‘రాధిక‘ పాట యొక్క లిరిక్స్‌ను (Radhika Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన టిల్లు స్క్వేర్ (Tillu Square) అనే తెలుగు రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాలోని పాట. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. సుమంత్ హీరోగా నటించిన ‘నరుడా డోనరుడా (2016)’ సినిమా ద్వారా మల్లిక్ రామ్ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తర్వాత ఈయన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు కాని అవేవి ఈయనకు తగిన గుర్తింపు తీసుకురాలేక పోయాయి.
‘టిల్లు స్క్వేర్’ అనేది 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వేల్. మొదటి పార్ట్ లో బాలగంగాధర్ తిలక్ అలియాస్ టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) రాధిక (నేహా శెట్టి) చేతిలో మోసపోతాడు. ఇక ఈ రెండో పార్ట్ లో (సీక్వెల్) కూడా లిల్లి జోసెఫ్ (అనుపమ పరమేశ్వరన్) చేతిలో మోస పోతాడు. ఇక అంతే మన టిల్లుగాడు ఇలా అమాయకంగా అందమైన అమ్మాయిల చేతిలో మోసపోవడం, క్లైమాక్స్ లో ఆ అమ్మాయిలనే తన తెలివితో జైల్లో వేయించడం.
ఇక మూడో పార్ట్ స్టోరి కూడా బహుశా ఇలానే ఉంటుందేమో. ఇలానే ఉన్న కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆడియన్స్ టిల్లు గాని మ్యానెరిజంకు, డైలాగ్ డెలివరికి, ఆ స్వాగ్ కు, ఆ బాడీ లాంగ్వేజ్ కు, కామిడి టైమింగ్ కు ఇలా మొత్తం టిల్లు క్యారెక్టర్ కు అడిక్ట్ అయిపోయారు. ఇదే ఫ్రాంచేజ్ లో ముందు ముందు వచ్చే సినిమాలలో ఒకవేళ స్టోరీ నిరాశపరిచిన కూడా, టిల్లు మాత్రం నూరు శాతం ఎంటర్ టైన్ చేయడం పక్కా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అసలు టిల్లు క్యారెక్టర్ లో సిద్ధు జొన్నలగడ్డను తప్ప మిగత వేరే వారిని ఊహించుకోవడానికి కూడా ఛాన్సే లేకుండా ఆ క్యారెక్టర్ ను సృష్టించారు. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలలో మీమ్స్ ను, సోషియల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ ను వాడుతున్నారు. కానీ ఈ టిల్లు ఫ్రాంచేజస్ లో వచ్చిన ‘డీజే టిల్లు (2022)’ మరియు ‘టిల్లు స్క్వైర్ (2024)’ సినిమాలలో అయితే మీమ్స్ కు ఉపయోగపడే చాలానే కంటెంట్ ను ఇస్తున్నారు. ఇది కదా ఒరిజినల్ క్రియేటివిటి అంటే.
ఇక పాటల విషయానికి వస్తే ఇందులోని ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అయ్యాయి. రాధిక పాటైతే రాధిక పేరున్న ప్రతీ ఒక్క అమ్మాయికి డెడికేట్ చేసే విధంగా ఉంటుంది. ఈ పాట మొదలవడానికి ముందు వచ్చే రాధిక పేరుకు సంబంధించిన డైలాగ్ రాధిక పేరున్న వాళ్ళు వింటే, ఆ పేరు పెట్టుకున్నందుకు షేమ్ ఫిల్ అవ్వడం గ్యారెంటి. ఈ రాధిక పాటకు సంగీతంతో సహా గానం కూడా అందించింది రామ్ మిరియాలా. అక్టోబర్ 30, 1987న ఆంధ్రప్రదేశ్‌లోని కోలంకలో జన్మించిన రామ్, రేడియో మిర్చికి ప్రోమో ప్రొడ్యూసర్‌గా మారడానికి ముందు కార్పొరేట్ రంగంలో తన వృత్తిని ప్రారంభించాడు. 2018లో, అతను కొంతమంది స్నేహితులతో కలిసి ‘చౌరాస్తా’ అనే మ్యూజిక్ బ్యాండ్‌ను స్థాపించాడు. 2019లో ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలోని “వగలాడి”తో రామ్ ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశారు. ఈ టిల్లు స్క్వేర్ సినిమాలోని మొత్తం నాలుగు పాటలలో మూడింటిని ఇతను కంపోజ్ చేశాడు. ప్రతీ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఈ రాధిక పాటను రాసింది కాసర్ల శ్యామ్.
పాట సమాచారం:
- పాట: రాధిక
- సినిమా: Tillu Square (టిల్లు స్క్వేర్)
- నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్
- సినిమా దర్శకుడు: మల్లిక్ రామ్
- సంగీత దర్శకుడు: రామ్ మిరియాల
- గేయరచయిత: కాసర్ల శ్యామ్
- గాయకుడు: రామ్ మిరియాల
- సినిమా విడుదల తేదీ: మార్చి 29, 2024
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Radhika Song Lyrics in Telugu
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలేందే ఇక
కాటుక కళ్లతోటి కాటే వేసావే
నువ్వు సూటిగా చూసి
దిల్లు టైటే చేసావే, భళా భళా
మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే
డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే
చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా
చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా
నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా
నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే, హా
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
హ, బేబీ అంటూ పిలిచి
బతుకు దోబీ ఘాటు చేసావే
డార్లింగ్ అంటూ గోకి
గుండెల్లో బోరింగు దింపేసినావే
పతంగిలా పైకి లేపి
మధ్యలో మాంజ కొసేసినావే
బలికా బకరాని చేసి
పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే
అరెరె, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే, ఏయ్
రంగుల కొంగు తాకి పడిపోయానే, ఆహ
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
Radhika Lyrics in English
Radhika Radhika
Mundhuka Enakaka
Kindhika Meedhika
Radhika Radhika
Radhika Radhika
Munchaka Telchaka
Aatalendhe Ika
Kaatuka Kallathoti Kaate Vesaave
Nuvvu Sootiga Choosi
Dillu Tight Ye Chesaave
Bhala Bhala
Mantraalevo Yesi Hack Chesaave
Delicate Mind-u Mottham
Block Ye Chesaave
Chakkarlu Koduthunnaane
Kukkapilla Laaga
Nuvvese Biscuit Laku
Marigaane Baagaa
Chocolate-u Gunjukunna
Santipornlaagaa
Nannedipisthunnaave
Gilla Gilla Kottukogaa
Nee Gingula Juttu Choosi Padipoyane
Nee Bongulo Maatalini Padipoyaane
Rangula Kongu Thaaki Padipoyaane
Nee Gaali Sokithene Sachhipoyaane
Haa
Radhika Radhika
Radhika Radhika
Mundhuka Enakaka
Kindhika Meedhika
Radhika Radhika
Radhika Radhika
Munchaka Telchaka
Aatalendhe Ika
Ha, Baby Antu Pilichi
Bathuku Dhobi Ghaatu Chesaave
Darling Antu Goki
Gundello Boring-u Dimpesinaave
Pathangilaa Paiki Lepi
Madhyalo Maanja Kosesinaave
Balikaa Bakaraani Chesi
Poshamma Gudi Kaada Idisesinaave
Arere Nee Ringula Juttu Choosi
Padipoyaane, Aaha
Nee Bongulo Maatalini Padipoyaane, Aey
Rangua Kongu Thaaki Padipoyaane, Aaha
Nee Gaali Sokithene Sachipoyaane
Radhika Radhika
Radhika Radhika
Mundhuka Enakaka
Kindhika Meedhika
Radhika Radhika
Radhika Radhika
Munchaka Telchaka
Aatalendhe Ika (x2)
రాధిక రాధిక Video Song
డిజే టిల్లు (పార్ట్ వన్) సినిమాలో మన టిల్లు అన్నని రాధిక ఎంతలా ఆడుకుందో తెలిసిందేగా. మళ్ళీ ఈ సీక్వెల్ లో కూడా అలాంటి లక్షణాలతో ఉన్న అమ్మాయి మన టిల్లు అన్నకు ఎదురౌతుంది. అప్పుడు వారిద్దరి మధ్య ఈ క్రింది విధంగా సంభాషణ జరుగుతుంది. డిజే టిల్లు (పార్ట్ వన్) సినిమాలో మన టిల్లు అన్నని రాధిక ఎంతలా ఆడుకుందో తెలిసిందేగా. మళ్ళీ ఈ సీక్వెల్ లో కూడా అలాంటి లక్షణాలతో ఉన్న అమ్మాయి మన టిల్లు అన్నకు ఎదురౌతుంది. అలా ఆమెతో టిల్లు మాట్లాడుతుండగా ఈ పాట మొదలవుతుంది. టిల్లు రాధికను చూసి ప్రశ్నలు వేస్తూ, తనదైన శైలిలో మొదలుపెట్టాడు: “రాధిక, నీకు ఏం కావాలో చెప్పు, ఈసారి నా జీవితాన్ని ఎలా ముంచబోతున్నావు?”. ఆ క్షణంలో లిల్లి, కాస్త ఆశ్చర్యపోతూ, సమాధానమిచ్చింది: “రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నేను లిల్లి.”
కానీ టిల్లు ఆపలేదు. “నీ పేరు లిల్లీ కావచ్చు, కానీ నువ్వు 100% రాధికలా కనిపిస్తున్నావు. రాధికలు ఒక వర్గం, మీరందరూ రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ లాగా ఉంటారు. ఆ గుట్ట మీద నుంచుని టిల్లులాంటి వాళ్లను చుస్తూ, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. మీ కాలేజీ కూడా గొప్పది. నేను ఒకసారి మీ సూపర్ సీనియర్ రాధికను కలిశాను. ఆమె నాకు రాగ్గింగ్ చేసి చానా ఆనందించింది, నేను కూడా చానా ఎంజాయ్ చేసాను. ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటారు.” టిల్లుగాడు తన ఉద్దేశాన్ని తేల్చేసి, చివరగా అడిగాడు: “రాధిక, నువ్వు నా జీవితంలోకి ఎలా వచ్చావో ఇప్పుడు ఏం కావాలో చెప్పు!”. అలా ఆమెతో టిల్లు మాట్లాడుతుండగా ఈ పాట మొదలవుతుంది.
అలా మొదలైన ఈ పాట మంచి ఊపుతో కొనసాగుతుంది. కాసర్ల శ్యామ్ రచన, రామ్ మిరియాల సంగీతం మరియు గానం ఈ పాటకు ప్రధాన బలాలైతే, మన స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ స్క్రీన్ ప్రెజెన్స్ పాటను వేరే లెవల్ కు తీసుకుని వెళ్ళింది. ఈ పాటకు రాధిక పేరున్న వారికి హానికరం అని డిస్క్లేమర్ వేస్తే బాగుండేది అనిపిస్తుంది. రాధిక పేరున్నవారు ఈ పాటను విని తక్కుకోగలం అనుకుంటే మాత్రమే ఈ పాటను వినాలని నా సూచన.