‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా‘ పాట యొక్క లిరిక్స్‌ను (O Rendu Prema Meghaalila Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఇది 2023లో విడుదలైన బేబీ (Baby) అనే తెలుగు సినిమాలోని పాట. ఈ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ కుమార్ నాయుడు (SKN) నిర్మించారు. అలాగే ప్రధాన పాత్రలలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు. బేబీ 14 జూలై 2023న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. విడుదల తర్వాత ఆహా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని, ఆగస్టు 25న ప్రీమియర్ చేసింది, ఇక టెలివిజన్ ప్రసార హక్కులను ETV కొనుగోలు చేసింది. 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, ₹90 కోట్లు వసూలు చేసింది.
ఎవ్వరైన ఇంక ముందు ఏదైనా సినిమాను కల్ట్ సినిమా అంటే, అరే మీకేమన్నా పిచ్చా కల్ట్ సినిమా అంటే బేబి సినిమా కదా అంటామేమో. ఎందుకంటే బేబి సినిమా ప్రమోషన్స్ లో బేబి చిత్రబృందం కల్ట్ అనే పదాన్ని లెక్కకు మించి వాడారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత ద గ్రేట్ ఎస్.కె.ఎన్ అయితే ప్రమోషన్స్ కు వెళ్ళిన ప్రతీచోట కల్ట్ అనే పదాన్ని విరివిగా వాడారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎందుకో ఏమోగాని చాలామంది మూవీ రివ్యూవర్స్ ఈ సినిమాను బాగాలేదు అన్నారు. కానీ విచిత్రమేమిటంటే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాపై ప్రజలు చూపించిన ప్రేమతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా యువతలో ఈ సినిమా ప్రభావం చాలా గట్టిగా పడింది. ఇందులోని క్యారెక్టర్స్ ను మనం ప్రత్యక్షంగా పరోక్షంగా మన నిజ జీవితంలో చూస్తూనే ఉంటాము. అందుకే ఇది అంత బాగా కనెక్ట్ అయింది.
సాయి రాజేష్ అంటే తెలుగు సినిమా ప్రేమికులకు సుపరిచితమైన పేరు. తనదైన కథన శైలితో, ఆధునిక యువతకు నచ్చే విధంగా కథలను రూపొందించడంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. 2014లో “హృదయ కాలేయం” సినిమాతో దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి రాజేశ్, స్టీవెన్ శంకర్ అనే మారుపేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాతోనే ఆయన సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2019లో సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన “కొబ్బరి మట్ట” చిత్రానికి కథ రాసి, మరొక వినూత్న ప్రయత్నం చేశాడు.
అయితే సాయి రాజేశ్‌కు నిజంగా పేరు తెచ్చిపెట్టింది 2020లో విడుదలైన “కలర్ ఫోటో” సినిమా. ఈ సినిమాకు ఆయన రచయిత, నిర్మాతగా వ్యవహరించి, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. “కలర్ ఫోటో” సినిమా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత పొందుతూ, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సినిమాతో సాయి రాజేశ్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ బేబి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. ఈ సినిమా విడుదలకు ముందు ఇది అంత పెద్ద హిట్ అవ్వడం పక్కన పెడితే, అసలు ఈ సినిమా థియేటర్స్ ఆడుతుంది, ఒకవేళ ఆడితే కూడా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సందేహాలు ఉండేవంటా సాయి రాజేశ్ కు. ఎందుకంటే ఈ సినిమాను ఎడిటింగ్ రూమ్ లో కొన్ని వందల సారి చూడడం వల్ల ఈ సినిమాను ఒక ఆడియన్ గా చూసినప్పుడు తనకు ఎక్సైట్మెంట్ కలిగించలేదని ఈ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
సాయి రాజేశ్ సినిమాల ప్రత్యేకత ఏంటంటే, ఆయన సినిమాలు ఎక్కువగా ఆధునిక యువతకు సంబంధించిన కథలే ఉంటాయి. వారి ఆలోచనలు, సమస్యలు, ఆశయాలను ప్రతిబింబిస్తాయి. ఆయన కథలను చాలా సరళంగా చెప్పడంలో ప్రవీణుడు. అందరూ అర్థం చేసుకునే భాషలో కథలను చెప్పడం ఆయన ప్రత్యేకత. అంతేకాకుండా, ఆయన సినిమాలు ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరుస్తాయి. కథలోని పాత్రలతో ప్రేక్షకులు తమను తాము కలుపుకుంటారు. కొన్ని సినిమాల్లో సాంఘిక సమస్యలపై కూడా ప్రస్తావన ఉంటుంది. అవి ప్రేక్షకులలో అవగాహన కల్పిస్తాయి. సాయి రాజేశ్ తన తొలి సినిమా నుండి ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ, తనదైన ముద్ర వేశారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఆయన మరెన్ని మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.
ఈ బేబీ సినిమాకు సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ అందించారు. ఇందులోని ప్రతి పాట ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కొన్న పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయే ఎవర్గ్రీన్ పాటల జాబితాలో చేరతాయి. అలా ప్రత్యేకంగా నిలిచిపోయే పాటల్లో “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” కూడా ఒకటి. ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా, శ్రీరామ చంద్ర ఆలపించారు. కిడ్స్ కోరస్‌గా వేద వాగ్దేవి, హర్షిత, తనిష్కా, ఉజ్జ్వల్, అనఘ, వీక్షిత్ పాటను పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: ఓ రెండు ప్రేమ మేఘాలిలా (O Rendu Prema Meghaalila)
- సినిమా: Baby (బేబీ)
- నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్
- సినిమా దర్శకుడు: సాయి రాజేష్
- సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
- గేయరచయిత: అనంత శ్రీరామ్
- గాయకుడు: శ్రీరామ చంద్ర
- కిడ్స్ కోరస్: వేద వాగ్దేవి, హర్షిత, తనిష్కా, ఉజ్జ్వల్, అనఘ, వీక్షిత్
- సినిమా విడుదల తేదీ: జూలై 14, 2023
- లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్
O Rendu Prema Meghaalila Song Lyrics in Telugu
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాస లేదే
ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే
తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే
మెల్లగా.. మెల్లగా..
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
తోచిందే ఈ జంట
కలలకే.. ఏ ఏ ఏ ఏ
నిజములా.. ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే.. ఏ ఏ ఏ ఏ
రుజువులా.. ఆ ఆ
కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళైనా విడిపోక
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఏ మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాస లేదే
ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే
తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే
మెల్లగా.. మెల్లగా..
O Rendu Prema Meghaalila Lyrics in English
Are Ee Lokame Mayamaa
Vere Ye Dhyaasa Ledhe..
Aa Gundello
Verayye Oose Raadhe..
Thulle Aashallo
Iddharidhi Oke Prayaanamgaa
Idhharidi Oke Prapanchamgaa
Aa Iddari Oopiri Okataindhe
Mellagaa.. Mellagaa..
O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa
O Rendu Prema Meghaalila
Dhookaayi Vaanalaaga
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa
Thochindhe Ee Janta
Kalalake.. Ye Ye Ye Ye
Nijamula.. Aa Aa
Saagindhe Daaranthaa
Chelimike.. Ye Ye Ye Ye
Rujuvulaa.. Aa Aa
Kantee Reppa Kanupaapalaaga
Untaaremo Kadadhaaka
Sandamama Sirivennela Laaga
Vandhellainaa Vidipoka
O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa
O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa
Ye Maaye Idhi Praayamaa
Are Ee Lokame Mayamaa
Vere Ye Dhyaasa Ledhe..
Aa Gundello
Verayye Oose Raadhe..
Thulle Aashallo
Iddharidhi Oke Prayaanamgaa
Idhharidi Oke Prapanchamgaa
Aa Iddari Oopiri Okataindhe
Mellagaa.. Mellagaa..
ఓ రెండు ప్రేమ మేఘాలిలా Video Song
ఈ పాటలో వైష్ణవి (వైష్ణవి చైతన్య) మరియు ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ల ప్రేమకథను ప్రతిబింబిస్తుంది. వీరి మధ్య చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి, స్కూల్ రోజుల్లోనే అది పరిపక్వత చెందిన ప్రేమగా వృద్ధి చెందుతుంది. అనుకోకుండా ఆనంద్ తన చదువును పూర్తి చేయలేక ఆటో డ్రైవర్‌గా జీవితం మొదలుపెట్టినప్పటికీ, వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. ఒకరోజు ఆనంద్ వెష్ణవిని కాలేజి దగ్గరకు తన ఆటోలో డ్రాప్ చేసి తిరిగి వచ్చే సమయంలో స్కూల్ యూనిఫామ్ లో స్కూల్ కు వెళుతున్నా ఒక అమ్మాయిని చూస్తాడు. అప్పుడు తనకు తన స్కూల్ డేస్ అలాగే ఆరోజుల్లో వైష్ణవితో ఏర్పడిన ప్రేమ గుర్తు తెచ్చుకుంటాడు. అంటే ఆనంద్ స్కూల్ డేస్ లో తనకు అసలు పరిచయమే లేని తెలియని వైష్ణవితో ప్రేమ ఎలా మొదలైందో మొత్తం గుర్తుకు తెచ్చుకుంటాడు. ఈ ఫ్లాష్ బాక్ అంతా ఈ ఒక్క పాటలో ముగుస్తుంది.
సినిమా అంటే ఎలా ఉండాలో అని చాలామంది చాలా ఫాయింట్స్ చెబుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ సినిమాలు ప్రేక్షకులను డిసప్పాయింట్మెంట్ చేయకుండా ఉంటే చాలు. ముఖ్యంగా బేబి లాంటి సినిమాని చూసి నిబ్బనిబ్బి సినిమాలా ఉందే ఇదేం సినిమా అన్నా యూట్యూబ్ రివ్యూవర్సే ఈ సినిమాకు రోజురోజుకు వస్తున్న కలెక్షన్స్ అలాగే ప్రేక్షకుల స్పందన చూసి నోట మాట రాలేదు. ఈ సినిమా ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారణం, ఇది మన సమాజంలో చుట్టూ ఉన్న వ్యక్తుల కథలా ఉండటం. కొన్ని సన్నివేశాలు మేజారిటీ యువత తమ జీవితాల్లో ఎదుర్కొన్న సంఘటనలను, అనుభవించిన పరిస్థితులను ప్రతిబింబించినట్లు అనిపించడం కూడా దీనికి మరింత ఆదరణను తీసుకువచ్చింది.
ఈ సినిమాలోని “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” పాట అప్పట్లో పెద్దగా సంచలనం సృష్టించింది. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో కూడా ట్రెండింగ్ గా నిలిచి, ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. స్కూల్ రోజుల్లోనే ప్రేమ ప్రారంభమైన ఆనంద్, వైష్ణవి ప్రేమ కథను కేవలం ఈ పాట ద్వారానే దర్శకుడు అద్భుతంగా చూపించాడు. స్కూల్ పిల్లలాగా ఆనంద్, వైష్ణవి నటన చాలా సహజంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వైష్ణవి అమాయకంగా డీగ్లామర్ పాత్రలో నటన ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ పదాలను అందించారు, శ్రీరామ చంద్ర ఆలపించారు.