This post features the Unnava Bagunnava song lyrics in Telugu and English from the Telugu movie Utsavam (2024). This soulful song, composed by Anup Rubens, with lyrics by Bhaskarabhatla and sung by Kailash Kher, beautifully captures the struggles of theater artists, specifically reflecting the hardships faced by Krishna (played by Dilip Prakash) and his determination to revive the traditional art form of Surabhi Natakalu.
The song’s lyrics delve into the challenges faced by artists who, after performing and bringing characters to life on stage, are often left to deal with financial struggles and a lack of recognition. Lines like “After the play ends, who asks if you’ve eaten, who cares about your well-being?” highlight the harsh reality these performers endure, despite their dedication to the craft.
The song’s tone reflects the emotional depth and pain of those who pour their heart into their art, only to face neglect and poverty. It conveys the feeling of hopelessness and frustration, as Krishna and his fellow artists find themselves in a world that doesn’t value their efforts. The lyrics, “To live like a common man, isn’t that a kind of hell?” resonate deeply with the hardships artists face, as they are often forgotten once the curtains fall. The track not only complements the film’s theme of reviving traditional theater but also sheds light on the financial and emotional toll that comes with pursuing such a noble art form in modern times.
చూశావా ఆఆ
చూశావా ఆఆ
ఉన్నావా బాగున్నావా
అని అడిగేవాడే ఉంటాడా
కట్టిన వేషం అయిపోయి
తెర దించేశాక
అరె తిన్నావా పోని తింటావా
అని పెట్టేవాడే ఉంటాడా
వెలుగంతా వెలవెలబోయాక
రాముడిలా ఒప్పిస్తావ్
కృష్ణుడిలా మెప్పిస్తావ్
అవతారం ఏదైనా అన్నీ నప్పేస్తావ్
మేకప్పే తీసాక
మాములు మనిషల్లే
బతకాలంటే నరకం కాదా
హే తందానే తందానే తందా
తందానే తందానే తందా
తందానే తందానే తానా
తానే తందానా
కొట్టే ఆ చప్పట్లే
నీ గుండె చప్పుడ్లే
అవి లేని రోజు
మింగాలి కన్నీళ్లే
చూశావా ఆఆ
చూశావా ఓఓ
హే మీ రంగుల లోకం
హే హే హే హే
మీ రంగుల లోకం
నల్లబారిపోయే
హార్మోనియం ఒక్కో మెట్టు
మూగదయ్యిపోయే
పూసల దండలు బోసిపోయేనే
మెరుపు దుస్తులు
పస్తులు చూసేనే, అయ్యో
గతమే కథల వ్యధల మిగిలేనులే
హరే హరే
హే తందానే తందానే తందా
తందానే తందానే తందా
తందానే తందానే తానా
తానే తందానా
నువ్వు మోసిన కిరీటం
నువ్వు ఎత్తిన కరబాలం
అటకెక్కి దీనంగా
చూస్తూ ఉన్నాయి
చూశావా ఆఆ
ఉన్నావా బాగున్నావా
అని అడిగేవాడే ఉంటాడా
కట్టిన వేషం అయిపోయి
తెర దించేశాక
అరె తిన్నావా పోని తింటావా
అని పెట్టేవాడే ఉంటాడా
వెలుగంతా వెలవెలబోయాక
పద్యాలు సంగతులు
పరిష్యత్తు బహుమతులు
సన్మాన పత్రాలు
కప్పిన శాలువలే
పోగేసిన ఆస్తుల్లా
తెగ సంబర పడిపోయే
అల్ప సొంతోషులేరా మీరు
హే తందానే తందానే తందా
తందానే తందానే తందా
తందానే తందానే తానా
తానే తందానా
ఏదీ ఆ రాజసం
ఏదీ ఆ వైభోగం
మళ్ళీ మీ ముంగిట్లో
ఎప్పుడు వస్తుందో
చూశావా ఆఆ
మాయమైన ఇంద్రధనుస్సే
కనుల చివరే ఉన్నది
శూన్యమైన స్వర్ణయుగమే
వెనుక వస్తూ ఉన్నది
తల తిప్పి చూడు
నువ్వు కోరుకుంది
నీకోసమే ఉందీ
కలని గుర్తిస్తే
నిజము అవుతుంది
ఉన్నావా ఆఆ
ఉన్నావా బాగున్నావా
అని అడిగేవాడే ఉన్నాడా
కట్టిన వేషం అయిపోయి
తెర దించేశాక
తిన్నావా పోని తింటావా
అని పెట్టేవాడే ఉంటాడా
వెలుగంతా వెలవెలబోయాక