‘నే వేరే‘ పాట యొక్క లిరిక్స్‌ను (Ney Veyrey Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఇది 2023లో విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోని పాట. యానిమల్ సినిమా ఎంత మన మీద ఎంత ప్రభావం చూపిందో, ఆ సినిమాలోని పాటలు కూడా అంతే ప్రభావం చూపాయి. అవి ప్రేక్షకులను చాలానే ఆకట్టుకున్నాయి. మన తెలుగు సినిమాలలో అయితే ఒక సినిమాకి ఒక సంగీత దర్శకుడు ఉండడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ యానిమల్ సినిమాకి పనిచేసిన సంగీత దర్శకులు దాదాపు 12 మంది. అంటే ఊహించుకోవచ్చు ఈ సినిమాలోని పాటలు ఏ రేంజ్ ఉంటాయో. ఈ సినిమా దర్శక రత్నం సందీప్ రెడ్డి వంగా పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రతీ సినిమాలోని పాటలు అలా మన హిట్ ప్లే లీస్ట్ లో యాడ్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటాయి ఆయన సినిమాలోని పాటలు.
ఇక నే వేరే పాటకు వస్తే, ఈ పాటను ఒరిజినల్ గా హిందీలో మొదట రాశారు. ఎందుకంటే ఇది ఒరిజినల్ హిందీ సినిమా కాబట్టి. దీనిని తెలుగులో మన అనంత శ్రీరామ్ రాశాడు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఎందుకంటే మనం ఈ మధ్య ఇష్టంగా వినే చాలా పాటల్లో ఈయన రాసిన పాటలు కూడా చాలానే ఉంటాయి. ఇక ఈ పాటను ఆలపించింది కార్తీక్. ఈయన ప్రముఖ మరియు ప్రసిద్ధ తెలుగు గాయకులలో ఒకరు. కార్తీక్ మొదట్లో బ్యాకింగ్ వోకలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి, కొద్ది కాలంలోనే ప్రసిద్ధ గాయకుడిగా ఎదిగాడు. ఈయన మొత్తం 10 భారతీయ భాషలలో తన మధురమైన గానంతో పాటలు పాడారు.
ఇక ఈ నే వేరే పాటకు సంగీతాన్ని అందించింది శ్రేయస్ పురనిక్. ఈయన ముఖ్యంగా హిందీ భాషలో చాలా పాటలకు సంగీతాన్ని అందిచాడు. కానీ ఊహించలేని గుర్తింపు తీసుకు వచ్చింది మాత్రం యానిమల్ సినిమాలోని సత్రంగా పాట. అదేనండి తెలుగులో నే వేరే పాట. ఈ పాటలో ఎక్కువ సంగీత పరికరాలను ఎడాపెడా వాడకుండా ఉండటం వల్ల చాలా క్లాసిక్ గా, నెమ్మదిగా సాగుతూ వినడానికి వినసొంపుగా ఉంటుంది. అర్థవంతమైన పదాలతో, వినసొంపైనా సంగీతంతో సాగే ఈ పాట మంత్రముగ్దులను చేయడం గ్యారెంటీ. నే వేరే పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: నే వేరే
- సినిమా: యానిమల్ (Animal)
- నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా
- సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
- సంగీత దర్శకుడు: శ్రేయస్ పురనిక్
- గేయరచయిత: అనంత శ్రీరామ్
- గాయకుడు: కార్తీక్
- సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Ney Veyrey Song Lyrics in Telugu
నా దేహమంత నీ స్నేహంతో
నిండింది చూడే నేస్తమా
హో, నా మౌనమంత నీ ధ్యానంలో
మునిగింది చూడే ప్రాణమా
నా చిన్ననాటి గుండె
నీ పేరే వినిపిస్తూ ఉందే
నాకన్నా నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో.. హో..
నీ పాదం స్పృశించాకే
నే తాకానే నీ పెదవిని
నీ ద్వేషాన్ని ముందుగా కలిసి
మళ్లీ చూస్తా నీ ప్రేమనీ
కసురుల దాగిన కనికరమా
అలకల మాటున అనురాగమా
శిశిరాలే జాడిలా ఎదురైనా
మరల రాదా మరుక్షణాన
వాసంతమే
నీ చేదు జ్ఞాపకాలే
గాయాలుగా మార్చుకుంటా
నువ్ నొచ్చుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా
నే నావై నువు తోవైయ్యాక నేస్తమా
ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా
హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో.. హో..
నేనేమో ఎండనైతే
నువ్వేమో నా వానవిల్లే
ఈ జంట ఉన్న చోటే
వెలగాలలా వానవిల్లే
నే రాత్రై నువు పగలైతేనే నేస్తమా
ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా
హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో.. నే వేరే నువ్వేరే.. కాదు నేస్తమా
నీ తీరే పూదారే.. నాకు ప్రాణమా
Ney Veyrey Lyrics in English
Naa Dehamantha Nee Snehamtho
Nindindhi Choode Nesthamaa
Ho, Naa Mounamantha
Nee Dhyaanamlo
Munigindhi Choode Praanamaa
Naa Chinnanaati Gunde
Nee Pere Vinipisthu Undhe
Naakannaa Ninnu Mundhu
Chadivesi Itu Cherukundhe
Ney Veyrey Nuvvere
Kaadhu Nesthamaa
Nee Theere Poodhaare
Naaku Praanama (x2)
Ho… Ho…
Nee Paadham Sprushinchaake
Nee Thaakaane Nee Pedhavini
Nee Dhweshaanni Mundhuga Kalisi
Mallee Choostha Nee Premani
Kasuraala Daagina Kanikarama
Alakala Maatuna Anuraagama
Shisiraale Jaadilaa Edurainaa
Marala Raadhaa
Marukshanaana Vaasanthame
Nee Chedhu Gnapakaale
Gaayaalugaa Maarchukuntaa
Nuv Nochhukunna Chote
Nanu Nenu Shikshinchukuntaa
Ne Naavai Nuvu Thovayyaka
Nesthamaa
Ye Theeram Ika Dhooram
Kaadhu Praanamaa
Ho, Ney Veyrey Nuvvere
Kaadhu Nesthamaa
Nee Theere Poodhaare
Naaku Praanama
Ho… Ho…
Nenemo Endanaithe
Nuvvemo Naa Vaanaville
Ee Janta Unna Chote
Velagaalalaa Vaanaville
Ne Raathrai Nuvu Pagalaithene
Nesthamaa
Prathi Roju Ika Poorthayyene
Pranama
Ho, Ney Veyrey Nuvvere
Kaadhu Nesthamaa
Nee Theere Poodhaare
Naaku Praanama (x2)
Ho… Ho…
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా Video Song
సినిమాలో ఈ పాటకు ముందు రణ్ విజయ్ మరియు గీతాంజలి మధ్య ఎంత పెద్ద పెద్ద సీన్లు ఉంటాయంటే, చూసే వాళ్ళకి అరెే ఈ సీన్లు అవసరమా, తీసేస్తే సినిమా లెన్త్ తగ్గుతుంది అనిపించక ఉండదు. కానీ ఆ సీన్లు మాత్రం ఏమాత్రం బోర్ కొట్టకుండ ఉంటాయి. ఈ సీన్లను ఉంచడంవల్ల రణ్ విజయ్ మరియు గీతాంజలి మధ్య ఉండే బాండింగ్ మరింత క్లియర్ గా తెలుస్తుంది. ఈ సీన్లలో గీతాంజలి పాత్రలో రష్మిక మాత్రం నటన విశ్వరూపం చూపింది. ఈమె కాసేపు అమాయకురాలిగా, ఆ వెంటనే కోపొస్తురాలిగా, అలాగే ఏడుస్తూ ఇలా అన్ని వేరియేషన్స్ చూపిస్తుంది.
ఈ పాట ఎలా మొదలవుతుందంటే, రణ్ విజయ్, జోయా రియాజ్ తో ఏకాంతంగా గడిపిన విషయం గీతాంజలికి చెప్తాడు. ఏ భార్యైన తన భర్త వేరొక అమ్మాయిని చూస్తేనే సహించుకోలేదు అలాంటిది మన ఆల్పా మెన్ రణ్ విజయ్ ఏకంగా వేరొక అమ్మాయితో పడుకోవడమే కాకుండా, ఆ విషయాన్ని తన భార్య దగ్గర చెప్పడమంటే సాహసమనే చెప్పాలి. అలా ఎందుకు చెప్పాడంటే తన భార్య దగ్గర ఏ విషయం దాచకుండ ఉండాలని అనుకుని ఉండవచ్చు. కానీ వాళ్ళు ఆడవాళ్ళు బ్రదర్ ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఈ విధంగానే కోప్పడతారు అందులో తప్పులేదు. ఈ పాట మొత్తంలో గీతాంజలి ఏడుస్తూ, అలుగుతూ, కొప్పడుతూ ఉంటే, మన రణ్ విజయ్ మాత్రం ఆమెను చూస్తూ, ఆమెకు తన ప్రేమను తన చేతులతో మరియు కళ్ళతో వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాడు సక్సస్ ఫుల్ గా వ్యక్తం చేస్తాడు కూడా. పాట చివరలో బెడ్ కింద ఏడుస్తూ కూర్చున్న గీతాంజలి దగ్గరకు కప్పులో టీ లాంటిది తీసుకుని రణ్ వచ్చి ఆమెకు తన చేతులతో తాగిపిస్తాడు. ఇక అంతే మీకు తెలిసిందే కదా భార్య భర్తల మధ్య గొడవలు స్వల్ప సమయం మాత్రమే అని. గీతాంజలి ఆ టీ తాగి అలాగే మన రణ్ విజయ్ ని లిప్ కిస్ చేస్తుంది. ఇక భార్యభర్తల మధ్య ఏ గొడవలు లేనట్టేన వాళ్ళు కలిసిపోయారా అంటే, అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిందే భార్యభర్తల (భార్యల) గొడవలు ఎండ్ లెస్ అని. ప్రస్తుతానికి ఈ పాటలో అయితే ఇద్దరు కలిసిపోతారు.
నిజంగా పాట మాత్రం వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఈ మధ్య పాటల్లో ఎడాపెడా సంగీత వాయిద్యాలను వాడుతూ, గాయకుడి గానం వినబడకుండా, సాహిత్యం సరిగ్గా అర్థం కాకుండా ఉండే పాటలు వింటూ వచ్చాము కాబట్టి వాటితో పోల్చితే ఇది చాలా బెటర్. ఎందుకంటే అర్థవంతమైన అనంత శ్రీరామ్ సాహిత్యం, సింగర్ కార్తిక్ యొక్క మధురమైన గానం, శ్రేయస్ పురనిక్ క్లాసిక్ సంగీతం అలాగే రణ్ బీర్ కపూర్ మరియు రష్మిక మందన్నా స్క్రీన్ ప్రెజెంన్స్ ఇలా అన్ని కలిపి ఉన్నా ఈ పాట ఒక ఆణిముత్యం లాగా తెలుగు లెజండరీ పాటల జాబీతాలో నిలిచిపోవడం మాత్రం ఖాయం. ఈ పాటలో చివరలో లిప్ కిస్ మినహా మరెక్కడ అసభ్య సన్నివేశాలు లేవు కాబట్టి ఈ పాట యొక్క వీడియోను చూస్తూ, పాటను వింటూ ఆనందించండి.