‘కళ్ళారా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Kallara Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన సత్యభామ (Satyabhama) అనే తెలుగు సినిమాలోని పాట. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూన్ 7న థియేటర్లలో విడుదలైంది. అయితే, విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలు అందుకుని, బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఎంతలా అంటే వికీపీడియా ప్రకారం 10 కోట్లతో రూపొందించబడిన ఈ సినిమా కేవలం 2.5 కోట్లను మాత్రమే వసూలు చేసింది.
ఇంతకి ఈ ‘సత్యభామ’ సినిమా కథేటంటే, సత్యభామ (కాజల్ అగర్వాల్) అనే ఓ ఏసీపీ షీ టీమ్‌లో పనిచేస్తూ, నేరస్తులను ఎదుర్కొనే ధైర్యం కలిగిన వ్యక్తి. సత్యభామకు అప్పగించిన ప్రతి కేసును విజయవంతంగా పూర్తి చేయడం ఆమె ప్రత్యేకత. వ్యక్తిగత జీవితానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ, తన వృత్తి జీవితం పట్ల అంకితభావంతో ఉంటుంది. రచయిత అమరేందర్ (నవీన్ చంద్ర)తో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా, ఆమె తన ఉద్యోగానికి అత్యధిక సమయం కేటాయిస్తుంది. ఒక రోజు, హసీనా అనే మహిళ గృహహింసకు గురై సత్యభామను ఆశ్రయిస్తుంది. సత్యభామ హసీనా పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పినప్పటికీ, ఆమె భర్త చేతిలో హత్యకు గురవడం సత్యభామను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సంఘటనతో ఆమె ఆ నేరస్తుని పట్టుకోవాలని తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ కేసు ఆమె జీవితంలో కొత్త సవాళ్లను తెస్తుంది, మరియు చివరికి న్యాయం సాధించడానికి ఆమె ఎలా ముందుకు వెళ్ళింది అనేది తెరపై చూడాల్సిన అంశం.
లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటీమణుల విషయానికి వస్తే, నయనతార, అనుష్క మొదటి గుర్తుకు వచ్చే పేర్లు. ఈ తరహా పాత్రల్లో నటించడం అనేది కాజల్ అగర్వాల్‌కి మాత్రం ఇప్పటి వరకు పెద్దగా అవకాశం రాలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత (2019) సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, అది పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమా కాదు, ఎందుకంటే సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఉన్నాడు. చాలా కాలం కాజల్‌ను ప్రేక్షకులు హీరోల పక్కన రొమాన్స్ చేయడం, పాటలు పాడడం వంటి పాత్రలలో మాత్రమే చూసారు. కాని ఇప్పుడు సత్యభామ సినిమాతో ఆమె కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రంలో మెయిన్ లీడ్‌గా నటించడం జరిగింది. సాధారణంగా నిర్మాతలు హీరోయిన్లను ప్రధాన పాత్రలుగా తీసుకొని సినిమాలు తీయడం చాలా అరుదు, ఎందుకంటే హీరోలతో పోల్చితే వారికి తక్కువ ఫ్యాన్ బేస్ ఉండటం, అలాగే హీరోల సినిమాల్లో ఉండే కమర్షియల్ హంగులు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. అందుకే ఈ తరహా సినిమాలు నిర్మించడం చాలా పెద్ద రిస్క్. అయినప్పటికీ, కాజల్ ప్రధాన పాత్రలో సత్యభామ సినిమాను తీసిన నిర్మాతలకు కథ పట్ల, కాజల్ నటన పట్ల ఉన్న నమ్మకం ఎంతో గట్టిదై ఉండాలి.
సత్యభామ సినిమాలోని అన్ని పాటలకు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను శ్రీచరణ్ పాకాల అందించడం వల్ల సంగీతం దృశ్యానికి మంచి బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోని పాటలలో “కళ్ళారా” పాట ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాటకు రాంబాబు గోసల సాహిత్యాన్ని అందించగా, శ్రేయా ఘోషాల్ తన సునిశితమైన గాత్రంతో పాటను అందంగా ఆలపించారు. ఈ పాట పెద్ద హిట్ కావడంతో, సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేయడంలో దాని పాత్ర కీలకమైంది. తెలుగు సినిమాల్లో సాధారణంగా నాలుగు పాటలు ఉంటాయి, కానీ వాటిలో ఒకటో రెండో మాత్రమే సుదీర్ఘకాలం గుర్తుండిపోయే విధంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. “కళ్ళారా” పాట కూడా అలాంటి ఎవర్గ్రీన్ తెలుగు పాటలలో ఒకటిగా నిలవడంలో సందేహమే లేదు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “కళ్ళారా” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: కళ్ళారా (Kallara)
- సినిమా: Satyabhama (సత్యభామ)
- నటీనటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర
- సినిమా దర్శకుడు: సుమన్ చిక్కాల
- సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
- గేయరచయిత: రాంబాబు గోసల
- గాయని: శ్రేయ ఘోషాల్
- సినిమా విడుదల తేదీ: జూన్ 7, 2024
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Kallara Song Lyrics in Telugu
నువ్వేనా నువ్వే నేనా
గుండెల్లో దాచాలే
నిన్నేనా నా నిన్నేనా
నీ ఊహల గుసగుస పదనిసలే
ఉయ్యాలే ఊపేనా
నీ ఊసుల మధురిమ హృదయమునే
మైకంలో ముంచేసేనా
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ తోనే
నడిచెలే ప్రాణం
కడలల్లే నీవుంటే
కౌగిలిలోకి రానా నదిలా
కలకాలం ప్రేమిస్తా ఇలా
ఆ ఆ ఆ.. కలువల్లే వేచుంటే
నీవే నా చనువై జతపడమని
ఆరాటం ఏంటంటా ఇలా
వాన విల్లై విరిసేలే
నా వయసే నిన్నే తలచి
వెన్నెలల్లే మెరిసేలే
నా కలలా తీరం
నింగి నీలం మనమౌతు
మురిపెంగా కలిసుందామా
ఏదేమైన నువ్ నా ప్రాణమా
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ తోనే
నడిచెలే ప్రాణం
ప్రాణం.. ప్రాణం..
ప్రాణం.. ప్రాణం..
Kallara Lyrics in English
Nuvvenaa Nuvve Nenaa
Gundello Daachaale
Ninnena Naa Ninnenaa
Nee Oohala Gusagusa
Padhanisale
Uyyaale Oopenaa
Nee Oosula Madhurima
Hrudayamune
Maikamlo Munchesenaa
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Nee Pere
Pilichele Naa Mounam
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Neethone
Nadichele Praanam
Kadalalle Neevunte
Kougililoki Raanaa Nadhilaa
Kalakaalam Premisthaa ilaa
Aa Aa Aa Kaluvalle Vechunte
Neeve Naa Chanuvai
Jathapadamani
Aaraatam Entantaa ilaa
Vaana Villai Virisele
Naa Vayase Ninne Talachi
Vennelalle Merisele
Naa Kalala Teeram
Ningi Neelam Manamouthu
Muripemgaa Kalisundaamaa
Edhemaina Nuv Naa Praanamaa
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Nee Pere
Pilichele Naa Mounam
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Neethone
Nadichele Praanam
Praanam.. Praanam..
Praanam.. Praanam..
కళ్ళారా చుసాలే Video Song
పాట వచ్చే సందర్భం:
ఈ పాటలో కాజల్ పాత్రలో ఉన్న సత్యభామ తన భర్త అమరేందర్ (నవీన్ చంద్ర) తో కలిసి కారులో ప్రయాణం చేసే సమయంలో సత్యభామ ఈ కళ్ళారా పాట యొక్క ట్యూన్ ను గానం చేస్తుంది. అప్పుడు తన పక్కనే కార్ డ్రైవ్ చేస్తున్న తన భర్త అమరేందర్ కాలేజి రోజులలో తమ ప్రేమ ఎలా మొదలైందో గుర్తు చేసుకుంటాడు. ఇంతకి ఏమి జరిగిందంటే కాలేజీలో ఇదే పాటను సత్యభామ పాడుతుంటుంది. ఆ మధురమైన స్వరం ఎవరిదని వెదుకుతూ ఎక్కడో మైదానంలో ఉన్న అమరేందర్ పరుగెత్తుకుంటు వస్తాడు. చివరకు ఆమెను చూసి ఫీదా అయి, తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు.
ఇదే విషయాన్ని ఇప్పుడు ఆమెకు చెబుతాడు. అప్పుడు ఆమె అంటుంది ఏంటీ నువ్వు పరుగెత్తుకుంటు వచ్చావని చెప్పనే లేదు అంటుంది. అంటే తన పాట విని ఈ గొంతు ఎవరిదా అని వెతుకుతూ వచ్చానని చెప్పి ఉంటాడు. కానీ అక్కడ నిజంగా అతను పరుగెత్తుకుంటూ వచ్చి ఉంటాడు. అదే విషయాన్ని ఆమె అడగడంతో తను సిగ్గు పడతాడు. ఇలా ఆమె మళ్ళీ ఆ పాటను పాడుతూ ఉంటుంది.
ముగింపు:
తెలుగు మాట్లాడానికి కూడా రాని శ్రేయా ఘోషాల్ తో తెలుగు పాట పాడించారంటేనే అది మామూలు పాట కాదని ఇట్టే అర్థం చేసుకోవాలి. ఆమె రెమ్యూనిరేషన్ తో పాటు ఆమెను కాంటాక్ట్ అయి పాట పాడించడానికి ఒప్పించి పాడించడమంటే మామూలు విషయం కాదు. ఇంత మేనేజ్ చేసుకుని ఆమెతోనే పాట పాడించారంటే ఆ పాట ఖచ్చితంగా సాధారణ పాటైతే అయి ఉండదు. ఇంతకు ముందు కూడా శ్రేయా ఘోషాల్ తో పాడించిన తెలుగు పాటలు కూడా మంచిగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కళ్ళారా పాట కూడా ఏ అనుమానం లేకుండా ట్రెండింగ్ లోకి వెళుతోంది. దీనిబట్టి తెలుస్తుంది కదా ఆ పాట వాల్యూ ఏమిటని. నిజంగా శ్రేయా ఘోషాల్ చిన్నప్పుడు తేనే మాత్రమే తిన్నదేమో, ఏంటి స్వామి ఆ గొంతు. వావ్… ముఖ్యంగా ఈ పాట పాడిన విధానం అబ్బబ్బా సూపర్ అంతే.