This post features the Yellamma song lyrics in Telugu and English from the Telugu movie Bheemadevarapally Branchi (2023). The song, composed by Charan Arjun with lyrics by Sanjay Mahesh Varma and sung by Vollala Vani and Nalgonda Gaddar, is featured at the beginning of the film. It is set during the celebration of the Yellamma festival in Bheemadevarapally village. Yellamma, a Gramadevata (village deity), is a protective deity worshipped in many Indian villages to safeguard the community from misfortunes.
The song beautifully captures the essence of rural traditions and shows how villagers come together to celebrate their local festivals. It portrays a vibrant atmosphere where the entire community gathers in one place, reflecting the unity and cultural richness of village life. This festive song sets the tone for the film and introduces the audience to the warmth and spirit of the village.
Song | Yellamma (ఎల్లమ్మ) |
Movie | Bheemadevarapally Branchi (భీమదేవరపల్లి బ్రాంచి) |
Starring | Anjibabu, Prasanna, Abhi Ram, Roopa Srinivas |
Movie Director | Ramesh Cheppala |
Music | Charan Arjun |
Lyrics | Sanjay Mahesh Varma |
Singers | Vollala Vani, Nalgonda Gaddar |
Movie Release Date | 23 June 2023 |
Video Link | Watch on YouTube |
Yellamma Song Lyrics in Telugu
మమ్ము ఆదరించవే లోకమాతా
(అమ్మ జగదాంబ భ్రమరాంబ
మమ్ము ఆదరించవే లోకమాతా)
గౌతూని కోడలా గాంభీర రాణివి
(గౌతూని కోడలా గాంభీర రాణివి)
పరుషరాముని కన్న పరమ కళ్యాణివి
(పరుషరాముల కన్న పరమ కళ్యాణివి)
బొట్టోక సేతూల, బోనమొక సేతూల
(బొట్టోక సేతూల, బోనమొక సేతూల)
గావుబిళ్ళ ఒక సేత, గటమొక సేతూల
(గావుబిళ్ళ ఒక సేత, గటమొక సేతూల)
జగదాంబ, భ్రమరాంబ
భ్రమరాంబ, జగదాంబ
అమ్మ జగదాంబ భ్రమరాంబ
మమ్ము ఆదరించవే లోకమాతా
లోకాలే ఏలేటి పరమశివునికి
పుట్టీన గారాల బిడ్డవే నువ్వు
(పుట్టీన గారాల బిడ్డవే నువ్వు)
మనసుకు నచ్చిన వాడిని పెండ్లాడి నువ్వు
దేవుళ్ళ దీవెనతో బిడ్డలగన్నావే
(మా దేవుళ్ళ దీవెనతో బిడ్డలగన్నావే)
ఈ నేలను కాపాడే కనతల్లివయ్యావే
మము సల్లగ జూసే తల్లి
నువ్వే అమ్మా ఎల్లమ్మా
(మము సల్లగ జూసే తల్లి
నువ్వే అమ్మా ఎల్లమ్మా)
భర్తను బతికించుకోగా
నువు బోనం ఎత్తావే
ఆనాటి నుండి బోనాల తల్లివి అయ్యావే
(ఆనాటి నుండి బోనాల తల్లివి అయ్యావే)
(మైసమ్మ వరపాట్నమేలే
లోకమాత రేణుక ఎల్లమ్మ దేవి
ఎల్లమ్మ కన్నకొడుకులు పంచపాండవుల రీతి
ఐదుగురు అన్నదమ్ములు, ఆ…
అందరికన్నా పెద్దవాడు నల్ల నల్లనివాడు
వల్లాని రోమాల వాడు, ప్రాణాల గుత్త
బల పరుషరాముడైనా ఆ…
బల పరుషరాముడు, ఏయ్ ఏ ఏ
కన్నతల్లి రేణుక ఎల్లమ్మ దగ్గరికి
చేర వచ్చిండు.
అమ్మా, కన్నతల్లి రేణుక ఎల్లమ్మ దేవీ, ఏయ్
మా నానెక్కడున్నడు, ఏయ్ )
మా తండ్రి జాడలు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
నువ్వు జాడలు జెప్పు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
(మా తండ్రి జాడలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ
నువ్వు జాడలు జెప్పపే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ)
ఏ కులమైతేంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
ఎలిగించి చెప్పవే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
(ఏ కులమైతేంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ
ఎలిగించి చెప్పవే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ)
(ఎల్లమ్మో ఓ ఆ…
రేణుక ఎల్లమ్మ దేవీ, ఏయ్
మా తండ్రి జాడ జెప్పు ఏ కులమైతేంది
మా తండ్రిని తీసుకొచ్చుకొని, అమ్మో, ఆ ఆ
బాపని పిలుసుకుంటమమ్మా
మా తండ్రి జాడ జెప్పపోతే
గండ్ర గొడ్లతోని తల గద్దలా
పండు దీత్తనాని ఆ…)
(బల పరుషరాముడే, ఏయ్
ఏడు పుట్ల గండ్ర గొడ్డలి దీసి
తల్లి గొంతు మీద పెట్టిండు
ఎద మీద పాదం బెట్టిండు, అరెరెరే)
కన్నతల్లిని నేను
అన్నన్ని మాటలు అనకయ్య పరశరామ
(నువ్వు అనకయ్య పరుశరామా)
ఉత్త నిందలు వేసి అందరిలో
నన్ను పలుసన జేయకురా
(నన్ను పలుసన జేయకురా)
ఏ పాపము ఎరుగను ఎనాడు
నా మాటలు నమ్మయ్యా
(నా మాటలు నమ్మయ్యా)
ఆ దేవుడు నాకు దీవించి ఇచ్చిన
బిడ్డలు మీరయ్యా
(ఆ బిడ్డలు మీరయ్యా)
మీ అమ్మొక దేవతరా
ఎంత మొక్కు తనివే తీరదిరా
(ఎంత మొక్కు తనివే తీరదిరా)
అందుకే ఏడాదికోమారు
చెయ్యాలి ఎల్లమ్మ జాతరా
(చెయ్యాలి ఎల్లమ్మ జాతరా)
ఎన్నెన్నో రూపాల్లో
ఆ తల్లి మనలను సల్లంగ కాసురా
(ఎల్లమ్మా సల్లంగ కాచురా)
ఒక్కేసి డప్పాట మావురాలెల్లమ్మ
ఒక్క శివ సత్తాట మావురాలెల్లమ్మ
(ఒక్కేసి డప్పాట మావురాలెల్లమ్మ
ఒక్క శివ సత్తాట మావురాలెల్లమ్మ)
రెండేసి డప్పులు మావురాలెల్లమ్మ
రెండు శివ సత్తులు మావురాలెల్లమ్మ
(రెండేసి డప్పులు మావురాలెల్లమ్మ
రెండు శివ సత్తులు మావురాలెల్లమ్మ)
పరుశరాముడు గనుక ఏనాడు
జాంబవంతుల వాడ లోపల
జోడి యావుల గడలయందు
గోలేము కాడా ఆ…
పంచ ముగ్గుల పట్నాలు ఏసి
ఎడంత్రాల బోనం సమర్పించి
రేణుక ఎల్లమ్మ దేవికి
మేకపోతుల మత్త గొలిపి, ఆ….
బైండ్ల వాళ్ళు జమిడిక మోతల తోటి
ఒగ్గోల్ల డోలు సప్పుళ్ళతోటి, ఏ…
ఊరోళ్ళ వాడల్లా సేను సెలకల్లా
ఎల్లమ్మా నీకు గుడులు గోపురాలంటా
(మా ఎల్లమ్మా నీకు గుడులు గోపురాలంటా)
గౌడన్నా జాంబవంతుల కుల దైవం నువ్వు
సబ్బండా వర్ణాల సొంతం అయ్యావు
(ఆ సబ్బండా వర్ణాల సొంతం అయ్యావు)
యాప రిల్లలు, యాట పోతులు
కల్లు సాకలు, వట్టి శాపలు అన్నీ నీకేలే
(ఆ కల్లు శాకలు, వట్టి శాపలు అన్నీ నీకేలే)
ఏ లోటూ రాకుండా
నీకు పూజలు జేస్తామే
మా ఇల్లూ వాకిలి, పిల్లాజెల్లలు
సల్లంగా జూడే
(మా ఇల్లూ వాకిలి, పిల్లాజెల్లలు
సల్లంగా జూడే)