(కాశ్మీరు) Kashmeeru Song Lyrics in Telugu from Animal (2023)

కాశ్మీరు పాట యొక్క లిరిక్స్‌ను (Kashmeeru Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఇది 2023లో విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోని పాట. ఈ కార్మీరు పాటను వింటే మీకు ఇంకొక పాట గుర్తురావచ్చు అదే ‘అర్జున్ రెడ్డి (2017)’ సినిమాలోని ‘గుండెలోన నింపుకున్న’ అనే క్లైమాక్స్ లో వచ్చే పాట. ఇక్కడ నా ఉద్దేశ్యం రెండు పాటలు ఓకేలా ఉన్నాయా అంటే కాదూ. రెండు కూడా వేరు వేరు ట్యూన్ లతో ఉంటాయి. కానీ పాట సాగే విధానం మాత్రం ఒకటే అని చెప్పొచ్చు. అది ఎలా అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఈ రెండు పాటల్లోను సంగీత వాయిద్యాల ఊసే ఉండదు. మొత్తం పాటంతా కేవలం మహిళ గాయకురాలి మధురమైన ధ్వని మాత్రమే సుమధురంగా వినిపిస్తుంటది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావాలనే ఇలాంటి పాటలు తన ప్రతీ సినిమాలో ఉండేలా చూసుకుంటారేమో. మంచి ఎమోషన్ పండే సన్నివేశాల్లో గడిబిడి బ్యాగ్రౌండ్ స్కోర్ లేక సంగీత వాయిద్యాలతో కూడిన పాటను పెట్టి ఆ సందర్భరాన్ని ప్రేక్షకులు సంపూర్ణంగా ఆస్వాదించకుండ ఉంటారేమోనని ఇలాంటి సాధారణ పాటను తన సినిమాలో పెడతారేమో మరి కారణం ఆయనకే తెలియాలి.

ఇక ఈ పాటను తెలుగులో వ్రాసింది అనంత శ్రీరామ్. ఇదే కాదూ మొత్తం అన్ని పాటలను తెలుగులో రాసిన ఘనపాటి ఈయన. పాటలో స్వచ్ఛమైన తెలుగు పదాలను కూర్చడంలో మేటి. అలాగే ఈ కాశ్మీరు పాటకు సంగీతం అందించింది ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు, గేయరచయిత మరియు సంగీత దర్శకుడు అయిన మనన్ భరధ్వాజ్. ఈయన ముఖ్యంగా బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో పాటు పంజాబీ మరియు హర్నావి భాషలలో కూడా పాటలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈయన 1987లో హర్యానలోని గుర్గావ్ లో జన్మించాడు. చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదొడుకులను ఎదురుకుంటూ ఇప్పుడు మంచి స్థానానికి చేరుకున్నాడు. నిజంగా అతని పట్టుదలను మెచ్చుకోవాలి. ఇతను ఈ కార్శీరు పాటను ఇలా సాధారణంగా కంపోజ్ చేయడానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎలాంటి పాట తన సినిమాలో ఉండాలో చెప్పే బాధ్యత దర్శకుడిదే కాబట్టి. ఇంతకు ముందే అర్జున్ రెడ్డి సినిమాలో ఇలాంటి పాటను సాహసోపేతంగా పెట్టారు కాబట్టి, ఈ సినిమాలో కూడా అలాంటి పాటను తనకు కావాలనే దర్శకుడి కోరిక మేరకు మనన్ భరధ్వాజ్ ఈ కంపోజ్ చేసి ఉంటారు.

ఈ పాటను ఆలపించింది యాజిన్ నిజార్ మరియు శ్రెయా ఘోషల్. యాజిన్ నిజార్, యాసిన్ అనే పేరుతో కూడా పిలువబడే, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమాల్లో ప్రధానంగా పనిచేసే ఒక ప్రముఖ ప్లేబ్యాక్ గాయకుడు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను తమిళం మరియు మలయాళ భాషల్లో ఆయనే పాడాడు. శ్రెయా ఘోషల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఇంకేముంది. ఆమె ఎంత ప్రసిద్ధ మరియు ప్రఖ్యాత గాయనో వేరే చెప్పాలా. ఈమె జన్మించింది పశ్చిమ బెంగాలో అయిన పెరిగింది మాత్రం రాజస్థాన్ లోని కోటాలో. ఈమె కేవలం హిందీ పాటలే కాకుండా అనేక భారతీయ భాషలలో కూడా పాటలకు తన మధురమైన స్వరాన్ని అందించారు. కొన్ని అంతర్జాతీయ పాటలను కూడా పాడారు. ఈమె తన చిన్నతనంలోనే నాలుగవ వయస్సున్నప్పటి నుండి సంగీతాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టి ఎన్నో సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పాటలను పాడారు. శ్రెయా ఘోషల్ మధురమైన స్వరంతో పాడే ప్రతీ పాట కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. అది సాధారణ పాటే అయినా కూడా శ్రెయా స్వరం తోడయిందంటే ఆ పాట రేంజే మారిపోతుంది. అదే కోవలోకి ఈ కాశ్మీరు పాట కూడా చేరుతుంది అనడంలో సందేహం లేదు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాట విన్న ఎవ్వరన్నా దాన్ని అంగీకరించాల్సిందే. కాశ్మీరు పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: కాశ్మీరు
  • సినిమా: యానిమల్ (Animal)
  • నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు త్రిప్తి దిమ్రీ
  • సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
  • సంగీత దర్శకుడు: మనన్ భరద్వాజ్
  • గేయరచయిత: అనంత శ్రీరామ్
  • గాయకుడు: శ్రేయా ఘోషల్, యాజిన్ నిజార్
  • సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
  • లేబుల్: టీ-సిరీస్ తెలుగు

Kashmeeru Song Lyrics in Telugu

చిరుగాలి వీచేలా
ఈ మేడలో ఎక్కడా
ఏ దారి లేదేంటో
సెలయేరు పారేలా
ఈ తోటలో ఎక్కడా
ఏ వాలు లేదేంటో

ఇటువంటి చోటులలో కమ్మే సెగలలో
ప్రేమనెలా పూయించాలో ఏంటో
ఇవాళే ఇవాళే అలా వాలిపోదా
కాశ్మీరులాంటి సీమలలో
ఆ రోజులాగే అలా తేలిపోదా
జీలమ్మనల్లాంటి ప్రేమలలో

మ్ అందాల లోయ చేసేటి మాయ
జతగా మరోసారి చూద్దాం ప్రియా
చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే
స్వర్గం అదంట పోదాం పదా
ఆ మంచు కనుమల్లో నేర్పించమంటే
నేర్పిస్తా ప్రేమంటే ఏంటో

ప్రపంచాన్ని మరచి కాసేపు ఊగిపోదాం
దేవకన్యలుండే ఆ గ్రామములో
ఆ జ్ఞాపకాలు పోగు చెయ్యి చాలు
లోటనేది ఉండదిక నీ మదిలో

నువ్వు అడిగితే తీసుకెళ్ళనా
ఆ చోటులోన చలి ఉంది చానా
వణుకుతూ నీవుంటే చూస్తూ అలా
ఎలా తాలనే అయ్యో లేడీ కూన

చలిమంటలై నన్ను నీ మాటలే
తాకుతుంటే చలేస్తాదా ఏంటో
నీ కౌగిలే నన్ను
ఓ కంబలై కాచుకుంటే
వణుకుతానా ఏంటో

నా ముందు నువ్వుండి మాటాడుతుంటె
కదిలే కాలాన్నే ఆపేయనా
ఆ గూటి పడవల్లో
నీ గుండెపై వాలి
నిదురిస్తా నేడే ఆ సీమలలో
ఏదేమి అవుతున్నా
ఏ గొంతు ఏమన్నా
తేలుస్తా నిన్నే నా ప్రేమలలో

Kashmeeru Lyrics in English

Chirugaali Veechela Ee Medalo
Ekkada Ye Daari Ledhento
Selayeru Paarela Ee Thotalo
Yekkada Ye Vaalu Ledhento

Ituvanti Chotulalo Kamme Segalalo
Premanela Pooyinchaalo Ento
Ivaale Ivaale Alaa Vaalipodha
Kashmeeru Laanti Seemalalo
Aa Roju Laage Alaa Thelipodha
Jheelammanallaanti Premalalo

Hm, Andaala Loya Cheseti Maaya
Jathaga Marosaari Chuddaam Priya
Chebuthaaru Prathi Okaru
Nelapaina Unde
Swargam Adhanta Podham Padha
Aa Manchu Kanumallo
Nerpinchamante
Nerpisthaa Premante Ento

Prapanchaanni Marachi
Kaasepu Oogipodhaam
Deva Kanyalunde Aa Graamamulo
Aa Gnaapakaalu
Pogu Cheyyi Chaalu
Lotanedhi Undadhika Nee Madhilo

Nuvvu Adigithe Theesukellana
Aa Chotulona Chali Undi Chaana
Vanukuthu Neevunte Chusthu Alaa
Ela Thaalane Ayyo Lady Koona

Chali Mantalai Nannu Nee Maatale
Thaakutunte Chalesthaada Ento
Nee Kougile Nannu
O Kambalai Kaachukunte
Vanukuthaana Ento

Naa Mundu Nuvvundi Maataduthunte
Kadhile Kaalaanne Aapeyanaa
Aa Gooti Padavallo
Nee GundePai Vaali
Niduristhaa Nede Aa Seemalalo
Yedhemi Avuthunna
Ye Gonthu Yemanna
Thelusthaa Ninne Naa Premalalo
Hmm

కాశ్మీరు Video Song


పాట వచ్చే సందర్భం:

ఈ పాటలో, కథానాయకుడు రణ్ విజయ్ గుండె మార్పిడి చేయడానికి ముందు ఉన్న సమయంలో అతనికి రుచి, లైంగిక భావనలు తెలియకుండా ఉంటాయి. అతను అనుభవించే శారీరక, మానసిక పరిస్థితి అస్పష్టంగా, అర్ధం కాని రీతిలో ఉంటుంది. ఈ సమయంలోనే గీతాంజలి ఈ పాటను పాడుతుంది.

“యానిమల్” సినిమాలో రణ్ విజయ్ మరియు గీతాంజలి మొదటిసారిగా కలిసినప్పుడు, వారి మధ్య ప్రేమ గొప్పగా వికసిస్తుంది. ఆ సమయంలోనే “అమ్మాయీ” పాట ద్వారా కాశ్మీర్ అందాల మధ్య వారు ఒకరికొకరు మరింత దగ్గరపడతారు. కాశ్మీర్ వేదికగా, అక్కడి స్వచ్ఛమైన గాలి, ప్రకృతి వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ దశలో, గీతాంజలి తనను కాశ్మీర్‌కు తీసుకెళ్లాలని రణ్ విజయ్‌కు చెబుతుంది. అతని ఆరోగ్యం బాగోలేక, మనసు కలవరపడిన తరుణంలో, గీతాంజలి అతనిని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లి, మానసికంగా ప్రశాంతతను అందించాలనుకుంటుంది. కాశ్మీర్‌కు వెళ్ళి అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తే, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండిపోతామని ఆమె ఆశిస్తుంది. రణ్ విజయ్ ఈ సన్నివేశంలో తన గత జీవితంలోని ప్రతి అనుభవం, మధుర క్షణాలన్నింటినీ గుర్తు చేసుకుంటాడు.

ముగింపు:

చాలామంది ఈ యానిమల్ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈ సినిమాలోని శృతిమించి వైలెంట్, బ్లడ్, లైంగికత ఉంటాయి కాబట్టి. నాకు తెలిసి ఈ సినిమాని ద్వేషించేవారు కన్నా ఇష్టపడేవారే ఎక్కువ అని నా భావన. నా విషయానికి వస్తే ఇది ఒక అద్భుత కావ్యంలాగ అనిపిస్తుంటుంది. ఈ సినిమాలోని అన్ని పాటలు ఒక్కో ఆణిముత్యంలాగ అనిపిస్తాయి. అందులో ఈ కార్మీరు పాట కూడా ఉంటుంది. ఈ పాటను వింటూ అలా ప్రశాంతంగా నిద్రలోకి జారుకోవచ్చు. ఈ పాట ఎప్పుడు ఎలా మొదలవుతుందంటే మన కధానాయకుడు రణ్ విజయ్ కు గుండె మార్పిడి చేయక ముందు ఏదో మైకంలో ఉన్నటుంటాడు. తన నోటికి రుచి తెలియకుండా మరియు లైంగిక భావనలు కూడా కలగని స్థితిలో ఉన్నప్పుడు ఈ పాట మొదలవుతుంది.

ముఖ్యంగా ఈ పాటను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. జాగ్రత్త అంటే ఏమి లేదండి రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉంటాయి, ముఖ్యంగా లిప్ కిస్ సీన్స్. అందుకే కాస్త జాగ్రత్త. ఈ యానిమల్ సినిమాలో రణ్ విజయ్ మరియు గీతాంజలి మొదటి సారిగా కలిసినప్పుడు “అమ్మాయి” అనే పాటలో కాశ్మీర్ లో విహరిస్తారు. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి గీతాంజలి తనను కాశ్మీర్ కు తీసుకుని వళ్ళు అక్కడి అందమైన ప్రకృతి ఒడిలో చేదదీరి ప్రశాంతంగా కాలాన్ని గడుపుదామని రణ్ విజయ్ కు చెబుతుంది. ఇలా పాట సాగుతూ ఉంటుంది. యూట్యూబ్ లో ఈ పాటను చూస్తున్నప్పుడు కొంత మందికి వీడియోలో ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు నచ్చకపోవచ్చు కానీ ఈ పాట మాత్రం యునానిమస్ గా నచ్చే తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top