‘తలవంచి ఎరగడే‘ పాట యొక్క లిరిక్స్‌ను (Thala Vanchi Eragade Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన రాయన్ (Raayan) అనే తెలుగు సినిమాలోని పాట. నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయనతో పాటు ఎస్.జె. సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది ధనుష్ దర్శకుడిగా చేసిన రెండవ చిత్రం. ఆయన తన దర్శకత్వ ప్రయాణాన్ని 2017లో వచ్చిన ‘పా పాండి’ సినిమాతో ప్రారంభించారు, ఇది మంచి విజయాన్ని సాధించింది.
వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా, సినిమా ప్రపంచంలో ధనుష్ గా ప్రాచుర్యం పొందిన ఈ నటుడు, తమిళ చిత్రసీమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన “తుళ్ళువదో ఇళమై (2022)” అనే సినిమాతో ధనుష్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన ప్రతిభను నిరూపించుకుంటూ, అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ధనుష్ కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాత, గీత రచయిత, నేపథ్య గాయకుడిగా కూడా తనను విస్తరించుకున్నారు.
ఆయన అనేక అవార్డులను అందుకుని, తమిళ సినిమా రంగంలో ఒక కొత్త తరం నటుడిగా నిలిచారు. ప్రొఫెషనల్ రంగంలో మాత్రమే కాకుండా, ధనుష్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా మంచి గుర్తింపు పొందారు. 2004లో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, యాత్ర (2006) మరియు లింగ (2010) ఉన్నారు. జనవరి 17, 2022న ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించడం వారి అభిమానులను కలచివేసింది.
తెలుగు రాష్ట్రాల్లో తమిళ నటులను అభిమానించే విధానం ఎంతో విశేషంగా ఉంటుంది. వారు తమిళంలో సినిమాలు చేసినప్పటికీ, మన తెలుగువారికి ఆ నటులు మన హీరోలే అన్నంతగా దగ్గరగా ఉంటారు. కమల్ హాసన్, రజనీకాంత్, ధనుష్, సూర్య, కార్తీ వంటి పెద్ద స్టార్ హీరోలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఈ హీరోల సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తారు, ఎందుకంటే వారికి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక రాయన్ సినిమా విషయానికి వస్తే, ధనుష్ తన 50వ సినిమాగా, దర్శకుడిగా పనిచేసిన ఈ సినిమా, ప్రమోషన్లు సరిగ్గా జరగకపోవడంతో మొదట్లో అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అయినప్పటికీ, ధనుష్ పేరు, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం, మరియు మన తెలుగు హీరో సందీప్ కిషన్ నటించడం వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాపై ఆసక్తి చూపించడానికి కారణమయ్యాయి.
సంగీత విషయానికి వస్తే, ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం ఈ చిత్రానికి అందించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, కానీ ఈ సారి పాటలు పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. “బోగి బోగి” అనే పాట మాత్రం పర్లేదు బాగానే ఉంది, కానీ మిగతా పాటలు నిరాశ పరిచాయి. రెహ్మాన్ గారి గత హిట్ పాటల స్థాయికి చేరుకోలేకపోయాయి. అయితే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు ఒక ప్రాణం పోసినట్టుగా ఉంది. సైలెంట్ సీన్లను కూడా బాగా ఎలివేట్ చేసే విధంగా రెహ్మాన్ తన ప్రత్యేకతను చూపించారు.
తలవంచి ఎరగడే పాటకు సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రఖ్యాత గీత రచయిత. తన అద్భుతమైన రచనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకిన చంద్రబోస్, కవిత్వానికి, గీత రచనకు ఒక కొత్త అర్థం చెప్పారు. ఆయన రచించిన పాటలు కేవలం వినసొంపుగా ఉండే మాటలే కాదు, ప్రతి పాటలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. చంద్రబోస్ పాటలు ప్రేమ, విరహం, ఆనందం, వ్యథ, సామాజిక అంశాలు వంటి అనేక కోణాలను అందులో జత చేస్తారు. ఆయన రాసిన పాటలు అనేక తరాల ప్రేక్షకులను అలరించడంతో పాటు, పాటలు వినేవారిలో ఆలోచనలు రేకెత్తించేలా చేస్తాయి. తన కీర్తితో పాటు, అనేక అవార్డులను అందుకోవడం చంద్రబోస్ ప్రతిభకు నిదర్శనం. నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మరియు ఏకంగా ఆస్కర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన పాటలకు లభించాయి.
ఇక ఈ పాటను హేమచంద్ర, శరత్ సంతోష్ లు ఆలపించారు. హేమచంద్ర తెలుగు సంగీత రంగంలో సుపరిచితమైన నేపథ్య గాయకుడు. తన మధురమైన స్వరంతో, ఎన్నో హిట్ పాటలను అందించిన హేమచంద్ర, తన గాత్రంతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు. అతని పాటలు కేవలం వినసొంపుగా ఉండడమే కాకుండా, వినేవారిలో భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. తెలుగు సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హేమచంద్ర, అనేక చిత్రాలలో పాటలు పాడి ప్రసిద్ది చెందాడు. అలాగే, శరత్ సంతోష్ కూడా ఈ పాటలో తన సొంత శైలిలో పాట పాడి, ఈ గీతానికి కొత్త ఉత్సాహం ఇచ్చాడు. శరత్ సంతోష్ అనేక చిత్రాలలో పాటలు పాడి, తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అతని గాత్రంలో ఉన్న సాఫ్ట్నెస్, క్లారిటీతో పాటను మరింత బలంగా తయారు చేసింది. హేమచంద్ర, శరత్ సంతోష్ లు తమ తమ స్వరాలతో ఈ తలవంచి ఎరగడే పాటను మరింత శ్రావ్యంగా తీర్చిదిద్దారు. ఇద్దరి గాత్రం ఈ పాటలోని ఎమోషనల్ టోన్ ను బాగా ఎలివేట్ చేసి, పాటను ప్రత్యేకంగా నిలిపాయి.
ఎ.ఆర్. రెహ్మాన్ అందించిన మ్యూజిక్, చంద్రబోస్ రాసిన సాహిత్యం, హేమచంద్ర, శరత్ సంతోష్ గాత్రం కలిసి ఈ తలవంచి ఎరగడే పాటను ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయి. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “తలవంచి ఎరగడే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: తలవంచి ఎరగడే
- సినిమా: Raayan (రాయన్)
- నటీనటులు: ధనుష్, ఎస్.జె. సూర్య, సందీప్ కిషన్
- సినిమా దర్శకుడు: ధనుష్
- సంగీత దర్శకుడు: ఎ.ఆర్. రెహ్మాన్
- గేయరచయిత: చంద్రబోస్
- గాయకులు: హేమచంద్ర, శరత్ సంతోష్
- సినిమా విడుదల తేదీ: జులై 26, 2024
- లేబుల్: జెమినీ టీవీ
Thala Vanchi Eragade Song Lyrics in Telugu
తల దించి నడువడే
తలపడితే వదలడే
తన పేరు విజయుడే
ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే
హే భోగి భోగి భోగిభోగి
కచ్ఛాలన్ని వెలికి లాగి
భోగి భోగి భోగి భోగీ
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
హే భోగి భోగి భోగిభోగి
కచ్ఛాలన్ని వెలికి లాగి
భోగి భోగి భోగి భోగీ
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
దందార దందార దందార
డుండుం డుం డుండుం డుం
డుండుం డుం
డుండుండుం
డుండుం డుం, డుండుం డుం
డుండుం డుం
డుండుండుం
డుండుం డుం, వీరము
డుండుం డుం, పాశము
డుండుం డుం, రోషము
అన్నీ ఉన్న మన్ను
డుం డుం డుం డుగుడాగే డుగుడాగే
డుండుం డుం డుం డుం
డుగుడాడే డుగుడాడే డాడే
గిలి గిలి గిలి గిలి…
అష్టదిక్కుల్లోని ఆనందాలు అన్ని
అరచేత వాలేనంటా
అత్యాశ లేకుంటే పేరాశే లేకుంటే
ఐశ్వర్యమేనంటా
అరె కొన్నాళ్ళు ఎండలు
కొన్నాళ్ళు వానలు
వస్తుంటే చాలంటా
వందేళ్ళు వద్దంటా
పోయేదాకా బతుకు సాగిపోవాలంటా
ప్రతిదీ నీతోనే నీతోనే
బ్రతుకంతా మాది నీదే
అడుగే నీతో నే నీతోనే
అడిగేదీ ఏదీ లేదే
హే భోగి భోగి భోగిభోగి
కచ్ఛాలన్ని వెలికి లాగి
భోగి భోగి భోగి భోగీ
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
హే భోగి భోగి భోగిభోగి
కచ్ఛాలన్ని వెలికి లాగి
భోగి భోగి భోగి భోగీ
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
ఏయ్, ఏమేమ్ తెచ్చావ్
ఎట్టా తెచ్చావ్, ఎంత తెచ్చావ్
ఎందుకు తెచ్చావ్…!
తెచ్చిందంతా ఇచ్చెయ్యాలి
ఖాళీగానే పైకెళ్ళాలీ
హే భోగి భోగి భోగి
భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి భోగి భోగి
తలవంచి ఎరగడే
తల దించి నడువడే
తలపడితే వదలడే
తన పేరు విజయుడే
ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే
గిలి గిలి గిలి గిలి…
Thala Vanchi Eragade Lyrics in English
Thala Dinchina Naduvade
Thalapadithe Vadalaade
Thana Peru Vijayude
Pranam Potunna Vastunna
Pogaru Veedadu Veede
Dooram Vellandi Vellandi
Vachadu Nippai Veede
Hey Bhogi Bhogi Bhogibhogi
Kacchalanni Veliki Laagi
Bhogi Bhogi Bhogi Bhogi
Kalchi Veddam Rechchi Regi
Hey Bhogi Bhogi Bhogibhogi
Kacchalanni Veliki Laagi
Bhogi Bhogi Bhogi Bhogi
Kalchi Veddam Rechchi Regi
(Dandaar Dandaar Dandaar)
Dum Dum Dum
Dum Dum Dum
Dum Dum Dum
Dum Dum Dum Dum Dum Dum
Dum Dum Dum
Dum Dum Dum
Dum Dum Dum Dum Dum Dum
Dum Dum Dum Veeramu
Dum Dum Dum Paashamu
Dum Dum Dum Roshamu
Anni Unna Mannu
Dum Dum Dum
Dugudage Dugudage
Dum Dum Dum
Dugudade Dugudade Daade
Gili Gili Gili Gili Gili…
Ashtadikkulloni Anandaalu Anni
Aracheta Vaalenantaa
Atyaasha Lekunte
Peraashe Lekunte
Aishwaryamentaa
Are Konnallu Endalu
Konnallu Vanalu
Vastunte Chaalantaa
Vandellu Vaddantaa
Poyedaka Bathuku
Saagipovaalantaa
Pratidi Neetone Neetone
Brathukantaa Maadi Neede
Aduge Neeto Ne Neetone
Adigedi Yedi Lede
Hey Bhogi Bhogi Bhogibhogi
Kacchalanni Veliki Laagi
Bhogi Bhogi Bhogi Bhogi
Kalchi Veddam Rechchi Regi
Hey Bhogi Bhogi Bhogibhogi
Kacchalanni Veliki Laagi
Bhogi Bhogi Bhogi Bhogi
Kalchi Veddam Rechchi Regi
Aye, Eemem Techaav
Etta Techaav, Enta Techaav
Enduku Techaav…!
Techindanta Iccheyyali
Khaaligane Paikelali
Hey Bhogi Bhogi Bhogi
Bhogi Bhogi Bhogi
Bhogi Bhogi Bhogi
Bhogi Bhogi Bhogi
Thala Vanchi Eragade
Thala Dinchina Naduvade
Thalapadithe Vadalaade
Thana Peru Vijayude
Pranam Potunna Vastunna
Pogaru Veedade Veede
Dooram Vellandi Vellandi
Vachadu Nippai Veede
Gili Gili Gili Gili Gili…
తలవంచి ఎరగడే వీడియో సాంగ్
ఈ పాటలో హీరో రాయన్, అంటే కథవరాయన్ (ధనుష్ పాత్ర పేరు) తన శక్తివంతమైన డ్యాన్స్ తో కనిపిస్తాడు. ఈ పాటలో ప్రధానంగా రాయన్ పాత్ర యొక్క సాహసాన్ని, ధైర్యాన్ని, అతనికి ఎదురుగా ఉండే శత్రువులను ఎదుర్కొనే తీరును బలంగా వర్ణిస్తారు. ఈ పాటలోని లిరిక్స్ మరియు సంగీతం కూడా ఈ పాత్రను మరింతగా ఎలివేట్ చేస్తాయి. ఇందులోని హుక్ లైన్ హే భోగి భోగి అంటూ సాగుతుంది కదా, ఇది భోగి పండుగను సూచిస్తుంది. అంటే భోగి పండుగ నాడు అగ్ని ద్వారా పాత వస్తువులను దహనం చేస్తారు. ఈ సందర్బంలో హీరో తన శత్రువులను కూడా అలాగే దహనం చేయాలనే ఉద్దేశంతో ఈ లిరిక్స్ వాడుతాడు, శత్రువులను వదిలించుకోవాలనే అతని ధృఢ నిశ్చయాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది.
ఈ పాటను మొదట్లో నేను అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ పాట వింటూ వింటూ, సడెన్‌గా “వావ్” అనిపించేలా ఫీలింగ్ వచ్చింది. ఇంతలా అనిపించింది అంటే, రోజంతా ఈ పాటలోని హుక్ లైన అయిన “బోగీ బోగీ” అని పాడుకుంటూ ఉంటాను. నాకు తెలిసిన చాలామంది కూడా ఈ పాటకు బాగా అడిక్ట్ అయ్యారు, డ్యాన్స్ స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు. ఈ పాటలో ధనుష్ చేసిన సింపుల్ డ్యాన్స్ మూవ్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ఆ పాట సాగే లొకేషన్, పాటకు ఎ.ఆర్. రెహ్మాన్ అందించిన సంగీతం, చంద్రబోస్ రాసిన సాహిత్యం—ఇలా అన్ని కలసి పాటను స్పెషల్‌గా మార్చేశాయి. హేమచంద్ర, శరత్ సంతోష్ గొంతులు కూడా ఆ పాటకు అదనపు అందం ఇచ్చాయి.
Share Your Thoughts / Comments / Lyrics Mistake