‘నాన్న నువ్ నా ప్రాణం‘ పాట యొక్క లిరిక్స్‌ను (Nanna Nuv Naa Pranam Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2023లో విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోని పాట. మనకు తెలుసి ఎక్కువగా అమ్మ గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి. మన తెలుగులోనే కాదూ, ప్రతీ భాషలోను నాన్నపై వచ్చిన పాటలతో పోల్చి చూస్తే, అమ్మలపై వచ్చిన పాటలే ఎక్కువగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. పాటలు ఒక్కటే కాదూ, సినిమాలు కూడా ఎక్కువగా అమ్మ అనే ఎమోషన్ చుట్టు తిరుగుతుంటాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సినిమాల్లో ముఖ్యంగా పాటలలో అమ్మకు ఇచ్చిన ప్రాధాన్యత నాన్నకు ఎందుకు ఇవ్వడం లేదు. నాకు తెలిసి జూనియర్ ఎన్టిఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో (2016)’ సినిమాలో నాన్నపై ఉన్న పాటలను మొదటిసారి విన్నాను. అందుకు ముందు విన్నట్టు నాకైతే జ్ఞాపకం లేదు. ఇక్కడ నాన్నపై వివక్ష ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ కొద్దిగా ఊరట ఇచ్చే విషయం ఏమిటంటే ఈ యానిమల్ సినిమాలో నాన్నపై పాట ఉండడం. అదే ఈ ‘నాన్న నువ్ నా ప్రాణం’ పాట.
‘నాన్న నువ్ నా ప్రాణం’ పాటను రాసింది అనంత శ్రీరామ్. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏప్రిల్ 8, 1984లో జన్మించాడు. చిన్నవయస్సులోనే (12వ సంవత్సరం) పాటలను రాయడం ప్రారంభించాడు. దీన్ని బట్టి చిన్ననాటి నుండే పాటలు రాయడం ప్రారంభించడం వల్ల పాటలు రాయడంలో విశేష నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఒక టీవి షోలో అనంత శ్రీరామ్ పాల్గొన్నప్పుడు, అక్కడి వీక్షకులు అతనికి కొన్ని రాండమ్ పదాలను ఇచ్చి, ఇక్కడే వెంటనే ఒక అర్థవంతమైన పాటను రాయండి అంటే, వెంటనే అలాగైతే మీకిష్టమైన పదాలను కొన్ని ఇవ్వండి అని చెప్పి, వారి నుండి పదాలు స్వీకరించిన కొన్ని నిమిషాల్లోనే పాటను రాసి వారికి వినిపిస్తాడు. సో పాటలు రాయడంలో అనంత శ్రీరామ్ సిద్ధహస్తుడని దీన్ని బట్టి తెలుస్తుంది.
ఇక సోనూ నిగమ్ ఈ పాటకు తన స్వరాన్ని అందిచాడు. ఈయన హింది మరియు కన్నడ భాష చిత్రాలలో పాటలను పాడి ప్రసిద్ధి చెందారు. అలాగే తెలుగుతో సహా మిగతా చాలా భారతీయ భాషలలో పాటలను పాడారు. అలాగే ఈయన చాలా నాన్ ఫిల్మ్ ఆల్బమ్స్ లను విడుదల చేశారు మరియు కొన్ని హిందీ భాష చిత్రాలలో కూడా తన నటన కౌశల్యాన్ని నిరూపించాడు. జులై 30, 1973లో హర్యానాలో జన్మించిన సోన్ నిగమ్ తన నాలుగు సంవత్సరాల వయస్సున్నప్పటి నుండి పాటలు పాడడం ప్రారంభించారు. అలాగే ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది హర్షవర్ధన్ రామేశ్వర్. ఈయన తమిళునాడులోని చైన్నైలో జన్మించి, తెలుగులో తను అందించిన పాటలకు ప్రసిద్ది చెందారు. తెలుగుతో పాటుగా తమిళ మరియు కొన్ని హిందీ పాటలకు కూడా సంగీతాన్ని అందించారు. హర్షవర్ధన్ కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదూ, గేయరచయిత మరియు గాయకుడిగా తన సామార్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ యానిమల్ సినిమా ముఖ్య నేపధ్యం కొడుకుకు తన నాన్నపై ఉండే అపరిమితమైన ప్రేమ కారణంగా ఆ కొడుకు ఏఏ పనులు చేయవలసి వచ్చింది. ఈ పాటలో తండ్రిపై ఆ కొడుకుకి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడం జరిగింది. ‘నాన్న నువ్ నా ప్రాణం’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: నాన్న నువ్ నా ప్రాణం
- సినిమా: యానిమల్ (Animal)
- నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు త్రిప్తి దిమ్రీ
- సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
- సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
- గేయరచయిత: అనంత శ్రీరామ్
- గాయకుడు: సోనూ నిగమ్
- సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Nanna Nuv Naa Pranam Song Lyrics in Telugu
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకీ
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
ఏ కానుకలు నీ లాలనతో
సరితూగవు ఇది నిజమూ
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
Nanna Nuv Naa Pranam Lyrics in English
Naa Chandrudivi
Naa Devudivi Nuvve
Naa Kannulaki
Nuvvu Vennelavi
Naa Oopirivi Nuvve
Nuvve Kadha
Nuvve Kadha
Sitara Naa Kalaki
Nanna Nuvvu Naa Pranam Aninaa
Saripodhata Aa Maata
Nanna Neekai Praanam Ivvanaa
Idhigo Idhigo Naa Maata
Nijaannela Anedhelaa
Ivaala Nee Edhutaa
Ye Kaanukalu Nee Laalanatho
Sarithoogavu Idhi Nijamu
Nee Samayamukai Ee Jeevithame
Choosthunnadhi Pasithanamai
Jagaalane Jayinchinaa
Thalonchi Nee Venake
Nanna Nuvvu Naa Pranam Aninaa
Saripodhata Aa Maata
Nanna Neekai Praanam Ivanaa
Idhigo Idhigo Naa Maata
Nijaannela Anedhelaa
Ivaala Nee Edhutaa
నాన్న నువ్ నా ప్రాణం Video Song
ఇంతకు ముందే పైన చెప్పినట్టుగా నాన్నలపై పాటలు చాలానే తక్కువ ఉన్నాయి. దాని లోటుకు చాలా గట్టిగా ఫిల్ చేసే పాటలలో ఈ ‘నాన్న నువ్ నా ప్రాణం’ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ‘యానిమల్’ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు బల్బీర్ సింగ్. ఈ పాత్రను అనిల్ కపూర్ పోషించారు. ఈ సినిమాలో తండ్రిపై అమితమైన ప్రేమను పెంచుకున్నా రణ్ విజయ్ సింగ్ (రణ్ బీర్ కపూర్ పాత్ర పేరు) కు ఆ ప్రేమ చిన్నప్పటి నుండి దొరకదు. ఎందుకంటే బల్బీర్ సింగ్ ఒక పెద్ద పారీశ్రామికవేత్త అవ్వడంవల్ల ఎప్పుడో పొద్దున్నా ఆఫీస్ కు వెళ్ళీ, పిల్లలంతా పడుకున్న తర్వాత ఇంటికి చేరుతూ ఉంటాడు. రణ్ విజయ్ కు మాత్రం తన నాన్న దగ్గర సమయం గడపాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ నాన్నపై ప్రేమ ఆ చిన్నపిల్లవాడిలో రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఇలా చిన్నప్పుడు ఆ పిల్లవాడు తన నాన్నపై ప్రేమను చూపిస్తున్నప్పుడు బ్యాగ్రౌండ్ లో ఈ పాట ప్లే అవుతూ ఉంటుంది.
ఈ మధురమైన పాటను సోను నిగమ్ ఆలపించారు. అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ పాటకు ప్రాణం పోశారు. డేవి సురేష్ కుమార్ విజిల్, సందిల్య పిసపాటి సోలో వయోలిన్, అపర్ణ హరికుమార్, సుష్మితా నరసింహన్, అయిశ్వర్య కుమార్, అంజనా బాలకృష్ణన్ (స్త్రీల కోరస్), అభిజిత్ రావు, గోవింద్ ప్రసాద్, సుధర్శన్ హేమరాం, ఆకాశ్ వి హెచ్ (పురుషుల కోరస్) వారితో ఈ పాట మరింత అందంగా మారింది. హర్షవర్ధన్ రమేశ్వర్ ప్రోగ్రామింగ్ చేశారు. జగన్ మోహన్ కోరస్ మరియు ఆర్కెస్ట్రాను అమర్చారు. జయప్రకాష్ సహాయకుడిగా వ్యవహరించారు. ప్రమోద్ చందోర్కర్ మరియు కిట్టు మాయకల్ సౌండిడీజ్ స్టూడియోస్‌లో వోకల్స్ రికార్డ్ చేశారు. శాదాబ్ రయీన్ ముంబైలోని న్యూ ఎడ్జ్‌లో మిక్స్ మరియు మాస్టరింగ్ చేశారు. పుఖ్రాజ్, అనుప్ మరియు ఎహ్సాన్ అసిస్టెంట్ మిక్స్ ఇంజనీర్లుగా పనిచేశారు.
ఈ పాటకు సంబంధించిన వివరాలను చూస్తే ఎంతో మంది ప్రతిభావంతులు కలిసి ఈ అద్భుతమైన పాటను సృష్టించారని తెలుస్తుంది. సోను నిగమ్ వంటి ప్రముఖ గాయకుడు, అనంత శ్రీరామ్ వంటి ప్రతిభావంతులైన లిరిసిస్ట్, హర్షవర్ధన్ రమేశ్వర్ వంటి సంగీత దర్శకుడు మరియు ఇతర అనేక మంది కళాకారుల కృషితో ఈ పాట మన కళ్ళ ముందే మెదులుతుంది. ఈ పాటలో వినిపించే ప్రతి శబ్దం, ప్రతి నోట్, ప్రతి వాయిద్యం ఈ పాటను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. నాన్నపై వచ్చిన పాటలలో ఈ పాట సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. పాటలో వాడిని సాహిత్యం, సంగీతం, ఆయా పాత్రల నటల ఇలా అన్ని కలగలిపిన ఈ ‘నాన్న నువ్ నా ప్రాణం’ పాట నాన్నంటే ఇష్టమైన ప్రతీ ఒక్కరికి నచ్చేలా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా సినిమాలో పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ కు ఎంత ప్రత్యేక స్థానం కల్పిస్తారో ఇప్పటి వరకు ఆయన తీసిన మూడు సినిమాలే నిదర్శనం. ఏది ఏమైన నాన్నపై ఇంతటి మంచి పాటను అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.