటాడనడంలో సందేహం లేదు కదా. ఈ బృందావనివే పాటను దానికి ఉదాహరణ చెప్పవచ్చు. ‘బృందావనివే’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: బృందావనివే
  • సినిమా: Gam Gam Ganesha (గం గం గణేశా)
  • నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక
  • సినిమా దర్శకుడు: ఉదయ్ బొమ్మిశెట్టి
  • సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
  • గేయరచయిత: వేంగి సుధాకర్
  • గాయకులు: సిద్ శ్రీరామ్, చైతన్ భరద్వాజ్
  • సినిమా విడుదల తేదీ: మే 31, 2024
  • లేబుల్: సరిగమ తెలుగు

Brundavanive Song Lyrics in Telugu

అందాల అందాల
అందం నన్నే తాకి పోయే
అందెల్లో జారి నే పడిపోయానే

మందార మందార
గంధం గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి
వలలే పట్టి నను పట్టే
అయ్యో నా కనులే చేరి
కలలడిగే పిల్లరా
నయగారమే నాపై చల్లే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే

అదో ఇదో ఎదో అనేసాకే అలజడి కలిగే
యధావిధి ఎదే ఏమాయెనే
మది వలపులు చిలికే
హడవిడి పడి పడేసావే మనసను మదినే
పదే పదే అదే సొదాయెనే

వెన్నెలైపోయే చీకటే వేళ
వన్నెలే ఉన్న వాకిటే
దారుణాలు తగవే
కన్నుల కారణాలు కనవే
విడువనులే చెలి నిను క్షణమే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
సింధూరివే

సరి గమ పద పెదాలేవో ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలనే
తొలి వలపుల జతకే
నది నదానికే ముడేసాకే
తనువులు తొనికే
అదే అదే వ్యదే కధాయేనే

నీడలా వెంట సాగని
నీలి కళ్లలో నన్ను దాగని
వాయిదాలు అనకే
గుండెలో వేదనేదో వినవే
మనువడిగే మధనుడి స్వరమే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే

Brundavanive Lyrics in English

Andhaala Andhaala
Andham Nanne Thaakipoye
Andhello Jaari Ne Padipoyaane

Mandara Mandara
Gandham Gaallo Kalisipoye
Vayyaari Choope Parugetti
Valale Patti Nanu Patte
Ayyo Naa Kanule Cheri
Kalaladige Pillaraa
Nayagaarame Naapai Challe

Brundavanive Yavvanive Neeve
Naa Manase Nee Vashame Raa
Preyasive Oorvashive Neeve
Aaraadhanamainaave

Praanaale Leve
Padasaage Cheli Nee Venukaa
Naa Sruthive Sangathive Neeve
Naa Aanathivai Raave

Adho Idho Edho
Anesaake Alajadi Kalige
Yadhaavidhi Edhe Yemaayene
Madhi Valapulu Chilike
Hadavidi Padi Padesaave
Manasanu Madhine
Padhe Padhe Adhe Sodhaayene

Vennelaipoye Cheekate Vela
Vannele Unna Vaakite
Daarunaalu Thagave
Kannula Kaaranaalu Kanave
Viduvanule Cheli Ninu Kshaname

Brundavanive Yavvanive Neeve
Naa Manase Nee Vashame Raa
Preyasive Oorvashive Neeve
Aaraadhanamainaave

Praanaale Leve
Padasaage Cheli Nee Venukaa
Naa Sruthive Sangathive Neeve
Sindhoorive

Sari Gama Pada
Pedaalevo Premani Vethike
Budha Guru Ane Rojelane
Tholi Valapula Jathake
Nadhi Nadhaanike Mudesaake
Thanuvulu Thonike
Adhe Adhe Vyadhe Kadhaayene

Needala Venta Saagani
Neeli Kallalo Nannu Daagani
Vaayidhaalu Anake
Gundelo Vedhanedho Vinave
Manuvadige Madhanudi Swarame

Brundavanive Yavvanive Neeve
Naa Manase Nee Vashame Raa
Preyasive Oorvashive Neeve
Aaraadhanamainaave

Praanaale Leve
Padasaage Cheli Nee Venukaa
Naa Sruthive Sangathive Neeve
Naa Aanathivai Raave

బృందావనివే Video Song


గం గం గణేశా సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా మొత్తం గణేశుడి ప్రతిమ చుట్టు తిరుగుతుంది. ఎందుకంటే మన హీరో డైమండ్ ని దొంగతనం చేసి కారులో వెళుతున్నప్పుడు పోలీస్ చెకింగ్ జరుగుతుంటుంది ఆ రోడ్డులో. అప్పుడు ఆ డైమండ్ ను హీరో తన పక్కన వాహనంలో ఉన్న గణేశుని బొమ్మ తొండంలో దాస్తాడు. పోలీస్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఆ బొమ్మలో నుండి డైమండ్ తీసుకోవడానికి ఆ గణేశుని బొమ్మ ఉన్న వాహనాన్ని వెంబడిస్తారు. ఏదోలా ఆ విగ్రహం ఒక గ్రామంలో కూర్చోబెట్టారని తెలుసుకుని, ఆ డైమండ్ ను ఎలాగోలా తిరిగి తీసుకోవాలని హీరో మరియు అతని స్నేహితుడు అదే గ్రామంలో కొన్ని రోజులు ఉండి, తాము మీడియా ప్రతినిధులమంటు ఆ ఊరి ప్రజలను నమ్మిస్తారు. అదే క్రమంలో ఆ ఊరిలో అందమైన అమ్మాయి అయిన మన హీరోయిన్ నీలవేణి మన హీరో గణేశ్ కు పరిచయం అవుతుంది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అదే సమయంలో ఈ బ్యూటిఫుల్ పాట వస్తుంది.

నిజం చెప్పాలంటే హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగతి శ్రీవాస్తవ చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటలో అయితే అందమైన పల్లెటూరి అమ్మాయిగా తన కట్టుబొట్టు చూడముచ్చటగా అనిపిస్తుంది. అలాగే మన ఆనంద్ దేవరకొండ కూడా చాలా క్యూట్ చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికి ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణ ప్రగతి అని చెప్పొచ్చు. చిత్ర బృందం ఈ పాటను ‘లవ్ సాంగ్ ఆప్ ది సీజన్’ గా ప్రమోట్ చేయడంలో తప్పులేదు అనిపిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top