‘సమ్మోహనుడ‘ పాట యొక్క లిరిక్స్‌ను (Sammohanuda Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 06 అక్టోబర్ 2023న విడుదలైన రూల్స్ రంజన్ (Rules Ranjann) అనే తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమాలోనిది. రతినం కృష్ణ రచన మరియు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించగా, మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మధ్యతరగతి యువకుడు మనో రంజన్ (కిరణ్ అబ్బవరం). తను చదువులో యావరేజ్ అయినప్పటికీ కష్టపడి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగం పొందుతాడు, దాని కోసం ముంబైకి మారతాడు. అయితే, హిందీ రాకపోవడం వల్ల ప్రారంభంలో ఆఫీస్‌లో కొన్ని అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ సమస్యను అలెక్సా సహాయంతో పరిష్కరించుకొని తన ప్రతిభతో బాస్‌ను మెప్పించి, టీమ్ లీడర్‌గా ఎదుగుతాడు. ఆపైన ఆఫీస్‌లోని అందరిని తన రూల్స్ ప్రకారం నడిపిస్తూ, ‘రూల్స్ రంజన్’ అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు.
ఇలా జీవితం గడుస్తున్న సమయంలో సనా (నేహా శెట్టి) అతని జీవితంలోకి వస్తుంది. సనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా, ముంబైలోని ఇంటర్వ్యూకి వస్తుంది. అప్పటికే ముంబైలో ఉద్యోగం చేస్తున్న రంజన్ సనాను మెట్రోలో చూసి తన గతం గురించి ఆమెతో పంచుకుంటాడు. కాలేజీ రోజుల నుండి రంజన్ సనాను ప్రేమిస్తున్నప్పటికీ, భయంతో తన ప్రేమను వ్యక్తం చేయకపోతాడు. ముంబైలో సనాను కలుసుకున్న తర్వాత కూడా రంజన్ తన ప్రేమను వ్యక్తం చేయడు. ఇంటర్వ్యూలో విఫలమై సనా తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయే ముందు ముంబై మొత్తం తిప్పి చూపించమని రంజన్ ను అడుగుతుంది. రంజన్‌తో కలిసి ఒకరోజంతా గడిపిన సనా కూడా అతనిపై ఆకర్షణ పెంచుకుంటుంది. ఆ క్రమంలో సనా ముంబై నుంచి తిరిగి ఊరికి వెళ్తుండగా, రంజన్ తనకోసం వచ్చినప్పటికీ ఆమె మొబైల్ నంబర్ తీసుకోవడం మరిచిపోతాడు. ఆమెను మళ్లీ కలిసేందుకు రంజన్ ముంబై నుంచి వచ్చి ఆమెను వెతుకుతుంటాడు. కామెడీ, యాక్షన్‌తో సాగిన ఈ కథ రంజన్, సనా మధ్య ప్రేమ మొదలవడం చివరికి వారికి పెళ్లి జరగడం వరకు సాగుతుంది.
కిరణ్ అబ్బవరం సినిమాలు ఎలా ఉన్నా కూడా వాటిలోని పాటలకు మాత్రం ఏ వంక పెట్టలేము. అంత మంచి పాటలను ఎలా పట్టుకుంటారో తెలీదు కానీ, కొన్నైతే మన హిట్ సాంగ్స్ లీస్ట్ లో చేరిపోతుంటాయి. ఇదే కోవలోకి ఈ రూల్స్ రంజన్ సినిమాలోని ఈ ‘సమ్మోహనుడ పెదవిస్తా నీకే కొంచం కోరుక్కోవ’ పాట కూడా వస్తుంది. దీనికి సంగీతాన్ని అందించింది అమ్రిష్ గణేష్. అలాగే ఈ పాటను రాంబాబు గోసాల ఈ సినిమా దర్శకుడైన రథినం కృష్ణతో కలిసి రాశాడు. అదే విధంగా దీనిని పాడింది ద గ్రేట్ సింగర్ శ్రేయా ఘోషల్. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “సమ్మోహనుడ” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: సమ్మోహనుడ (Sammohanuda)
- సినిమా: Rules Ranjann (రూల్స్ రంజన్)
- నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు
- సినిమా దర్శకుడు: రథినం కృష్ణ
- సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
- పాట రచయిత: రథినం కృష్ణ, రాంబాబు గోసాల
- గాయని: శ్రేయా ఘోషల్
- సినిమా విడుదల తేదీ: 06 అక్టోబర్ 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Sammohanuda Song Lyrics in Telugu
కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె
చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్
తెరలే తొలగించెయ్వా మధనా
సమ్మోహనుడ పెదవిస్త నీకే
కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
ఝుమ్మను తుమ్మెద నువ్వైతే
తేనెల సుమమే అవుతా
సందెపొద్దే నువ్వైతే
చల్లని గాలై వీస్తా
శీతాకాలం నువ్వే అయితే
చుట్టే ఉష్ణాన్నౌతా
మంచు వర్షం నువ్వే అయితే
నీటి ముత్యాన్నౌతా
నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్
తెరలే తొలగించెయ్వా మధనా
నదిలా కదిలిన ఎదలయలే
పొంగే ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా
నదిలా కదిలిన ఎదలయలే
పొంగే ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా
సమ్మోహనుడ పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె
చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్
తెరలే తొలగించెయ్వా మధనా
Sammohanuda Lyrics in English
Koncham Korukkova
Ishta Sakhuda Nadumistha Neeke
Naluge Pettukovaa
Pachi Prayale Vechenaina
Chilipi Oosulaada Vache
Chematallo Thadisina Deham
Sugandhaala Gaali Panche
Choosey Choosey Choosey
Kaluvai Unnaale Sasivadhana
Teesey Teesey Teesey Theesey
Terale Tholigincheyvaa Madhanaa
Sammohanuda Pedavistha Neeke
Koncham Korukkova
Ishta Sakhuda Nadumistha Neeke
Naluge Pettukovaa
Jhummanu Thummedha Nuvvaithe
Thenela Sumame Avuthaa
Sandhepoddhe Nuvvaithe
Challani Gaalai Veesthaa
Seethakalam Nuvve Ayithe
Chutte Ooshnnaannautha
Manchu Varsham Nuvve Ayithe
Neeti Muthyaannauthaa
Nannu Choosey Choosey Choosey
Kaluvai Unnaale Sasivadhana
Teesey Teesey Teesey Theesey
Terale Tholigincheyvaa Madhanaa
Nadhila Kadhilina Yedhalayale
Ponge Prema Alalai
Edurautha Kadalai
Mettha Metthani Hrudayaanni
Meesamtho Thadamaala
Ipude Thodime Thunchi
Sukhame Panchi Okataipovaala
Nadhila Kadhilina Yedhalayale
Ponge Prema Alalai
Edurautha Kadalai
Mettha Metthani Hrudayaanni
Meesamtho Thadamaala
Ipude Thodime Thunchi
Sukhame Panchi Okataipovaala
Sammohanuda Pedavistha Neeke
Koncham Korukkova
Ishta Sakhuda Nadumistha Neeke
Naluge Pettukovaa
Pachi Prayale Vechanaina
Chilipi Oosulaada Vache
Chematallo Thadisina Dheham
Sugandhaala Gaali Panche
Choosey Choosey Choosey
Kaluvai Unnaale Sasivadhana
Teesey Teesey Teesey Theesey
Terale Tholigincheyvaa Madhanaa
సమ్మోహనుడ పెదవిస్తా నీకే కొంచం కోరుక్కోవ Video Song
పాట వచ్చే సందర్భం:
‘సమ్మోహనుడ’ పాట ‘రూల్స్ రంజన్’ సినిమాలోని రొమాంటిక్ పాట. ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, అక్కడ సనా (నేహా శెట్టి) అనే యువతి తన వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వస్తుంది. ఆమెను చూడగానే మనో రంజన్ తన కాలేజీ రోజుల్లో ఆమెను ఎంతగానో ప్రేమించేవాడని గుర్తు చేసుకుంటాడు. కానీ అప్పట్లో ఆమెతో తన ప్రేమను చెప్పలేదు. ఈసారి ముంబైలో ఆమెను కలుసుకున్న ఆనందంలో ఆమెకు తన ప్రేమను పరోక్షంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు.
ముంబైలో ఉన్నంతకాలం రంజన్ సనా కోసం సమయాన్ని ఆస్వాదిస్తాడు, ఆమెకు ముంబై అందాలను చూపిస్తాడు. సనా తిరిగి తన ఊరికి వెళ్ళేలోపల వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కానీ ఆమె వెళ్ళే ముందు తన ఫోన్ నంబర్ పొందడం మాత్రం మరిచి పోతాడు. సనా వెళ్ళిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకాలతో బాధపడుతూ, రంజన్ తన ఊరికి వచ్చి ఆమెను కలవడానికి ప్రయత్నిస్తాడు. తనకు ఆమె ఫోన్ నంబర్ లేకపోవడంతో, సనా స్నేహితురాలు స్వప్న (మెహర్ చాహల్) ద్వారా ఆమెను కలవడానికి ప్రణాళిక వేస్తాడు. చివరగా కాలేజ్ రీ-యూనియన్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి, తన బ్యాచ్‌మేట్స్‌తో పాటు సనాను కూడా రప్పిస్తాడు.
ఆ కాలేజ్ రీ-యూనియన్ ఫెస్టివల్ లో స్వప్న మరియు సనా ఫల్లుగా మందు తాగి మత్తులో తూగుతుంటారు. వారిని రంజన్ ఇంతకు ముందే బుక్ చేసిన రూమ్ లోకి తీసుకుని వెళ్ళబోయే సమయంలో ఆ హోటల్ లో పనిచేసే వేయిటర్ అలాగే ఎవరో వేరొక వ్యక్తి వారు ముగ్గురిని చూసి రొమాంటిక్ గా ఊహించుకుంటారు. అప్పుడు ఈ పాట మొదలవుతుంది. అంటే ఇది ఊహల్లో సాగే రొమాంటిక్ పాట. ఈ పాటలో మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) మరియు సనా (నేహా శెట్టి) మధ్య చాలా రొమాంటిక్ సాగుతంది. దీనిని సనా పాడుతున్నట్టు ఉంటుంది.
“సమ్మోహనుడా పెదవిస్తా నీకే” ఈ పంక్తితోనే పాట మొదలవుతుంది. ఇక్కడ “సమ్మోహనుడా” అని రంజన్ ను సనా పిలుస్తుంది. ఇక్కడ సమ్మోహనుడా అంటే “మోహింప చేసేవాడా” అని అర్థం. ఇది ప్రధానంగా ప్రేమ, ఆకర్షణ మరియు మాయాజాలం వంటి భావాలను సూచిస్తుంది. అలాగే సనా తదుపరి లైన్లో నీకు నా పెదవిని ఇస్తాను కొద్దిగా కొరక్కోవా అని అడుగుతుంది. అడుగుతుంది అనడం కన్నా ప్లీజ్ అనే విధంగా అడుగుతుంది. “ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే” అని చెప్పడం ద్వారా రంజన్ తనకు ఇష్టమైన స్నేహితుడు అంటూనే, నీకు నడుమును ఇస్తాను దానికి నలుగును పెట్టమని అతనితో చెబుతుంది. అంటే నలుగు పెట్టే వంకతో నడుమును నలుపుతాడనే ఊహించి ఉంటుంది.
తర్వాతి లైన్లో, మంచి యవ్వనంలో వెచ్చగా ఉండి నీతో చిలిపి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వేడిలో నా దేహం చెమటల్లో తడిసిపోయి, సుగంధాల వంటి వాసన పంచుతుంది కావున నువ్వు చూసెయ్, నేను కలువ పువ్వులా ఉన్నాను, ఉన్న అడ్డంకులన్ని తీసేయ్ అంటూ తన్మయత్వంతో రంజన్ కు చెబుతూ ఉన్నది. అలాగే రంజన్ తుమ్మెద అయితే తను తేనె అవుతుందని, రంజన్ సాయంత్రం అయతే సాయంత్రం వీచే చల్లని గాలి తను అవుతుందని అంటుంది. ఇలా పాట మొత్తం సనా రంజన్ పై ఉన్న తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది.
ముగింపు:
ఇంతకు ముందే పైన చెప్పుకున్నట్టు కిరణ్ అబ్బవరం సినిమాలు ఎలా ఉన్న ఒక్క పాటైనా బ్లాక్ బస్టర్ గా నిలిచే పాట ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమ్మోహనుడ పాట ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్రబృందం ముందుగానే ఊహించడం అలాగే దీనిని శ్రేయా ఘోషల్ తో పాడించారని ఈ పాట విన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ పాటలో నేహా శెట్టి ఎంత హాట్‍గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. ఈమె కర్ణాటకలోని మంగళూరుకు చెందింది కాబట్టే ఇంత అందంగా ఉందో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రసిద్ది చెందిన చాలామంది హీరోయిన్స్ ఇక్కడి నుండే వచ్చారు కాబట్టి. మన అనుష్క శెట్టి అలాగే ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఇక్కడివారే.
ఈ పాటను చూడడానికి ముఖ్యంగా రెండు బలమైన కారణాలు ప్రేరేపిస్తాయి. వాటిలో మొదటిది శ్రేయా ఘోషల్ తన సుమధురమైన స్వరంతో ఈ పాటను పాడిన విధానం అయితే ఇక రెండోది ఖచ్చితంగా నేహా శెట్టి కోసమే చూస్తారని అనడంలో సందేహమే లేదు. నిజంగా షీ ఈజ్ సో హాట్ గురు. అలాగే ఈ పాటను రాసినవారిలో ఈ సినిమా దర్శకుడైన రథినం కృష్ణ ఉండడంతో ఇతను మల్టి టాలెంటెడ్ అని అర్థమవుతుంది. అలాగే సంగీతంలో కూడా రొమాంటిక్ ఫీల్ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని తెలుగు సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడు అమ్రిష్ గణేష్ తమిళ వాడైనను అన్ని పాటలను చక్కగా కంపోజ్ చేశారు. అందుకే అంటారేమో సంగీతానికి భాష లేదని. మీరు ఈ ‘సమ్మోహనుడ’ పాటను చూడకపోతే ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంది కాబట్టి తప్పకుండా చూసి ఈ పాటను ఆస్వాదించండి.
Report a Lyrics Mistake / Share Your Thoughts