Picchiga Nacchesave Song Lyrics – Gam Gam Ganesha (2024) | Anurag Kulkarni

పిచ్చిగా నచ్చేసావే పాట యొక్క లిరిక్స్‌ను (Picchiga Nacchesave Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 2024లో విడుదలైన గం గం గణేశా (Gam Gam Ganesha) అనే తెలుగు సినిమాలోనిది. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించాడు. ఇతని స్నేహితుడి పాత్రలో ఇమాన్యువెల్ మరియు మొదటి ప్రేమికురాలిగా నయన్ సారిక, రెండో ప్రేమికురాలిగా ప్రగతి శ్రీవాస్తవ నటించారు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా 2019లో ‘దొరసాని’ సినిమా ద్వారా తెరకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ తనకంటూ తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన నటన ముఖ్యంగా డైలాగ్ డెలివరీ తన అన్న విజయ్ లాగా ఉంటుదని తన అన్నను కాఫీ కొడుతున్నాడని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.

దీనికి సంబంధించి ఎదో ఇంటర్వ్యూలో వీరిని అడగగ వాళ్ళు సొంత అన్న తమ్ముళ్ళు అవ్వడంవల్ల వాయిస్ కొంచెం వినేవారికి ఒకే విధంగా అనిపించిన మనం ఏమి చేయగలం దానిని మార్చలేము కదా అని జవాబు ఇచ్చారు. అంతే కదా అన్నతమ్ముళ్ళు అన్నాక కొంచెం చాలా విషయాల్లో ఒకే విధంగా ఉన్నట్టు అనిపించవచ్చు, ముఖ్యంగా వీరి వాయిస్ కొంచెం సిమిలర్ గా చాలా మందికి అనిపిస్తుంది కూడా. అయినా ఆనంద్ కొత్త కొత్త కథలతో, క్యారెక్టరైజేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో కౌశల్యాన్ని చూపిస్తూ, తన కంటు ప్రత్యేక ఇమేజ్‍ని క్రియేట్ చేసుకుని ఉన్నాడు. ఇక 2023లో విడుదలైన ‘బేబి’ సినిమాలో అయితే తన నటనతో ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తెప్పించాడు.

ఈ కల్ట్ బ్లాక్‍బస్టర్ అయిన ‘బేబి’ సినిమా తర్వాత వచ్చిన ఈ గం గం గణేశ సినిమాపై సినీ ప్రేమికులు కొంచెం ఆసక్తిని కనబరిచారు. ఈ సినిమాలోని పాటలైతే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీటిలో బృందావనివే పాటైతే విశేష స్పందనను మూట గట్టుకుంది. అది సంగీత ప్రియులను మత్తులో ముంచేసింది. దీంతో పాటు ఈ గం గం గణేశ సినిమాలోని రెండవ పాటైన పిచ్చిగా నచ్చేసావే అయితే ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది. ఈ పాటలోని లిరిక్స్, బీట్స్, అనురాగ్ కులకర్ణి వాయిస్ వీటితో పాటు ఆనంద్ దేవరకొండ సింపుల్ డ్యాన్స్ స్టెప్స్ చూసే వారికి నేత్రానందాన్ని కలిగిస్తాయి.

ఈ ‘పిచ్చిగా నచ్చేసావే’ పాటకు సంగీతాన్ని అందించింది చైతన్ భరద్వాజ్. 2018లో విడుదలైన ‘Rx100’ సినిమాలోని ఆణిముత్యాలాంటి పాటలకు సంగీతం అందించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చైతన్ భరద్వాజ్ తన సంగీతంతో తన ప్రతీ సినిమాలో కనీసం ఒకటి లేదా రెండు గుర్తుండిపోయే మంచి మంచి పాటలను అందిస్తూ వస్తున్నాడు. అలా ఈ సంగీత ప్రయాణంలో గంగం గణేశ సినిమాలో కూడా గుర్తుండిపోయే పాటలనే అందించాడు. ఇక పిచ్చిగా నచ్చేసావే పాటను సురేష్ బనిశెట్టి రాస్తే పాడింది అనురాగ్ కులకర్ణి. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “పిచ్చిగా నచ్చేసావే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: పిచ్చిగా నచ్చేసావే (Picchiga Nacchesave)
  • సినిమా: Gam Gam Ganesha (గం గం గణేశా)
  • నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక
  • సినిమా దర్శకుడు: ఉదయ్ బొమ్మిశెట్టి
  • సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
  • గేయరచయిత: సురేష్ బనిశెట్టి
  • గాయకుడు: అనురాగ్ కులకర్ణి
  • సినిమా విడుదల తేదీ: మే 31, 2024
  • లేబుల్: సరిగమ తెలుగు

Picchiga Nacchesave Song Lyrics in Telugu

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
కళ్ళలో జల్లేసావే
రంగులన్నీ భలేగా

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
జంటగా వచ్చేసానే
అందుకనేగా

మనసే పట్టీ పట్టీ
మాయాలోకి నెట్టేసావే
ప్రేమ గట్టీ గట్టీ
కంకణంలా కట్టేసావే

నీ మువ్వల పట్టి
గుండెకి చుట్టీ మోగించేసావే
ఆ కాటుక పెట్టి
కవితలిట్టే రాయించేసావే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

ఇంకేం కావాలే
నాకింకేం కావాలే
రెప్పలపైనా చుక్కలవానై దూకావులే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

నువ్ కొట్టూ
బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే
దాచిపెట్టుకున్నాలే

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
కళ్ళలో జల్లేసావే
రంగులన్నీ భలేగా

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
జంటగా వచ్చేసానే
అందుకనేగా

ఏ చూపులా దారం కట్టి
అట్టా ఇట్టా లాగితే
ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే

నవ్వుతు నరం పట్టి
అటూ ఇటు ఊపితే
నొప్పి కూడా హాయిగా బాగుంటాదే

ఎదలో బందిపోటు
దొంగలా దూరేసావే
నీ పంటిగాటు
ప్రేమగా పెట్టేసావే

నువ్ తిట్టే తిట్టు
కమ్మగానే ఉంటాదిలే
చావగొట్టు కొట్టు
సమ్మగానే ఉంటాదిలే

నా నిద్దరనిట్టే
బద్దలు కొట్టే అందం నీదేలే
నిన్ను వదిలిపెట్టి
ఉండాలంటే పిచ్చోన్నవుతాలే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

ఇంకేం కావాలే
నాకింకేం కావాలే
రెప్పలపైనా చుక్కలవానై దూకావులే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

నువ్ కొట్టూ
బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే

Picchiga Nacchesave Lyrics in English

Picchiga Nacchesaave
Rangu Thuneega
Kallalo Jallesaave
Rangulanni Bhalegaa

Picchiga Nacchesaave
Rangu Thuneega
Jantagaa Vachesaave
Andukanegaa

Manase Patti Patti
Maayaloki Nettesaave
Prema Gatti Gatti
Kankanamlaa Kattesaave

Nee Muvvala Patti
Gundeki Chutti Moginchesaave
Aa Kaatuka Petti
Kavithalitte Raayinchesaave

Alele Alle
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo
Bongaramlaa Thirigesthaale

Inkem Kavale
Nakinkem Kavale
Reppala Paina
Chukkalavanai Dhukavule

Alele Alle
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo
Bongaramlaa Thirigesthaale

Nuv Kottu
Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Praanaalanni Neelone
Daachipettukunnaale

Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Anyaayamai Pothane
Gurthupettukove

Picchiga Nacchesaave
Rangu Thuneega
Kallalo Jallesaave
Rangulanni Bhalegaa

Picchiga Nacchesaave
Rangu Thuneega
Jantagaa Vachesaave
Andukanegaa

Ye Choopila Daaram Katti
Attaa ittaa Laagithe
Oopiraagipokundaa
Ettaa Untaadhe

Navvuthu Naram Patti
Atu itu Oopithe
Noppi Kooda Haayigaa
Baaguntaadhe

Edhalo Badhipotu
Dongala Dooresaave
Nee Pantigaatu
Premaga Pettesaave

Nuv Thitte Thittu
Kammagaane Untaadhile
Chaavagottu Kottu
Sammagaane Untaadhile

Naa Niddaranitte
Baddhalu Kotte
Andham Needhele
Ninnu Vadhili Petti Undaalante
Picchonavuthaale

Alele Alle
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo
Bongaramlaa Thirigesthaale

Inkem Kavale
Nakinkem Kavale
Reppala Paina
Chukkalavanai Dhukavule

Alele Alle
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo
Bongaramlaa Thirigesthaale

Nuv Kottu
Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Praanaalanni Neelone
Daachipettukunnaale

Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Anyaayamai Pothane
Gurthupettukove

పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా Video Song

Picchiga Nacchesave - Lyrical | Gam Gam Ganesha | Anand Deverakonda | Chaitan Bharadwaj

పాట వచ్చే సందర్భం:

సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, ఈ సినిమాలోని హీరో గణేశ (ఆనంద్ దేవరకొండ పాత్ర) తను ప్రేమిస్తున్న శృతి (నయన్ సారిక) ను కలవడానికి శృతి పనిచేస్తున్న శాప్ కు వెళతాడు. ఆమె ఆనంద్ ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తు ఉంటుంది. ఎందుకంటే తమ రిలేషన్ గురించి అప్పుడే ఎవరికి తెలియకూడదని సీక్రెట్ మేంటేన్ చేస్తూ ఉంటుంది. ఇక మనోడు అక్కడికి వెళ్ళాక ఆమెను సీక్రెట్ గా ఆ శాప్ లోని ఒక మూలకు తీసుకుని పోయి లిప్ కిస్ ఇవ్వబోతున్న సందర్భంలో స్టాప్ వాళ్ళని గమనిస్తారు. ముఖ్యంగా ఆ శాప్ యజమాని అయిన హర్ష వారిని చూసి ఆనంద్ ని ఎవర్రా నీవు అంటాడు. అప్పుడు శృతి ఇతను ఎవరో తనకు తెలియదని అతను తనతో మిస్ బిహేవ్ చేస్తున్నాడని హర్షతో చెబుతుంది.

దీంతో ఆనంద్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అందరి ముందు శృతి తను ఎవరో తెలియనట్టుగా ప్రవర్తించి, తనతో మిస్ బిహేవ్ చేస్తున్నాడని అందరికి ముందు చెప్పి ఉంటుంది. ఈ సీన్ తర్వాత రాత్రి ఆనంద్ రోడ్డుపై అప్ సెట్ గా కూర్చున్నప్పుడు అక్కడికి శృతి వచ్చి ఆనంద్ ని కన్విజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మన గురించి అప్పుడే అందరికి తెలియడం ఎందుకని తను శాప్ లో తన స్టాప్ అందరి ముందు అలా చెప్పినట్టు ఆనంద్ తో చెబుతుంది. అంతటితో ఆగక ఆనంద్ నోటిలో సువాసన వెదజల్లే ఏదో మౌంత్ ఫ్రెష్ నర్ కొట్టి గాఢంగా లిప్ కిస్ ఇస్తుంది. ఈ భావోద్వేగ క్షణం వారిద్దరికీ అనుబంధం మరింతగా పెంచుతుంది. అప్పుడు ఈ “పిచ్చిగా నచ్చేసావే” పాట మొదలవుతుంది.

ముగింపు:

సినిమాలలోని పాటలు సినిమా చూసే ప్రేక్షకులకు బూస్ట్ గా పనిచేస్తాయి. మన భారతీయ సినిమాలలో నవరసాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా పాటలైతే వాటి రేంజే వేరు. అవి సినిమాపై బజ్ క్రియేట్ చేయడంతో పాటు, ఎంతో మందిని సినిమా థియేటర్స్ వరకు కూడా తీసుకు వస్తాయి. ఇంతకు ఉదాహరణగా ఈ గం గం గణేశ సినిమాను కూడా చెప్పవచ్చు. ఇది ఆనంద్ దేవరకొండకు బేబి సినిమా తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కొంత బజ్ అయితే క్రియేట్ అయ్యింది. దానికి ఈ సినిమాలోని పాటలు కూడా మంచి ఊతమిచ్చాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఈ పిచ్చిగా నచ్చేసావే పాటైతే చాలా ఎనర్జిటిక్‍గా ఉంటుంది. దీనికి తోడు అందమైన హీరోయిన్ (నయన్ సారిక) మరియు ఆనంద్ దేవరకొండ సింపుల్ డ్యాన్ మూవ్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణను తీసుకు వచ్చాయి. ఇక అనురాగ్ కులకర్ణి పాట పాడిన విధానం ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేస్తుంది. ఇదే అని కాదు కాని ఇతని ప్రతీ పాట కూడా మంచి హిట్ లీస్ట్ లో చేరే విధంగా ఉంటాయి. అలాగే సురేశ్ బనిశెట్టి ఈ పాటలో వాడిని లిరిక్స్ అర్థవంతంగా చక్కగా సింపుల్ గా ఉంటాయి. సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, చింపి పడేశాడు.

Report a Lyrics Mistake / Share Your Thoughts