‘రాజు నా బాలరాజు‘ పాట యొక్క లిరిక్స్‌ను (Raju Naa Balaraju Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన బూట్‌కట్ బాలరాజు (Bootcut Balaraju) అనే తెలుగు సినిమాలోని పాట. శ్రీ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సయ్యద్ సోహైల్, మేఘలేఖ, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, ఝాన్సి, సిరి హనుమంత్, జబర్దస్త్ రోహిణి వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం 2021 డిసెంబర్ 21న హైదరాబాద్‌లో జరిగింది. ప్రధాన చిత్రీకరణ 2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. 2022 ఏప్రిల్ 18న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. చిత్రీకరణ పూర్తయిన తరువాత, పాటల విడుదలపై దృష్టి సారించి, 2024 ఫిబ్రవరి 2న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు. 2023 డిసెంబర్ 11న అనిల్ రావిపూడి చేతుల మీదుగా చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
సయ్యద్ సోహైల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు విస్తృతంగా పరిచయమైన వ్యక్తి. తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు నిజాయితీతో ఆయన అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొన్న తర్వాతే సోహైల్‌కు అసలు గుర్తింపు లభించింది. ఈ షోలో తన నిజాయితీ, స్నేహం మరియు కొన్నిసార్లు ఆవేశపూరిత ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తర్వాత సోహైల్‌కు అనేక సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, బిగ్ బాస్‌లో పొందిన గుర్తింపు సినిమాల్లో సాధించలేకపోయారు. ప్రతి సంవత్సరం ఆయన తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అయితే, ఈ సినిమాల కథ బాగున్నా, ప్రేక్షకులు సరిగ్గా ఆదరించడం లేదు. బహుశా దీనికి కారణం ఇతను స్టార్ హీరో లేదా నెపో కిడ్ కాకపోవడమేనేమో. ముఖ్యంగా “బూట్‌కట్ బాలరాజు” సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు, చాలా కొద్దిమంది మాత్రమే చూసారు. దీంతో సోహైల్ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశాడు, “దయచేసి ప్రేక్షకులు నా సినిమా చూడండి” అని కోరుతూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ సంఘటన అప్పట్లో మీమర్స్‌కు మంచి మీమ్ మెటీరియల్ కూడా అయింది. ఇక ముందు వచ్చే సినిమాలు బాగా ప్రమోషన్ చేసుకుని థియేటర్లలో రావాలి. ఎంత చిన్న సినిమా అయినా, కంటెంట్ బాగుంటే, పబ్లిసిటీ లేకపోయినా ప్రజల మధ్య చర్చలు జరిగి ఆ సినిమా హిట్ అవుతుంది. అందుకే, ఎక్కువ సినిమాలు తీయడంపై దృష్టి పెట్టకుండా, మంచి కథలతో సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు రావాలి.
ఇక ఈ “బూట్‌కట్ బాలరాజు” సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. వీటన్నింటి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. భీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, తెలంగాణ యాసలో మాస్ పాటలు పాడడంలో సంగీతం అందిచడంలో ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది, అందువల్లనే సినిమా బృందాలు ముందుగా ఆయనను సంప్రదిస్తుంటాయి. ఆయన చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడకుండా అన్ని సినిమాలకు మంచి పాటలే అందిస్తాడు. దీని ఉదాహరణ ఈ “బూట్‌కట్ బాలరాజు” సినిమా. ఇందులోని కొన్ని పాటలు కూడా బాగున్నాయి. ఈ సినిమాలోని ‘రాజు నా బాలరాజు’ పాటను కాసర్ల శ్యామ్ రాసాడు. ఇతను కూడా తెలంగాణ యాసలో పాటలు రాయడంలో మేటి. ఈ పాటను స్వాతి రెడ్డి పాడింది. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “రాజు నా బాలరాజు” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: రాజు నా బాలరాజు
- సినిమా: Bootcut Balaraju (బూట్‌కట్ బాలరాజు)
- నటీనటులు: సయ్యద్ సోహైల్, మేఘలేఖ
- సినిమా దర్శకుడు: శ్రీ కోనేటి
- సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
- గేయరచయిత: కాసర్ల శ్యామ్
- గాయని: స్వాతిరెడ్డి
- సినిమా విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2024
- లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్
Raju Naa Balaraju Song Lyrics in Telugu
మనసు నా మనసు
వెళ్లలేకపోతుందయ్యో
ఆ సంగతి నాకు తెలుసు
ఇన్నినాళ్ళ సంది
సూడలేదు ఇంత రంది
సుట్టు ఉన్న మంది
సూపు నిన్నే ఎతుకుతాంది
నువ్వు నవ్వుతుంటే ఏందయ్యో
నా గుండె గుంజుతుందయ్యో
సిత్తరంగ ఉందయ్యో
నా ఎదురంగా నువ్వుంటే
బుగ్గల్లో సిగ్గెందయ్యో
రాజు నా బాలారాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా రా రా
నువ్ సిన్న నాటి నుండి
తిరిగేటి దోస్తైనా
ఇప్పుడున్నపాటుగా
ఇష్టాన్ని పెంచుకున్నా
రోజు పక్క పక్క సీటులోనే
కూసోని వెళుతున్నా
నేడు ఏలు తాకితేనే
చక్కిలిగింతల్లో మునుగుతున్న
ఇన్నేండ్లకు నీ కండ్లను
నే సూటిగా సూడ్లేకున్నా
సాటుగ దాగుడుమూతల ఆటరా
నీ సేతిల సెయ్యేసి మరీ
సెప్పాలని ఉన్నదిరా
లోపలేదో లొల్లి జరుగుతంది
వశపడతలే నీ వల్లనే
రాజు నా బాలారాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా రా రా
నిన్ను సూసుకుంట
వంద ఏళ్ళైనా బతికేస్తా
నీ పేరు తల్సుకుంట
ఎన్నాళ్ళైనా ఉండిపోతా
నీ ఒక్కని కోసం
లోకాన్ని మొత్తం వదిలేస్తా
నువ్వు పక్కనుంటే సాలు
ఎక్కడికైనా కదిలొస్తా
ఏ గడియలో నువ్ నచ్చినవో
సచ్చిన నిను ఇడువను
ఈ పిచ్చిని ప్రేమంటావో
ఏమంటావో
ఈ ఆశను అరిగోసను
ఓ నిమిషము నే సైసనురా
లగ్గమింక జేసుకొని
నీ పిల్లలకు తల్లినైపోతను
రాజు నా బాలారాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా రా రా
Raju Naa Balaraju Lyrics in English
Manasu Naa Manasu
Vellalekapothundhayyo
Aa Sangathi Naaku Telusu
Inninaalla Sandhi
Soodaledhu Intha Randhi
Suttu Unna Mandhi
Soopu Ninne Ethukuthaandhi
Nuvvu Navvuthunte Endhayyo
Naa Gunde Gunjuthundhayyo
Sittharanga Undhayyo
Naa Edhuranga Nuvvunte
Buggallo Siggendhayyo
Raju Na Baalaraju
Raju Bangari Raju
Raju Na Raaraaju Raaveraa
Raju Na Sakkani Raju
Raju Na Sukkala Raju
Raju Naa Muddhua Raju
Ra Ra Raa
Nuv Sinna Naati Nundi
Thirigeti Dosthainaa
Ippudunnapaatuga
Ishtaanni Penchukunna
Roju Pakka Pakka Seatulone
Koosoni Veluthunna
Nedu Yelu Thaakithene
Chakkiliginthallo Munuguthunna
Innendlaku Nee Kandlanu
Ne Sootiga Soodlekunna
Saatuga Daagudumoothalu
Aataraa
Nee Sethila Seyyesi Maree
Seppaalani Unnadhiraa
Lopaledho Lolli Jaruguthandhi
Vashapadathale Nee Vallane
Raju Na Baalaraju
Raju Bangari Raju
Raju Na Raaraaju Raaveraa
Raju Na Sakkani Raju
Raju Na Sukkala Raju
Raju Naa Muddhua Raju
Ra Ra Raa
Ninnu Soosukunta
Vandha Ellainaa Bathikesthaa
Nee Peru Talsukunta
Ennaallainaa Undipothaa
Nee Okkani Kosam
Lokaanni Mottham Vadhilesthaa
Nuvvu Pakkanunte Saalu
Ekkadikainaa Kadhilosthaa
Ye Gadiyalo Nuv Nachinavo
Sachhina Ninu Iduvanu
Ee Pichhini Premantaavo
Emantaavo
Ee Aasanu Arigosanu
O Nimishamu Ne Saisanuraa
Laggaminka Jesukoni
Nee Pillalaku Thallinaipothanu
Raju Na Baalaraju
Raju Bangari Raju
Raju Na Raaraaju Raaveraa
Raju Na Sakkani Raju
Raju Na Sukkala Raju
Raju Naa Muddhua Raju
Ra Ra Raa
రాజు నా బాలరాజు Video Song
బిగ్ బాస్ షోకు చాలామంది రకరకాల కారణాలతో వెళుతుంటారు. అయితే, కొందరు కేవలం ప్రజల్లో గుర్తింపు పొందడానికి మరియు బయటకు వచ్చాక సినిమాలలో అవకాశాలు పొందడం కోసం మాత్రమే వెళ్తారు. అలాంటి వారిలో సోహైల్ కూడా ఒకరు. బిగ్ బాస్ హౌస్‌లో అతని క్యారెక్టర్‌ను చాలా మంది ఇష్టపడ్డారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా అతనికి మంచి క్రేజ్ ఉండేది. ఆడియన్స్ తన సినిమాలను ప్రోత్సహిస్తారని నమ్ముకుని సోహైల్ ఇప్పటివరకు చాలానే సినిమాలు తీసాడు. కాని వాటిలో ఏదీ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వలేదు. కొన్ని ప్లాఫ్ అయితే, ఇంకొన్ని యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ “బూట్ కట్ బాలరాజు” సినిమా అయితే దారుణంగా అని చెప్పాలి. ఈ సినిమాను ఎవ్వరూ చూడడానికి థియేటర్‌కు రాకపోవడంతో, సోహైల్ మీడియా ముందు వచ్చి తన బాధను ఏడుస్తూ చెప్పి, ఈ సినిమాను చూడవలసినదిగా ఆడియన్స్‌ను వేడుకున్నాడు.
ఇక ఇందులోని “రాజు నా బాలరాజు” పాట ఒక అందమైన ప్రేమ పాట. ఇందులో హీరో బాలరాజు (సయ్యద్ సోహైల్) కోసం హీరోయిన్ మహాలక్ష్మి (మేఘలేఖ) తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆమె మనసులోని భావాలను పంచుకుంటూ, బాలరాజు మీద ఉన్న తన ప్రేమ, ఆకర్షణను తెలియజేస్తుంది.