Naa Favourite Naa Pellam Song Lyrics from Janaka Ayithe Ganaka (2024)

నా ఫేవరెట్ నా పెళ్ళామ్ పాట యొక్క లిరిక్స్‌ను (Naa Favourite Naa Pellam Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన జనక అయితే గనక (Janaka Ayithe Ganaka) అనే తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రంలోని పాట. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల రచన మరియు దర్శకత్వం వహించగా, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో హర్షిత్ రెడ్డి మరియు హంషిత రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో సుహాస్ ప్రధాన పాత్రలో నటించగా, సంగీర్తన విపిన్, వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ మరియు గోపరాజు రమణ వంటి ప్రముఖ నటులు ఉన్నారు.

ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, ప్రసాద్ (సుహాస్) అనే యువకుడు తన తండ్రి (గోపరాజు రమణ) తీసుకున్న నిర్ణయాల వల్ల తన జీవితం ఇలా మిడిల్ క్లాస్ లో కొనసాగుతుందని భావించి ఆయనపై ఎల్లప్పుడూ కోపంతో ఉంటాడు. అయినప్పటికీ, తన భార్యతో (సంగీర్తన విపిన్) మాత్రం సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. పెళ్లి తర్వాత కొంతకాలం వరకు పిల్లలు లేకపోవడం గురించి ప్రత్యేకంగా ఆలోచించని ప్రసాద్, తన తల్లిదండ్రులు, బంధువులు అడిగినప్పుడు, తన భార్యకు మరియు పిల్లలకు సరైన విద్య, వైద్యం ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లలను కనడం సరికాదని భావిస్తూ ఉంటాడు. ఆయన భార్య కూడా ఈ ఆలోచనను సమర్థిస్తుంది. కానీ, ఒక రోజు సంగీత గర్భవతి అయినట్లు తెలిసి ప్రసాద్‌కు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తాను వాడే కండోమ్‌ల నాణ్యత లోపించడం వల్లే ఇలా జరిగిందని భావించి ఆ కండోమ్ కంపెనీపై కోర్టులో కేసు వేసి గెలుస్తాడు కూడా.

తన ప్రయాణాన్ని యూట్యూబ్ షార్ట్ ఫిలీమ్స్ నుంచి ప్రారంభించిన సుహాస్, తనకు వచ్చిన చిన్న చిన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తు తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తు, ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో 2020లో ‘కలర్ ఫోటో’ సినిమాలో మేన్ లీడ్‍గా నటించే అవకాశం వచ్చింది. ఇక అంతే తన ఈ మొదటి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నారు. ఈ కలర్ ఫోటో సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలా అప్పటి నుంటి ఇప్పటి వరకు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన ప్రత్యేకతను నిరూపించుకుంటూనే ఉన్నాడు.

ఇక ఈ ‘జనక అయితే గనక’ సినిమాలో కూడా తన సహజమైన నటనతో మిడిల్ క్లాస్ పర్సన్‍గా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాలో ఐదు పాటలు ఉండగా, వాటిలో ఈ ‘నా ఫేవరెట్ నా పెళ్ళామ్’ పాటైతే సోషియల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యింది. ‘బేబి’ సినిమాలోని పాటలు అన్ని ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే కదా. ఆ పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడే ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించారు. ఆయనే విజయ్ బుల్గానిన్. ఇతను ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలకు పనిచేశారు కాని అతని కొన్ని పాటలు మాత్రం అలా చాలా కాలం పాటు ఎవర్గీన్ గా నిలిచిపోతాయి. అలాగే ఈ పాటను కృష్ణకాంత్ రాస్తే, ఆదిత్య ఆర్కే పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “నా ఫేవరెట్ నా పెళ్ళామ్” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: నా ఫేవరెట్ నా పెళ్ళామ్ (Naa Favourite Naa Pellam)
  • సినిమా: జనక అయితే గనక (Janaka Ayithe Ganaka)
  • నటీనటులు: సుహాస్, సంగీర్తన విపిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను తదితరులు
  • సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి బండ్ల
  • సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
  • గేయరచయిత: కృష్ణకాంత్
  • గాయకుడు: ఆదిత్య ఆర్కే
  • సినిమా విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024
  • లేబుల్: టీ-సిరీస్ తెలుగు

Naa Favourite Naa Pellam Song Lyrics in Telugu

నేనేది అన్న బాగుంది కన్నా
అంటూనే ముద్దాడుతావే
నీవే నా పక్కనుంటే చాలే

కష్టాలు ఉన్న కాసేపు అయినా
రాజాలా పోజు కొడతానే
నీవే నా పక్కనుంటే చాలే

కలతలు కనబడవే
నువ్వు ఎదురుగా నిలబడితే
గొడవలు జరగవులే
ఒడిదుడుకులు కలగవులే
అర క్షణమైన అసలెప్పుడైనా
కోపం నీలోనా
ఎప్పుడైనా చూశానా

పుణ్యమేదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
ఓ.. ఆ..

హే ఉదయం నే లేచే ఉన్న వేచుంటానే
నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే

హే నీతో తాగేస్తూ వుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కాదా మాఫీ

మన గదులివి ఇరుకులు కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు గానీ
ఏ గొలుసులు లేవే

నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాట
గుండె కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట
ఆ.. ఓ..

పుణ్యమేదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
ఓ.. ఆ..

Naa Favourite Naa Pellam Lyrics in English

Nenedi Annaa Baagundhi Kannaa
Antoone Mudhaadu Thaave
Neeve, Naa Pakkanunte Chaale
Kashtaalu Unnaa Kaasepu Ayinaa
Raajaala Foju Kodathaane
Neeve, Naa Pakkanunte Chaale

Kalathalu Kanabadave
Nuvvu Edhuruga Nilabadithe
Godavalu Jaragavule
Odidhudukulu Kalagavule

Ara Kshanam Ayina
Asaleppudaiyna Kopam Neelona
Eppudaina Choosaana

Punyam Edho Chesi Vuntaane
Nedu Nenu Neenu Pondhyaane
Enni Janmalayina Antaane
Naa Favourite Naa Pellaame
Naadu Bramha Kori Raasaade
Neeku Naaku Mudivesaade
Enni Janmalaina Antaanne
Naa Favourite Naa Pellaame
Oh.. Aa..

Hey Udhayam Ne Leche
Unna Vechuntaane
Nuvve Doddhicche Daaka
Mancham Dhikane

Hey Neetho Taagesthu Unte
Cup-u Coffee
Konchem Bore Antoo Unnaa
Kaadhaa Maafi
Mana Gadhulivi Irukuvi Kaani
Mana Manasulu Kaave
Yegaradame Teliyadhu Gaani
Ye Golisulu Leve

Nuvvu Anna Prathi Oka Maata
Sa Ri Ga Ma Pa Dha Ni Sa Paata
Gunde Kooda Chindhulese Nanta
Choode Ee Poota
Aa.. Oh..

Punyam Edho Chesi Vuntaane
Nedu Nenu Neenu Ponthaane
Enni Janmalaina Antaane
Naa Favourite Naa Pellaame
Naadu Bramha Kori Raasaade
Neeku Naaku Mudivesaade
Enni Janmalaina Antaanne
Naa Favourite Naa Pellaame

నా ఫేవరెట్ నా పెళ్ళామ్ Video Song


నేను కాసేపు కళ్ళు మూసుకుని భార్యలను ఇంతలా కాకపోయిన కొద్దిగా పొగుడుతూ సాగే పాటలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచిస్తే నాకు ఒక్కటి కూడా గుర్తుకు రావడం లేదు. అదేంటి అస్సలు భార్యలను పొగుడుతూ సాగే పాటలు అస్సలు లేవా అంటే, ఉండచ్చేమో కాని నేను విన్నట్టు అస్సలు గుర్తే లేదు. ఈ ఇన్‍స్టాగ్రామ్, యూట్యూబ్ లలో భార్యభర్తలకు సంబంధించి మీమ్స్, కామీడి వీడియోలు కుప్పలు తిప్పలుగా కనబడతాయి. కానీ ఒక్కటైన వారిని పొగడుతూ పాట కనబడదు. అదే ప్రేమికుల పాటలైతే అమ్మో అతి పెద్ద పాటల జాబితానే ఉంటుంది. అంతెందుకు మన సినిమా వాళ్ళు అస్సలు పట్టించుకోని నాన్నలపై కూడా కొద్దో గొప్పో పాటలు ఈ మధ్య వింటున్నాం. కానీ వేర్ ఈజ్ వైఫ్ సాంగ్స్.

ఏ జీతం, గౌరవం ఆశించకుండా ఇంట్లో గొడ్డు చాకిరి చేసే భార్యలకు భర్తలు ప్రేమగా డెడికేట్ చేయడానికి మంచి వైఫ్ సాంగ్ లేకుండా పోయింది ఇన్ని రోజులు. ఈ వెలితిని పోగొట్టేలా ‘జనక అయితే గనక’ సినిమాలో ‘నా ఫేవరెట్ నా పెళ్లామ్’ అనే పాట ఉంది. భార్యను భర్త ఇంతలా పొగుడుతూ, మెచ్చుకుంటూ, ప్రేమిస్తూ ఎన్ని జన్మలైనను తనకు తన భార్యనే ఫేవరెట్ అంటూ పాడుతుంటే వావ్ అనిపిస్తుంటది. దానికి తోడు సంగీతం, సాహిత్యం, గానం, సుహాస్ అభినయం ఇలా ఇవన్ని చేరి ఈ పాటను ఇంత గొప్పగా ఉండేలా చేశాయి. ఇంకెందుకు లేట్ మీకు పెళ్ళై ఉంటే, మీ సతీమణికి ఈ పాటను అంకితం చేసి వాళ్ళ ముఖంపై చిరునవ్వు తెప్పించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top