Suttamla Soosi Lyrics – Gangs of Godavari (2024) | Anurag Kulkarni

సుట్టంలా సూసి పాట యొక్క లిరిక్స్‌ను (Suttamla Soosi Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) అనే తెలుగు సినిమాలోని పాట. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, అంజలి, నేహా సెట్టి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది, ప్రవీణ్, మయాంక్ పారక్, అయేషా ఖాన్ తదితరులు నటించారు. సంవత్సరంలో ఒక సినిమా విడుదల అవ్వడమే కష్టంగా ఉన్న మన తెలుగు హీరోలలో కొంత మంది మాత్రమే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను (దాదాపు మూడు వరకు) విడుదల చేస్తున్నారు. వారిలో మన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఉన్నారు. ఈయన నటించిన ‘గామీ’ మార్చ్ 8, 2024న విడుదలైతే ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మే 31, 2024న విడుదలైంది. అలాగే ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రాన్ని అక్టోబర్ 31,2024న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

చిత్ర పరిశ్రమలో కొంతమంది మాత్రమే అవకాశాలు రాకపోయిన వాటిని సృష్టించుకుంటారు. వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తనకు నటనపై ఉండే మక్కువతో జగపతి బాబు మరియు మీరా జాస్మీన్ ప్రధాన పాత్రలో నటించిన ‘బంగారు బుల్లోడు (2009)’ సినిమాతో తన నటన కెరీర్ ను ప్రారంభించారు. తను మేన్ లీడ్ గా ‘వెళ్ళిపోమాకే (2017)’ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచాయి. అదే సమయంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది (2018)’ సినిమాలో అవకాశం రావడం, ఆ సినిమా మంచి విజయం సాధించడం జరిగింది. విశ్వక్ కేవలం ఒక సాధారణ నటుడు మాత్రమే కాదు, అతను దర్శకుడు మరియు నిర్మాత కూడ. 2019లో ఇతని స్వియ దర్శకత్వంలో (హీరో కూడ ఇతనే) ‘ఫలక్ నామ దాస్’ సినిమాను తీయడం జరిగింది. అది కూడ మంచి విజయాన్ని సాధించింది. ఇలా తనకు అనేక క్రాఫ్ట్స్ పై ఉన్న పట్టుతో మంచి మంచి సినిమాలు తీసుకుంటూ తన ప్రయాణాన్ని విజయవంతంగా టాలీవుడ్ లో కొనసాగిస్తున్నాడు.

ఇక ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని పాటల విషయానికి వస్తే ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. కానీ వీటిలో ‘సుట్టంలా చూసి’ పాట మాత్రం ట్రెండింగ్ నిలిచింది. ఈ పాట చాలామందిని ఆకట్టుకుంది. దీనికి సంగీతాన్ని అందించింది యువన్ శంకర్ రాజా. ఈయన ముఖ్యంగా తమిళ పాటలకు సంగీతాన్ని అందిచారు. తమిళంతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, హిందీ పాటలను కంపోజ్ చేశారు. ఇతను సంగీత ధీరుడు ఇళయరాజా మూడవ మరియు చిన్నకొడుకు. తన తండ్రిలాగానే అనేక మంచి హిట్ పాటలను అందిచారు. ఇక ఈ పాటను రాసింది శ్రీహర్ష ఎమాని, పాడింది అనురాగ్ కులకర్ణి. ‘సుట్టంలా సూసి’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: సుట్టంలా సూసి
  • సినిమా: Gangs of Godavari (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
  • నటీనటులు: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి
  • సినిమా దర్శకుడు: కృష్ణ చైతన్య
  • సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
  • గేయరచయిత: శ్రీహర్ష ఎమని
  • గాయకుడు: అనురాగ్ కుల్కర్ణి
  • సినిమా విడుదల తేదీ: మే 31, 2024
  • లేబుల్: ఆదిత్య మ్యూజిక్

Suttamla Soosi Song Lyrics in Telugu

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కళ ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందళ్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోకలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్.. మ్.. సేత్తానే నువ్ సెప్పిందలా

ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని పూసగుచ్చేలా
ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా

సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా

సుట్టంలా సూసి పోకలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కళ ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందళ్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోకలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

Suttamla Soosi Lyrics in English

Addaala Vonilaa
Akshavani Laa
Godaari Gattu Pai
Merisavu Maani Laa

Pedenti Danilaa
Bangaru Gaani Laa
Suthane Ninnelaa
Na Rendu Kanulaa

Kala Unna Kallalee Kaatuke Yela
Ma Veedhi Veedhanta Dishti Kottela
Sannai Mothala Sandhela Patala
Sandhalle Techave Neelaa

Suttamla Soosi Pokala
Suttesukove Seerala
Sakkani Santi Vaadila
Settaane Nuv Seppindala

Ye Utharalu Rayalenu
Neeku Teliselaa
Naa Lachanalanni
Pusa Guchelaa

Emoutaanante Yedi
Seppalenu Varasala
Nee Pakkanundi Pothe
Saalule Ila

Sottu Ginna Meda
Suthi Petti Kottinattuga
Sumaru Kottukunde
Gunde Gattiga

Gantakokasaari Ganta
Kotte Gadiyaaramai
Ninne Thalisela

Suttamla Soosi Pokala
Suttesukove Seerala
Sakkani Santi Vaadila
Settaane Nuv Seppindala

Addaala Vonilaa
Akashavani Laa
Godavari Gattu Pai
Merisavu Maani Laa

Pedenti Danilaa
Bangaru Gaani Laa
Suthane Ninnilaa
Na Rendu Kannulaa

Kala Unna Kallale Kaatuke Yela
Ma Veedhi Veedhanta Dishti Kottele
Sannai Mothala
Sandhella Patala
Sandhelle Techave Nelaa

Suttamla Soosi Pokala
Suttesukove Seerala
Sakkani Santi Vaadila
Settaane Nuv Seppindala

సుట్టంలా సూసి పోకలా Video Song


ప్రతీవారం ఎన్నో సినిమాలు వచ్చి పోతుంటాయి. చాలామందికి వాటి పేర్లు కూడా తెలియకుండా ఉంటున్నాయి. అంటే ఆయా సినిమాలకు సరిగ్గా బజ్ క్రియేట్ కాకపోవడం వల్లే, వాటి గురించి ఎవ్వరికి తెలియకుండా అవుతుంది. పెద్దసినిమాలైతే వాటిలో సూపర్ క్యాస్ట్ మరియు మంచి బడ్జెక్ట్ కూడా ఉండడంతో తమ సినిమాలకి పబ్లిసిటి చేసుకుంటారు. కానీ చిన్న సినిమాలకు ఇవేవి ఉండవు కాబట్టి అవి కథను నమ్ముకుంటాయి. కాని ఆ కథ ప్రజల వద్దకు వెళ్ళాలంటే పబ్లిసిటి మేన్. చిన్న సినిమాలు సరిగ్గా పబ్లిసిటి చేసుకోలేకపోయిన, వాటిలో మంచి మంచి హిట్ పాటలుంటే అవి ట్రెండింగ్ లోకి రావడంవల్ల సినిమాపై బజ్ అమాంతం క్రియేట్ అవుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. విశ్వక్ సేన్ చిన్న హీరో అయితే కాదూ, అయిన ఈ సినిమాకు బజ్ అంత క్రియేట్ కానప్పుడు ఈ సుట్టంలా చూసి పాటను వదిలారు. ఇక అంతే పాట హిటై ట్రెండింగ్ లోకి వెళ్ళి సినిమాపై ఆశలను పెంచింది.

ఈ పాటలో మేన్ అట్రాక్షన్ నేహా శెట్టి అని చెప్పొచ్చు. ఈమె ‘డీజే టిల్లు’ సినిమాలో నటించడం ద్వారా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించింది. ఈమె అందాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే మన విశ్వక్ సేన్ విలేజ్ మాస్ లుక్ తో రొమాంటిక్ గా ఇచ్చే లుక్స్ పాటు సింపల్ డ్యాన్స్ మూవ్ తో ఆకట్టున్నాడు. ఈ పాటకు సంగీతాన్ని యువన్ శంకర్ రాజా స్వయంగా సమకూర్చి, అమర్చారు. ఈ పాటను అనురాగ్ కుల్కర్ణి తన స్వరంతో వినసొంపుగా ఆలపించగా, శ్రీహర్ష ఎమని అందించిన సాహిత్యం ఆ పాటకు మరింత అందం తెచ్చింది. డిల్షాద్ సారంగి వాయించి, వాసుదేవన్ వోకల్ కండక్ట్ చేశారు. ఈ పాటను U1 రికార్డ్స్‌లో రికార్డ్ చేసి, మిక్స్ మరియు మాస్టరింగ్ ఎం.కుమారగురుపరణ్ నిర్వహించారు. అంతే కాకుండా, ఐట్యూన్స్ మాస్టరింగ్ కూడా ఆయనే పూర్తి చేశారు. లిరిక్ వీడియోను ఆది రూపొందించారు, ఈ పాటకు అందరూ కలిసి చేసిన కృషి పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top