Nachavule Nachavule Song Lyrics – Virupaksha (2023) | Karthik

నచ్చావులే నచ్చావులే పాట యొక్క లిరిక్స్‌ను (Nachavule Nachavule Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2023లో విడుదలైన విరూపాక్ష (Virupaksha) అనే తెలుగు సినిమాలోని పాట. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త, రవికృష్ణ, సోనియా సింగ్, అజయ్, బ్రహ్మాజీ, సాయిచంద్, సునీల్, రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థల ద్వారా బి. వి. ఎస్. ఎన్. ప్రసాద్ మరియు సుకుమార్ కలిసి నిర్మించారు. అదేవిధంగా, ఈ సినిమాకి సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, రుద్రవనం అనే గ్రామంలో చేతబడి చేసి చిన్న పిల్లల మరణాలకు కారణమవుతున్నారు అనే అనుమానంతో ఆ ఊరి గ్రామస్తులు ఆ గ్రామంలోని ఒక జంటను సజీవ దహనం చేస్తారు. మంటల్లో కాలిపోతూ ఆ జంట, పుష్కర కాలం తర్వాత ఈ గ్రామం వల్లకాడుగా మారిపోతుందని శపిస్తారు. సరిగ్గా పన్నెండు సంవత్సరాల తర్వాత, గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తాయి. దాంతో, గ్రామ పెద్దలు గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయిస్తారు, అంటే కొన్ని రోజులు ఎవరూ ఆ ఊరి పొలిమేర బయటకు వెళ్లకుండా, కొత్తవారు లోపలికి రాకుండా ఉంటారు. అయితే, ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా, మరణాలు ఆగవు. తన తల్లితో బంధువుల ఇంటికి వచ్చిన సూర్య (సాయి ధరమ్ తేజ్), వెళ్లిపోవడానికి అవకాశమున్నా, తను ప్రేమించిన నందిని (సంయుక్త) ప్రాణాలను కాపాడే కృతనిశ్చయంతో తిరిగి గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఆ మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి సూర్య విశ్వ ప్రయత్నాలు చేస్తు ఉంటాడు.

ఇలా చాలా ఉత్కంఠంగా సాగుతూ ఉంటుంది ఈ సినిమా కథ. మనం ఇంతకు ముందు చాలానే హర్రర్ సినిమాలను చూసి ఉంటాము. కానీ ఈ విరూపాక్ష చిత్రం మాత్రం వాటికి భిన్నంగా, ఆసక్తి రేపే స్క్రీన్ ప్లేతో ఉండడం చేత థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇది మన మనస్సులో బలంగా నాటుకుపోతుంది. కొన్ని సినిమాల క్లైమాక్స్ ను మనం కొంచెం ఊహించవచ్చు. మొత్తం కాకపోయిన కొద్దిగా ఏమి జరిగి ఉండవచ్చో తెలిసిపోతూ ఉంటుంది. కానీ నేను వంద శాతం బల్ల గుద్ది చెబుతున్న, ఈ విరూపాక్ష సినిమా చూసిన అందరికి ఈ క్లైమాక్స్ అస్సలు ఇలా ఉంటుందని ఊహించి ఉండరు. ఎందుకంటె మేన్ విలన్ వీళ్ళు అయి ఉండవచ్చు అనుకునే లోపల ఇంకొరి మీద అనుమానం కలుగుతుంది. ఇలా నలుగురు ఐదుగురు మేన్ విలన్ అనుకునే విధంగా కథను రాసుకున్న విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఇక ఇందులోని పాటల విషయానికి వస్తే, అబ్బా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆల్బమ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాలోని అన్ని పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించింది కన్నడ చిత్రసీమకు చెందిన బి.అజనీష్ లోక్‍నాధ్. ఇందులోని మొత్తం మూడు పాటలు కూడా వినడానికి చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ ‘నచ్చావులే నచ్చావులే’ పాటైతే కుర్రకారుకు మంచిగా ఎక్కేసింది. దీనిని రాసింది కృష్ణ కాంత్ మరియు పాడింది కార్తిక్. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “నచ్చావులే నచ్చావులే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: నచ్చావులే నచ్చావులే (Nachavule Nachavule)
  • సినిమా: Virupaksha (విరూపాక్ష)
  • నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్
  • సినిమా దర్శకుడు: కార్తిక్ దండు
  • సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోకనాథ్
  • పాట రచయిత: కృష్ణ కాంత్
  • గాయకుడు: కార్తిక్
  • సినిమా విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023
  • లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్

Nachavule Nachavule Song Lyrics in Telugu

నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటె వేషాలే చూసాకే

తడబడని తీరు నీదే
తెగబడుతు దూకుతావే
ఎదురుపడి కూడా
ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా
అనుకుందే నువు చేస్తావే

ఏ నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే

అప్పుడే తెలుసనుకుంటే
అంతలో అర్థం కావే
పొగరుకే అణుకువే అద్దినావే
పద్దతే పరికిణీలోనే
ఉన్నదా అన్నట్టుందే
అమ్మడూ నమ్మితే తప్పు నాదే
నన్నింతలా ఏమార్చిన
ఆ మాయ నీదే

నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే

పైకలా కనిపిస్తావే
మాటతో మరిపిస్తావే
మనసుకే ముసుగునే వేసినావే
కష్టమే దాటేస్తావే
ఇష్టమే దాచేస్తావే
లోపలో లోకమే ఉంది లేవే
నాకందులో ఏ మూలనో
చోటివ్వు చాలే

తడబడని తీరు నీదే
తెగబడుతు దూకుతావే
ఎదురుపడి కూడా
ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా
అనుకుందే నువ్ చేస్తావే

నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటె వేషాలే చూసాకే

Nachavule Nachavule Lyrics in English

Nachavule Nachavule
Ye Roju Chushaano Aa Roje
Nachavule Nachavule
Nee Konte Veshaale Choosaake

Thadabadani Theeru Needhe
Thegabaduthu Dhookuthaave
Yedurupadi Kooda
Yevarolaa Nanu Choosthaave
Beduru Mari Ledhaa
Anukundhe Nuv Chesthaave

Hey, Nachavule Nachavule
Ye Roju Chushaano Aa Roje

Appude Thelusanukunte
Anthalo Ardham Kaave
Pogaruke Anukuve Addhinaave
Paddhathe Parikinilone
Unnadaa Annattundhe
Ammadu Nammithe
Thappu Naadhe
Nanninthalaa Yemaarchina
Aa Maaya Needhe

Nachavule Nachavule
Ye Roju Chushaano Aa Roje

Paikalaa Kanipistaave
Maatatho Maripisthaave
Manasuke Musugune Vesinaave
Kashtame Daatesthaave
Ishtame Daachesthaave
Lopalo Lokame Undi Leve
Naakandhulo Ye Moolano
Chotivvu Chaale

Thadabadani Theeru Needhe
Thegabaduthu Dhookuthaave
Yedurupadi Kooda
Yevarolaa Nanu Choosthaave
Beduru Mari Ledhaa
Anukundhe Nuv Chesthaave

Nachavule Nachavule
Ye Roju Chushaano Aa Roje
Nachavule Nachavule
Nee Konte Veshaale Choosaake

నచ్చావులే నచ్చావులే Video Song


ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, సూర్య తన తల్లి, స్నేహితుడితో కలిసి రుద్రవనం అనే గ్రామానికి వస్తాడు. గ్రామంలో ఉన్నంత కాలం, సూర్య తన బంధువులతో గడుపుతూ ఉంటాడు. ఒక రాత్రి, సూర్య ఓ అనుకోని సంఘటనలో సర్పంచ్ గారి కూతురైన నందినిని (సంయుక్త) మొదటిసారి చూస్తాడు. ఆమె ఆ ఊరిలో కోళ్ళను దొంగతనం చేస్తు ఉంటుంది. ఒకరోజు ఆమె కోడి దొంగతనం చేస్తున్నప్పుడు, ఆ ఊరివాళ్ళు ఆమెను వెంబడిస్తున్న సమయంలో, సూర్య నందినిని పట్టుకుంటాడు. ఆమె అందం, నవ్వు, కళ్లలోని అమాయకత్వం చూడగానే, సూర్య నందినిని చూడగానే ప్రేమలో పడతాడు. ఇది అతని తొలి చూపులో ప్రేమ. ఆ తర్వాత ఆమె ఆ ఊరి సర్పంస్ కూతురు అని తెలుసుకున్న సూర్య నందిని పట్ల పరోక్షంగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు, అయితే ఆమె మాత్రం అతన్ని పట్టించుకోకుండా ఉంటుంది. ఇలా వీరి ప్రేమ కొనసాగుతుండగా ఈ పాట మొదలవుతుంది.

ఈ పాటలో రుద్రవనం అనే పల్లెను చూపించిన విధానం చాలా బాగుంటుంది. కేవలం పట్టణాలు నగరాల్లో పెరిగే పిల్లలకు ఈ పాటలోని పల్లెటూరి అందాలు కొత్త అనుభూతిని మరియు పల్లెల అందాలు వారికి తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. పల్లె అందాలతో పాటు హీరోయిన్ సంయుక్త గారు కూడా చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా అమె కళ్ళలో ఏదో ఆకర్షణ ఉంటుంది. ఆమెను చూస్తూ వన్‍సైడ్ లవ్ చేసే మన సాయిధరమ్ తేజ్ గారి ఎక్స్‍ప్రెషన్స్ కూడా చూడముచ్చటగా ఉంటాయి. అలాగే కార్తిక్ గారు ఈ పాటను తన మధురమైన స్వరంతో ఆలపించిన విధానం కూడా ఈ పాటకు ప్రత్యేకతను కలిగించింది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. కావున ఒకసారి చూడండి, ఖచ్చితంగా ఇది మీ హిట్ సాంగ్స్ ప్లే లీస్ట్ చోటు సంపాదించుకుంటుంది.

1 thought on “Nachavule Nachavule Song Lyrics – Virupaksha (2023) | Karthik”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top