‘మేడమ్ సార్ మేడమ్ అంతే‘ పాట యొక్క లిరిక్స్‌ను (Madam Sir Madam Anthe Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన మారుతీనగర్ సుబ్రమణ్యం (Maruthinagar Subramanyam) అనే తెలుగు సినిమాలోని పాట. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్నపూర్ణ, శివన్నారాయణ తదితరులు నటించారు. మారుతి నగర్‌లో నివసిస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. కానీ, కోర్టులో ఉన్న కొన్ని సమస్యల కారణంగా ఆ ఉద్యోగం నిలిచిపోయింది. మరో ఉద్యోగం కోసం ప్రయత్నించడం మానేసి, అతని కుటుంబం పూర్తిగా అతని భార్య సంపాదనపై ఆధారపడింది. అనుకోని పరిస్థితుల్లో అతని బ్యాంక్ ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ అవుతాయి. ఈ డబ్బు ఎవరు పంపారో, ఎలా వచ్చిందో తెలియదు. అలా అనుకోకుండా వచ్చిన డబ్బు సుబ్రహ్మణ్యం జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేదే ఈ సినిమా ప్రధాన కథ.
ఇక ఈ పాట విషయానికి వస్తే, ఈ పాటకు సంగీతాన్ని కల్యాణ్ నాయక్ అందించారు. ఈయన 2023లో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘మేమ్ ఫేమస్’ సినిమాకు కూడా సంగీతాన్ని అందించారు. ‘మేమ్ ఫేమస్’ సినిమాలోని పాటలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అయ్యయ్యో అనే పాటైతే చాలామందికి ఎక్కేసింది. ఆ పాటలోని ట్యూన్, సాహిత్యం, సంగీతం ఇలా ప్రతీది మంచిగా వర్క్ అవుట్ అవ్వడంతో అదే ట్యూన్ దాదాపు ఇంకా రెండు పాటలను కూడా పాడారు. ఆ సినిమాకు ప్రాణం పాటలు అని చెప్పడంలో సందేహం లేదు. ఆ సినిమాపై గట్టిగా బజ్ క్రియేట్ అవ్వడం కల్యాణ నాయక్ కంపోజ్ చేసిని పాటల ప్రభావం చాలా ఎక్కువే ఉంది అని చెప్పవచ్చు. మేమ్ ఫేమస్ సినిమా తర్వాత జులై 5, 2024న విడుదలైన “14” అనే సినిమాకు సంగీతాన్ని అందిచిన కల్యాణ్ నాయక్ మళ్ళీ మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ద్వారా మన ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఉన్న మొత్తం మూడు పాటలలో ఈ మేడమ్ సార్ మేడమ్ అంతే పాటను ఈయన కంపోజ్ చేసిన విధానం కేక అని చెప్పొచ్చు.
ఈ పాటను పాడింది సిద్ శ్రీరామ్. దీనమ్మ ఏంట్రా అసలు నిజంగా సిద్ శ్రీరామ్ పెట్టి పుట్టినట్టున్నాడు. ఏదైనా సినిమాలో ఒక మంచి పాటకు స్వరాన్ని అందిస్తేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యే వారు చాలానే ఉన్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఎన్ని సార్. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ సినిమాలో మాంచి రొమాంటిక్ లవ్ సాంగ్ ఉందంటే చాలు దాన్ని సిద్ శ్రీరామ్ చేత పాడించాల్సిందే అనే విధంగా తయారయ్యారు మన సినిమావాళ్ళు. అందుకే మనం ఈ మధ్య వినే ట్రెండింగ్ లో ఉన్న చాలా రొమాంటిక్ పాటలను పాడింది సిద్ శ్రీరామే అయి ఉంటాడు. అతని హవా చాలా గట్టిగా నడుస్తా ఉంది మన తెలుగు చిత్రసీమలో. అది ఎంతకాలం నడుస్తుందో నడవని దానివల్ల మనకేమి నష్టం లేదు.
కానీ చాలామంది టాలెంటెడ్ సింగర్స్ మన టాలీవుడ్ లో ఉన్నారు కదా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు పాడిన ఆ హిట్ పాటల వల్ల ముందు ముందు వాళ్ళకి మంచి సినిమాలలో పాటలు పాడే అవకాశం రావచ్చు. ఇక్కడ చిత్రబృందం యొక్క తప్పు కూడా లేదు లేండి ఎందుకంటే సిద్ గారు ఎస్టాబ్లిస్డ్ సింగర్ అతని పాడే విధానం, అతని కున్న ఫ్యాన్స్ బేస్ ఇలా అన్ని ఆలోచించుకునే అతనితో పాడించి ఉంటారు. దీనివల్ల వాళ్ళ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యి మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తారేమో. ఇక ఈ పాటకు సాహిత్యం అందించింది భాస్కరభట్ల.
నేను చాలా కొద్ది పాటలను మాత్రమే తరుచుగా రిపీటెడ్ గా వింటూ ఉంటాను. ఒకసారి అలాంటి పాటలను వినడం మొదలు పెడితే అంతే ఇక ఆగేదె లేదు అన్నట్టుగా ఆ పాటపై విరక్తి వచ్చే వరకు వదిలి పెట్టను. ఆ పాటలు కొద్ది రోజులు నా మీద డ్రగ్స్ లాగ పనిచేయడం మొదలు పెడతాయి. ఇది చివరకు ఎంతవరకు వెళుతుందంటే కొన్ని రోజుల తర్వాత అదే పాటను వింటే మరీ అంతేమి లేదే నేనెందుకు అంతలా విన్నాను అని ఆశ్చర్యానికి గురౌతుంటాను. ఇక్కడ నేనేమి ఆ పాటలను బాగాలేవు అని చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే తినగా తినగా వేప తియ్యనైనట్టుగా, వినగా వినగా నేను చాలా ఇష్టపడ్డ పాటలు చివరకు వినడానికి కూడా ఇష్టపడను. అందుకే మన పెద్దవారు చెబుతారు ఏదైన అతిగా చేస్తే దానిమీద విరక్తి పుడుతుందని. ఇది నాకు మాత్రమే ఇలా జరుగుతుందా లేక నాలాగా వేరే వారికి కూడా జరుగుతుందా నాకు తెలియదు. కానీ నేను చెప్పేదొకటే, దేన్ని కూడా అతిగా చేయకండి. చేస్తే దానిమీద మీకు విరక్తి లేదా ఇష్టం పోవచ్చు.
ఈ మధ్య నేను రిపీటెడ్ వినే పాటల జాబీతాలో ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ పాట చేరడంతో నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఆ పాటను ఒకసారి స్టార్ట్ చేస్తే అలా అది రిపీటెడ్ గా ఒక లూప్ ప్లే అవ్వాల్సిందే. దీనివల్ల నాకు రోజులు గడిచే కొద్ది ఆ పాటపై విరక్తి రావచ్చు. ఎందుకంటే దీనికన్నా ముందు నా హిట్ ప్లే లీస్ట్ లో ఉన్న చాలా పాటలు తర్వాత కొన్ని తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాటలను వినాలన్న థాటే రావడం లేదు. మేడమ్ సార్ మేడం అంతే పాటను వింటున్నప్పుడు నాకు ఏదో తెలియని ఎనర్జిటిక్ భావన కలుగుతుంది. అదే సమయంలో నా క్రష్, నా గర్ల్ ఫ్రెండ్, నా బెస్టీలు ఒకరి తర్వాత ఒకరు నా ఊహల్లోకి వచ్చేస్తారు. ఇక చూసుకోండి వారు హీరోయిన్స్ గా నేనేమో హీరోగా ఊహల్లో డ్యూయెట్ నడుస్తూ ఉంటుంది. ఇది నాకు మాత్రమే కాదండోయ్ చాలా మంది పురుషులకి ఇలాగే జరుగుతుంటుందని నా ఫ్రెండు కూడా చెప్పాడు.
మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “మేడమ్ సార్ మేడమ్ అంతే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: మేడమ్ సార్ మేడమ్ అంతే
- సినిమా: మారుతీనగర్ సుబ్రమణ్యం
- నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్నపూర్ణ, శివన్నారాయణ.
- సినిమా దర్శకుడు: లక్ష్మణ్ కార్య
- సంగీత దర్శకుడు: కల్యాణ్ నాయక్
- గేయరచయిత: భాస్కర భట్ల
- గాయకుడు: సిద్ శ్రీరామ్
- సినిమా విడుదల తేదీ: ఆగస్ట్ 23, 2024
- లేబుల్: లిధా మ్యూజిక్
Madam Sir Madam Anthe Song Lyrics in Telugu
గుండె గంతులేస్తున్నదే
ఏంటీ అల్లరి అంటే వినకుందే
ఎందుకనో నువ్ నచ్చేసి
వెంట వెంట పడుతున్నదే
నన్ను తోడు రమ్మని పిలిచిందే
నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత
ఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోత
ఏదో మాయ చేసావ్ కధే
నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా
నక్సలైటులాగ నేను నీకు లొంగిపోత
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
ఎప్పుడు లేదే
తనందమెంతటి గొప్పది అంటే
తలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కిన తప్పే కాదే
మేడం సారు మేడమంతే
ప్రపంచవింతలు ఎన్నని అంటే
నేనొప్పుకోనే ఏడని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడం సారు మేడమంతే
ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే
మనసే అడుగుతోంది
దాని బాధ కొంచం చూడవే
ఇకపైనుంచి నిద్దర రానే రాదులే
కంటిపాపతోటి తప్పవేమో యుద్ధాలే
ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు
పడేసావే కోమాలాంటి స్థితిలో ఓ ఓ
వచ్చాయేమో వచ్చాయేమో
పాదాలకే చక్రాలు
ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ ఓ
కుర్ర ఈడునేమో కోసినావు ఊచకోత
బంధిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా
బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా
కల్లోలాన్ని తెచ్చావ్ కదే
చెయ్యి పట్టుకుంటే ఎంతలాగ పొంగిపోతా
మాట ఇచ్చుకుంటె సచ్చెదాక ఉండిపోతా
ఎలాగ ఎలాగ ఎలాగ ఎలాగ నమ్మకపోతే
తనందమెంతటి గొప్పది అంటే
తలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కిన తప్పే కాదే
మేడం సారు మేడమంతే
ప్రపంచవింతలు ఎన్నని అంటే
నేనొప్పుకోనే ఏడని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడం సారు మేడమంతే
Madam Sir Madam Anthe Lyrics in English
Gunde Ganthulesthunnadhe
Enti Allari Ante Vinakundhe
Endukano Nuv Nachhesi
Venta Venta Paduthunnadhe
Nannu Thodu Rammani Pilichindhe
Ninnu Choodagaane
Ontilona Ukkapotha
Nuvvu Navvagaane
Sambaraalu Endhuchetha
Okkamaata Cheppu
Intimundhe Vaalipothaa
Edho Maaya Chesaav Kadhaa
Ninnu Idisipetti Nenu Yaadikellipotha
Naxaliteu Laaga
Nenu Neeku Longipotha
Ilaaga Ilaaga Ilaaga Ilaaga
Eppudu Ledhe
Thanandhamenthati Goppadhi Ante
Thaletthi Choodaka Thappadhu Anthe
Thalonchi Mokkina Thappe Kaadhe
Madam Sir Madam Anthe
Prapancha Vinthalu Ennani Ante
Nenoppukone Edani Ante
Aa Navvu Kalipithe Enimidi Anthe
Madam Sir Madam Anthe
Evare Evare Nuvvu Peru Cheppave
Manase Adugutondi
Dani Badha Koncham Choodave
Ikapai Nunchi Niddara Raane Raadhule
Kanti Paapathoti Tappavemo Yuddhale
Identila Identila Naalo Inni Chitraalu
Padesaave Comalanti Sthithilo O O
Vaccha Yemo Vaccha Yemo
Paadhalaku Chakralu
Uregutunna Uhallo O O O
Kurra Idunemo Kosinavu Uchakota
Bandhipotulaga Ninnu Ettukellipota
Burelanti Bugga Okkasari Pindipota
Kallolanni Tecchav Kadhe
Cheyyi Pattukunte Entalaaga Pongipotha
Maata Ichhukunte Sachhedaka Undipotha
Elaaga Elaaga Elaaga Elaaga
Nammakapote
Thanandhamenthati Goppadhi Ante
Thaletthi Choodaka Thappadhu Anthe
Thalonchi Mokkina Thappe Kaadhe
Madam Sir Madam Anthe
Prapancha Vinthalu Ennani Ante
Nenoppukone Edani Ante
Aa Navvu Kalipithe Enimidi Anthe
Madam Sir Madam Anthe
మేడమ్ సార్ మేడమ్ అంతే Video Song
మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా 23 ఆగస్ట్ న విడుదలైంది. నాకు ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది. అది ఎందువల్లంటే ఈ మేడమ్ సార్ మేడమ్ అంతే పాటవల్ల. నేను ఈ సినిమా ప్రస్తుతానికి చూడలేదు కానీ ఈ పాట ఈ సినిమాలో ఉందని ముందుగానే తెలిసి ఉంటే ఈ పాట కోసమన్నా సినిమాకు వెళ్లేవాడిని. అరే ఏంట్రా ఇలా కూడా ఉంటారా అని మీరు అడగవచ్చు. ఎస్ ఉంటారు. ప్రతీ వారం దాదాపు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటన్నింటిని చూడలేము కదా. ఏ సినిమాలైతే మంచి బజ్ క్రియేట్ చేస్తాయో, టీజర్, ట్రైలర్, పాటలు లాంటి వల్ల ఇంప్రేస్ చేస్తాయో అలాంటి సినిమాలకు మాత్రమే వెళ్ళేవారు ఉన్నారు. అందులో నేను కూడా ఒకడ్ని. అందుకే ఈ పాట నాకు ఆ సినిమా థియేటర్ ఉన్నప్పుడు వినబడి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకు వెళ్ళేవాడ్ని.
ఆ పాటను పెద్ద స్క్రీన్ పైన లౌండ్ స్పీకర్ల మధ్య వినాలనే కొరికతో నైనా ఈ సినిమా చూసేవాడ్ని. ఇక పాట విషయానికి వస్తే హీరో కన్నా హీరోయిన్ గా నటించిన రమ్యా పసుపులేటి తన అందంతో నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. తనను ఇంస్టాగ్రామ్ లో నేను చాలా సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నాను. ఆమె చాలా అందంగా, క్యూట్ గా ఉంటారు. ఈ మధ్య ఆమె లిప్ ఫిల్లింగ్ (లిప్ సర్జరీ) కూడా చేసుకున్నట్టు ఉన్నారు. కొంతమంది లిప్ ఫిల్లింగ్ చేసుకోవడం ద్వారా అంతకు ముందు ఉన్నదానికన్నా చాలా క్యూట్ గా కనిపిస్తుంటారు. వారిలో రమ్య కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆమెలో ఇప్పుడు లిప్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ పాటలో మన హీరో అంకిత్ కొయ్య దారిలో వెళుతూ ఫోన్ ను కింద పడేసుకుంటాడు. ఆ సమయంలో సైకిల్ పై హారన్ కొడుతు మన క్యూటీ రమ్య వస్తుంటాది. ఆమెను చూస్తూ అలా లవ్ లో పడిపోయి మన హీరో ఆమె వెనక వెనకాల తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగే సమయంలో అతను సినిమాలో అల్లుఅర్జున్ ఫ్యాన్ అవ్వడం వల్ల ఇంతకు ముందు అల్లు అర్జున్ చేసిన సినిమాలలోని కొన్ని ముఖ్యమైన సీన్లను రీక్రియేట్ చేస్తూ ఉంటాడు.
Report a Lyrics Mistake / Share Your Thoughts