‘స్టుపిడ్ హార్ట్‘ పాట యొక్క లిరిక్స్‌ను (Stupid Heart Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన లవ్ మీ: ఇఫ్ యూ డేర్ (Love Me: If You Dare) అనే తెలుగు సినిమాలోని పాట. అరుణ్ భీమవరపు రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఈ సినిమాలో ఆశిష్, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ, సంయుక్త తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 2023 చివరలో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది, వెంటనే చిత్రీకరణ ప్రారంభమైంది. వైష్ణవి చైతన్యను ప్రధాన కథానాయికగా డిసెంబర్ 2023లో ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో సినిమా మోషన్ పోస్టర్ విడుదల కాగా, మార్చిలో చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం 2024 మే 25న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది. చివరగా, ఈ చిత్రం జూన్ 17, 2024న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
అసలు ఈ సినిమా కథ ఏంటంటే, అర్జున్ (ఆశిష్ రెడ్డి) మరియు ప్రతాప్ (రవికృష్ణ) ఇద్దరు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, వీరు మూఢనమ్మకాలపై వీడియోలు చేసి, ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. ప్రతాప్ తన ఊర్లో జరిగిన ఓ మిస్టరీని చేదించాలనుకునే క్రమంలో దివ్యవతి (సంయుక్త మీనన్) అనే చిన్నారి కనిపించకుండా పోయి, కొన్నాళ్ల తర్వాత ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని ఓ అపార్ట్‌మెంట్‌లో సూసైడ్ చేసుకొని చనిపోవడం గురించి తెలుసుకుంటాడు. ఆ అపార్ట్‌మెంట్ నుంచి భయంకరమైన శబ్దాలు రావడంతో దివ్యవతి దెయ్యంగా మారిందని స్థానికులు నమ్ముతారు. ఈ మిస్టరీను ఛేదించాలనుకున్న అర్జున్ ఒక్కడే ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
దిల్ రాజు గారు మంచి సినిమాలైతే చాలు ఒకవేళ అవి చిన్న సినిమాలైన కూడా తన సపోర్ట్ ను అందిస్తారు. అదే విధంగా ఈ లవ్ మీ సినిమా కథను నమ్మి తన బ్యానర్ నిర్మించి ఉంటారేమో అని అనుకున్న. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని ఎం.ఎం.కీరవాణి గారు అందించారు. ఆయన ఈ మద్యనే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ కూడా అందుకున్నారు. ముఖ్యంగా కీరవాణి గారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కదా ఎందుకు ఈ చిన్న సినిమాకు సంగీతాన్ని అందించారు అనుకుని, ఈ సినిమాలో ఏదో స్పెషల్ శక్తి ఉంది అనుకున్న. కాని నా అంచన తప్పైంది. ఎందుకంటే శక్తి సినిమాలో లేదు హీరోలో ఉంది. అదేంటి ఆశిష్ రెడ్డి కొత్త హీరో కదా అనుకోవచ్చు మీరు. కాని అతను ఇంతకు ముందే ‘రౌడి బాయ్స్ (2022)’ అనే సినిమాను తీశారు. అంటే ఈయనకు ఇది రెండవ సినిమా అన్నమాట.
ఇంతకి ఎవరీ ఆశిష్ రెడ్డి. అసలు మొఖంలో సందర్భానికి తగ్గ ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగ్గా ఇవ్వకుండా, సినిమా మొత్తం మీద దాదాపు ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా ఈ హీరో రెండవ సినిమాలోనే ‘బేబి (2023)’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య నటించడం ఏమిటి, ఆస్కర్ అందుకున్న కీరవాణి గారు ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం ఏమిటో, అలాగే కీరవాణి తో పాటే ఆస్కర్ అందుకున్న గేయరచయిత చంద్రబోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించడం ఏమిటో, అస్సలు ఎవరీ ఆశిష్ రెడ్డి అని శోదిస్తే అప్పుడు తెలిసింది, ఇతను దిల్ రాజు గారి తమ్ముడైన శిరీష్ రెడ్డి కొడుకని. అంటే ఇతను నెపో కిడ్ అన్నమాట. ఇతను టాలీవుడ్ లో కాని ఏ వుడ్ లోనైన గాని మంచి నటుడిగా నిలదొక్కుకోవాలంటే ముందుగా యాక్టింగ్ నేర్చుకుని, హావభావాలను ముఖంలో పలికించాలి. లేకపోతే కష్టమే.
ఇక ఈ సినిమాలోని నాలుగు పాటల్లో నాకు వ్యక్తిగతంగా నచ్చిన పాట “స్టుపిడ్ హార్ట్.” ఈ పాట చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుంది, వినడానికి హుషారుగా అనిపిస్తుంది. కీరవాణి అందించిన సంగీతం, చంద్రబోస్ రాసిన సాహిత్యం, సాయి శ్రేయ పాడిన గానం ఈ పాటకు మరింత ఆకర్షణను తెచ్చాయి. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “స్టుపిడ్ హార్ట్” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: స్టుపిడ్ హార్ట్ (Stupid Heart)
- సినిమా: Love Me (లవ్ మీ)
- నటీనటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య
- సినిమా దర్శకుడు: అరుణ్ భీమవరపు
- సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి
- గేయరచయిత: చంద్రబోస్
- గాయని: సాయి శ్రేయ
- సినిమా విడుదల తేదీ: మే 25, 2024
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Stupid Heart Song Lyrics in Telugu
కొత్త వణుకులు ఏంటో
కళ్ళల్లో కళ్ళల్లో బెరుకులు
కంగారు అవి ఏంటో
ఒళ్ళు ఒళ్ళంతా చెమటే పడుతున్నా
ఉల్లాసంగా ఉందేమిటో
అదురు బెదురు భయము
గుబులు ఇష్టంగా మారేనా, ఏమిటో
వద్దన్నా పడిపోతోంది వాడికే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వెళిపోతోంది ముందుకే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా దిగి పోతోంది లోతులో మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వద్దొద్దన్నా ఆగదే మరి
కొంచెం కొంచెం కొంచెం కూడా
వినదీ స్టుపిడ్ హార్ట్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
నన్నే చూసి నవ్వలేదే
హేయ్ హేయ్ హేయ్ హేయ్
రోజా పువ్వే ఇవ్వలేదే
హేయ్ హేయ్ హేయ్ హేయ్
కూడా కూడ రానే లేదే
కొంచెం జడిపించాడే
వాడిలోనే ఉన్నా
ఆ తేడా నాకు అంత నచ్చేసిందే
లోకమేమనుకున్నా
ఇక వాడే నాకు లోకమైపోయాడే
వద్దన్నా పరిగెడుతోంది వాడితో మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వెతికేస్తోంది వాడినే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా పలికేస్తోంది వాడి పేరుని
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వద్దొద్దన్నా ఆగదే మరి
కొంచెం కొంచెం కొంచెం కూడా
వినదీ స్టుపిడ్ హార్ట్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
మాటల్లోనే అర్థంకాదే
హేయ్ హేయ్ హేయ్ హేయ్
అర్ధం అయితే అర్ధం లేదే
హేయ్ హేయ్ హేయ్ హేయ్
అలవాటైతే బాగుంటుందే
ఏది గురుతుకు రాదే
ఊపిరంతా నాదే
నా ఊపిరి లోన గాలి కబురు వాడే
ప్రామమంతా నాదే
నా ప్రాణానికి పేరు మాత్రం వాడే
వద్దన్నా పడిపోతోంది ప్రేమలో మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వెళిపోతోంది ముందుకే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా దిగి పోతోంది లోతులో మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వద్దొద్దన్నా ఆగదే మరి
కొంచెం కొంచెం కొంచెం కూడా
వినదీ స్టుపిడ్ హార్ట్
Stupid Heart Lyrics in English
Kotha Vanukulu Ento
Kallallo Kallallo Berukulu
Kangaaru Avi Ento
Ollu Ollantha Chemate Paduthunna
Ullaasangaa Undhemito
Adhuru Bedhuru Bhayamu
Gubulu Ishtamga Maarena, Yemito
Oddhanna Padipotondi Vaadike Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Velipotondi Munduke Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Digipotondi Lothulo Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Oddhoddhanna Aagade Mari
Koncham Koncham Koncham Kuda
Vinadhi Stupid Heart
Hey Hey Hey Hey
Nanne Chusi Navvaledhe
Hey Hey Hey Hey
Roja Puvve Ivvaledhe
Hey Hey Hey Hey
Kuda Kuda Raane Ledhe
Koncham Jadipinchaade
Vadilone Unna
Aa Theda Naaku Antha Nacchesinde
Lokamemanukunna
Ika Vade Naaku Lokamai Poyaade
Oddhanna Parigedutondi
Vaaditho Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Vetikestondi Vaadine Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Palikestondi Vaadi Peruni
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Oddhoddhanna Agade Mari
Koncham Koncham Koncham Kuda
Vinadhi Stupid Heart
Hey Hey Hey Hey
Matallone Ardham Kaadhe
Hey Hey Hey Hey
Ardham Aite Ardham Ledhe
Hey Hey Hey Hey
Alavatayithe Baguntundhe
Yedhi Gurutuku Raadhe
Oopirantha Naade
Na Oopiri Lona Gaali Kaburu Vaade
Pranamatha Naadhe
Na Prananiki Peru Matram Vaade
Oddhanna Padipotondi Premalo Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Velipotondi Munduke Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Digipotondi Lothulo Mari
Chebithe Vinadhu Stupid Heart
Oddhanna Oddhoddhanna Aagade Mari
Koncham Koncham Koncham Kuda
Vinadhi Stupid Heart
స్టుపిడ్ హార్ట్ Video Song
ఈ పాటలో ప్రియ (వైష్ణవి చైతన్య) తన ప్రేమను అర్జున్ (ఆశిష్ రెడ్డి) పట్ల వ్యక్తం చేస్తుంది, అక్కడ ఆమె మనసులోని భావనలు మరియు అంచనాలను తెలియజేస్తుంది. ప్రేమలో పడినప్పుడు మనం ఎలా బాధ్యతలను పక్కన పెట్టి ముందుకు సాగుతామో ఈ పాటలో ప్రతిబింబితమవుతుంది. ప్రేమలోని తొలిపడుల క్షణాలను అందంగా వర్ణిస్తూ, ప్రియ తన శారీరక మరియు మానసిక అనుభూతులను వ్యక్తం చేస్తుంది. ఆమె ఆందోళనలు, ఉల్లాసాలు, మరియు ప్రేమలో ఉన్నప్పుడు హృదయం చేసే ప్రవర్తనల గురించి అన్వేషిస్తారు. చివరగా, ఈ పాట ప్రేమ అనేది ఎంత ముఖ్యమో, మన జీవితంలో ఉన్న వ్యక్తి పై మన అనుభూతులు ఎలా ఉంటాయో చక్కగా చూపిస్తుంది.
ఆశిష్ రెడ్డి గారు మీరు యాక్టింగ్ నేర్చుకోవాలండి లేకపోతే కష్టమే. ఎందుకంటే దిల్ గారు ఎంతో మంది కొత్త హీరో హీరోయిన్లను, దర్శకులను ఇలా కొత్త కొత్తవారిని తెలుగు సినీరంగలోకి తీసుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు తమ టాలెంట్ నిరూపించుకుంటే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు. మీరు నెపో కిడ్ కాబట్టి ఇంకొన్ని ఎక్కువ రోజులు ఇంకొన్ని ఎక్కువ సినిమాలు తీస్తు టాలీవుడ్ లో కొనసాగవచ్చు. కానీ మీ గురించి ఎవ్వరూ గొప్పగా మాట్లాడుకోరు. ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఒకే ఎక్స్ప్రెషన్స్ తో సినిమా మొత్తం క్యారి అయ్యారెమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే దిల్ రాజు గారికి చెడ్డపేరు తీసుకురాకుండ యాక్టింగ్ లో మంచిగా మెళకువలు నేర్చుకోవలసిందిగా నా విన్నపం.
ఇక ఈ సినిమాలో వైష్ణని చైతన్య తనకు ఇచ్చిన క్యారెక్టర్ పరంగ పర్వలేదు బాగానే చేసింది. తన తెలుగింటి అమ్మాయిల ఉండే అందమైన అందంతో చాలామంది యూత్ ని సినిమాకు రప్పించి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఆశిష్ రెడ్డి ఎవరో కూడా తెలియకుండా కేవలం వైష్ణని ఉందనే ఒకే కారణంతో ఈ సినిమాను చూశాను. ఈ స్టుపిడ్ హార్ట్ పాటలో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. అంటే క్యూట్ గా ఉండే అమ్మాయి, క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఇంకా క్యూట్ గా ఉంటుందని ఇక్కడ నా ఉద్దేశ్యం. అలాగే లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు కూడా సింపుల్ తెలుగు పదాల ద్వారా ఆ అమ్మాయి ఫీలింగ్ ను చాలా చక్కగా లిరిక్స్ రూపంలో రాశారు. ఈ పాటలో మ్యూజిక్ అంతగా ప్రభావం చూపదు కానీ, ట్యూన్ మాత్రం మనసులో అలా నిలిచిపోతుంది. సాయి శ్రేయ గారు ఈ పాటకు స్వరాన్ని అందిచడం ద్వారా కీరవాణి గారి సంగీతాన్ని డామినేట్ చేశారు.
Report a Lyrics Mistake / Share Your Thoughts