Kalallo Song Lyrics – Virupaksha (2023) | Anurag Kulkarni

కలల్లో పాట యొక్క లిరిక్స్‌ను (Kalallo Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట విరూపాక్ష (Virupaksha) అనే తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రంలోనిది. ఈ సినిమా మొదట 2023 ఏప్రిల్ 21న తెలుగు భాషలో థియేటర్లలో విడుదలైంది. తరువాత, ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి 2023 మే 5న పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్, శాటిలైట్ హక్కులు స్టార్ మా కైవసం చేసుకున్నాయి. 2023 మే 21న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వగా, జూన్ 25న స్టార్ మాలో ప్రసారం చేశారు.

ఈ సినిమా నిర్మాతల్లో అగ్ర తెలుగు దర్శకుడు సుకుమార్ కూడా ఒకరు. ఆయన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం “కుమారి 21F.” ఈ సినిమాకి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఆయన దగ్గర పనిచేసిన సహాయకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ఈ కుమారి 21ఎఫ్ తర్వాత చాలా సినిమాల నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ పాలుపంచుకుంది. వాటిలో చాలా వాటికి దర్శకత్వం వహించింది సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళే. అలాగే ఈ విరూపాక్ష సినిమాకు దర్శకత్వం వహించిన కార్తిక్ దండు కూడా సుకుమార్ అసిస్టెంటే. అంటే ఈయన తన నిర్మాణ సంస్థ ద్వారా మంచి కథలతో పాటు తన దగ్గర అసెస్టెంట్స్ గా పనిచేసిన వారిని దర్శకులుగా చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు.

2023లో విడుదలైన మాంచి సినిమాలలో ఈ విరూపాక్ష సినిమా కూడా ఒకటి. ఇందులో ఏ సందేహం కూడా లేదు. ఇది ప్రేక్షకుల మనస్సును చూరగొన్నది. అదే స్థాయిలో ఇందులోని పాటలు కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వాటిలో ఈ ‘కలల్లో’ పాట కూడా ఒకటి. దీనికి సంగీతాన్ని అందించింది బి.అజనీష్ లోక్‍నాథ్. అలాగే ఈ పాటను రాసింది అనంత శ్రీరామ్, పాడింది అనురాగ్ కులకర్ణి, మధుశ్రీ. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “కలల్లో” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: కలల్లో (Kalallo)
  • సినిమా: Virupaksha (విరూపాక్ష)
  • నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్
  • సినిమా దర్శకుడు: కార్తిక్ దండు
  • సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోకనాథ్
  • పాట రచయిత: అనంత శ్రీరామ్
  • గాయకులు: అనురాగ్ కులకర్ణి, మధుశ్రీ
  • సినిమా విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023
  • లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్

Kalallo Song Lyrics in Telugu

కలల్లో నేనులిక్కి పడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే
ఇలా అయోమయంగ నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే

పదే పదే అడక్కు నువ్వింక
పెదాలతో అనొద్దు ఆ మాట
పదాల్లలో వెతక్కు దాన్నింక
కదుంది కళ్ళ లోపట

ఎవరికి తెలియని లోకం
చూపిస్తుందే నీ మైకం
ఇది నిజమా మరి మహిమా ఏమో

అటు ఇటు తెలియని పాదం
ఉరకేసేదెందుకు పాపం
అవసరమా కుడిఎడమో నేమో

కలల్లో నేనులిక్కి పడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే
ఇలా అయోమయంగ నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే

పదే పదే అడక్కు నువ్వింక
పెదాలతో అనొద్దు ఆ మాట
పదాల్లలో వెతక్కు దాన్నింక
కదుంది కళ్ళ లోపట

నువ్వొచ్చి నా ప్రపంచమౌతుంటే
ప్రపంచమే నిశ్శబ్ధమౌతుందే
తపస్సుల తపస్సుల
నిన్నే స్మరించనా స్మరించనా

పొగడ్తల పొగడ్తల ఉన్నా
వినేందుకు విధంగ బాగుందే
వయస్సులో వయస్సులో
అంతే కవ్వించినా క్షమించినా

చిలిపిగా ఆ…
మనస్సులో రహస్యమేమున్నా
భరించనా వరించనా

కలల్లో నేనులిక్కి పడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే
ఇలా అయోమయంగ నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే

ఎవరికి తేలియని లోకం
చూపిస్తుందే నీ మైకం
ఇది నిజమా మరి మహిమా ఏమో

అటు ఇటు తెలియని పాదం
ఉరకేసేదెందుకు పాపం
అవసరమా కుడిఎడమో నేమో

కలల్లో నేనులిక్కి పడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే

Kalallo Lyrics in English

Kalallo Nenulikki Paduthunna
Nijaanni O Kolikki Thevente
Ilaa Ayomayanga Nenunna
Idhantu Thelchavemite

Padhe Padhe Adakku Nuvvinka
Pedhaalatho Anoddhu Aa Maata
Padhaallalo Vethukku Dhaanninka
Kadhundhi Kalla Lopata

Yevariki Theliyani Lokam
Choopisthundhe Nee Maikam
Idhi Nijama Mari
Mahima Yemo

Atu Itu Theliyani Paadham
Urakesendhendhuku Paapam
Avasarama Kudiedamo Nenu

Kalallo Nenulikki Paduthunna
Nijaanni O Kolikki Thevente
Ilaa Ayomayanga Nenunna
Idhantu Thelchavemite

Padhe Padhe Adakku Nuvvinka
Pedhaalatho Anoddhu Aa Maata
Padhaallalo Vethukku Dhaanninka
Kadhundhi Kalla Lopata

Nuvvochi Naa Prapanchamouthunte
Prapanchame Nishabdhamouthundhe
Thapassula Thapassula
Ninne Smarinchana Smarinchanaa

Pogadthala Pogadthala Unna
Vinendhuku Vidhanga Baagundhe
Vayassulo Vayassulo
Anthe Kavvinchina Kshaminchina

Chilipiga Aa AaAa
Manassulo Rahasyamemunna
Bharinchanaa Varinchanaa

Kalallo Nenulikki Paduthunna
Nijaanni O Kolikki Thevente
Ilaa Ayomayanga Nenunna
Idhantu Thelchavemite

Padhe Padhe Adakku Nuvvinka
Pedhaalatho Anoddhu Aa Maata
Padhaallalo Vethukku Dhaanninka
Kadhundhi Kalla Lopata

Yevariki Theliyani Lokam
Choopisthundhe Nee Maikam
Idhi Nijama Mari
Mahima Yemo

Atu Itu Theliyani Paadham
Urakesendhendhuku Paapam
Avasarama Kudiedamo Nenu

Kalallo Nenulikki Paduthunna
Nijaanni O Kolikki Thevente

కలల్లో నేనులిక్కి పడుతున్నా Video Song

Virupaksha - Kalallo Lyrical Video | Sai Dharam Tej, Samyuktha, Sukumar B, Karthik Dandu, Ajaneesh

మీకు గుర్తుందో లేదో కమల్ హాసన్ నటించిన దశవతారం సినిమాలో ముకుంద ముకుంద అనే పాటను మీరు వినే ఉంటారు కదా, నాకు ఈ కలల్లో పాటను విన్నప్పుడు ఈ పాటే గుర్తుకు వచ్చింది. నాకు అనుమానం వచ్చి ఈ రెండు పాటలను పాడిన అమ్మాయి (లేడి వాయిస్) ఒకరేనా అని వెదికితే కాదు వారు ఇరువురు వేరు వేరు అని తెలిసింది. కానీ నేను ఈ కలల్లో పాటను విన్నప్పుడల్లా ముకుందా ముకుందా పాట వైబ్ నే ఫీల్ అవుతున్నా. ఈ పాట ఎంత క్లాసిక్‍గా ఉందంటే ఈ మధ్య ఇలాంటి పాటలు రావడం లేవు. ప్రేమలో ఉన్న జంటలైతే ఈ పాటను తమ తమ ప్రియమైన వారికి అంకితం చేయొచ్చు. మీరు పాడితే కొంచెం వినేలాగా ఉంటే, మీరు ప్రేమతో ఈ పాటను మీ పార్ట్‍నర్ తో కలిసి పాడొచ్చు.

నేను గాయని విషయంలో పొరబడినట్టే గాయకుడి విషయంలో కూడా పొరబడిన. నేను అనురాగ్ కులకర్ణి పాటలను చాలానే విన్నా కానీ, ఈ పాటను పాడింది ఈయనే అని గుర్తించలేకపోయా. మొదట్లో ఈ కలల్లో పాటను విన్నప్పుడు దీనిని పాడింది ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారి కొడుకు చరణ్ గారు అని భ్రమపడినాను. తర్వాత అనురాగ్ అని తెలిసి ఒకింత ఆశ్చర్యానికి గురి అయినాను. ఎందుకంటే ఈ క్లాసిక్ పాటను ఆయన పాడిన విధానం చాలా కొత్తగా ఉంది. అలాగే దీనికి అజనీష్ లోకనాథ్ గారు కూడా ఎడాపెడా ఉన్న సంగీత వాయిద్యాలను అన్ని ఉపయోగించకుండా, ఈ పాటలో ఎంతవరకు మ్యూజిక్ వాడాలో అంతే వాడారు. దీని ద్వారా మ్యూజిక్ సాహిత్యాన్ని, అలాగే సింగర్స్ యొక్క ఆటో ట్యూన్ కు అడ్డుపడకుండా ఉండి, మనం ఏదో నైంటీస్ పాటను వింటున్నట్టు భ్రమను కలిగించారు.

అదే విధంగా ఈ సినిమా 21 ఏప్రిల్ 2023న విడుదల అవుతుందనగా 17 ఏప్రిల్ నాడు ఈ కలల్లో పాటను విడుదల చేశారు. నేను థియేటర్ లో ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఈ పాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. కానీ ఎప్పటికీ రాదే. రాదే కాదు అస్సలు సినిమాలో ఈ పాటను లేపేశారు. ఎందుకో మరి దీనిని ఎక్కడ పెట్టాలో తెలియక తీసేసి ఉంటారు. ఎందుకంటే సినిమా మొదట్లో హీరోయిన్ హీరోను పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటుంది. కానీ మన హీరో ఆమె వెంట పడుతూ ఉంటాడు. ఆ సమయంలో నచ్చావులే నచ్చావులే పాట వస్తుంది. తర్వాత సన్నివేశాలు ఆ ఊరిలో జరిగే మరణాల గురించి, ఆ ఊరిని అష్టదిగ్భందనం చేయడం గురించి సాగుతుంటాయి. ఇలా ఆసక్తిగా సాగుతున్న కథలో ఈ పాటను అనవసరంగా ఉంచడం అవసరమా అని తీసేసి ఉండొచ్చు. మీరు ఈ పాటను థియేటర్స్ లో చూడకపోయిన ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంది, కావున ఒకసారి లుక్ వేయండి.

Report a Lyrics Mistake / Share Your Thoughts