‘కుర్చీ మడతపెట్టి‘ పాట యొక్క లిరిక్స్‌ను (Kurchi Madathapetti Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన గుంటూరు కారం (Guntur Kaaram) అనే తెలుగు సినిమాలోని పాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమా మొదట 2021 మేలో “SSMB28” అనే పేరుతో ప్రకటించబడింది. అధికారికంగా సినిమా పేరు 2023 మేలో ప్రకటించబడింది. “గుంటూరు కారం” సినిమా ప్రపంచవ్యాప్తంగా 2024 జనవరి 12న, సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం మరియు కథా రచనకు విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలు అందుకుంది. అయితే, తమన్ సంగీతం మరియు మహేష్ బాబు నటనకు ప్రశంసలు లభించాయి. చివరికి, సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందింది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్.ఎస్ అనగానే మళ్ళి ఏ పాటలను కాపీ కొడతాడోనని అనుకుంటున్న సమయంలో కుర్చి మడతపెట్టి పాట ప్రోమోను విడుదల చేశారు. ఇక అంతే సోషియల్ మీడియాలో ముఖ్యంగా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఈ పాటను వ్యతిరేకించేవారు మరియు సపోర్ట్ చేసి మెచ్చుకునే వారు. నిజంగానే పాట బాగుంది, ఫుల్ మాస్ గా ఉంది. దీనికి తోడు శ్రీలీలా కూడా ఉండడంతో ఒక ఊర మాస్ డ్యాన్స్ తో కూడిన పాట వస్తుందని, మహేశ్ బాబు డ్యాన్స్ ను కూడా చూడొచ్చని చాలా మంది ఫుల్ పాట కోసం ఎదురుచూస్తుంటే, ఇంకోవైపు ఎవరో మతిస్థిమితం లేని ఒక వృద్ధ బిచ్చగాడు వాడిన “కుర్చి మడతపెట్టి దెంXగితే మెడలు విరిగిపోయినాయి” అనే అతిపెద్ద బూతు పదాన్ని ఒక సూపర్ స్టార్ తన సినిమాలో వాడడం ఏమిటో, దానికి డ్యాన్సులు వేయడం ఏమిటో అని చాలా మంది చిత్రబృందాన్ని దుయ్యబెట్టారు.
ఇలా వ్యతిరేకత వస్తుందని చిత్రబృందానికి తెలీదా అంటే, తెలిసే ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ పదం ట్రెండింగ్ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఆ పదంతో డీజే హరీష్ అనే వ్యక్తి రిమిక్స్ చేశాడు కాబట్టి, దానిని వాడి బాబు మరియు శ్రీలీలాతో మంచి ఊరమాస్ డ్యాన్స్ స్టెప్పులు వేయించొచ్చనే ఉద్దేశ్యంతోనే ఈ పాటను సినిమాలో పెట్టి ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ పాట ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసిన ఇదే పాట. సోషియల్ మీడియాలలో లక్షలమంది ఈ పాటకు రీల్స్ క్రియేట్ చేశారు మరియు ఈ పాట సినిమాపై బజ్ ను అమాంతం పెంచేసింది. ఈ పాటను పాడింది సాహితి చాగంటి మరియు శ్రీకృష్ణ, సాహిత్యం అందించింది సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది తమన్ ఎస్. ‘కుర్చీ మడతపెట్టి’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: కుర్చీ మడతపెట్టి
- సినిమా: Guntur Kaaram (గుంటూరు కారం)
- నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి
- సినిమా దర్శకుడు: త్రివిక్రమ్
- సంగీత దర్శకుడు: తమన్ ఎస్
- గేయరచయిత: రామజోగయ్య శాస్త్రి
- గాయకులు: సాహితి చాగంటి, శ్రీకృష్ణ
- సినిమా విడుదల తేదీ: జనవరి 12, 2024
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Kurchi Madathapetti Song Lyrics in Telugu
మాయమ్మ పేరు
తలవనోళ్లు లేరు మేస్త్రిరి
కళాకార్ల ఫ్యామిలీ మరి
మేము గజ్జ కడితే
నిదరపోదు నిండు రాతిరి
సోకులాడి స్వప్న సుందరి
నీ మడతసూపు మాపటేల మల్లె పందిరి
రచ్చరాజుకుందె ఊపిరి
నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరీ
తూనీగ నడుములోన తూటాలెట్టి
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి
మగజాతి నట్ట మడతపెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
(కు కు కుకూ కూ కూ కూ కూ)
దాని కేమో మరి దానికేమో
దానికేమో మేకలిస్తివి
మరి నాకేమో
సన్న బియ్యం నూకలిస్తివి
మేకలేమో వందలుగా
మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో
ఒక్క పూటక్ కరిగిపాయే
(కు కు కుకూ)
ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి
మరి నాకేమో చుక్క గళ్ళ కోకలిస్తివి
దాని చెవిలో జూకాలేమొ
దగా దగా మెరిసిపాయే
నాకు పెట్టిన కోకలేమో
పీలికలై సిరిగిపాయే
ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ
నీతో ఎప్పుడింత కిరికిరి
ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ
నీతో ఎప్పుడింత కిరికిరి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
(కు కు కుకూ, కూ కూ కూ కూ)
సో సో సో సోకులాడి స్వప్న సుందరి
(మడత పెట్టి, మడత పెట్టి)
మాపటేల మల్లె పందిరి
(మడత పెట్టి, మడత పెట్టి)
రచ్చరాజుకుందె ఊపిరి
(మడత పెట్టి, మడత పెట్టి)
గుండెలోన డీరి డిరి డి డి డి
ఏందట్టా చూస్తన్నా
ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్
రాసుకోండి మడతెట్టి పాడేయండి
మడత పెట్టి, మ మమ మ మమ
మడత పెట్టి, మడత పెట్టి
మ మమ మ మమ
మడత పెట్టి, మడత పెట్టి
మ మమ మ మమ
మడత పెట్టి, మడత పెట్టి మ మమ
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి, మడత పెట్టి
మడత పెట్టి, మడత పెట్టి
Kurchi Madathapetti Lyrics in English
Maayamma Peru
Thalavanollu Leru Mesthri
Kalaakaarla Family Mari
Memu Gajja Kadithe
Nidarapodhu Nindu Raathiri
Sokulaadi Swapna Sundari
Nee Madatha Soopu
Maapatela Malle Pandiri
Rachha Raajukundhe Oopiri
Nee Vanka Choosthe
Gundelona Deeri Diri Diri
Thooniga Nadumulona Thootaaletti
Thupaaki Pelchinaave Thingari Chitti
Magajaathi Natta Madathapetti
Aa Kurchini Madatha Petti
Aa Kurchini Madatha Petti
Madatha Petti, Ma MaMa Madatha Petti
Madatha Petti, Ma MaMa Madatha Petti
Madatha Petti, Ma MaMa Madatha Petti
Daani Kemo Mari Daanikemo
Daanikemo Mekalisthivi
Mari Naakemo
Sanna Biyyam Nookalisthivi
Mekalemo Vandhaluga
Mandhaluga Perigipaaye
Naakichina Nookalemo
Okka Pootak Karigipaaye
Aada Pachharaalla Jukaalisthivi
Mari Naakemo
Chukka Galla Kokalisthivi
Daani Chevilo Jukaalemo
Dhaga Dhagaa Merisipaaye
Naaku Pettina Kokalemo
Peelikalai Sirigipaaye
Yem Rasika Raajuvo Mari
Naa Dasu Baava
Neetho Eppudintha Kirikiri
Yem Rasika Raajuvo Mari
Naa Dasu Baava
Neetho Eppudintha Kirikiri
Aa Kurchini Madatha Petti
Madatha Petti, Ma MaMa Madatha Petti
Madatha Petti, Ma MaMa Madatha Petti
Madatha Petti, Ma MaMa Madatha Petti
So So So Sokulaadi Swapna Sundari
(Madatha Petti, Madatha Petti)
Maapatela Malle Pandiri
(Madatha Petti, Madatha Petti)
Rachha Raajukundhe Oopiri
(Madatha Petti, Madatha Petti)
Gundelona Deeri Diri Di Di Di
Yendhattaa Choosthannaa
Ikkada Yevadi Badhalaku
Vaade Lyrics Writer
Raasukondi, Madathetti Paadeyandi
Madatha Petti, Ma MaMa Ma MaMa
Madatha Petti, Madatha Petti
Ma MaMa Ma MaMa
Madatha Petti, Madatha Petti
Ma MaMa Ma MaMa
Madatha Petti Madatha Petti
Ma MaMa
Aa Kurchini Madatha Petti
Madatha Petti, Madatha Petti
Madatha Petti, Madatha Petti
కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్
‘కుర్చి మడతపెట్టి’ అనే పదాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది ‘కూర్చి తాత’గా పిలవబడుతున్న ఒక వృద్ధ బిచ్చగాడు. అతన్ని ఒక యూటూబ్ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు, అతని భార్యపిల్లల గురించి అడిగారు. అందుకు ఆ కుర్చి తాత తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను వివరించాడు. అదేంటంటే తన భార్య తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిందని తెలుసుకుని, ఎలాగైన తీసుకు రావాలని ఇతను వెళ్ళగా. అక్కడ తన భార్యతో మాట్లాడుతూ ఉండగా తన బామర్ధి (భార్యవాళ్ళ సహోదరుడు) కొట్టడానికి వచ్చినప్పుడు కుర్చి తాత తన పక్కనున్న మడత కుర్చీని మడిచి కొట్టానని (కొట్టాడు అని చెప్పే బదులు దెం*గితే అనే బూతు పదాన్ని వాడాడు) చెప్పాడు.
చిత్రబృందం ఆ బూతు పదాన్ని కట్ చేశారు. అయినా కూడా చాలామందే ఈ పాటను వ్యతిరేకించారు. అదే సమయంలో ఎక్కడ చూసిన ఈ పాటదే హవా నడిచింది. కుర్చి తాత వాడిని ఆ పదాన్ని మరియు దానికి డీజే మిక్స్ చేసిన హరీష్ అనే వ్యక్తికి కూడా కొంత డబ్బులు ఇచ్చారని టాక్ వినిపించింది. ఈ పాట విడదలైన తర్వాత కుర్చి తాతను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చిత్రబృందం తనకు కొంత డబ్బు ఇచ్చిందని చెప్పుకొచ్చి, తన డైలాగ్ పాట రూపంలో సినిమాలో పెట్టుకోవడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.
ఈ పాట సినిమాలో ఇంటర్వల్ తర్వాత సెకండాఫ్ లో వస్తుంది. ఈ పాట రిలీజ్ కాకముందు మహేశ్ బాబు మరియు శ్రీలీల మాత్రమే ఈ పాటలో కనిపిస్తారు అనుకున్నారు. కానీ పాట విడుదలయ్యాక తెలిసింది ఇందులో సీనియర్ నటి పూర్ణ గారు కూడా ఉన్నారని. కానీ ఆమె కొద్దిగా బొద్దుగా (లావుగా) ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అయిన కూడా ఆ చీర కట్టు, బొట్టులో చాలా క్యూట్ గా హాట్ గా ఉంటుంది. మొదట్లో హీరోయిన్ గా సినిమాలలో కనిపించిన పూర్ణగారు ఇప్పుడు చాలా సినిమాలలో మంచి పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనుసాగుతూ ఉన్నారు.
మహేశ్ బాబుగారికి డ్యాన్స్ రాదు అనడం కంటే డ్యాన్స్ చేయరు అని చెప్తే బాగుంటుందేమో. ఆయన సినిమాలలో చాలా పాటలలో ఎక్కువగా డ్యాన్ స్టెప్పులు ఉండవు. అదే డ్యాన్స్ కంపల్సరిగా ఉండి తీరాల్సిందే అనుకుంటే మాత్రం బాబు గారు డ్యాన్స్ బాగానే చేస్తారు. దీనికి ఉదాహర ఈ కుర్చిమడత పెట్టి పాటే అని చెప్పొచ్చు. ఈ పాటలో బాబు గారి ఊరమాస్ డ్యాన్స్ ను చూస్తాము. అలాగే పక్కన శ్రీలీలా గురించి చెప్పేదేముందు తను కూడా డ్యాన్స్ తో అల్లాడించింది. ఒవరాల్ గా ఈ కుర్చి మడతపెట్టి పాట ప్రతీ బారత్ లలో, పంక్షన్లలో, ప్రోగ్రామ్ లలో ఇలా ఎక్కడ హుషారైన మరియు జోషైన పాట కావాలో అక్కడ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనడంలో సందేహం లేదు.