‘టికెటే కొనకుండా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Ticket Eh Konakunda Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన టిల్లు స్క్వేర్ (Tillu Square) అనే తెలుగు సినిమాలోని పాట. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. మల్లిక్ రామ్ దీనికి ముందు ‘నరుడా డోనరుడా’ మరియు ‘అద్భుతం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు.
ఇది 2022లో విడుదలైన DJ టిల్లు సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ను కూడా ప్రకటించారు, దీనికి టిల్లు క్యూబ్ అని పేరు పెట్టారు. సిద్ధు జొన్నలగడ్డ మొదటి సినిమాలోని తన పాత్రను తిరిగి పోషిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. “డీజే టిల్లు” సినిమాలోని సంఘటనల తర్వాత టిల్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతని జీవితంలో కొత్తగా ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. టిల్లు తనదైన స్టైల్‌తో కొత్త కొత్త సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అనేది కథాంశం.
టిల్లు స్క్వేర్ 2023 మార్చి నెలలో విడుదల చేయాలని తొలుత ప్రణాళిక చేయబడింది. కానీ, నిర్మాణ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. తరువాత పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యాల కారణంగా 2024 ఫిబ్రవరి 9కి వాయిదా పడింది, చివరగా మార్చి 29, 2024న విడుదల తేదీగా నిర్ణయించారు. సినిమా సంగీతాన్ని రామ్ మిరియాల మరియు అచు రాజమణి సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో అందించారు. ఆదిత్య మ్యూజిక్ సంగీత బ్యానర్‌గా పని చేసింది. “టిల్లు స్క్వేర్” సినిమా విడుదలకు ముందే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది ఈ సినిమాను “డీజే టిల్లు”కు సమానంగా భావించగా, మరికొందరు మొదటి భాగం మరింత బాగుంది అని అభిప్రాయపడ్డారు. “టిల్లు స్క్వేర్” ఒక సరదా ఎంటర్టైనర్. సిద్ధు జొన్నలగడ్డ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సినిమా యువతను ఆకట్టుకునేలా ఉంటుంది.
చిత్రబృందం “టికెటే కొనకుండా” అనే మొదటి పాటను 2023 జులై 26న విడుదల చేశారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. శ్యామ్ ప్రసిద్ధ తెలుగు సినిమా గేయ రచయిత. 1974 జూన్ 25న హనుమకొండలో జన్మించిన శ్యామ్, చిన్ననాటి నుంచే జానపద సంగీతం, నాటకాల్లో ఆసక్తి పెంచుకున్నారు. వీటిపై ప్రభావం శంకరన్న వంటి కళాకారుల ద్వారా వచ్చింది. తన తండ్రి సాధించలేని సినీ ఆకాంక్షలు, ఆర్థిక పరిస్థితులు శ్యామ్‌ను స్థిరమైన కెరీర్ వైపు ప్రేరేపించాయి. చదువులు పూర్తి చేసిన తర్వాత, ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం జానపద పాటలు రచించారు. ‘ఛంటిగాడు’ సినిమాలోని “కోక్కొర కోక్కొర” పాట ద్వారా శ్యామ్ సినీ రంగంలోకి ప్రవేశం చేసారు. ఆ తరువాత ‘మహాత్మా’ సినిమాలోని “నీలాపురి గాజుల…” పాటతో ఆయన ప్రముఖ గేయ రచయితగా నిలిచారు.
ఇక “టికెటే కొనకుండా” పాటను పాడింది మరియు సంగీతం అందించింది రామ్ మిరియాల. ఈయన తెలంగాణకు చెందిన ముందు బిడ్డ, తెలంగాణ యాసలో పాటలను పాడడంలో మరియు అలాంటి పాటలను కంపోజ్ చేయడంలో దిట్ట. ‘టికెటే కొనకుండా’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: టికెటే కొనకుండా
- సినిమా: Tillu Square (టిల్లు స్క్వేర్)
- నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్
- సినిమా దర్శకుడు: మల్లిక్ రామ్
- సంగీత దర్శకుడు: రామ్ మిరియాల
- గేయరచయిత: కాసర్ల శ్యామ్
- గాయకుడు: రామ్ మిరియాల
- సినిమా విడుదల తేదీ: మార్చి 29, 2024
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Ticket Eh Konakunda Song Lyrics in Telugu
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా ఆ
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
మురిసిపోకు ముందున్నాది
కొంప కొల్లేరయ్యే తేది, ఓహో
గాలికి పోయే కంప
నెత్తి కొచ్చి సుట్టుకున్నాది, హా
ఆలి లేదు సూలు లేదు
గాలే తప్ప మ్యాటరు లేదు, ఆహా
ఏది ఏమైన గాని
టిల్లు గానికడ్డే లేదు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా
స్టోరీ మళ్ళీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా
తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్
ఏందీ హైరానా
టికెటే కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
అల్లి గాడు మల్లి గాడు కాదు
టిల్లు గాడు కిర్రాకీడు
మందులోకి పల్లీ లాగ
లొల్లి లేకుండా ఉండ లేడు
తొందరెక్కువమ్మ వీడికి
తెల్లారకుండా కూసేస్తాడు
బోని కొట్టకుండా నేను
డాడీ నైపోయానంటాడు
అయ్యనే లెక్క జెయ్యడు
ఎవ్వడయ్యెచ్చి జెప్పిన ఆగడు
పోరడు అస్సలినడు
సిత్తరాలే సూపిత్తడు
ప్రేమిస్తడు పడి చస్తడు
ప్రాణమిమ్మంటే ఇచ్చేస్తడు
తగులుకుండంటే వదులుకోలేడు
బిడ్డ ఆగమై పోతున్నాడు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా
స్టోరీ మళ్ళీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా
తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్
ఏందీ హైరానా
టికెటే కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
Ticket Eh Konakunda Lyrics in English
Lottery Kottina Sinnoda
Sitti Needhi Siruguthundhemo
Soodaraa Bullodaa Aa
Moosukoni Koosokunda
Gaalam Vesaav Pub-u Kaada
Sorra Saape Thagulukundhi
Teerindhi Kadhaa
Murisipoku Mundhunnaadi
Kompa Kollerayye Thedhi, Oho
Gaaliki Poye Kampa
Netthikochhi Suttukunnaadhi, Haa
Aali Ledhu Soolu Ledhu
Gaale Thappa Matter-u Ledhu, Aaha
Edhi Emaina Gaani
Tillu Gaanikadde Ledhu
Tillanna Ilaagaithe Ellaaganna
Story Malli Repeatenaa
Pori Debbaku Malli Nuvvu
Thaana Thandhaana
Tillanna Etla Neeku Jeppaalanna
Telisi Telvaka Jetthaavanna
Ille Peeki Pandiri Esthaav
Endhee Hairaana
Ticket Eh Konakunda
Lottery Kottina Sinnoda
Sitti Needhi Siruguthundhemo
Soodaraa Bullodaa
Moosukoni Koosokunda
Gaalam Vesaav Pub-u Kaada
Sorra Saape Thagulukundhi
Teerindhi Kadhaa
Alli Gaadu Malli Gaadu
Tillu Gaadu Kirraakeedu
Mandhiloki Palli Laaga
Lolli Lekunda Undaledu
Thondarekkuvamma Veediki
Thellaarakunda Koosesthaadu
Boni Kottakunda Nenu
Daddy Naipoyaanantaadu
Ayyane Lekka Jeyyadu
Evvadayyochhi Jeppina Aagadu
Poradu Assalinadu
Sittharaale Soopitthadu
Premisthadu Padi Chasthadu
Praanamimmante Ichesthadu
Thagulukundante Vadhulukoledu
Bidda Aagamai Pothunnadu
Tillanna Ilaagaithe Ellaaganna
Story Malli Repeatenaa
Pori Debbaku Malli Nuvvu
Thaana Thandhaana
Tillanna Etla Neeku Jeppaalanna
Telisi Telvaka Jetthaavanna
Ille Peeki Pandiri Esthaav
Endhee Hairaana
Ticket Eh Konakunda
Lottery Kottina Sinnoda
Sitti Needhi Siruguthundhemo
Soodaraa Bullodaa
Moosukoni Koosokunda
Gaalam Vesaav Pub-u Kaada
Sorra Saape Thagulukundhi
Teerindhi Kadhaa
టికెటే కొనకుండా Video Song
‘డీజే టిల్లు’ సినిమాలో ‘టిల్లు అన్న డీజే పెడితే’ పాట ఎంత పెద్ద హిట్ అయి ట్రెండింగ్ లో నిలిచిందో మనమంతా చూశాము. మళ్ళీ ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తున్నప్పుడు అలాంటి ఊపున్న ఒక్క పాటనైన ఊహించుకోవడం మాములే కదా. ఎందుకంటే ఆ పాటలలో మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మ్యానెరిజం స్టెప్స్, బట్టల స్టైల్ ఇలా ప్రతీది కొత్తగా, చూడడానికి ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ఈ టిల్లు స్క్వెర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి చాలామంది ట్రైలర్, టీజర్, పాటల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో విడుదలయింది ఈ ‘టికెటే కొనకుండా’ పాట. ఈ పాటకు సంగీతం మరియు గానం ఇచ్చింది రామ్ మిరియాల అవ్వడంవల్ల తెలంగాణ యాసలో మాంచి ఊపుమీద సాగే పాటవల్ల చాలా మందికి ఎక్కేసింది.
పాట లిరిక్స్ కూడా టిల్లు క్యారెక్టర్ ను పోట్రేట్ చేసే విధంగా ఉంటాయి. డీజే టిల్లు (ఫస్ట్ పార్ట్) సినిమాలో రాధిక చేతిలో మోసపోయి కూడా సిగ్గు, బుద్ది తెచ్చుకోకుండా మళ్ళీ లిల్లీ జోసెఫ్ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతావేరా టిల్లుగా అని గడ్డి పెట్టినట్టు ఉంటాయి లిరిక్స్. ఈ టిల్లు ఫ్రాంచేజ్ సినిమాలు చూడనివారు, టిల్లుగాని క్యారెక్టర్ ఏమిటో తెలియని వాళ్ళు, కేవలం ఈ ఒక్క పాటను వినడం వల్ల టిల్లుగాడు ఎలాంటోడో ఒక అభిప్రాయానికి రావచ్చు.
Report a Lyrics Mistake / Share Your Thoughts