‘లేదే లేదే ప్రేమసలే‘ పాట యొక్క లిరిక్స్‌ను (Lede Lede Premasale Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన రాజు యాదవ్ (Raju Yadav) అనే తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాలోని పాట. కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందించబడిన ఈ చిత్రంలో గెటప్ శ్రీను, అంకిత కారాట్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ వంటి నేటీనటులు నటించారు. ఈ సినిమా 2024 మే 17న విడుదల కావాల్సినది, కానీ తెలంగాణలో థియేటర్లు మూసివేత వల్ల 2024 మే 24కు వాయిదా వేయబడింది.
తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన గెటప్ శ్రీను, ఇప్పుడు “రాజు యాదవ్” సినిమాతో హీరోగా అవతారం ఎత్తడం తెలుగు సినీ ప్రేమికులకు ఒక ఆహ్లాదకరమైన విషయం. ‘జబర్దస్త్’ వంటి కార్యక్రమాలలో తన హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీను, ఇప్పుడు ప్రేక్షకులను కట్టిపడే హీరోగా మారడానికి సిద్ధమవుతున్నాడు. గెటప్ శ్రీను తన కెరీర్‌ను ‘జబర్దస్త్’ కార్యక్రమంతో ప్రారంభించి, తన హాస్య ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ‘జబర్దస్త్’లో సొంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న శ్రీను, తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
ఇప్పుడు ‘రాజు యాదవ్’ సినిమాతో హీరోగా అడుగుపెట్టడం శ్రీనుకు ఒక పెద్ద అవకాశం. ఈ సినిమా అతని కెరీర్‌లో ఒక మలుపు తిప్పుతుందని ఆశిద్దాం. ప్రేక్షకులు శ్రీనును కొత్త అవతారంలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతను హీరోగా ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అతని కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో ఎలా ఉపయోగిస్తాడో చూడాలని కోరుకుంటున్నారు. శ్రీను కొత్త అనుభవం అందించగలడని నమ్ముతున్నారు. “రాజు యాదవ్” సినిమా గెటప్ శ్రీనుకు మొదటి హీరో సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గెటప్ శ్రీనును తెలుగు సినీ పరిశ్రమలో మరో స్టార్‌గా మారుస్తుందని ఆశిద్దాం.
ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి, అందులో ఐదు పాటలు హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేశారు, మిగతా ఒక పాటను రామ్ మిరియాల స్వరపరిచారు. ఈ సౌండ్‌ట్రాక్ అదిత్య మ్యూజిక్ లేబల్ కింద విడుదలైంది. అందులో ప్రత్యేకంగా “లేదే లేదే ప్రేమసలే” అనే పాటకు సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు, మరియు ఈ పాటను చందబోస్ గారు రాశారు మరియు పాడారు. చంద్రబోస్ తెలుగు సినిమాల్లోని ప్రముఖ లిరిసిస్టులలో ఒకరు, అతను “RRR” (2022) సినిమాలో “నాటు నాటు” పాట రాసి కీరవాణితో కలిసి ఆస్కార్ అవార్డు పొందారు. అలాంటి ప్రఖ్యాతి చెందిన రచయిత, “రాజు యాదవ్” వంటి చిన్న సినిమాకు పాట రాయడం మరియు పాడారంటేనే ఈ సినిమాపై ప్రేక్షకులు నమ్మకం పెట్టుకోవచ్చు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “లేదే లేదే ప్రేమసలే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: లేదే లేదే ప్రేమసలే (Lede Lede Premasale)
- సినిమా: Raju Yadav (రాజు యాదవ్)
- నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత కారాట్
- సినిమా దర్శకుడు: కృష్ణమాచారి
- సంగీత దర్శకుడు: హర్షవర్థన్ రామేశ్వర్
- గేయరచయిత: చంద్రబోస్
- గాయకుడు: చంద్రబోస్
- సినిమా విడుదల తేదీ: మే 24, 2024
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Lede Lede Premasale Song Lyrics in Telugu
లోకం లోనే ప్రేమే లేదసలే
లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమే లేదసలే
మోహాన్నే ప్రేమంటు పిలిచారే
కామాన్నే ప్రేమంటు తలచారే
లాభాన్నే ప్రేమంటు కొలిచారే
స్వచ్ఛంగా ప్రేమంటూ
లేదే లేదే లేదే ప్రేమసలే
ఈ లోకం లోనే ప్రేమే లేదసలే
పంచిన రక్తానికి విలువే ఎంతంటా
పట్టిన చనుబాలకి వెల ఎంతంటా
చేసిన త్యాగాలకి రుసుమే ఎంతంటా
కార్చిన కన్నీటికి ఖర్చెంతంటా
ఏ సొమ్ముకాశపడక
ఏ స్వార్దమంటు లేక
నిను కనిపెంచిన
కన్నోళ్ళది కాదా ప్రేమ
నీ రూపురేఖ చూసి
నువ్వు ఉన్న స్థాయి చూసి
నిన్ను ప్రేమించిన అమ్మాయిది
ప్రేమంటావా
లేదే లేదే లేదే ప్రేమసలే
ఈ లోకం లోనే ప్రేమే లేదసలే
గగనం పడిపోతే చుక్కల దిక్కేది
కడలే ఎండితే చేపల దారేది
కొడుకే కనుమూస్తే తల్లికి బ్రతుకేది
తండ్రిలో ఆవేదన కొరివైనాది
ఈ తల్లిదండ్రికెపుడు
కొడుకన్నవాడు ఒకడే
వేరేవరెవరో ఆ లోటుని తీర్చగలేరు
నువ్వు కాకపోతే వాడు
వాడవకపోతే వీడు
ఆ ప్రియురాలికి ప్రియులెందరో కరువే లేరు
లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమే లేదసలే
మోహాన్నే ప్రేమంటు పిలిచారే
కామాన్నే ప్రేమంటు తలచారే
లాభాన్నే ప్రేమంటు కొలిచారే
స్వచ్ఛంగా ప్రేమంటూ
లేదే లేదే లేదే ప్రేమసలే
ఈ లోకం లోనే ప్రేమే లేదసలే
Lede Lede Premasale Lyrics in English
Lokam Lone Preme Ledhasale
Ledhe Ledhe Ledhe Premasale
Lokam Lone Preme Ledhasale
Mohanne Premantu Pilichare
Kamanne Premantu Talachare
Laabane Premantu Kolichare
Swacchanga Premantu
Ledhe Ledhe Ledhe Premasale
Ee Lokam Lone Preme Ledhasale
Panchina Raktanki Viluve Yenthanta
Pattina Chanubalaki Vela Yenthanta
Chesina Tyagalaki Rusume Yenthanta
Karchina Kannitiki Karchenthanta
Ye Sommu Kasapadaka
Ye Swardamantu Leka
Ninu Kanipenchina
Kannolladi Kaada Prema
Ni Rupurekha Chusi
Nuvvu Unna Sthayi Chusi
Ninnu Preminchina Ammayidi
Premantava
Ledhe Ledhe Ledhe Premasale
Ee Lokam Lone Preme Ledhasale
Gaganam Padipote Chukkala Dikkedi
Kadale Yendite Chepala Daredi
Koduke Kanumuste Thalliki Bratukedi
Thandrilo Aavedana Korivainadi
Ee Tallidandrikepudu
Kodukannavadu Okade
Vereveravaro Aa Lotuni Thirchagaleru
Nuvvu Kakapote Vadu
Vadavakapote Veedu
Aa Priyuralike
Priyulendaro Karuve Leru
Ledhe Ledhe Ledhe Premasale
Lokam Lone Preme Ledhasale
Mohanne Premantu Pilichare
Kamanne Premantu Talachare
Laabane Premantu Kolichare
Swacchanga Premantu
Ledhe Ledhe Ledhe Premasale
Ee Lokam Lone Preme Ledhasale
లేదే లేదే ప్రేమసలే Video Song
పాట విశ్లేషణ:
ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, రాజు (గెటప్ శ్రీను) డిగ్రీ పూర్తిచేయకుండా తన ఊర్లో తిరుగుతూ కాలం గడుపుతుంటాడు, కానీ అతనికి తగిలిన క్రికెట్ బాల్ కారణంగా అతని ముఖంలో స్మైల్ కనపడుతుంది. ఈ స్మైల్, తన తండ్రి డబ్బు లేకపోవడం వల్ల సర్జరీకి నిరాకరించడంతో, రాజు జీవితంలో అనేక కష్టాలను తెస్తుంది. ఈ సమయంలో, స్వీటీ (అంకిత ఖారత్) అతనిని కలుస్తుంది. ఆమెను చూసి రాజు ప్రేమలో పడతాడు. అయితే, స్వీటీ అప్పుడు అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాలక్రమేణా, వారు స్నేహితులుగా మారుతారు, కానీ రాజు తనను ఇష్టపడ్డందుకు, ప్రేమలో పడతాడు. కానీ స్వీటీకి ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండటంతో, ఇది రాజుకు గాఢమైన బాధను కలిగిస్తుంది. రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, స్వీటీ అతన్ని మరచిపోమని చెప్పడంతో అతని బాధ పెరుగుతుంది.
స్వీటీ మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ పార్కుల వెంబడి తిరుగుతూ వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం చూసి రాజు ఇంకా బాధపడతాడు. ఆ బాధ అతని ముఖంలో కనబడుతూ ఉంటుంది. అతని మనసులో స్వీటీకి ఉన్న ప్రేమ తాను ఎదుర్కొంటున్న కష్టాలను మరింత పెంచుతుంది. ఈ కష్టాల వల్ల, రాజు మద్యానికి బానిసవాడవుతాడు. ఒకరోజు ఇదంతా తలచుకంటూ విపరీతంగా మధ్యం సేవించి, సొంతంగా బైక్ నడుపుకుంటూ వెళుతుంటాడు. బైక్ డ్రైవ్ చేసే సమయంలో కూడా తన లవర్ నే ఊహించుకుంటూ ఉంటాడు. ఇలా బైక్ నడుపుతూ వెళుతున్న సమయంలో కారుకు డాష్ ఇచ్చి, క్రింద పడిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతాడు.
ఇలా రాజు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిపే సమయంలో ఈ పాట మొదలవుతుంది. ఈ సీన్ లో వాళ్ళ తల్లిదండ్రులు విపరీతంగా దుఃఖానికి లోనవుతారు. అప్పుడే ఈ పాట మొదలవుతుంది. ఇది చాలా అర్థవంతంగా ఉంటుంది. ఈనాటి కుర్రకారు కోసమే ఈ పాటను రాశారేమో అనిపిస్తు ఉంటుంది.
ముగింపు:
జబర్ధస్త్ అనే కామిడీ షో చాలామంది కామిడియన్స్ ను వెలుగులోకి తీసుకువచ్చి వారు తెలుగుసినీరంగలో తమకంటు గర్తుంపును డబ్బను సంపాందించునేందుకు అవకాశం కల్పించింది. లెక్క పెట్టుకుంటు పోతే మనం సినిమాలలో చూసే చాలామంది కమీడియన్స్ ఏదో ఒక్కసారైనా జబర్ధస్త్ స్టేజ్ పై కనిపించే ఉంటారు. కొంతమంది జబర్ధస్త్ షో ద్వారా సంపాదించుకున్న గుర్తింపుతో హీరోలుగా సినిమాలు తీసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. అందులో ముందు వరుసలో సుడిగాలి సుధీర్ ఉంటాడు. సుధీర్ నటించిన ‘గాలోడు (2022)’ సినిమాను ప్రేక్షకులు మంచిగా ఆదరించి సుధీర్ పై తమకున్న అభిమానాన్ని చూపించుకున్నారు. ఇప్పుడు అదే దారిలో గెటప్ శ్రీను కూడా రాజు యాదవ్ సినిమాతో హీరోగా వెండితెరపై కనిపించాడు.
ఈ సినిమాలో గెటప్ శ్రీను స్మైలీ ఫేస్ పెట్టుకునే మొత్తం సినిమా మొత్తం కనిపించాడు. ఒకవేళ ఎమోషన్ సీన్ ఉన్న కూడా ఆ స్మైలీ ఫేస్ తోనే ఏడుస్తూ, బాధపడుతూ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సినిమా కథ చాలా రొట్ట రొటీన్ గా ఉన్నా కూడా గెటప్ శ్రీను యాక్టింగ్ మాత్రం అరాచకం. ఆయనకు అప్పగించిన పాత్రకు నూరు శాతం న్యాయం చేశాడు.
లేదే లేదే ప్రేమసలే పాటకు ముందు ఆయన చాలా ఎమోషన్ అవుతారు. ఎందుకంటే తను పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకున్న అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తితో రాసుకుని పూసుకుని తిరుగుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. ఆ బాధను గెటప్ శ్రీను తన నటనతో బాగా పండించారు. అలాగే యాక్సిడెండ్ లో శ్రీను చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడడం కూడా ఈ పాటలోనే చూపిస్తారు. నువ్ ప్రేమించిన అమ్మాయికి ఎవరైన బాయ్ ఫ్రెండ్ గ ఉండవచ్చు కాని, నిన్ను కన్నా తల్లిదండ్రులకు నువ్వు మాత్రమే బిడ్డగా ఉండాలి తప్పా ఎవ్వరు ఉండరు అనే అర్థం వచ్చేలా గేయరచయిత చంద్రబోస్ రాసిన అర్థవంతమైన లిరిక్స్ యువతను ఆలోచింపచేస్తాయి అనడంలో సందేహం లేదు.