(యాలో యాలా) Yaalo Yaalaa Song Lyrics in Telugu from Animal (2023)

యాలో యాలా పాట యొక్క లిరిక్స్‌ను (Yaalo Yaalaa Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2023లో విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోని పాట. సందీప్ రెడ్డి వంగా నిజంగా మిగతా దర్శకుల కంటే కూడా భిన్నమైన వ్యక్తి. మరి లేకపోతే తీసిన మూడు సినిమాలకే (అందులో ఒకటి రిమేక్) అతని తర్వాత సినిమాలపై అంచనాలు తారాస్థాయికి చేరినాయి. ఈ యానిమల్ (2024) సినిమా తర్వాత ఈయన ప్రభాస్ గారితో స్పిరిట్ అనే సినిమా తీయబోతున్నాడు. యానిమల్ సినిమా దాదాపు మూడు గంటలవరకు ఉంటుంది. ఎడిటింగ్ లో తీసివేయవలసిన సీన్లు చాలానే ఉన్నాయి అని చాలా చెబుతున్నారు. దీనికి సందీప్ రెడ్డి ఏమి చెబుతున్నారంటే ఆ సీన్లవల్ల సినిమా నిడివి పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు ఉంచవలసిందంటే ఆ సీన్లవల్ల ఆ పర్టికులర్ క్యారెక్టర్ గురించి మరింత లోతుగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చెప్పాడు. ఇక యాలో యాలా పాట గురించి చెప్పాలంటే, కేవలం పాటను వింటున్నప్పుడు ఒకలా ఉంటుంది, అదే ఆ పాటను వీడియోతో పాటుగా చూస్తే ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో ఈ పాటే వచ్చే సమయంలో జరుగుతున్న సన్నివేశం చెప్తే శాక్ అవుతారు. అక్కడ జరిగేది మన ఆల్ఫా మెన్ రణ్ విజయ్ కు మరియు విలన్ అయిన అబ్రార్ హక్ (బాబీ డియోల్ పాత్ర) మధ్య ఫైట్. ఇదేంటి హీరో మరియు విలన్ మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు, హీరో తన నాన్న గురించి పాట పాడుతన్నట్టు ఉండడం ఏమిటో తర్వాత వివరంగా చర్చిద్దాం.

“యాలో యాలా” పాటను తెలుగులో రాసింది అనంత శ్రీరామ్. ఇక్కడ ప్రత్యేకంగా తెలుగు రాసింది అని ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఒరిజినల్ హిందీ సినిమా కావడంవల్ల మరియు ఈ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకులు హింది (మరియు పంజాబి) కి సంబందించినవారు అవ్వడం వల్ల మొదట అన్ని పాటలను హిందీలో రాసి, తర్వాత వేరే భాషలలో రాశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈ యానిమల్ సినిమాలోని తెలుగు పాటలన్ని మన అనంత శ్రీరామ్ వ్రాసాడు. ఇక ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది రాజీవ్ కుమార్ అలియాస్ జానీ. ఈయన కేవలం పాటల కంపోజర్ మాత్రమే కాదూ గేయ రచయిత కూడాను. జాని హింది మరియు పంజాబి భాషలలో పాటలకు సంగీతం ఇవ్వడం వల్ల ప్రసిద్ధిగాంచాడు. ఇతను 1989లో పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. ఈయనకు హోటెల్ మ్యానేజ్మెంట్ లో డిప్లామో ఉన్న కూడా సంగీతంపై మక్కువతో సంగీత దర్శకుడిగా, గేయరచయితగా మారి ఎన్నో హిట్ పాటలకు అందిచారు. ఈయన తను నటుడిగా కూడా ప్రేక్షకుల్లో తగిన గుర్తింపు పొందారు. 2021లో పంజాబీ చిత్రం ఖిస్మత్ 2లో నటుడిగా తెరపైకి అడుగుపెట్టాడు.

ఇక ఈ పాటను పాడింది అనురాగ్ కులకర్ణి. ప్రస్తుతం మన తెలుగులో చాలా బిజీగా ఉన్న గాయకుల్లో అనురాగ్ ఒకరు. తెలంగాణాలోని కామారెడ్డిలో జన్మించిన అనురాగ్ చిన్నప్పుడు సంగీతంపై ఆసక్తితో హిందూస్తాని సంగీతాన్ని నేర్చుకున్నాడు. 2015లో తెలుగు రియాలిటి షో ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8లో భాగవహించి ఆ సీజన్ యొక్క విజేతగా నిలిచారు. అనురాగ్ కులకర్ణీ 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను దాదాపు 800 లకు పైగా పాటలను పాడినట్టు చెప్పుకొచ్చాడు. దీని బట్టి తెలుస్తుంది ఈయన ఎంత పెద్ద బిజీ సింగరో. ఈ మధ్యకాలంలో మనం వినే చాలా హిట్ పాటల్లో ఈయన పాడిన పాటలు కూడా చాలానే ఉంటాయి. మంచి పాటలు వెతుకుంటు మరి అనురాగ్ స్వరాల్లోంచి ప్రేక్షకుల దగ్గరకు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఈ “యాలో యాలా” పాట కూడా ఒకటి. యాలో యాలా పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: యాలో యాలా
  • సినిమా: యానిమల్ (Animal)
  • నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా
  • సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
  • సంగీత దర్శకుడు: జాని
  • గేయరచయిత: అనంత శ్రీరామ్
  • గాయకుడు: అనురాగ్ కులకర్ణి
  • సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
  • లేబుల్: టీ-సిరీస్ తెలుగు

Yaalo Yaalaa Song Lyrics in Telugu

హో యాలో యాలా యాలోరే
హో యాలో యాలా యాలోరే
హో ఎన్నో ఏండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
హో ఎన్నో ఏండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే

ఓ యాలో యాలా యాలోరే
ఓ యాలో యాలా యాలోరే
ఎన్నో ఏండ్ల ఆకలికి
యాట మొదలైందయ్యో ఈ యాలే
ఎన్నో ఏండ్ల ఆకలికి
యాట మొదలైందయ్యో ఈ యాలే

మండేటి ఎండల నుండి
ఎగసిపడే సూరీడులాగొస్తా
కమ్మేటి మబ్బులు కాల్సి
నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా

నింపేసుకుంట నిన్ను నాలోనా
అచ్చేసుకుంట నిన్ను నా మీనా
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామివంటే నువ్వే లోకానా

సెమ్మ సేరదు మీ కంటా
ఓ సెమ్మ సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా

హో పిడుగై నేనటే రానా
హో బడాబాగ్నులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా

Yaalo Yaalaa Lyrics in English

Ho Yaalo Yaalaa Yaalore
Ho Yaalo Yaalaa Yaalore
Ho Enno Yendla Seekatiki
Poddhu Podisindhayyo Ee Yaale
Ho Enno Yendla Seekatiki
Poddhu Podisindhayyo Ee Yaale

Ho Yaalo Yaalaa Yaalore
Ho Yaalo Yaalaa Yaalore
Enno Endla Aakaliki
Yaata Modhalaindayyo Ee Yaale
Enno Endla Aakaliki
Yaata Modhalaindayyo Ee Yaale

Mandeti Endala Nundi
Egasipade Sooreedu Laagostha
Kammeti Mabbulu Kaalsi
Nee Suttu Ennellu Pongisthaa

Nimpesukunta Ninnu Naalonaa
Achesukunta Ninnu Naa Meena
Mokkedhi Ninne Yeppudainaa
Naa Saamivante Nuvve Lokaanaa

Semma Seradhu Mee Kantaa
O Semme Seradhu Mee Kanta
Ammathodu Nenundagaa
Meeku Aapadhe Raadhantaa

Ho Pidugai Nenate Raanaa
Ho Badabaagnulu Eedhainaa
Bhoominainaa Buggi Seseynaa
Neeku Emannaithe Naannaa
Bhoominainaa Buggi Seseynaa
Neeku Emannaithe Nanna

యాలో యాలా Video Song


సందీప్ రెడ్డి వంగా విలక్షణమైన దర్శకుడు అని ఈ యొక్క పాట ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకుంటే అక్కడ జరిగే సన్నివేశం హీరో విలన్ మధ్య ఫైట్ సీన్. కానీ బ్యాగ్రౌండ్ లో ప్లే అయ్యేది మాత్రం క్లాసిక్ గా సాగే నాన్న పాట. అంటే హీరో రణ్ విజయ్ తన నాన్న గురించి పాట పాడుతున్నట్టు ఉంటుంది. ఇంతకి ఈ పాట సందర్భాన్ని చెప్పాలంటే సినిమా కథను సింపల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది క్లైమాక్స్ ఫైట్ కాబట్టి. హీరో రణవిజయ్ నాన్న ఒక పెద్ద పారీశ్రామికవేత్త ఆయనను చంపాలని విలన్ గ్యాంగ్ ఒకసారి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో వాళ్ళు ఎవ్వరు ఎందుకు తన నాన్నను చంపడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవాలని రకరకాల పద్దతిలో తెలుసుకుంటాడు. దానికి ముఖ్య కారణం హబ్రార్ అని తెలుసుకుని వాడు వేరే దేశంలో (దుబాయ్ అనుకుంటా) ఉన్నాడని తెలుసుకుని వెళ్ళి మరి చంపేస్తాడు. చంపె ముందు జరిగే ఫైట్ లో బ్యాగ్రౌండ్ లో ఈ పాట కొనసాగుతూ ఉంటుంది.

ఈ పాట ద్వారా రణ్ విజయ్ కు తన తండ్రిపై ఉన్న గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తాడు. “ఎన్నో ఏండ్లా ఆకలికి యేటా మొదలైందయ్యో ఈయాలే” అనే వాక్యం ద్వారా ఇన్నాళ్ళు తన నాన్నను ఎవ్వడు చంపాలనుకుంటున్నాడో వెదుకుతూ ఉన్నాడు. ఈరోజు వాడెవడో తెలిసి, వాడి అంతు చూస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఫైటే మధ్య ఇలాంటి పాటను చూడడం నాకైతే ఇదే ఫస్ట్. ఆ ఫైట్ ను కంపోజ్ చేసిన విధానం కూడా చాలా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. ఈ ఫైట్ లో హీరో మరియు విలన్ కు సంబంధించిన వారు ఆ ఫైట్ ని దూరం నుంచి చూస్తూ ఉంటారు, కేవలం హీరో విలన్ మాత్రమే పోటాపోటీగా రెండు చిరుత పులుల్లా దాదపు రెండు గంటల పాటు కొట్టుకుంటు ఉంటారు. ప్రతీ సినిమాలో జరిగే విధంగానే చివరకు హీరోనే గెలవాలి కాబట్టి, మన హీరో విలన్ ని గొంతు కోసి చంపేస్తాడు.

అనంత శ్రీరామ్ సాహిత్యం, జానీ సంగీతం, అనురాగ్ కులకర్ణీ గానం మరియు ఆ ఫైట్ సీన్ తీసిన విధానం ఇలా అన్ని కలిసి ఈ “యాలో యాలా” పాటను ఒక ప్రత్యేక పాటలాగా మార్చేశాయి. ఈ పాటలో వాడిన సంగీతం మనల్ని అలా ఏదో ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్ళడం పక్కా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top