‘ప్రేమిస్తున్నా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Premisthunna Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఈ పాట జూలై 14, 2023న విడుదలైన బేబీ (Baby) అనే తెలుగు సినిమాలోనిది. ‘హృదయ కాలేయం (2014)’ లాంటి కామిడి సినిమా ద్వారా దర్శకుడిగా స్టీవెన్ శంకర్ అనే మారుపేరుతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ బేబి సినిమా తెరకెక్కుతుందని తెలిసుకున్న చాలామందిలో ఇది కూడా కామెడి సినిమాలాగానే ఉంటుందని భావించారు. కాని కట్ చేస్తే చాలా ఎమోషన్తో కూడిన సినిమాను ప్రేక్షకులకు అందించారాయన. ఎంత ఎమోష్‍నల్ గా ఈ బేబి సినిమాను తీశారంటే, కర్నాటకలోని బళ్ళారిలో ఉన్న ఒక సినిమా థియేటర్ లో అయితే, ఏకంగా స్వచ్చందంగా సినిమా వీక్షించే ప్రేక్షకులకు సినిమా మొదలవకముందే టిష్యూ పేపర్స్ సరఫరా చేశారు. దీనిబట్టి అర్థమవుతుంది కదా సినిమా ఎంతలా ఎమోషనల్ గా ఉందని.
ఈ బేబి సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ కు తమ ఒరిజినల్ పేర్లనే పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా హృదయ కాలేయం సినిమాకు విరుద్ధంగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే హృదయ కాలేయం సినిమాను ఎలా తీశారంటే ఎటువంటి లాజిస్క్ లేకుండా కేవలం సినిమా చూసే ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోవాలనే ప్యూర్ ఉద్దేశ్యంతో తీశారు. దీనివల్ల ఆ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు చెడ్డపేరు రావచ్చని దానివల్ల అది వాళ్ళ కెరీర్ కు ఏదైనా డ్యామేజ్ కలుగుతుందని, దర్శకునితో సహా ప్రతీ ఒక్కరూ మారుపేరు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఊహకందని రీతిలో ప్రేక్షకుల నుండి చాలా పాజిటీవ్ రెస్పాన్స్ కు అందుకుంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన సంపూర్ణేశ్ బాబుకు ఒక స్టార్ రేంజులో ఇమేజ్ క్రియేట్ అయ్యింది.
‘హృదయ కాలేయం’ హిట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో దాదాపు ఐదు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని 2019లో అదే సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘కొబ్బరిమట్టం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ప్రజాదరణను పొందింది. ఈ రెండు కామిడి జోనర్ కు చెందిన సినిమాల తర్వాత ఒక ఎమోషనల్ లవ్ స్టోరిని రాసుకున్నారు. అదే ‘కలర్ ఫోటో (2020)’ సినిమా. దీనికి దర్శకుడిగా సందీప్ రాజ్ పెట్టి, తను నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయి, ఏకంగా నేషనల్ అవార్డునే అందుకుంది. ఈ సినిమా తర్వాత సాయి రాజేష్ రచనా దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మాతగా ‘బేబి (2023)’ సినిమా విడుదలై ద గ్రేటెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.
ఈ ‘బేబి’ సినిమాలో సంగీతాన్ని విజయ్ బుల్గనిన్ అందించారు. ఆయన అందించిన ప్రతీ పాట కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా “ప్రేమిస్తున్నా” పాట అయితే అయ్యబాబోయ్, ఆడియన్స్ కళ్ళలో నీళ్లు తెప్పించేంత భావోద్వేగం కలిగిస్తుంది. ఈ పాటకు సాహిత్యం సురేశ్ బనిశెట్టి అందించగా, Pvns రోహిత్ హృదయాన్ని కదిలించేలా ఆలపించారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “ప్రేమిస్తున్నా” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: ప్రేమిస్తున్నా (Premisthunna)
- సినిమా: Baby (బేబీ)
- నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్
- సినిమా దర్శకుడు: సాయి రాజేష్
- సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
- గేయరచయిత: సురేష్ బనిశెట్టి
- గాయకుడు: Pvns రోహిత్
- సినిమా విడుదల తేదీ: జూలై 14, 2023
- లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్
Premisthunna Song Lyrics in Telugu
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆఆ
ఆశకి ఇవ్వాళే ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే
మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆఆ
నువ్వు ఎదురే నిలబడితే
వెలిగెనులే నా కంటి పాపలు
ఒక నిమిషం వదిలెళితే
కురిసేనులే కన్నీటి ధారలు
అపుడెపుడో అల్లుకున్న బంధమిది
చెదరదుగా చెరగదుగా
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
కరగదుగా తరగదుగా
మరణము లేనిదొక్కటే
అది మన ప్రేమ పుట్టుకే
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆఆ
నను ఎపుడూ మరువనని
పరిచావులే చేతుల్లో చేతిని
నను వదిలి బ్రతకవనీ
తెలిసిందిలే నీ శ్వాస నేనని
నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
మనసుకదే వరము కదా
అణువణువు నీలో నన్నే నింపుకోడం
పగటికలే అనవు కదా
మలినము లేని ప్రేమకీ
నువ్వు ఒక సాక్ష్యమవు చెలి
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆఆ
ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే
మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
Premisthunna Lyrics in English
Premisthunnaa Aa AaAa
Nee Premalo O O O O
Jeevisthunnaa Aa AaAa
Aashaki Ivvaale Aayuvu Posaave
Kotthaga Naa Brathuke
Theepini Chesaave
Ee Muddhu Mana Prema Guruthugaa
Manasuna Dhaachukuntane
Mana Kathalaanti Maro Kathaa
Charithalo Undadhantane
Oo Aa Aa Aa
Aa Aa Aa Aa
Aa Aa Aa Aa Aa
Premisthunnaa Aa Aa Aa Aa
Premisthunnaa Aa AaAa
Nee Premalo O O O O
Jeevisthunnaa Aa AaAa
Nuvvu Yedhure Nilabadithe
Veligenule Naa Kantipaapalu
Oka Nimisham Vadhilelithe
Kurisenule Kanneeti Dhaaralu
Apudepudo Allukunna Bandhamidhi
Chedharadhuga Cheragadhuga
Muripemuga Penchukunna
Prema Needhi
Karagadhuga Tharagadhuga
Maranamu Lenidhokkate
Adhi Mana Prema Puttuke
Premisthunnaa Aa Aa Aa Aa
Premisthunnaa Aa AaAa
Nee Premalo O O O O
Jeevisthunnaa Aa AaAa
Nanu Yepudu Maruvanani
Parichaavule Chethullo Chethini
Nanu Vadhili Brathakavani
Telisindhile Nee Shwaasa Nenani
Nuvvu Tharachu
Naa Oohallo Undipodam
Manasukadhe Varamu Kadhaa
Anuvanuvu Neelo Nanne Nimpukodam
Pagati Kale Anavu Kadha
Malinamu Leni Premaki
Nuvvu Oka Saakshyamau Cheli
Premisthunnaa Aa Aa Aa Aa
Premisthunnaa Aa AaAa
Nee Premalo O O O O
Jeevisthunnaa Aa AaAa
Aashaki Ivvaale Aayuvu Posaave
Kotthaga Naa Brathuke
Theepini Chesaave
Ee Muddhu Mana Prema Guruthugaa
Manasuna Daachukuntane
Mana Kathalaanti Maro Kathaa
Charithalo Undadhantane
Oo Aa Aa Aa
Aa Aa Aa Aa
Aa Aa Aa Aa Aa
ప్రేమిస్తున్నా Video Song
పాట వచ్చే సందర్భం:
ఈ పాట కథలో కీలకమైన ఘట్టంలో వస్తుంది. కథలో వైష్ణవి (వైష్ణవి చైతన్య) మరియు ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) చిన్నప్పటి నుండి ఒకే బస్తీలో ఎదుగుతారు. వారి ప్రేమ చిన్న వయస్సులోనే, స్కూల్ రోజుల్లోనే మొదలవుతుంది. ఇద్దరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో ఉండడం వల్ల సమయం గడుస్తున్న కొద్దీ వారి మధ్య అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. అయితే, పదో తరగతి తరువాత వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. వైష్ణవి తన చదువును కొనసాగిస్తూ కాలేజీలో చేరుతుంది, కానీ ఆనంద్ మాత్రం పాస్ కాలేక ఆటో డ్రైవర్‌గా మారి జీవనోపాధి కోసం కష్టపడతాడు.
కాలేజీలో చేరిన తరువాత వైష్ణవి కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటుంది, ముఖ్యంగా విరాజ్ అనే వ్యక్తితో స్నేహం పెంచుకుంటుంది. విరాజ్ వైష్ణవిని ప్రేమించడమే కాకుండా, ఆమెపై తన మనసు పెట్టుకుంటాడు. అయితే వైష్ణవి ఎప్పటికీ ఆనంద్ మీద ప్రేమను మర్చిపోలేక, విరాజ్‌ను ప్రియుడిగా అంగీకరించదు. విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఆమెకు తెలియజేసినా, ఆమె ఎప్పటికీ ఆనంద్‌ని వదలలేని స్థితిలో ఉంటుంది. ఇక్కడ కథలో ఒక ఆసక్తికరమైన మలుపు వస్తుంది. ఒకరోజు తాగిన మైకంలో పబ్ లో విరాజ్ కు వైష్ణవి లిప్ కిస్ పెడుతుంది. ఈ సీన్ సిసి టీవిలో రికార్డ్ అవుతుంది. దీనిని అడ్డం పెట్టుకుని విరాజ్ వైష్ణవిని బ్లాక్ మేల్ చేస్తాడు. ఈ కారణంగా వైష్ణవి అతనితో లైంగిక సంబంధం కలిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇక్కడే కథలో ముఖ్యమైన సంఘటన చోటు చేసుకుంటుంది. విరాజ్ ఇంటికి వెళ్ళడం కోసం వైష్ణవి క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ క్యాబ్ అందుబాటులో లేకపోవడంతో, చివరికి ఆనంద్ తన ఆటోలో ఆమెను స్వయంగా విరాజ్ ఇంటికి వదిలిపెడతాడు. ఆనంద్ వైష్ణవిని విరాజ్ ఇంటి వద్ద వదిలిపెడుతున్న సమయంలో, అతనికి ఆమె మరియు విరాజ్ మధ్య ఏమీ జరుగుతుందని అసలు అనుమానం కూడా రాదు. అతను కేవలం తన ప్రేయసి కోసం చేసే సహాయం అని భావిస్తూ వైష్ణవిని అక్కడ వదిలి వెళ్తాడు. ఈ సమయంలో, వైష్ణవి ఆనంద్‌ను ఆపి అతనికి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆమె ఆనంద్‌ను తన నుదుటిపై ముద్దు పెడుతూ, ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పి, అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. అప్పుడే ఈ పాట ప్రారంభమవుతుంది.
ముగింపు:
ఈ బేబి సినిమాలో హీరో ఆనంద్ కు వచ్చిన పరిస్థితి ఏ ఒక్క ప్రేమికుడికి కూడా రాకూడదు. ఆనంద్ ను చూస్తేనే అయ్యో అనే ఫీలింగ్ రాకుండా ఉండదు. ఆనంద్ వైష్ణవిని ఒక ముద్దు ఇవ్వమని అడిగితేనే గోల గోల చేసి, నాకిలాంటివి ఇష్టముండదు అని చెబుతుంది. అలాంటి వైష్ణవి ఏకంగా విరాజ్ అనే తన స్నేహితుడితో లైంగికంగా కలుస్తుంది. దురదృష్టం ఏమిటంటే వీరు లైంగికంగా కలవాలి అని ఫిక్స్ అయి, విరాజ్ తన ఇంటికి రమ్మని వైష్ణవికి చెబుతాడు. అమె విరాజ్ ఇంటికి వెళ్ళడానికి క్యాబులు బుక్ అవ్వని సందర్భంలో ఆనంద్ కు ఫోన్ చేసి తనను తన ఆటోలో విరాజ్ ఇంటి కాడా దిగబెట్టవలసినదిగా అడుగుతుంది. మన ఆనంద్ అమాయకుడు పాపం వీళ్ళు ఏమి చేస్తున్నారో కూడా గ్రహించకుండా అమెను విరాజ్ ఇంటి దగ్గర వదిలి పెట్టి వస్తాడు. వచ్చే సమయంలో వైష్ణవి ఆనంద్ కు నుదిటిపై ముద్దు పెడుతుంది. ఎప్పుడు చేతిని కూడా టచ్ చేయని వైష్ణవి ఏకంగా నుదిటిపై ముద్దు పెట్టేసరికి ఆనంద్ ఆనందానికి అవదులు లేకుండా పోతాయి. ఆ ఆనందమయ సమయంలో ఆనంద్ ఈ ప్రేమిస్తున్నా పాటను పాడతాడు. ఇది చాలా దారుణం కదా.
ఈ పాటకు సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ అందించగా, సాహిత్యాన్ని సురేష్ బనిశెట్టి రాశారు, Pvns రోహిత్ హృదయాన్ని కదిలించేలా ఆలపించారు. “ప్రేమిస్తున్నా నీ ప్రేమలో జీవిస్తున్నా” వంటి లిరిక్స్ ద్వారా ఆనంద్ వైష్ణవిపై ఉన్న తన అమితమైన ప్రేమను చాటుతాడు. అతనికి వైష్ణవి లేకుండా జీవితం అసాధ్యమని, ఆమెతోనే తన జీవనానికి అర్థం ఉందని తెలియజేస్తాడు. ఈ పాట ప్రతి లైన్‌లోనూ ప్రేమ అనుబంధం మాత్రమే కాకుండా, అది జీవితాన్ని మార్చే శక్తిగా ఉంటుందని చూపిస్తుంది. సురేష్ బనిశెట్టి రాసిన పదాలు, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, Pvns రోహిత్ గొంతు కలవడంతో, ఈ పాట వినేవారి కళ్ళలో కన్నీళ్లు తెప్పించేలా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
Report a Lyrics Mistake / Share Your Thoughts