Oh Manamey Song Lyrics – Manamey (2024) | Karthik, Geetha Madhuri

ఓహ్ మనమే పాట యొక్క లిరిక్స్‌ను (Oh Manamey Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 2024లో విడుదలైన మనమే (Manamey) అనే తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమాలోనిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మించిన “మనమే” చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రారంభంలో 2023 మార్చి 6న శర్వానంద్ 39వ పుట్టిన రోజున తాత్కాలిక శీర్షిక #Sharwa35గా ప్రకటించబడింది, కానీ 2024 మార్చి 6న అధికారికంగా “మనమే”గా మార్చబడింది. ఈ చిత్రంలో సుమారు 80% షూటింగ్ లండన్‌లో జరిగింది, అలాగే బ్యాంకాక్, శంకరపల్లె, హైదరాబాద్‌లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబడిన ఈ సినిమాను జూన్ 7, 2024న థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు భాషలో విడుదలైన ఈ సినిమా తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్బింగ్ చేయబడింది.

ఇంతకి ఈ ‘మనమే’ సినిమా కథ ఏమిటంటే, విక్రమ్ (శర్వానంద్) లండన్‌లో మాస్టర్స్‌ను పూర్తిచేసి ఏ బంధాలు భాద్యతలు లేకుండా చాలా జాలీగా తల జీవితాన్ని తనకు ఇష్టమొచ్చినట్లు గడిపేస్తూ ఉంటాడు. విక్రమ్ చిన్నప్పటి నుంచి అనాథ అయిన తన స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్)ను ఎంత ఇష్టంగా చూసుకునేవాడు. అనురాగ్ ప్రేమించిన అమ్మాయి ఇంట్లోవారు అనురాగ్ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో విక్రమే వారికి పెళ్ళి చేస్తాడు. ఇది ఇలా ఉండగా అనురాగ్ తన కుటుంబంతో కలిసి ఏదో పని మీద భారత్‌కు వచ్చినప్పుడు అక్కడ జరిగిన ప్రమాదంలో మరణిస్తారు. కాని ఈ ఘటనలో అనురాగ్ కొడుకు మాత్రం బ్రతుకుతాడు. ఈ ఘటనతో అనాథగా మిగిలిన వారి కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యత విక్రమ్‌పై పడుతుంది. ఈ బాధ్యతను శాంతి స్నేహితురాలు సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి పంచుకుంటాడు.

వీళిద్దరికి పెళ్లి కాకపోయిన కొన్నాళ్ళ పాటు తల్లిదండ్రుల బాధ్యతలు భుజానికెత్తుకుంటారు. ఈ సమయంలో విక్రమ్ మరియు సుభద్ర ఎదుర్కొన్న అనుభవాలు, వారు కాపాడుకోవాల్సిన చిన్నారికి ఇచ్చే ప్రేమ మరియు సంరక్షణ, వారి మధ్య జరుగుతున్న గొడవలు, అంతా ఈ చిత్రంలో చూపించబడతాయి. సుభద్రకు కాబోయే భర్త కార్తీక్ (శివ కందుకూరి) ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకున్నాడు, ఖుషిని పెంచడంలో లేజీగా బాధ్యతరహితంగా ఉన్న విక్రమ్ ఎలా మారిపోయాడు, సుభద్రపై విక్రమ్ కలిగిన ప్రేమను బయట పెట్టడం జరిగింది లేదా అనే అంశాలు ఈ సినిమాలో చాలా ముఖ్యమైనవి. జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్) పాత్ర కూడా కథలో చాలా ప్రత్యేకమైనది.

“భలే మంచి రోజు” (2015) చిత్రంతో రచయితగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రీరామ్ ఆదిత్య, “మనమే” సినిమాతో కలిపి మొత్తం ఐదు చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాకు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు అందుకున్నాయి, కానీ ఈ సినిమా 21.85 కోట్ల రూపాయల వసూలు చేసి కమర్షియల్ సక్సెస్ సాధించింది. సంగీతానికి సంబంధించిన విషయానికి వస్తే, ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతాన్ని మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ కు ఇది మూడవ తెలుగు చిత్రం. ఈయన దీనికన్న ముందు “ఖుషి (2023)” మరియు “హాయ్ నన్నా” (2023) చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆ సినిమాలలో పాటలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో తెలిసిందే కదా. అలాంటి సంగీత దర్శకుడు ఈ మనమే సినిమాకు సంగీతాన్ని అందిచడం సంగీత ప్రియుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో మొత్తం 12 పాటలు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా “ఓహ్ మనమే” పాట వినడానికి చాలా ప్రెషింగ్ అనిపిస్తుంది. ఈ పాటకు సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వాహాబ్, సాహిత్యాన్ని రాసిన కృష్ణకాంత్, హారికా నారాయణ, అలాగే కార్తిక్, గీతా మాధురి, ఆవని మల్హార్ వంటి గాయకుల కృషి దీనికి కారణం. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “ఓహ్ మనమే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: ఓహ్ మనమే (Oh Manamey)
  • సినిమా: Manamey (మనమే)
  • నటీనటులు: శర్వానంద్, కృతిశెట్టి
  • సినిమా దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య. టి
  • సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వాహాబ్
  • గేయరచయిత: Krishna Kanth
  • గాయకులు: Karthik, Geetha Madhuri, Harika Narayan
  • సినిమా విడుదల తేదీ: జూన్ 7, 2024
  • లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్

Oh Manamey Song Lyrics in Telugu

ఓ మనమే

ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే

హేయ్ మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే

పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసేలోపు నా దరిదాపు మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా

మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

ఓహ్ యు అర్ మై రైజ్
ఇన్ ది సన్ షైన్
యు అర్ ది మూన్
ఇన్ ది మూన్ లైట్

యు అర్ మై రైజ్
యు అర్ మై షైనింగ్ హార్ట్
ఇన్ ది డ్రీమ్

అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా
అంతల్లోనే ఉన్నట్టుండి గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున

చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసెగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా

Oh Manamey Lyrics in English

Oh Manamey

Oh Manamey Manamey
Padadha Kshaname
Roju Roju Page Pedda Manamey
Hey Manamey Manamey
Kalisaam Manamey
Konchem Konchem
Raaji Padda Vainame

Panthalalo O Papayila
Manchodivai Nee Kopaalelaa
Emaina Sare Neelo Allare
Muddhocche Muppootalaa

Entho Adbutham Kadhaa
Maarindento Maa Kathaa

Kasire Choopu Kaasepaapu
Puttindhoyammaa
Oohallona Chinni Uppena
Theliselopu Naa Dharidhaapu
Marchesaavammaa
Mantram Undha
Maata Maatuna

Mabbulo Pairulaa
Mannulo Tharala
Dhikkule Okkatai Cheraga

Ilaa Kothagaa Idho Vinthagaa
Modalaindigaa Mana Katha

Entho Adbutham Kada
Maarindento Maa Katha

Oh Youre My Rise
In The Sunshine
Youre The Moon
In The Moonlight

Youre My Rise
Youre My Shining Heart
In The Dream

Antha Naadhe Anni Nene
Antaventamma
Meedhadipoye Mirchee Missamma
Anthallone Unnattundi
Gamaninchesale
Golentamma Gunde Chaatunaa

Chetilo Geethala
Kaagitham Kaavithala
Raathale Nedila Kalisegaa

Ilaa Kothagaa Idho Vinthagaa
Sammelanam Avvagaa

ఓహ్ మనమే మనమే Video Song

Oh Manamey Lyrical | Manamey | Sharwanand, KrithiShetty | Sriram Adittya | Hesham Abdul Wahab

ఈ పాట ఉల్లాసంగ ఉత్సాహంగా సాగుతున్నట్టు ఉంటుంది. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కలిసి జీవిస్తూ ఉన్న సందర్భంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకుంటు సాగుతున్న విక్రమ్, సుభద్ర, ఖుషి జీవితంలో చాలా ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. అలాగే ఖుషి తండ్రి అయిన అనురాగ్ కు చెందిన రెస్టారెంట్ మూతపడిందని తెలుసుకున్న విక్రమ్ మరియు సుభద్ర దానిని రీ-ఓపెన్ చేసి, సక్సస్ ఫుల్ గా నడుపుతారు. ఆ సమయంలోనే ఈ ఓహ్ మనమే అనే పాట వస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తులు తాము కలిసిన మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో అని సంతోషంగా పాట పాడుతున్నట్టు ఉంటుందీ పాట.

సినిమాలో పాట వచ్చిందంటే అది సినిమాను ముందుకు తీసుకుని వెళ్ళగలిగింది అయి ఉండాలి. లేకపోతే ఆ పాటను ఆ సినిమాలో పెట్టి ఉపయోగం ఉండదు, కేవలం రన్ టైం బొక్క అంతే. కొన్ని సినిమాలో చూస్తాము కదా అస్సలు ఆ సినిమా కథకు ఆస్సలు అవసరమే లేని సందర్భంలో పాటను ఇరికిస్తుంటారు. ఎందుకు పాట అవసరమా అక్కడ అంటే, అది అంతే, ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా అంటారు. కమర్షియల్ సినిమా అంటే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు అని ఫిక్స్ అయిపోయారు దానికి మనమేమి చేస్తామ్. ఇక ఈ ఓహ్ మనమే పాట కథతో పాటు ప్రయాణం చేస్తుంటుంది. రెస్టారెంట్ రీ-ఓపెన్ చేసే సందర్భంలో పాట అలా బ్యాగ్రౌండ్ లో వస్తుంటుంది. దీంతో కథకు ఏమాత్రం డిస్టబెన్స్ కలిగించదు మరియు ఆ పాత్రలు మొదటితో పోల్చితే ఇప్పుడు ఏ విధంగా మార్పు చెందాయో అనే విషయాన్ని కూడా పాటలో చెప్పినట్టు ఉంటుంది.

Report a Lyrics Mistake / Share Your Thoughts