‘మధురము కదా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Madhuramu Kadha Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 2024లో విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) అనే తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రంలోనిది. పరశురామ్ రచన మరియు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. పరశురామ్‌కి ఇది “సర్కారు వారి పాట” (2022) తర్వాతి సినిమా కాగా, విజయ్ దేవరకొండకు “ఖుషి” (2023) తర్వాతి చిత్రం. అలాగే ఇది గీత గోవిందం (2018) లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కలయికలో వస్తున్న రెండవ చిత్రం. ఈ కారణంగా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
“ఫ్యామిలీ స్టార్” సినిమా 2023 ఫిబ్రవరిలో “VD11” అనే తాత్కాలిక పేరు తో ప్రకటించబడింది, ఎందుకంటే ఇది విజయ్ హీరోగా నటించిన 11వ చిత్రం. 2023 జూలైలో షూటింగ్ ప్రారంభమై, హైదరాబాద్ మరియు న్యూయార్క్ లాంటి ప్రదేశాల్లో విభాగాలుగా పూర్తయింది. సంక్రాంతి విడుదలకు ముందుగా ప్లాన్ చేసినప్పటికీ, ఇతర సంక్రాంతి చిత్రాలతో పోటీని నివారించడానికి వాయిదా పడి చివరకు 5 ఏప్రిల్ 2024న థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదల తర్వాత విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను అందుకుంది, వారు పరశురామ్ రచన మరియు దర్శకత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 50కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ఊహించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు, కేవలం సుమారు ₹19.78–23.20 కోట్లు మాత్రమే వసూలు చేసి పరాజయం పొందింది. 2024 ఏప్రిల్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
చాలామంది అభిప్రాయం ప్రకారం, ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ విషయానికి వస్తే కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కొందరు కావాలనే విజయ్ దేవరకొండ సినిమాలకు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అది కొంత వరకు నిజమే అనిపించినా, ఈ సినిమా నాకు కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు. కారణాలు అనేకం ఉన్నాయి, వాటిలో కొన్ని రివ్యూవర్లు కూడా ఇప్పటికే పేర్కొన్నారు. ఇక పాటల విషయానికి వస్తే, సినిమా కన్నా పాటలు చాలా బాగున్నాయి. పాటలపై చూపించిన శ్రద్ధను కథ కథనంపై కూడా పెట్టి ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేది. ముఖ్యంగా ‘మధురము కదా’ పాటకు గోపీ సుందర్ అందించిన సంగీతం, శ్రీమణి రాసిన సాహిత్యం, శ్రేయ ఘోషాల్ పాడిన స్వరం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “మధురము కదా” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: మధురము కదా (Madhuramu Kadha)
- సినిమా: The Family Star (ది ఫ్యామిలీ స్టార్)
- నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
- సినిమా దర్శకుడు: పరశురామ్
- సంగీత దర్శకుడు: గోపీ సుందర్
- గేయరచయిత: శ్రీమణి
- గాయని: శ్రేయ ఘోషాల్
- సినిమా విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2024
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Madhuramu Kadha Song Lyrics in Telugu
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి
వింతలు ఏడు పక్కకు జరిపి
కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం
అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం
మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా
ఉసురేమో నాదైనా నడిపేదే నీవుగా
కసురైన విసురైన విసుగైన రాదుగా
పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి
వింతలు ఏడు పక్కకు జరిపి
కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం
అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం
ఏదో సంగీతమె
హృదయమున ఎంతో సంతోషమే
క్షణములో గాల్లో తేలిన భ్రమే
తిరిగి నవ్వింది ప్రాయమే
ఏదో సవ్వడి విని
టక్కుమని తిరిగాలే నువ్వని
మెరుపులా నువ్వొస్తున్నావని
ఉరుకులో జారె ప్రాణమే
నీపేరే పలికినదో ఏ మగువైన, తగువేనా
నా గాలే తాకినదో చిరుగాలైన, చంపెయ్ నా
హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెనా
వెన్నెలను నిన్ను వదలమని వైరం
ప్రతి నిమిషమునా
హక్కులివి నాకు మాత్రమవి సొంతం
ఇలా నీపైనా
మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా
పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి
వింతలు ఏడు పక్కకు జరిపి
కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం
అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం
Madhuramu Kadha Lyrics in English
Tholakari Jallula Megham’malle
Alajadi Hrudayam Aadina Kuchipudi
Rangulu Dhiddina Bommakumalle
Kavithalu Addhina Pusthakamalle
Santoshamlo Muddhuga Ee Ammaadi
Araaru Ruthuvula Andham
Okatiga Kalipi
Vinthalu Yedu Pakkaku Jaripi
Kothaga Punthalu Thokkenu
Ee Aravindham
Ammammo Thaandavamaade
Krishnudi Nundi
VenuvuGaanam Thiyyaga Pande
Radhaku Praanam
Upponge Aanandham
Madhuramu Kadha Prathoka Nadaka
Neetho Kalisi ilaa
Tharagani Kadha Manadhe Kanuka
Manasu Murisenilaa
Usuremo Naadhainaa
Nadipedhe Neevugaa
Kasurainaa Visurainaa
Visugainaa Raadhugaa
Pincham Vippina Nemalikimalle
Tholakari Jallula Megham’malle
Alajadi Hrudayam Aadina Kuchipudi
Rangulu Dhiddina Bommakumalle
Kavithalu Addhina Pusthakamalle
Santoshamlo Muddhuga Ee Ammaadi
Araaru Ruthuvula Andham
Okatiga Kalipi
Vinthalu Yedu Pakkaku Jaripi
Kothaga Punthalu Thokkenu
Ee Aravindham
Ammammo Thaandavamaade
Krishnudi Nundi
VenuvuGaanam Thiyyaga Pande
Radhaku Praanam
Upponge Aanandham
Edho Sangeethame
Hrudhayamuna Entho Santoshame
Kshanamulo Gaallo Telina Bhrame
Thirigi Navvindhi Praayame
Edho Savvadi Vini
Takkumani Thirigaale Nuvvani
Merupulaa Nuvvosthunnaavani
Urukulo Jaare Praaname
Neepere Palikinadho
Ye Maguvainn, Thaguvenaa
Naa Gaale Thaakinadho
Chirugaalaina, Champeynaa
Hechhakrika Chesina
Neeku Needayyenaa
Vennelanu Ninnu Vadhalamani Vairam
Prathi Nimishamunaa
Hakkulivi Naaku Maathramani Sontham
Ilaa Neepainaa
Madhuramu Kadha Prathoka Nadaka
Neetho Kalisi ilaa
Tharagani Kadha Manadhe Kanuka
Manasu Murisenilaa
Pincham Vippina Nemalikimalle
Tholakari Jallula Megham’malle
Alajadi Hrudayam Aadina Kuchipudi
Rangulu Dhiddina Bommakumalle
Kavithalu Addhina Pusthakamalle
Santoshamlo Muddhuga Ee Ammaadi
Araaru Ruthuvula Andham
Okatiga Kalipi
Vinthalu Yedu Pakkaku Jaripi
Kothaga Punthalu Thokkenu
Ee Aravindham
Ammammo Thaandavamaade
Krishnudi Nundi
VenuvuGaanam Thiyyaga Pande
Radhaku Praanam
Upponge Aanandham
మధురము కదా Video Song
పాట వచ్చే సందర్భం:
ఈ పాటలో గోవర్ధన్ (విజయ్ దేవరకొండ)పై ఉన్న ప్రేమను ఇందు (మృణాల్ ఠాకూర్) వ్యక్తం చేస్తుంది. గోవర్ధన్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు, అతనిది ఒక పెద్ద కుటుంబం. ఇది ఇలా ఉండగా, గోవర్ధన్ కు ఇంటిపై ఉన్న రూమ్ లో అద్దెకు ఉన్న అందమైన అమ్మాయి ఇందు. ఈమె గోవర్ధన్ మరియు అతని కుటుంబంతో పరిచయం పెంచుకుని, వారి జీవనశైలి గురించి వివరాలు సేకరించి, ఒక పుస్తకం రాయాలనే ఉద్దేశ్యంలో ఉంటుంది. కానీ గోవర్ధన్ ఆమెతో ప్రేమలో పడతాడు, కానీ ఇందు గోవర్ధన్ కుటుంబాన్ని మరియు వారి ఆర్థిక పరిస్థితులను తక్కువ చేసి పుస్తకంలో రాయడం వల్ల అతనికి కోపం పెరుగుతుంది. ఆ కోపంతో, తాను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసేందుకు వెళ్లి, విలాసవంతమైన లైఫ్ స్టైల్ గడుపుతూ, ఫోటోలు తీసి, అందులో ఉన్న లగ్జరీని ఇందుకు చూపిస్తూ ఆమె తన కుటుంబం గురించి చాలా తక్కువ చేసి రాసిన విషయాలు తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు.
కానీ ఆ కంపెనీ ఇందు తండ్రిదే అని గోవర్ధన్ తెలియకుండానే చేరతాడు. ఇదీలా ఉండగా కంపెనీ పనిమీద వీరిరువురు కలసి న్యూయార్క్ వెళతారు. అక్కడ, ఇందుకు గోవర్ధన్ పై నిజమైన ప్రేమ కలుగుతుంది. గోవర్ధన్ ఇతర ఆఫీస్ అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, ఇందు జలసీగా, పొసెసివ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఈ పాట వస్తుంది.
ముగింపు:
మన తెలగులో ఎంతో మంది లేడీ సింగర్స్ ఉన్నా కూడా హిందీ నుచి శ్రేయ ఘోషల్ ను తీసుకువచ్చి పాట పాడించారంటే ఆ పాటకు ఉన్న పొటెన్షియల్ ఏమిటో మనకు పరోక్షంగా అర్థం అవ్వాల్సిందే. ఆమె స్వరం తగిలిన సాధారణ పాటలు కూడా హిట్ పాటలవుతున్నప్పుడు ఒక మాంచి పాట ఆమె స్వరం నుంచి వెలువడితే ఇక అది బ్లాక్ బస్టర్ పాట అవ్వాల్సిందే. ఈమె ఈ మధురము కదా పాటను పాడిన విధానం చాలా ఇంప్రెస్ గా అనిపించక మానదు. ఆమె స్వరం లోని తియ్యదనం పాటలో కనిపిస్తుంటది. దానికి తోడు శ్రీమణి సాహిత్యం మరియు గోపీ సుందర్ సంగీతం తోడవ్వడంతో ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళింది.
దానికి తోడు మృణాల్ ఠాకూర్ మరియు విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. విజయ్ చేసే పనులను ఎవరికీ తెలియకుండా గమనిస్తూ, అతనితో మాట్లాడే అమ్మాయిపై జలసా ఫీల్ అవడం ద్వారా తన ప్రేమను తన ముఖ కవళికలతో, నవ్వుతో ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా ప్రతిభావంతంగా నటించిన మృణాల్, ఈ పాటలో ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా చాలామందికి నచ్చకపోయిన కూడా, ‘మధురము కదా’ పాటతో పాటు మిగతా అన్ని పాటలు కూడా చక్కగా ఉన్నాయి.