‘గరం గరం‘ పాట యొక్క లిరిక్స్‌ను (Garam Garam Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది ఆగస్ట్ 29, 2024న విడుదలైన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) అనే తెలుగు విజిలెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలోనిది. నాని, ఎస్.జె. సూర్య మరియు ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ “సరిపోదా శనివారం” సినిమా, వివేక్ ఆత్రేయ రచన మరియు దర్శకత్వంలో రూపొందించబడింది. ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించారు.
వివేక్ ఆత్రేయ తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన శైలితో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. తన సినిమా కథలు, పాత్రల నిర్మాణం, సంభాషణలు ప్రతి చిత్రంలోకూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు ఆయన మొత్తం నాలుగు సినిమాలు మాత్రమే తీశారు, కానీ వాటి ప్రతిభతోనే ప్రేక్షకులను అలరించారు. 2017లో “మెంటల్ మదిలో” సినిమాతో ఆయన దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు, ఇందులో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. తర్వాత 2019లో శ్రీవిష్ణుతో మరో సినిమా “బ్రోచేవారెవరురా” తీసి, వరుసగా రెండు సినిమాలు ఒకే హీరోతో తీశారు. తర్వాత నాని హీరోగా “అంటే సుందరానికి” (2022) చిత్రంతో సక్సెస్ సాధించారు. ఇప్పుడేమో మళ్ళీ నాని హీరోగా “సరిపోదా శనివారం” (2024) తీసి, తన సినిమాటిక్ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. విశేషంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, వివేక్ ఒక హీరోతో సినిమాలు తీసినప్పుడు, ఆ తర్వాత కూడా అదే హీరోతో మరొక సినిమా తీసే ఆచారం పాటిస్తున్నారు. చూడాలి ముందు ముందు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాడ లేదా అని.
ఇంతకి ఈ సినిమా కథేంటంటే, సూర్య (నాని) అనే యువకుడు తన తల్లి చనిపోయే ముందు తీసుకున్న మాట ప్రకారం వారానికి ఒక రోజు మాత్రమే కోపం తెచ్చుకుంటాడు. ఆ రోజు శనివారం. అతను తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నప్పుడు, తన డైరీలో వారంత చేసిన తప్పులను రాసుకుంటాడు. శనివారం వచ్చినప్పుడు, తన డైరీలో రాసుకున్న పేరులో ఎవరి మీదైతే ఇంకా కోపం ఉంటుందో వారిని కలుసుకొని వారిని కొట్టి వస్తుంటాడు. సూర్యకు ఒక అందమైన యువతి చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమ పుడుతుంది. అమె కానిస్టేబుల్ గా పనిచేస్తు ఉంటుంది. కానీ ఆమెకు హింస అంటే అసహ్యం. సూర్య తన శనివారం రహస్యాన్ని ఆమెతో చెప్పాలనుకుంటాడు కానీ అలా చేయలేకపోతున్నాడు. ఇంతలో, సీఐ దయానంద్ (ఎస్.జె. సూర్య) అనే పోలీస్ ఆఫీసర్ చేసే కృత్యాలు నచ్చక సూర్యాకు విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు సూర్య తన శనివారం కోపంతో దయానంద్‌ను కూడా శిక్షించాలని నిర్ణయిస్తాడు. కానీ చారులత సూర్యకు ఒక ప్రణాళిక చెబుతుంది. అది వర్క్ అవుట్ అయ్యిందో లేదో సినిమాలోనే చూడాలి.
ఇక ఈ సినిమాలోని ‘గరం గరం’ పాటకు సంగీతాన్ని అందించినది ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్. ఈ పాటకు సాహిత్యాన్ని రాసింది సనాపతి భరద్వాజ, ఆయన మాటలు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా అమర్చబడ్డాయి. ఈ ఆకర్షణీయమైన పాటను శక్తివంతమైన గాయకుడు విశాల్ దద్లానీ పాడాడు, ఆయన ప్రత్యేకమైన శ్రావ్యం మరియు ఆలాపన ద్వారా ఈ పాటకు ప్రత్యేకతను తెచ్చారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “గరం గరం” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: గరం గరం (Garam Garam)
- సినిమా: Saripodhaa Sanivaaram (సరిపోదా శనివారం)
- నటీనటులు: నాని, ఎస్‌జే సూర్య, ప్రియాంక మోహన్
- సినిమా దర్శకుడు: వివేక్ ఆత్రేయ
- సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్
- గేయరచయిత: సనాపతి భరద్వాజ పాత్రుడు
- గాయకుడు:విశాల్ దద్లానీ
- సినిమా విడుదల తేదీ: ఆగస్ట్ 29, 2024
- లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్
Garam Garam Song Lyrics in Telugu
గండర గండర గండడు ఎవడు
దండిగ నిండిన
దుండగ దండుకి
దండన వేసే వీడు
మాములుగ నాటు ఐన నీటు
ఎరగడు తడబాటు
ఆ మాసు క్లాసుల
మధ్యన ఊగుట
వీడికి అలవాటు
ముని మాదిరి మ్యూట్-ఉ
ఆ స్లాట్ లో నో ఫైట్-ఉ
శత్రువు తల స్లేట్-ఉ
రాస్తాడటరా ఫేట్-యు
కేర్ఫుల్ వాట్ యు థింక్
కేర్ఫుల్ వాట్ యు సే
గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే
కుడ్ బి సాటర్డే
గరం గరం యముడయో
సహనాల శివుడయో
నరం నరం బిగువయో
నియమాల తెగువయో
కణం కణం కరుకయో
ఇది ఇంకో రకమయో
అయోమయం తగదయో
సమయంతో మెలికయో
ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే
కిక్కుని పక్కన నెడతాడే
రెస్ట్ అనే టెస్టు లో బెస్టు గ వీడే
లిస్టులు రాయడమొదలడే
రాంగు రైటు గడబిడలో
ఏది కరెక్టో తెలపడురో
లెఫ్ట్ ఓ, రైట్ ఓ, మరి స్ట్రెయిట్ ఓ
ఎవ్వడినీ అడగడురో
కనుచూపే ఊరిమిండోయ్
తిమిరంకే వదిలెను తిమ్మిరి
నలుపంతా కరిగే వరకు
మెరుపై మెరుపై తరిమిందోయ్
కేర్ఫుల్ వాట్ యు థింక్
కేర్ఫుల్ వాట్ యు సే
గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే
కుడ్ బి సాటర్డే
గరం గరం యముడయో
శివమెత్తే శివుడయో
నరం నరం బిగువయో
విలయంలో వినడయో
కణం కణం కరుకయో
తనువంతా తెగువయో
అయోమయం తగదయో
శనివారం తనదయో
పురాణే జమానే మే నరకాసుర
నమక్ ఏక్ రాక్షస్ రెహతా తా
వో లోగోన్ కో బహుత్ సథాతా తా
ఇస్లియే శ్రీ కృష్ణ నే
సత్యభామ కే సాత్ మిల్కర్ ఉసే
మార్ డాలా
కమ్మగా సరికొత్తగా
సృష్టించిన లోకం చూడరా
బుద్ధిగా బహుశ్రద్ధగా
సరిహద్ధే దాటని తీరురా
ఓర్పుతో నేర్పుతో నిప్పుని
గుప్పిట కప్పడా
శనివారమై సెగ కక్కుతూ
ప్రతి వారపు కథలని కాల్చడా
గరం గరం యముడయో
యముడయో యముడయో
నరం నరం బిగువయో
బిగువయో బిగువయో
శనివారం తనదయో
Garam Garam Lyrics in English
Gandara Gandara
Gandara Gandadu Evadu
Dhandiga Nindina
Dhundaga Dhanduki
Dhandana Vesey Veedu
Mamuluga Naatu
Aina Neat U
Yeragadu Thadabaatu
Aa Massu Classu La
Madhyana Ooguta
Veediki Alavaatu
Muni Maadhiri Mute U
Aa Slot Lo No Fight U
Shatruvu Thala Slate U
Raasthaadataraa Fate U
Careful What You Think
Careful What You Say
Get It Wrong And Everyday
Could Be Saturday
Garam Garam Yamudayo
Sahanaalaa Shivudayo
Naram Naram Biguvayo
Niyamaala Theguvayo
Kanam Kanamkarukayo
Idhi Inko Rakamayo
Ayomayam Thagadhayo
Samayamtho Melikayo
Yekkadikakkada Lekkalu Thelche
Kickuni Pakkana Nedathaadey
Rest Ane Test U Lo
Best U Ga Veede
List-u lu Raayadamodhaladey
Wrongu Rightu Gadabidalo
Yedhi Correcto Thelapaduro
Left O, Right O, Mari Straight O
Yevvadini Adagaduro
Kanuchupe Urimindoy
Timiramke Vadilenu Timmiri
Nalupantaa Karige Varaku
Merupai Merupai Tarimindoy
Kanuchoope Urimindoy
Careful What You Think
Careful What You Say
Get It Wrong And Everyday
Could Be Saturday
Garam Garam Yamudayo
Shivametthey Shivudayo
Naram Naram Biguvayo
Vilayamio Vinadayo
Kanam Kanamkarukayo
Thanuvanthaa Theguvayo
Ayomayam Thagadhayo
Samayamtho Melikayo
Puraane Jamaane Mein Narakaasur
Naamak Ek Raakshas Rehta Tha
Wo Logon Ko Bahut Sathatha Tha
Isliye Shree Krishna Ne
Sathyabhama Ke Sath Milkar Use
Maar Dala
Kamhagaa Sarikotthagaa
Shrustinchina Lokam Choodaraa
Buddhigaa Bahushraddhagaa
Sarihaddhey Dhaatani Theeruraa
Orputho Nerputho
Nippuni Guppita Kappadaa
Sanivaaramai Sega Kakkuthoo
Prathi Vaarapu
Kathalani Kaalchadaa
Ggaram Garam Yamudayo
Yamudayo Yamudayo
Naram Naram Biguvayo
Biguvayo Biguvayo
Sanivaaram Thaadhayo
గరం గరం Video Song
ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై చాలామందిలో అంచనాలు పీక్ లో ఉండేవి. ముఖ్యంగా ఆ టైటిల్ విన్నవారు దానిని డీకోడ్ చేయడానికి చాలానే ప్రయత్నించారు. అంటే ఇదేమైన హాలీవుడ్ మూవిలలో హీరోలాగా శనివారం మాత్రమే హీరోకు స్పెషల్ పవర్స్ ఏమన్నా వస్తాయా, అసలు శనివారమని పేరు ఎందుకుపెట్టి ఉంటారు ఇలా చాలానే అనుమానాలు అంచనాలు ఈ సినిమాపై పెట్టుకున్నారు.
ఎప్పుడైతే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైందో, ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు వారు చాలా నిరాశకు గురైనారు. ఎందుకు శనివారం అని పేరు పెట్టారంటే, మన హీరో సూర్య (నాని పాత్ర) కు విపరీతమైన కోపం వస్తుండేది చిన్నప్పుడు అప్పుడు సూర్య అమ్మ కోపాన్ని కంట్రోల్ చేసుకో, ఒకవేళ కంట్రోల్ కాకపోతే వాటిని ఒక డైరీలో రాసి పెట్టుకుని, ఆ డైరీని మళ్ళి శనివారం చూడు. అప్పటికి వాళ్ళపై కోపం ఉంటే శనివారం మాత్రమే ఆ కోపాన్ని చూపించు అని చెప్పి ఉంటుంది. ఇదే సరిపోదా శనివారం సినిమా టైటిల్ వెనక ఉన్న కారణం.
అలాగే టైటిల్ కు తగ్గట్టుగానే టైటిల్ సాంగ్ లాగా ఈ ‘గరం గరం’ పాట ఉంటుంది. శనివారం నాడు మన హీరో తన కోపాన్ని తీర్చుకునే సమయంలో ఈ పాట ప్లే అవుతూ ఉంటుంది. అంటే హీరో మోటీవ్ ఏంటనేది ఈ పాట ద్వారా తెలుసుకునేలా ఉంటాయి ఈ పాటలోని లిరిక్స్. ఇందులోని మ్యూజిక్ కూడా చాలా ఎనర్జిటిక్ గా ఫాస్ట్ బీట్ లో సాగుతుంటుంది. ఒక విధంగా ఈ సరిపోదా శనివారం సినిమాకు ఆంథమ్ పాటల ఉంటుందీ ‘గరం గరం’ పాట.