Na Roja Nuvve Lyrics – Kushi (2023) | Hesham Abdul Wahab

నా రోజా నువ్వే పాట యొక్క లిరిక్స్‌ను (Na Roja Nuvve Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఇది 2023లో విడుదలైన ఖుషి (Kushi) అనే తెలుగు సినిమాలోని పాట. ఈ చిత్రం ఏప్రిల్ 2022లో ప్రకటించబడింది, విజయ్ దేవరకొండ 11వ ప్రధాన పాత్రలో నటిస్తున్నందున దానిని తాత్కాలికంగా VD11 గా పిలిచారు; అయితే, మేలో అధికారికంగా ఈ చిత్రానికి “ఖుషి” అనే పేరు ప్రకటించారు. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఏప్రిల్ 2022లో కాశ్మీర్‌లో ప్రారంభమై, 2023 జూలైలో పూర్తయింది. ఇది బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. తెలుగు సినిమాగా విడుదలైన “ఖుషి,” తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ వర్షన్లతో ఒకేసారి థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం మొదట 2022 డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, నిర్మాణంలో జాప్యం కారణంగా 2023 ఫిబ్రవరి, తరువాత 2023 సెప్టెంబర్ 1కి వాయిదా పడింది. థియేటర్ రన్ తర్వాత, ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ ₹30 కోట్లకు కొనుగోలు చేసి, 2023 అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించింది శివ నిర్వాణ. ఇతను తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. విజయనగరం జిల్లా, విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం గ్రామంలో జన్మించిన శివ నిర్వాణ తన మొదటి దశలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. చిత్రసీమలోకి అడుగుపెట్టే ముందు పాఠశాల బయాలజీ అధ్యాపకుడిగా పనిచేశాడు. సినిమాల మీదున్న ఆసక్తితో స్క్రిప్ట్ రైటింగ్, దర్శకత్వంపై పట్టు సాధించి, రాంగోపాల్ వర్మ మరియు పరుశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం ప్రారంభించాడు. శివ నిర్వాణ 2017లో నాని, నివేథా థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన “నిన్ను కోరి” సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం విజయవంతం కావడంతో తెలుగు సినిమా రంగంలో అతనికి మంచి గుర్తింపు దక్కింది. తన తదుపరి చిత్రాలు “మజిలీ (2019),” “టక్ జగదీష్ (2021)” వంటి సినిమాలు కూడా శివ నిర్వాణను అత్యుత్తమ దర్శకుడిగా నిలబెట్టాయి. శివ నిర్వాణాకి సంబంధించిన సినిమాల్లో ప్రేమ, కుటుంబ విలువలు, సంబంధాల మధ్య భావోద్వేగాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. అతని చిత్రాలలోని పాటలు, కథనాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా రూపొందిస్తాడు.

ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, విప్లవ్ (విజయ్ దేవరకొండ) ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తితో బి.ఎస్.ఎన్.ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO)గా చేరతాడు. అతను కశ్మీర్‌లో పోస్టింగ్ కోరుకుంటాడు, ఎందుకంటే అక్కడ ప్రశాంతమైన ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటాడు. కశ్మీర్‌లో పనిచేస్తున్న సమయంలో ఆరా బేగం (సమంత)ను చూసి ఆమెపై ప్రేమలో పడతాడు. ఆరా చిన్నప్పుడు తప్పిపోయిన తన తమ్ముడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ నుండి వచ్చిందని చెబుతుంది. అయినప్పటికీ, విప్లవ్ ఆమెను ప్రేమించి, ఆమె కోసం పాకిస్థాన్ వెళ్లడానికి కూడా సిద్ధమవుతాడు. విప్లవ్ ప్రేమలో నిజాయితీ చూసిన ఆరా కూడా అతని ప్రేమకు ఆకర్షితురాలవుతుంది. కానీ, వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరు. ఇలా సాగుతూ ఉంటుంది ఈ సినిమా కథ.

హెషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు, ఇది ఆయన సంగీతం అందించిన మొదటి తెలుగు చిత్రం. ఈ సినిమా నుండి విడుదలైన పాటల్లో మొదటి సింగిల్ “నా రోజా నువ్వే” 2023 మే 9న విడుదల చేశారు. దీనికి సంగీతంతో పాటు హేషమ్ అబ్దుల్ వాహాబ్ తన స్వరాన్ని కూడా అందించారు. ఈ పాట విడుదలై సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ పాటకు సాహిత్యాన్ని ఈ సినిమా దర్శకుడైన శివ నిర్వాణ అందించారు. ఆయన ఇంతకు ముందు తన సినిమాలలోని కొన్ని పాటలను కూడా రాశారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “నా రోజా నువ్వే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: నా రోజా నువ్వే (Na Roja Nuvve)
  • సినిమా: Kushi (ఖుషి)
  • నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత
  • సినిమా దర్శకుడు: శివ నిర్వాణ
  • సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వాహాబ్
  • గేయరచయిత: శివ నిర్వాణ
  • గాయకుడు: హేషమ్ అబ్దుల్ వాహాబ్
  • సినిమా విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023
  • లేబుల్: సరిగమ తెలుగు

Na Roja Nuvve Song Lyrics in Telugu

తననననా తననననా
ఆరా సే ప్యారు, అందం తన ఊరు
సారె హుషారు, బేగం బేజారు
ఆరా సే ప్యారు, అందం తన ఊరు
దిల్ మాంగే మోరు, ఈ ప్రేమే వేరు

నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తాననననా

నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తా నా నా

నా కడలి కెరటంలో
ఓ మౌనరాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే

నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
నో అంటే నో అంటా
ఓకే బంగారం ఊ ఊ

నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తాననననా

నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే
తా నా నా నన నా న

నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండెసడి లయలో
నే మారన నీ ప్రతిధ్వనిలా

నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై
నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాకా తోడుంటా
ఓకే నా బేగం

ఆరా సే ప్యారు, అందం తన ఊరు
సారె హుషారు, బేగం బేజారు

నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తాననననా

నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తా నా నా

Na Roja Nuvve Lyrics in English

Tha na na na naa
Tha na na na naa
Aaraa Se Pyaaru
Andam Thana Ooru
Saare Hushaaru
Begum Bejaaru
Aaraa Se Pyaaru
Andam Thana Ooru
Dil Mange Moru
Ee Preme Veru

Na Roja Nuvve, Tha na na na naa
Naa Dil Se Nuvve, Tha na na na naa
Naa Anjali Nuvve, Tha na na na naa
Geetanjali Nuvve, Thaa na na na naa

Na Roja Nuvve, Tha na na na naa
Naa Dil Se Nuvve, Tha na na na naa
Naa Anjali Nuvve, Tha na na na naa
Geetanjali Nuvve, Thaa naa naa

Naa Kadali Keratamlo
Oo Mounaraagam Nuvvele
Nee Amruthapu Jadilo
Oo Gharshane Modhayayyindhe

Naa Sakhivi Nuvvele
Nee Dhalapathini Nenele
Naa Cheliya Nuvvele
Nee Naayakudu Nene

Nuvvu Yes Ante Yes Anta
No Ante No Antaa
Ok Bangaram

Na Roja Nuvve, Tha na na na naa
Naa Dil Se Nuvve, Tha na na na naa
Naa Anjali Nuvve, Tha na na na naa
Geetanjali Nuvve, Thaa na na na naa

Na Roja Nuvve, Tha na na na naa
Naa Dil Se Nuvve, Tha na na na naa
Naa Anjali Nuvve, Tha na na na naa
Geetanjali Nuvve
Thaa naa naa na na naa na

Naa Prema Pallavilo
Nuv Cherave AnuPallavigaa
Nee Gunde Sadi Layalo
Ne Maarana Nee Prathidhwanilaa

Nee Kanula Kalayikalo
Kannaanu Enno Kalalenno
Nee Adugulaku Adugai
Untaanu Nee Needai
Nuvvu Uu Ante Nenuntaa
Kadadhaaka Thoduntaa
Ok Naa Begum.. Mm Mm

Aaraa Se Pyaaru
Andam Thana Ooru
Saare Hushaaru
Begum Bejaaru

Na Roja Nuvve, Tha na na na naa
Naa Dil Se Nuvve, Tha na na na naa
Naa Anjali Nuvve, Tha na na na naa
Geetanjali Nuvve, Thaa na na na naa

Na Roja Nuvve, Tha na na na naa
Naa Dil Se Nuvve, Tha na na na naa
Naa Anjali Nuvve, Tha na na na naa
Geetanjali Nuvve, Thaa naa naa

నా రోజా నువ్వే Video Song

Na Roja Nuvve | Kushi | Vijay Deverakonda | Samantha Ruth Prabhu | Hesham Abdul Wahab | Lyrical

ఈ పాటలో విజయ్ దేవరకొండ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అతను ఆరా అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కాని ఆమె పాకిస్తాన్ కు చెందిన అమ్మాయి అని తెలిసిన కూడా ఏమాత్రం సందేహం లేకుండా ఆ అమ్మాయినే ఇష్టపడడం బట్టి అతనికి ఆరా అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఆరా గా నటించిన సమంత కూడా తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటకు అందాన్ని తెచ్చారు. ఈ పాటలో కాశ్మీర్ అందాలను కూడా లైట్ గా చూపించే ప్రయత్నం చేశారు. పాట మొత్తం మీద డ్యాన్స్ మూవ్స్ లేకుండా కేవలం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మరియు కొన్ని సీన్లతోనే నడుస్తుంది. ఈ సినిమా దర్శకుడైన శివ నిర్వాణ రాసిన ఈ పాటలో ఒక ప్రేమికుడు తన ప్రేయసి గురించి గొప్పగా తన మనసులోని భావాలను చెబుతున్నట్టు ఉంటాది. అలాగే దీనికి తోడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంతో పాటు తన మధుర స్వరంతో ఈ పాటను పాడారు. ఇది అతనికి మొదటి సినిమా కావడం వల్ల తన టాలెంట్ ఏంటో ఈ ఒక్క సినిమా ద్వారా, ముఖ్యంగా ఈ పాట ద్వారా నిరూపించుకున్నట్టయింది.

Report a Lyrics Mistake / Share Your Thoughts