Raayani Kadhale Song Lyrics – True Lover (2024) | MS Krsna, Meha Agarwal

రాయని కథలే పాట యొక్క లిరిక్స్‌ను (Raayani Kadhale Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన ట్రూ లవర్ (True Lover) అనే రొమాంటిక్ డ్రామా తెలుగు సినిమాలోని పాట. ఈ సినిమాను నూతన దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ తెరకెక్కించగా, MRP ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మించాయి. మణికందన్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ప్రేమ కథా నేపథ్యంతో తెరకెక్కింది. సహాయ పాత్రల్లో శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్ వంటి నటులు కనిపిస్తారు. తమిళంలో ఫిబ్రవరి 9, 2024న విడుదలైన ఈ చిత్రం, తెలుగులో మాత్రం ఒక రోజు ఆలస్యంగా, ఫిబ్రవరి 10, 2024న విడుదలైంది.

ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే, అరుణ్ (మణికందన్) మరియు దివ్య (శ్రీ గౌరి ప్రియ) కాలేజ్ రోజుల నుంచి ప్రేమలో ఉంటారు. కాలేజ్ పూర్తయ్యాక, దివ్య మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదిస్తే, అరుణ్ కేఫ్ పెట్టాలనే ప్రయత్నాల్లో ఉండి ఖాళీగా ఉంటాడు. దివ్య ఇతర అబ్బాయిలతో మాట్లాడినా, బయటకు వెళ్తేనూ అనుమానించే అరుణ్, ఆమెను నియంత్రించేందుకు తాపత్రయపడతాడు. ఈ కారణంగా తరచూ గొడవలు, విడిపోవడం, మళ్లీ కలవడం జరుగుతుంటాయి. విసిగిపోయిన దివ్య అతనికి దూరంగా ఉండాలని నిర్ణయిస్తుంది. అయితే, అరుణ్ తల్లి ఆత్మహత్య యత్నం చేస్తుందని తెలిసి, దివ్య మళ్లీ అతనితో మాట్లాడటం ప్రారంభిస్తుంది. దాదాపు సినిమా మొత్తం ఇలానే ఉంటుంది. అంటే వాళ్ళు గొడవపడడం మళ్ళీ ఒకటవ్వడం. కానీ చివరకు విడిపోతారనుకోండి అది వేరే విషయం.

ఆరేళ్ళుగా ప్రేమించుకున్న ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు చాలానే అర్థం చేసుకుని ఉంటారు. కాని అరుణ్ గాడికి అనుమానం పిచ్చి పీక్స్ లో ఉంటడంతో దివ్య ఎవరైన అబ్బాయితో కొంచెం క్లోజ్ గా ఉంటే మనోడు తట్టుకోలేడు. వెంటనే సైకోలా మారిపోయి ఆ అమ్మాయి దివ్యను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. మనం ప్రేక్షకులా ఆ అమ్మాయి వైపు నుంచి చూస్తే ఆమెనె రైటు అనుకుంటాము. అదే అబ్బాయి వైపు నుంచి చూస్తే కొంచెం మనోడు కూడా కరెక్టే కదా అనుకుంటాము. కాని అబ్బాయి ఆ అమ్మాయికి మనశ్శాంతి లేకుండా తన అనుమానపు పిచ్చితో ఇబ్బంది పెట్టడం చూస్తే మాత్రం కొంచెం అతనిదే తప్పు అనిపించక మానదు. ప్రేమలో ఉన్నప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్ళైనాక జీవితాంతం ఇలాంటోడితో కాపురం చేయడం ఆ అమ్మాయికి కష్టమే కదా. అందుకే అరుణ్ తన తప్పులను ఒప్పుకుని ఇక మీదట నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నేనేమి నిన్ను ప్రశ్నించను, అనుమాన పడను అని చెప్పిన కూడా ఆమె దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆరెళ్ళ నుంచి అతనేమిటో చూస్తూ ఉంది కాబట్టి అతనిలో ఇక మార్పు రాదు అని మనం బ్రేకప్ చేసుకుందామని తెగేసి చెబుతుంది. ఆ సమయంలో ఈ పాట మొదలవుతుంది.

“రాయని కథలే” పాట నిజంగా చాలా భావోద్వేగం కలిగిస్తుంది, ముఖ్యంగా ప్రధాన కథలో ప్రేమికుల మధ్య విడిపోతున్న సమయంలో ఈ పాట వస్తుంది. సీన్ రోల్డాన్ అందించిన సంగీతం, రాకేందు మౌళి రాసిన సాహిత్యం అద్భుతంగా మిళితమై, ప్రేమలో ఉన్నవారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఎం.ఎస్. కృష్ణ, మెహా ఆగర్వాల్ గొంతులతో పాట మరింత ప్రాణం పొందింది. ఈ పాటలో యూత్‌కు కనెక్ట్ అయ్యే భావాలు, ఆవేదన ప్రతిబింబిస్తుంది. అశ్విన్ రాజా అదనపు ప్రోగ్రామింగ్, మణోజ్ కృష్ణ వోకల్ సూపర్‌విజన్ లాంటి సాంకేతిక అంశాలు కూడా పాటను మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దాయి. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “రాయని కథలే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: రాయని కథలే (Raayani Kadhale)
  • సినిమా: True Lover (ట్రూ లవర్)
  • నటీనటులు: మనికందన్, శ్రీ గౌరి ప్రియ
  • సినిమా దర్శకుడు: ప్రభురామ్ వ్యాస్
  • సంగీత దర్శకుడు: సీన్ రోల్డాన్
  • గేయరచయిత: రాకేందు మౌళి
  • గాయకులు: ఎం.ఎస్. కృష్ణ, మెహా ఆగర్వాల్
  • సినిమా విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2024
  • లేబుల్: థింక్ మ్యూజిక్ ఇండియా

Raayani Kadhale Song Lyrics in Telugu

కనులలో ధారే జారెనే
నిజమునే రాసి ఆరెనే
గురుతులో చేదులూరెనే
కలలిలా చితిని చేరెనే

రాయని కథలే
రాయని కథలే
పొరబడినొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కథలే

దీర్ఘ మౌనం పించు కోపమేది లేదు
కంట నీరు మించు జ్ఞానమేది లేదు
కాలం మాపలేని గాయమేది లేదు
ఇవి రాయని కథలే

చెదిరిపోయే కలలు మరల తిరిగి రావు
తీరం తడుము అలల సగము తరలిపోవు
పరుగులెత్తు క్షణము మాయ తెలుసుకోవు
ఇవి రాయని కథలే

రాయని కథలే
రాయని కథలే
పొరబడినొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కథలే

రా చిలకా (x4)

రాయని కథలే
రాయని కథలే
పొరబడినొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కథలే

Raayani Kadhale Lyrics in English

Kanulalo Dhaara Jaarene
Nijamune Raasi Aarene
Guruthulo Cheduloorene
Kalalila Chithini Cherene

Raayani Kadhale
Raayani Kadhale
Porabadinoravadilo
Avagathamagu Sthithilo
Ivi Raayani Kadhale

Deergha Mounam Minchu
Kopamedi Ledu
Kanta Neeru Minchu
Gnyaanamedi Ledu
Kaalam Maapaleni
Gaayamedi Ledu
Ivi Raayani Kadhale

Chediripoye Kalalu
Marala Thirigi Raavu
Theeram Thadumu Alala
Sagamu Tharalipovu
Paruguletthu Kshanamu
Maaya Thelusukovu
Ivi Raayani Kadhale

Raayani Kadhale
Raayani Kadhale
Porabadinoravadilo
Avagathamagu Sthithilo
Ivi Raayani Kadhale

Raa Chilaka (x4)

Raayani Kadhale
Raayani Kadhale
Porabadinoravadilo
Avagathamagu Sthithilo
Ivi Raayani Kadhale

రాయని కథలే Video Song

Raayani Kadhale (Telugu) - Video | True Lover | Manikandan, Sri Gouri Priya | Sean Roldan |Prabhuram

ఈ పాట ప్రధాన పాత్రలైన అరుణ్ (మణికందన్) మరియు దివ్య (శ్రీ గౌరి ప్రియ) మధ్య ప్రేమ, విరహం, అనుమానాలు, మరియు తపనను ప్రతిబింబిస్తుంది. దివ్య మరియు అరుణ్ మధ్య జరిగిన విభేదాలు, ప్రేమలోని విభిన్న భావోద్వేగాలు ఈ పాట ద్వారా ఎమోషనల్‌గా బయటకు వస్తాయి. అరుణ్, దివ్యను ఎన్నిసార్లు అనుమానించి, తన కోపంతో ఆమెను నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు, దాని ఫలితంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతాయి.

ఈ పాట వారి ప్రేమ కథలో ముఖ్యమైన సమయంలో ప్రారంభమవుతుంది, అంటే, దివ్య అతడిని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో. గోకర్ణ ట్రిప్ సందర్భంగా, అరుణ్ తన తప్పులను అంగీకరిస్తూ, ఇకపై మారతానని, తనను వదిలిపోవద్దని ఏడుస్తూ దివ్యను వేడుకుంటాడు. కానీ దివ్య అతడికి మళ్లీ అవకాశాన్ని ఇవ్వదని స్పష్టంగా చెప్పినప్పుడు, ఆ భావోద్వేగభరితమైన క్షణంలో ఈ పాట ప్రారంభమవుతుంది.

Report a Lyrics Mistake / Share Your Thoughts