‘సితార్‘ పాట యొక్క లిరిక్స్‌ను (Sitar Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది ఆగస్టు 15, 2024న విడుదలైన మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) అనే తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమాలోని పాట. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మరియు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. హరీష్ శంకర్ రవితేజ హీరోగా నటించిన “శాక్” (2006) సినిమాతో దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత రవితేజతో మరోసారి కలిసి “మిరపకాయ్” (2011) తెరకెక్కించారు. హరీష్ శంకర్ స్టార్ దర్శకుడిగా ఎదగడానికి రవితేజ కూడా ఒక ప్రధాన కారణం, ఎందుకంటే ఆయనపై ఉన్న నమ్మకంతో రవితేజ రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. “గద్దలకొండ గణేశ్” (2019) తర్వాత హరీష్ శంకర్ మరోసారి ఐదు సంవత్సరాల విరామం తీసుకుని, ఇప్పుడు మళ్లీ రవితేజతో “మిస్టర్ బచ్చన్” (2024) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
టాలీవుడ్‌లో రిమేక్ సినిమాలపై నిరసన వ్యక్తం చేయడం చాలా మందిలోనూ కనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే హిట్ అయిన సినిమాలను మళ్లీ తీసుకోవడం, దానికి ఎలాంటి కొత్తతనం లేకపోవడం ప్రేక్షకులకు విసుగు కలిగిస్తోంది. సినిమా కొత్తగా ఉండాలని, మన భాషా, సంస్కృతిలోనే పుట్టిన కథలు కావాలని కోరుకుంటున్నారు. ఓవర్‌గా, సబ్‌టైటిల్స్‌తో చూసే ప్రేక్షకులకు రిమేక్ అవసరం ఏమిటి అన్న భావన కూడా ఉన్నది. ముఖ్యంగా, ఇప్పటికే డబ్ అయిన సినిమాలను మళ్లీ రిమేక్ చేయడం మరింత నిరాశను కలిగిస్తోంది.
దీనికి “గాడ్ ఫాదర్” (2022) సినిమా ఒక క్లాసిక్ ఉదాహరణ. మళయాళ బ్లాక్‌బస్టర్ “లూసిఫర్” (2019) ఇప్పటికే తెలుగులో డబ్ అయి యూట్యూబ్‌లో అందుబాటులో ఉండటం, అయినా చిరంజీవి గారితో దీన్ని రిమేక్ చేయడం ప్రేక్షకుల ప్రశ్నల ముంచుకు రావడానికి కారణమైంది. మరి, ఇదే పరిస్థితి హరీష్ శంకర్ విషయంలో కూడా ఉంది. ఆయన సినిమాలపై అభిమానులు పెట్టుకున్న అభిప్రాయం ఏంటంటే, ఆయన తరచుగా రిమేక్ సినిమాలకే కట్టుబడిపోతున్నారు అని. ఇలాంటి రిమేక్ సినిమాలపై ప్రేక్షకులు ఎదురు తిరగడం సహజమే. కొత్త కథలు, సృజనాత్మకతతో నిండిన సినిమాలు తీయడం ద్వారా మాత్రమే ఆ విమర్శలు తగ్గుతాయి.
హరీష్ శంకర్ దర్శకుడిగా, రీమేక్ సినిమాల్లో తనదైన శైలి చూపిస్తూ విజయాలను సాధించిన వ్యక్తిగా పేరుగాంచారు. పవన్ కళ్యాణ్ హీరోగా, బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కించిన “గబ్బర్ సింగ్” (2012) హిందీలో విడుదలైన బ్లాక్‌బస్టర్ “దబాంగ్” సినిమాకు రీమేక్. ఈ సినిమా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ కెరీర్‌లలోనే పెద్ద హిట్. “గద్దలకొండ గణేశ్” (2019) కూడా తమిళ బ్లాక్‌బస్టర్ “జిగర్ తాండ” రీమేక్ కాగా, ఇప్పుడు “మిస్టర్ బచ్చన్” కూడా హిందీ చిత్రం “రైడ్” (2018) రీమేక్. అంతేకాక, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా తమిళ “తేరి” (2016) రీమేక్. దీన్ని బట్టి, హరీష్ శంకర్‌ను రీమేక్‌లకు స్పెషలిస్టుగా చూడొచ్చు. కొత్త కథలు రాయలేకపోతున్నారా అని ఎవరైనా ప్రశ్నిస్తే, హరీష్ శంకర్ వారి సమాధానం ఎంతో సింపుల్: “మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు అందించడమే మా ఉద్దేశ్యం, అది ఒరిజినల్ సినిమా, రీమేక్ అనేది ఆలోచన కాదు.”
“మిస్టర్ బచ్చన్” సినిమాలోని పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా “సితార” పాట యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ తన అందచందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, కుర్రకారును తన నటనతో బాగా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ఈ పాటకు అందమైన ట్యూన్ ఇచ్చారు. సాహిత్యాన్ని అందించిన సాహితీ పాటకు చక్కని మాటలతో జీవం పోశారు. గాయకులు సాకేత్ కొముండూరి మరియు సమీర భరద్వాజ్ వారి స్వరాలతో ఈ పాటను మరింత మధురంగా, వినసొంపుగా చేశారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “సితార్” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: సితార్
- సినిమా: మిస్టర్ బచ్చన్
- నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు
- సినిమా దర్శకుడు: హరీష్ శంకర్
- సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్
- గేయరచయిత: సాహితీ
- గాయకులు: సాకేత్ కొముండూరి, సమీర భరద్వాజ్
- సినిమా విడుదల తేదీ: ఆగస్టు 15, 2024
- లేబుల్: టి-సిరీస్ తెలుగు
Sitar Song Lyrics in Telugu
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా
నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే.. హే..
నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్‍నా
పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్‍నా
ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా
గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్‍నా, హే.. హే..
సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్‍నా
వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్‍నా
నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన
నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా
హే.. హే..
Sitar Lyrics in English
Bottu Petti Pattu Cheera Kattukomma
Jattu Katti Chuttamalle Chuttukomma
Guttugunna Puttumachha Ekkadamma
Chitti Guvva Pittalaanti Chakkanamma
Bottu Petti Pattu Cheera Kattukomma
Jattu Katti Chuttamalle Chuttukomma
Guttugunna Puttumachha Ekkadamma
Nuvvu Chese Aagaalanni Nacheesa
Kaani Konchem Aagaalantu Cheppesa
Nuvu Cheppelogaa Raane Vachhesaa
Hey Hey
NigaNiga Pedavullo
Mohaalanni Thadipeynaa
Kasi Kasi Ompullo
Kaalaalanni Gadipeynaa
Paruvapu Sandhraala
Lothullonnaa Munakeyanaa
Padanisa Raagaala
Meghaalanni Taakeynaa
Aakupoka Choopanaa
Aasha Neelo Repanaa
Gaale Gole Chese Teeraana
Nee Kuchhili Maarchi
Muchata Teercheyanaa
Hey Hey
Sogasari Dongalle
Saayamkaalam Vacheynaa
Bigusari Paruvamtho
Pillo Yuddham Cheseynaa
Valapula Vegamtho
Vayyaaraale Vaateynaa
Thalapula Thaapamtho
Daahaalanni Daateynaa
Neelaakaasham Needana
Vidigaa Nanni Vedhana
Neelo Naalo Raagam Paadenaa
Tholi Pulakinthiche
Poochi Naadhega, Hey Hey
సితార్ Video Song
“మిస్టర్ బచ్చన్” సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. కొందరికి సినిమా బాగుందని అనిపిస్తే, మరికొందరు ఈ సినిమా ఏమిటో అర్థం కాకపోయిందని అంటున్నారు. ఇది సహజమే, ఎందుకంటే ప్రతీ ఒక్కరికి సినిమాను చూడటంలో వేర్వేరు అభిరుచులు ఉంటాయి. కానీ, సినిమాపై వచ్చిన ఈ స్పందన గురించి మనం పెద్దగా ఆలోచించనక్కర్లేదు. అయితే, ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రజల చేత ప్రశంసలు పొందాయి. ముఖ్యంగా రవితేజ గారి ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ 56 ఏళ్ల వయస్సులో కూడా విపరీతమైన స్పందన తెచ్చుకుంది. కానీ, “సితార” పాటలో ఆయన, 25 ఏళ్ల భాగ్యశ్రీ బోర్సేతో కలిసి వేసిన కొన్ని డ్యాన్స్ మూవ్స్ వివాదానికి దారితీశాయి. ఆ పాటలో రవితేజ గారి రెండు చేతులను హీరోయిన బ్యాక్ సైడ్ లోని ప్యాకెట్ లలో పెట్టి చేసిన స్టెప్పులు ప్రేక్షకుల మనసుకు పడలేదు. ఈ సన్నివేశం అసభ్యకరంగా ఉందని, ఆ డ్యాన్స్ ఎక్కువ మోతాదులో ఉన్నదని పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు ఈ అంశం గురించి దర్శకుడు హరీష్ శంకర్ ను సక్సెస్ మీట్‌లో ప్రశ్నించగా, ఆయన దీనిపై సమాధానం ఇచ్చారు. ఈ పాటను చిత్రీకరించిన మొదటి రోజే ఆ డ్యాన్స్ స్టెప్పులు తీసినట్లు, శేఖర్ మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ చేసిన స్టెప్పులను మార్చడం కుదరలేదని, మొదటి రోజు అవ్వడం వల్ల ఆ మార్పులకు అవకాశం లేదని చెప్పారు. ఇంకా, మొత్తం పాటను కంటిన్యూగా చూస్తే అసభ్యకరంగా అనిపించదని, కానీ కట్ కట్ చేసి చూస్తేనే ఇబ్బందిగా అనిపిస్తుందని హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. ఈ వివరణ ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి, కానీ సినిమా పాటలు, డ్యాన్స్‌లు మాత్రమే కాదు, కొన్ని వివాదాస్పద అంశాలే ఎక్కువగా చర్చనీయాంశం అయ్యాయి.
ఈ పాటలో హీరో మిస్టర్ బచ్చన్‌గా పేరొందిన ఆనంద్ (రవితేజ) మరియు హీరోయిన్ జిక్కీ (భాగ్యశ్రీ బోర్సే) మధ్య ఉన్న ప్రేమను సున్నితంగా, కవితాత్మకంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాటలో అబ్బాయి తన ప్రేమను చక్కగా వర్ణిస్తూ, ఆమె అందాన్ని పొగడ్తలతో పొగిడుతాడు, అనేక భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ, ప్రేమలోని మాధుర్యాన్ని చూపిస్తుంది. అమ్మాయి తన ప్రేమను సమర్థంగా అంగీకరిస్తూ, ఒక చిలిపి స్వభావంతో అబ్బాయిని సున్నితంగా ప్రశ్నిస్తుంది. పాటలోని లిరిక్స్ ప్రేమలో ఉన్న ఆకర్షణ, ఆనందం, మరియు అనుబంధాన్ని అద్భుతంగా వివరిస్తాయి, అందంగా పొందికైన సంగీతంతో ఈ పాటను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తాయి.