‘పూలమ్మే పిల్లా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Poolamme Pilla Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన హనుమాన్ (HanuMan) అనే తెలుగు సినిమాలోని పాట. ఈ సినిమా విడుదలైనప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎంత బజ్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అది సంక్రాంతి సీజన్ కావడంతో మహేష్ బాబు గారి ‘గుంటూరు కారం (2024)’ సినిమాకు ఎక్కువ థియేటర్స్ కేటాయించి, హనుమాన్ సినిమాకు తక్కువ థియేటర్స్ ఇవ్వడంవల్ల, చాలామందికి హనుమాన్ చిన్న సినిమా అవ్వడంవల్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలిగింది.
దాంతోపాటు అది హిందువుల ఆరాధ్య దైవం హనుమంతుడి ఆధారంగా తెరకెక్కించడం వల్ల, ఎక్కవ థియేటర్స్ కేటాయించిన గుంటూరుకారం సినిమా హనుమాన్ సినిమాతో పోల్చి చూస్తే బాగాలేకపోవడంవల్ల హనుమాన్ సినిమాకు సింపతితో కూడిన సపోర్ట్ లభించింది. ప్రజల సపోర్ట్ కు తగ్గట్టుగానే హనుమాన్ సినిమా కథ, కథనం, నటీనటుల అభినయం, పాటలు, గ్రాఫిక్స్ ఇలా అన్ని కలగలసి ఉండడంవల్ల, 2024లో సంక్రాంతి విజేతగా ఆ సినిమా నిలిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా డబ్ చేసి విడుదల చేసిన అన్ని భాషలలో మంచి ప్రజాధరణను మూటగట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రజలు ఈ హనుమాన్ సినిమాను ఆదరించడం వల్ల ఇది పాన్ ఇండియా సినిమా అయ్యింది.
ఈ సినిమా విజయం వెనక ముఖ్యకారణం దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన రాసుకునే కథను ఎంత యూనిక్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంత్ వర్మ తీసిన మొదటి సినిమా ఆ చూసిన ఎవ్వరికైన అది అర్థం అవుతుంది. అలాగే దశాబ్దాలుగా సక్సెస్ ఎరుగని రాజశేఖర్ కు ‘కల్కి (2019)’ సినిమాతో మంచి విజయవంతమైన సినిమాను అందిచారు. తర్వాత తేజ సజ్జా మేన్ లీడ్ గా ‘జాంబీ రెడ్డి (2021)’ సినిమాను తీశాడు. ఇది తెలుగులో తీసిన మొదటి జాంబీ ఫిల్మ్. ఇక దీని తర్వాత ఇదే తేజ సజ్జ కథానాయకుడిగా ‘హనుమాన్ (2024)’ సినిమాను తీయడం జరిగింది. ప్రశాంత్ వర్మకు తేజసజ్జ మొదటి నుంచి మంచి స్నేహితుడు అవ్వడంవల్ల ఇలా రెండు సినిమాలను ఆయనతో తీయడం జరిగింది. చూడడానికి చిన్న పిల్లవాడిల ఉన్న తేజ సజ్జ ఈ హనుమాన్ సినిమాకి సెట్ అవ్వడేమో అనుకున్న వారిలో నేను కూడా ఒకడు. కాని అందరి నోళ్ళను తన నటలతో విజయవంతంగా మూయించాడు తేజసజ్జ.
ఇక ఈ పూలమ్మే పిల్లా పాట విషయానికి వస్తే, ఈ పాటను వింటున్నప్పుడు దీనిని కంపోజ్ చేసింది ఎం.ఎం.కీరవాణేన అనే సందేహం రాక మానదు. ఎందుకంటే పాట అంత సాలీడ్ గా ఉంది. సంగీత దర్శకుడు ఎవరా అని చూస్తే తెలిసింది, సంగీత దర్శకుడు, కంపోజర్, గాయకుడు, గేయరచయిత, గీటారిస్ట్, ప్రోగ్రామర్ అయిన గౌరహరి అని. ఈయన ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలకి పనిచేసిన కూడా అంతగా ఎవ్వరికి తెలియనట్టుగా ఉండేవాడు. కానీ ఈ హనుమాన్ సినిమాకి ఈయన అందించిన మరిచిపోలేని ఆణిముత్యాలాంటి పాటలను ఇవ్వడం వల్ల ప్రసిద్ది చెందారు. ఈ పాటకు సంగీతంతో పాటుగా తన స్వరాన్ని కూడా అందించారు.
అలాగే ఈ పాటను రాసింది కాసర్ల శ్యామ్. ఈయన తెలంగాణలోని హన్మకొండలో రంగస్థల, టీవి, సినీనటుడైన మధసూదన రావుగారికి జన్మించారు. కాసర్ల శ్యామ్ సినిమాలలోకి రాకముందు వేలాది జానపద గీతాలను రాశారు. అందుకే ఈయన రాసే పాటలలో ఎక్కవగా అచ్చ తెలంగాణ పదాలు కనిపిస్తుంటాయి. ‘పూలమ్మే పిల్లా’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: పూలమ్మే పిల్లా
- సినిమా: HanuMan (హనుమాన్)
- నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్
- సినిమా దర్శకుడు: ప్రశాంత్ వర్మ
- సంగీత దర్శకుడు: గౌరహరి
- గేయరచయిత: కాసర్ల శ్యామ్
- గాయకుడు: గౌరహరి
- సినిమా విడుదల తేదీ: జనవరి 12, 2024
- లేబుల్: టిప్స్ తెలుగు
Poolamme Pilla Song Lyrics in Telugu
పూలమ్మే పిల్లా
గుండెను ఇల్లా
దండగా అల్లా
పూలమ్మే పిల్లా
పూలమ్మే పిల్లా
పూలమ్మే పిల్లా
అమ్మాయి జళ్ళో
చేరేది ఎల్లా
పూలమ్మే పిల్లా
మూరెడు పూలే
మా రాణికీవే
చారేడు చంపల్లే
సురీడై పూసెలే
ఎర్రగ కందెలే
నున్నాని బుగ్గలే
పిల్ల పల్లేరు కాయ సూపుల్ల
సిక్కి అల్లాడినానే సేపల్లా
పసిడి పచ్చాని అరసేతుల్లా
దారపోస్తా ప్రాణాలు తానే అడగాల
సీతాకోకల్లే రెక్క విప్పేలా
నవ్వి నాలోన రంగు నింపాలా
హే మల్లి, అందాల సెండుమల్లి
గంధాలు మీద జల్లి
నను ముంచి వేసెనే
తనపై మనసు జారి
వచ్ఛా ఏరి కొరి
మూరెడు పూలే
మా రాణికీవే
చారేడు చంపల్లే
సురీడై పూసెలే
ఎర్రగ కందెలే
నున్నాని బుగ్గలే
పిల్ల అల్లాడిపోయి నీ వల్లా
ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా
బలమే లేకుండా పోయే గుండెల్లా
ప్రేమ మందే రాసియ్యే మూడు పూటల్లా
ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా
తుళ్ళీ ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా
హే తెల్ల, తెల్లాని కోటు పిల్ల
దాచేసి జేబులల్ల నను మోసుకెళ్ళవే
పట్నం సందమామ
సిన్న నాటి ప్రేమ
పూలమ్మే పిల్లా
పూలమ్మే పిల్లా
అమ్మాయి జళ్ళో
చేరేది ఎల్లా
పూలమ్మే పిల్లా
మూరెడు పూలే
మా రాణికీవే
చారేడు చంపల్లే
సురీడై పూసెలే
ఎర్రగ కందెలే
నున్నాని బుగ్గలే
Poolamme Pilla Lyrics in English
Poolamme Pillaa
Gundenu Illaa
Dhandaga Allaa
Poolamme Pillaa
Poolamme Pillaa
Poolamme Pillaa
Ammaayi Jallo
Cheredhi Yellaa
Poolamme Pillaa
Mooredu Poole
Maa Ranikeeve
Chaaredu Champalle
Sooreedai Poosele
Yerraga Kandhele
Nunnaani Buggale
Pilla Palleru Kaaya Soopullaa
Sikki Allaadinaane Sepallaa
Pasidi Pachaani Arasethullaa
Daaraposthaa Praanaalu
Thaane Adagaala
Seethakokalle Rekka Vippelaa
Navvi Naalona Rangu Nimpaalaa
Hey Malli, Andhaala Sendumalli
Gandhaalu Meedha Jalli
Nanu Munchi Vesene
Thanapai Manasu Jaari
Vachaa Yeri Kori
Mooredu Poole
Maa Ranikeeve
Chaaredu Champalle
Sooreedai Poosele
Yerraga Kandhele
Nunnaani Buggale
Pilla Allaadipoyi Nee Vallaa
Udiki Jaramochinattu Niluvella
Balame Lekundapoye Gundellaa
Prema Mandhe
Raasiyye Moodu Pootallaa
Yelli Pothunte Nuvvu Veedhullaa
Thulli Oogindhe Ollu Uyyaalaa
Hey Tella, Tellaani Kotu Pilla
Daachesi Jebulalla
Nanu Mosukellave
Patnam Sandamaama
Sinna Naati Prema
Poolamme Pillaa
Poolamme Pillaa
Ammaayi Jallo
Cheredhi Yellaa
Poolamme Pillaa
Mooredu Poole
Maa Ranikeeve
Chaaredu Champalle
Sooreedai Poosele
Yerraga Kandhele
Nunnaani Buggale
పూలమ్మే పిల్లా Video Song
పూలమ్మే పిల్లా పాట సందర్భం ఏమిటంటే కథనాయకుడు హనుమంతు (తేజసజ్జ పాత్ర పేరు) తన చిన్ననాటి ప్రేయసి (క్రష్) మీనాక్షి (అమృత అయ్యర్ పాత్ర పేరు) పట్టణంలో డాక్టర్ చదువు ముగిసిన తర్వాత చాలా ఏళ్ళను అంజనాద్రి అనే తమ చిన్న పల్లెటూరికి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హనుమంతు ఆమెను చూడాలనే తాపత్రయంతో వచ్చి చూస్తాడు. ఈ సందర్భంలోనే ఈ పూలమ్మే పిల్లా పాట మొదలవుతుంది. ఈ పాట మధ్య మధ్యలో వీళ్ళ చిన్ననాటి తీపి సందర్భాలను కూడా చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడు హనుమంతు మొదటి సారిగా ఎప్పుడు మీనాక్షిని చూస్తాడంటే, ఇతను ఆ పల్లెటూరిలో జరిగే జాత్రలో ఒక శాప్ కాడా కళ్ళద్దాలను దొంగలిస్తాడు. దీన్ని చూసిన మీనాక్షి అతని చెయ్యి పట్టుకుని ఆ శాప్ యజమాని పట్టిస్తుంది. ఇక అంతే అదే మన హీరోకి లవ్ అట్ ఫస్ట్ సైట్.
అప్పటి నుండి ఆమెకు తెలియకుండా ఆమెను వెంబడిస్తూ ఉంటాడు మరియు ప్రతీదాంట్లో ఆమెకు పరోక్షంగా మేలు చేస్తూ ఉంటాడు. కాని ఇవన్ని తనే చేస్తున్నట్లుగా మీనాక్షికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. అదే విధంగా ఇప్పుడు ఆమె డాక్టర్ అవ్వడం వల్ల ఆ పల్లెటూరిలో హెల్త్ క్యాంప్ నిర్వహించేటప్పుడు అనేక సార్లు వివిధ వేషాలలో వెళ్ళి మరి ఆమె దగ్గర ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిపించుకుంటు ఉంటాడు. ఇలా కొన్ని సీన్లు చిన్నప్పటివి కొన్ని ప్రస్తుతానికి చెందినవి చూపిస్తూ అలా పాట కొనసాగుతూ ఉంటుంది.
నేనైతే సినిమా చూడక ముందు ఈ పాటను వినలేదు. డైరెక్టుగా సినిమా థియేటర్ లోనే చూసి ఈ పాటకు అడిక్ట్ అయిపోయా. గౌరహరి సంగీతం, గానం మరియు కాసర్ల శ్యామ్ యొక్క సాహిత్యాన్ని ఎంత మెచ్చుకున్న తక్కువే. వైది ఈ పాటకు ప్రోగ్రామింగ్ చేశారు. గణేష్ మరియు రామచంద్ర శ్రీనివాస్ లైవ్ లయలు అందించారు. తిరుమూర్తి నాదస్వరంలో, ఎస్ ఎం సుభాని ఓడ్ మరియు మాండోలిన్ వాయిద్యాలలో మెరిశారు. శాదాబ్ రయీన్ ఈ పాటను మిక్స్ మరియు మాస్టర్ చేశారు. “పూలమ్మే పిల్లా” పాట అనేక మంది ప్రతిభావంతుల కృషి ఫలితంగా అద్భుతంగా వచ్చింది. ఈ పాటలోని ప్రతి శబ్దం, ప్రతి నోట్, ప్రతి వాయిద్యం ఈ పాటను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఎంత విన్నా కూడా మరల మరల వింటూ ఉండే అర్హత కలిగిన పాటల్లో ఇది ఖచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు.