Nee Chuttu Chuttu Song Lyrics – Skanda (2023) | Sid Sriram

నీ చుట్టూ చుట్టూ పాట యొక్క లిరిక్స్‌ను (Nee Chuttu Chuttu Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 2023లో విడుదలైన స్కంద (Skanda) అనే తెలుగు యాక్షన్ చిత్రంలోనిది. ఈ చిత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణంలో జీ స్టూడియోస్ సహకారంతో తెరకెక్కింది. ఇందులో రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితశ్వ, అజయ్ పూర్కర్, బాబ్లు ప్రిథ్వీరాజ్, దగ్గుబాటి రాజా, ప్రిన్స్ సెసిల్ లాంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 2023 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కాస్త మిశ్రమ స్పందనను పొందింది. కథనం, రాజకీయ వ్యంగ్యం, యాక్షన్ సన్నివేశాలు లాంటి వాటికి విమర్శలు వచ్చాయి. రూ. 95 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 59.20 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది.

ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుర్కర్) తన కూతురు వివాహాన్ని చిన్నప్ప (ప్రభాకర్)తో ఏర్పాటు చేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వా) కుమారుడు వచ్చి రాయుడు కూతుర్ని ఎత్తుకొని పారిపోతాడు. ఈ సంఘటన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వాన్ని పెంచుతుంది. ఇంతలో, భాస్కర్ రాజు (రామ్ పోతినేని) అనే కాలేజీ విద్యార్థి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమార్తెలను అపహరిస్తాడు. అతని ఈ చర్యకు కారణం, అక్రమంగా జైలులో ఉన్న రుద్రకాంతి రామకృష్ణ రాజు (శ్రీకాంత్) అనే వ్యక్తిని రక్షించడమే.

రామకృష్ణ రాజు, భాస్కర్ రాజు తండ్రికి మంచి స్నేహితుడు మరియు అతని కుటుంబాన్ని రక్షించడానికి తప్పుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ కథలో రామకృష్ణ రాజు నిరపరాధి అని నిరూపించడానికి ప్రోటాగనిస్ట్ ప్రయత్నిస్తాడు. కానీ, తన గతంలో ఒక ప్రమాదకరమైన హంతకుడుగా ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత, ప్రోటాగనిస్ట్ యొక్క జీవితం మరింత క్లిష్టమవుతుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం, ఒక కాలేజీ విద్యార్థి చేసిన అపహరణ, ఒక నిరపరాధి వ్యక్తి కోసం జరిగే పోరాటం మరియు ఒక ప్రమాదకరమైన హంతకుడి గతం – ఈ అన్ని అంశాలు కలిసి స్కంద చిత్రానికి ఆసక్తికరమైన కథాంశాన్ని అందిస్తాయి.

బోయపాటి శ్రీను గారి సినిమాలు ఎంత మాస్ కమర్షియల్‍గా ఉంటాయే మనందరికి తెలుసు. ఇక ఈయన 2021లో అఖండ సినిమాతో ఎంత పెద్ద హిట్ అందుకున్నారో కూడా తెలుసు. దీని తర్వాత ఈయన 2023లో ఈ స్కంద సినిమాతో అది కూడా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వస్తున్నాడంటే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. అదే విధంగా ఇందులోని పాటలు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ‘నీ చుట్టూ చుట్టూ’ అనే పాటైతే వినడానికే కాదు చూడడానికి కూడా చాలా బాగుంది. దీనికి సంగాతాన్ని అందించింది తమన్ ఎస్. అలాగే రఘురామ్ రాయగా, సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే ఈ పాటను పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “నీ చుట్టూ చుట్టూ” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: నీ చుట్టూ చుట్టూ (Nee Chuttu Chuttu)
  • సినిమా: Skanda (స్కంద)
  • నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా తదితరులు
  • సినిమా దర్శకుడు: బోయపాటి శ్రీను
  • సంగీత దర్శకుడు: తమన్ ఎస్
  • పాట రచయిత: రఘురామ్
  • గాయకులు: సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే
  • సినిమా విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2023
  • లేబుల్: జంగ్లీ మ్యూజిక్ తెలుగు

Nee Chuttu Chuttu Song Lyrics in Telugu

నీ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ తిరిగినా
నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓ దమ్ము లాగి గుమ్మతో
రిథమ్ము కలిపి ఆడమందిగా

ప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగా
ఇంతలో తతంగమంత మారుతోందిగా
క్షణాలలో ఇదేమిటో
గల్లంతు చేసే ముంతకళ్ళు లాంటి
కళ్ళలోన తేలగా

మరింత ప్రేమ పుట్టుకొచ్చి
మత్తులోకి దించుతోందిగా

నీ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ తిరిగినా
నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

మీసాలనే తిప్పమాకు బాబో
వేషాలతో కొట్టమాకు డాబో
నువ్వింత పొగుడుతున్న
నేను పడనే పడనుగా
చటుక్కునొచ్చె ప్రేమ
నమ్మలేను సడనుగా

కంగారుగా కలగనేయ కైపు
నేనస్సలే కాదు నీ టైపు
ఇలాంటివెన్ని చూడలేదు కళ్ళ ముందరా
నువ్వెంత గింజుకున్న నన్ను గుంజలేవురా

ఏమిటో అయోమయంగ ఉంది నా గతి
ముంచినా భలేగా ఉంది ఈ పరీస్థితి
ఇదో రకం అరాచకం
కరెంటు షాకు లాంటి వైబ్
నీది అంటే డౌటే లేదు
ఖల్లాసు చేసి పోయినావు
ఓరచూపు గుచ్చి నేరుగా

నీ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగినా
నా చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా
ఓ దమ్ము లాగి గుమ్మతో
రిథమ్ము కలిపి ఆడమందిగా

Nee Chuttu Chuttu Lyrics in English

There is Something About
You Got Me Going Crazy Crazy
I’m Wondering Why Am I
Dreaming About You
Catching Feelings

I Fall into Love
I’ve Fallen So Hard
I Need You Baby
if You’re Looking for Mine
With Golden Heart
Then Baby Try Me

Nee Chuttu Chuttu Chuttu
Chuttu Chuttu Tirigina
Naa Chitti Chitti Chitti
Chitti Gundenadiginaa
Naa Dhimma Thirige
Bomma Evaridhante
Ninnu Chooputhondhigaa

O Dhammu Laagi Gummatho
Rhydhammu Kalipi Aadamandhiga
Praaname Pathangi Laaga
Eguruthondhigaa
Inthalo Thathangamantha
Maaruthondhigaa

Kshanaalalo Idhemito
Ghallanthu Chese
Munthakallu Laanti
Kallalona Thelagaaa
Marintha Prema Puttukochhi
Matthuloki Dhinchuthondhigaa

Nee Chuttu Chuttu Chuttu
Chuttu Chuttu Tirigina
Naa Chitti Chitti Chitti
Chitti Gundenadiginaa
Naa Dhimma Thirige
Bomma Evaridhante
Ninnu Chooputhondhigaa

There is Something About
You Got Me Going Crazy Crazy
I’m Wondering Why Am I
Dreaming About You
Catching Feelings

I Fall into Love
I’ve Fallen So Hard
I Need You Baby
if You’re Looking for Mine
With Golden Heart
Then Baby Try Me

Meesaalane Thippamaaku Baabo
Veshaalatho Kottamaaku Daabo
Nuvvintha Pogudunthunna
Nenu Padane Padanugaa
Chatukkunoche Prema
Nammalenu Sadenugaa

Kangaarugaa Kalaganeya Kaipu
Nenassale Kadhu Nee Type
Ilaantivenni Choodaledhu
Kalla Mundharaa
Nuvventha Ginjukuna
Nannu Gunjalevuraa

Emito Ayomayangaa Undi Naagathi
Munchinaa Bhalega Undi Ee Paristhithi
Idho Rakam Araachakam
Current Shock Laanti Vibe
Needhi Ante Doubt Ye Ledhugaa
Khallaasu Chesi Poyinaavu
Orachoopu Guchhi Nerugaa

Nee Chuttu Chuttu Chuttu Tirigina
Naa Chitti Chitti Gundenadiginaa
Naa Dhimma Thirigi
Bomma Evaridhante
Ninnu Chooputhondhigaa
O Dhammu Laagi Gummatho
Rhydhammu Kalipi Aadamandhiga

There is Something About
You Got Me Going Crazy Crazy
I’m Wondering Why Am I
Dreaming About You
Catching Feelings

I Fall into Love
I’ve Fallen So Hard
I Need You Baby
if You’re Looking for Mine
With Golden Heart
Then Baby Try Me

నీ చుట్టూ చుట్టూ Video Song

Nee Chuttu Chuttu (Lyrical Video) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu | Thaman S

పాట వచ్చే సందర్భం:

“నీ చుట్టూ చుట్టూ” పాట ‘స్కంద’ సినిమాలోనిది. ఇంతకి ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే,ఈ సినిమాలోని హీరో భాస్కర్ రాజు (రామ్ పోతినేని) కాలేజీ క్లాస్ లో టీచర్ స్టూడెంట్స్ అందరిని తాము భవిష్యత్తులో ఏమి అవ్వాలనుకుంటున్నారో చెప్పమని అడుగుతారు. ఇక మన హీరో భాస్కర్ రాజ్ వంతు వచ్చినప్పుడు, తను భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని చెబుతుంటాడు. ఈ మాట విన్న వెంటనే క్లాస్ లోని అందరూ టీటర్స్ తో సహా శాక్ అవుతారు. అదే క్లాస్ లో మన హీరోయిన్ శ్రీలీల కూడా ఉంటుంది.

క్లాస్ అయిపోయిన తర్వాత భాస్కర్ రాజ్ బయటకు వచ్చే సమయంలో శ్రీలీల అతనితో మాట కలుపుతుంది. అప్పుడు అతను తను ముఖ్యమంత్రి అల్లుడని చెప్పి, ముఖ్యమంత్రికి ఉన్న కూతురికి తనంటే చచ్చేంచ ఇష్టమని బిల్డప్ లు ఇస్తాడు. దానిని విని శ్రీలీల శాక్ అవుతుంది. ఎందుకంటే తనే ముఖ్యమంత్రి కూతురు కాబట్టి. భాస్కర్ రాజు ఇంకా చెబుతూ, ముఖ్యమంత్రి కూతురు తనకోసం బట్టలు చింపేసుకుంటుంది, తను కనిపించిన వెంటనే గపా గపా అని ముద్దులు పెడుతుందని చెప్పడంతో శ్రీలీల సీరియస్ అవుతుంది. అప్పుడు భాస్కర్ ఆమెతో నువ్వేందుకు పరాషాన్ అవుతావు కొంపదీసి నా మీద నీకేమైన ఇష్టం ఏర్పడిందా అని అడుగుతాడు. దానికి ఆమె నేనా, నిన్నా అని తీసేసినట్టు మాట్లాడుతుంది. అప్పుడు అతను నీకు అంత సీన్ లేదులే ఎందుకంటే నీన్ను సీఎం కూతురితో పోల్చితే నువ్వు జస్ట్ యావరేజ్ ఫిగర్ అని అంటారు.

ఈ యావరేజ్ అనే పదాన్ని అతను పదే పదే వాడి, ఆమె హర్ట్ అయ్యే విధంగా చేస్తాడు. అది ఎంతలా అంటే ఆమె తన ఇంటికి వెళ్ళినాక కూడా అక్కడ ఎవరైన యావరేజ్ అనే పదాన్ని ఉపయోగించిన కూడా చికాకు పడుతుంటుంది. తనలాంటి అందమైన ఫిగర్ ని పట్టుకుని యావరేజ్ అని ఎలా అంటాడు అని ఆమె ఫీలింగ్. ఇక మనశ్శాంతి కోసం బార్ కు వెళ్ళి మందు తాగి చిల్ అవుదామని వెెెెళ్ళగా అక్కడికి కూడా మన భాస్కర్ రాజు వస్తాడు. అక్కడ బార్ లో అతన్ని చూసేసరికి తనకు ఇంకా కోపం ఎక్కువైతుంది మరియు తనకు అతన్ని చూస్తేనే ఇరిటేషన్ ఫీల్ అవుతుంది. ఆ సమయంలో భాస్కర్ ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతాడు. నన్ను చూస్తే కదా నీకు ఇరిటేషన్, దానిని దింపుతా పదా అని చెప్పిన తర్వాత ఈ పాట మొదలవుతుంది. ఇది పబ్ లో చాలా ఎనర్జిటిక్ గా కొనసాగే పాట.

ముగింపు:

ఏమిటో రామ్ పోతినేనికి 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చెప్పుకునే మంచి హిట్ సినిమాలు ఒక్కటి కూడా లేవు. ఈ సినిమా తర్వాత విడుదలైన రెడ్ (2021), రొమాంటిక్ (2021), ది వారియర్ (2022) సినిమాలో ఘోర పరాభావాన్ని ఎదుర్కోన్నాయి. ఇప్పుడు ఈ స్కంద (2023) కూడా డిజాస్టర్ టాక్ ను అందుకుంది. కానీ రామ్ ప్రతీ సినిమాకు కష్టపడే విధానం చాలా మందికి ఆదర్శం అవుతుంది. అతను ప్రతి సినిమాకు తన లుక్ ని మార్చుకుంటూ కొత్తగా కనిపించేలా చూసుకుంటాడు. ఇక ఈ స్కంద సినిమా బోయపాటి దర్శకత్వంలో రావడంతో ఊర మాస్ లుక్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటాడు. అలాగే కొంచెం బాడీని కూడా పెంచినట్టు కనబడుతుంటుంది.

ఇక ఈ నీ చుట్టూ చుట్టూ పాటలో అయితే తన స్టైల్‍తో డ్యాన్స్‍తో సూపర్ స్టెప్పులతో ఇరగదీశాడు. ఎంత క్లిష్టతరమైన స్టెప్పులను కూడా తను చాలా సులభ రీతిలో అదీ కూడా స్టైల్ మిస్ అవ్వకుండా వేయడం చూస్తుంటే వావ్ అనిపించక తప్పదు. బ్యూటి విత్ బ్రేన్ లాగా బ్యూటీ విత్ డ్యాన్స్ అయిన శ్రీలీల రామ్ పక్కన డ్యాన్స్ చేస్తున్నా కూడా మొత్తం ఇంప్రెషన్స్ రామే తీసుకుంటాడు. ఈ బ్రహ్మాండమైన పాటలో ఉన్న పబ్ ను డెకరేట్ చేసిన విధానం కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఆ పబ్ చాలా కాస్టీగా ఉన్నట్టు కనబడుతుంటుంది. ఒకవేళ దానిని సెట్ వేసి ఉంటే, దానికోసం చాలానే ఖర్చు చేసినట్టు ఉన్నారు. వారు ఖర్చుచేసిన ప్రతీ రూపాయి ప్రతీ ఫ్రేములో కనబడుతూ ఉంటుంది. ఈ పాట యూట్యూబ్ లో అందుబాటులో ఉంది కావున ఇప్పటి వరకు ఎవరైన ఈ పాటను చూడకుంటే చూసేయ్యండి.

Report a Lyrics Mistake / Share Your Thoughts