Vaddu Anavaddu Song Lyrics – Perfume (2023) | Indravathi Chauhan

వద్దు అనవద్దు పాట యొక్క లిరిక్స్‌ను (Vaddu Anavaddu Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2023లో విడుదలైన పర్‌ఫ్యూమ్ (Perfume) అనే తెలుగు సినిమాలోని పాట. జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేనాగ్ ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్‍గా ప్రాచీ థాకర్ మరియు ఎసిపి అధికారిక అభినయ ఆనంద్ కీలక పాత్రలో నటించారు. ఈ చిన్న సినిమాకు సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మాతలుగా ఉన్నారు.

ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, విస్స అనే వ్యక్తి (చేనాగ్) ఒక అరుదైన స్మెల్ అబ్‌సెషన్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఈ దీని లక్షణం ఏమిటంటే, అమ్మాయిల శరీర వాసన చూడడం అతనికి డ్రగ్స్ తీసుకున్నంత కిక్. అతను అమ్మాయి వాసన గమనిస్తే వారి దగ్గరకు వెళ్ళి వాసన చూస్తుంటాడు. దీనివల్ల వాళ్ళు తెగ ఇబ్బందిపడి భయాందోళనల్లో మునిగిపోతుంటారు. ఇటువంటి సంఘటనల సంఖ్య పెరిగిపోవడంతో, ఏసీపీ దీప్తి (అభినయ) అతనిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే అతను ప్రమాదకరమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సినిమాలోని హీరోయిన్ లీలా (ప్రాచీ థాకర్) కూడా వ్యాస్‌ను వెతుకుతుంటుంది. తన వెతుకులాటలో వ్యాస్‌ను కనుగొనగానే, అతనికి లిప్ లాక్ ఇస్తుంది. కానీ ఆ తరువాత, ఒక అనుకోని సంఘటన జరిగిన తర్వాత అతనిని అవమానించి వెళ్ళిపోతుంది. ఆ అవమానం కారణంగా, వ్యాస్ తన కోపాన్ని తీర్చుకోవాలని, ఆమెను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇలా సాగుతుంటుంది ఈ సినిమా కథ.

ఈ సినిమా విడుదలైనట్టు కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీక్ ప్రమోషన్స్, కొత్త నటీనటులు మరియు చిత్రబృందం. ఇది ఎప్పుడో 24 నవంబర్ 2023లో థియేటర్స్ విడుదలైంది. దీనిని ఇంకా ఎవరైన చూడకుంటే ఇది ఎయిర్టెల్ ఎక్స్-స్ట్రీమ్ లో అందుబాటులో ఉంది కాబట్టి చూడండి. మన తెలుగులో ఎన్నో చిన్న చిత్రాలు విడుదలవుతాయి. కానీ వాటిలో కొన్నే ప్రేక్షకుల మనసులో స్థానం కల్పించుకుంటాయి. ఎందుకంటే అవి వాటి కథ మరియు కథనంతో ఆకట్టుకుంటాయి. ఇదే కోవాలోకి వచ్చే ఈ పర్‌ఫ్యూమ్ చిత్రం మాత్రం ఎందుకు ఆకట్టుకోలేదు అంటే కూడా దానిని చాలా కారణాలనే మనం వెదకవచ్చు.

ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు వీక్ ప్రమోషన్స్, కొత్త నటీనటులు మరియు వీళ్ళు ఎంచుకున్న కథ కొత్తగా బాగుంటుంది కానీ దానిని తీసిన విధానంలో లోపం ఉందనిపించక మానదు. కానీ మీరు ఈ సినిమాపై భారీగా అంచనాలు లేకుండా చూస్తే మాత్రం నచ్చే అవకాశం ఉంది. ఇక ఇందులోని పాటల విషయానికి వస్తే, నాకు మాత్రం ఈ ‘వద్దు అనవద్దు’ పాట తెగ నచ్చేసింది. చాలా రొమాంటిక్‍గా మెలోడీలా ఉంటుంది. దీనికి సంగీతం అందించింది అజయ్ అరసద, రాసింది చంద్రబోస్ మరియు పాడింది ఇంద్రావతి చౌహాన్. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “వద్దు అనవద్దు” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: వద్దు అనవద్దు (Vaddu Anavaddu)
  • సినిమా: Perfume (పర్‌ఫ్యూమ్)
  • నటీనటులు: చేనాగ్, ప్రాచీ థాకర్, అభినయ ఆనంద్
  • సినిమా దర్శకుడు: జేడీ స్వామి
  • సంగీత దర్శకుడు: అజయ్ అరసద
  • గేయరచయిత: చంద్రబోస్
  • గాయని: ఇంద్రావతి చౌహాన్
  • సినిమా విడుదల తేదీ: 24 నవంబర్ 2023
  • లేబుల్: సరిగమ తెలుగు

Vaddu Anavaddu Song Lyrics in Telugu

నువు చూసిన లోకం కాదు
ఇంకో లోకం ఉంది
నువ్వు పొందిన మైకం కాదు
ఇంకో మైకం ఉంది
నువు చేరిన స్వర్గం కాదు
ఇంకో స్వర్గం ఉంది
నువు చేరిన స్వర్గం కాదు
ఇంకో స్వర్గం ఉంది
చూపిస్తారా

వద్దు అనవద్దు, వద్దు అనవద్దు
వద్దు అనవద్దు, వద్దు అనవద్దు
ఈ అమృత ఘడియను
అస్సలే వదలోద్దు

అందమంత అందుకో
కాంశగా ఆకాంశగా
ప్రాయమంత పిండుకో
పూర్తిగా సంపూర్తిగా
తనివి నువ్వు తిర్చుకో
తనివి నువ్వు తిర్చుకో
తృప్తిగా సంతృప్తిగా
నా తనువంత అగరొత్తులుగా
ఈ తరుణమ్లో వెలిగించితిర
నీ అనువణువు ఒక నాసికగా
ఆ పరిమళమే పీల్చేసైరా

వద్దు అనవద్దు, వద్దు అనవద్దు
అసలోద్దు అనవద్దు
అసలోద్దు అనవద్దు
ఈ అమృత ఘడియను
అస్సలే వదలోద్దు

Vaddu Anavaddu Lyrics in English

Nuvu Chusina Lokam Kaadu
Inko Lokam Vundi
Nuvvu Pondina Maikam Kaadu
Inko Maikam Vundi
Nuvu Cherina Swargam Kaadu
Inko Swargam Vundi
Nuvu Cherina Swargam Kaadu
Inko Swargam Vundi
Chupisthara

Vaddu Anavaddu, Vaddu Anavaddu
Vaddu Anavaddu, Vaddu Anavaddu
Ee Amrutha Ghadiyanu
Assale Vadaloddu

Andamantha Anduko
Kaanshaga Aakanshagaa
Praayamantha Pinduko
Purthiga Sampurthiga
Thanivi Nuvvu Thirchuko
Thanivi Nuvvu Thirchuko
Thrupthiga Samthrupthiga
Naa Thanuvantha Agarotthulugaa
Ee Tharunamlo Veliginchithira
Nii Anuvanuvu Oka Naasikagaa
Aa Parimalame Peelchesai Raa

Vaddu Anavaddu, Vaddu Anavaddu
Asaloddu Anavaddu
Asaloddu Anavaddu
Ee Amrutha Ghadiyanu
Assale Vadaloddu

వద్దు అనవద్దు Video Song


“వద్దు అనవద్దు” పాట “పర్‌ఫ్యూమ్” అనే సినిమాలోని మధురమైన ప్రేమ సన్నివేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పాట హీరో వ్యాస్ (చేనాగ్) మరియు హీరోయిన్ లీలా (ప్రాచీ థాకర్) మధ్య ఆత్మీయ ప్రేమ భావాలను వ్యక్తం చేస్తుంది. మెలోడీతో కూడిన ఈ రొమాంటిక్ పాటలో, లీలా ప్రేమలోని లోతులను, ఆ భావంలో మునిగిపోయిన అనుభూతులను తన గానంతో పంచుకుంటుంది. పాట ప్రారంభంలో లీలా, తన ప్రేమికుడైన వ్యాస్‌కు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తానని చెబుతుంది. ఈ ప్రేమలో సాధారణమైన అనుభూతుల కన్నా మరింత విలువైన అనుభూతులను, మరింత ఉత్కృష్టమైన మైకాన్ని చూపిస్తానని వ్యక్తపరుస్తుంది.

ఇక ఈ పాటను పాడిన ఇంద్రావతి చౌహాన్ తన కెరీర్ ప్రారంభంలో కొన్ని పాటలను పాడినప్పటికి అస్సలు ఏ గుర్తింపు కూడా లేకుండా ఉండేది. ఈమె ప్రముఖ సింగర్ అయిన మంగ్లి చెల్లెలు అని కూడా చాలామందికి తెలియలేదు. కానీ ఈమె ఎప్పుడైతె ‘పుష్ప పార్ట్ 1’ సినిమాలోని ‘ఊ అంటావా మామ ఊఊ అంటావా మామ’ అనే ఐటమ్ సాంగ్‍తో ఈమె చాలా పేరును గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ పాటలో ఆమె తన గొంతుతో రొమాంటిక్‍గా పాడిన విధానం ఆకట్టుకుంది. అదే స్థాయిలో అంతే రొమాంటిక్‍గా పాడిన ఈ వద్దు అనవద్దు పాట మాత్రం అస్సలు చాలామందికి తెలియకుండా పోయింది. ఇది మాత్రం ప్రమోషన్ లోపమే అని నేను అనుకుంటున్నాను.

అస్సలు ఈ పాట ఎంత రొమాంటిక్‍గా ఉంటుందంటే, వింటూ అలా మనం ఏదో మైకంలో తేలియాడుతున్నట్టు అనిపించక మానదు. ఏది ఏమైన గాని ఇంద్రావతి చౌహాన్ లో మాత్రం మంచి రొమాంటిక్ పాటలు పాడే సత్తా ఉంది. అదోక విశిష్ట లక్షణం అని చెప్పవచ్చు. అలాగే ఇంత మంచి పాటను రాసింది ఎవరా అని చూసి శాక్‍కు గురైనాను. ఎందుకంటే ఈ పాటను రాసింది ఆస్కార్ విజేత చంద్రబోస్. చిన్న పెద్ద అని తేడా లేకుండా చంద్రబోస్ గారు ఈ మధ్య చాలా చిన్న సినిమాలకు పాటలను రాశారు. అసలు సినిమా కథలు నచ్చి రాస్తున్నారో లేకా చిత్రబృందంలో ఎవరైనా తెలిసిన వారు ఉండడంవల్ల ఇలాంటి చిన్న సినిమాలకు పాటలు రాస్తున్నారో తెలీదు కానీ, ఇతను ఈ చిన్న సినిమాలకు పాటలను రాయడం ద్వారా ఆ పాటలు హిటై ఆ సినిమాలకు బజ్ క్రియేట్ చేయడంలో ఎంతో కొంత పాత్ర వహిస్తున్నాయి.

అదే విధంగా అజయ్ అరసద అనే వ్యక్తి ఈ పాటకు సంగీతాన్ని అందించారు. ఇతని పేరు నేను ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు. అయిన కూడా ఈ పాట విన్న తర్వాత ఇతనిపై గౌరవం పెరిగింది మరియు మంచి పాటలను అందించే సత్తా ఉంది అనిపిస్తుంది. నాకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి కలిగించింది కేవలం రెండు అంశాలు మాత్రమే. వాటిలో ఒకటి మహిళల శరీర వాసనకు ఆకర్షితుడయ్యే వ్యాధితో బాధపడుతున్న హీరో అయితే, ఇక రెండోది ఈ ‘వద్దు అనవద్దు’ అనే రొమాంటిక్ పాట.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top