‘ఎవరెవరో‘ పాట యొక్క లిరిక్స్‌ను (Evarevaro Song Lyrics) గురించి ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట అక్టోబర్ 1, 2023న విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోనిది. ఈ పాట నభూతో నా భవిష్యత్. అస్సలు త్రీప్తీ దిమ్రి పాటలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలను ఎలా ఒప్పుకుందో, అసలు దర్శక ధీరుడు సంధీప్ రెడ్డి వంగా ఎలా ఒప్పించి ఉంటాడో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్నను అడగగా, త్రీప్తి సమాధానం చెబుతూ సందీప్ రెడ్డి వంగా ఈ సన్నివేశాలను ఎలా తీయబోతున్నాడో, ఎందుకు ఇంత బోల్డ్ సీన్ ఈ పాటలో అవసరమో చాలా క్లియర్ గా వివరించి, నీకు ఏవైనా సన్నివేశాలు నచ్చకపోతే నిరభ్యంతరంగా చెప్పమని చెప్పాడు అని చెప్పింది. కాని తను ఏమి అడ్డు చెప్పి ఉండదు అని ఆ పాటలోని సన్నివేశాలను ముఖ్యంగా బెడ్ రూమ్ లో సీన్ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే త్రీప్తి దిమ్రి కూడా అలాంటి బోల్డ్ సీన్ కు అంగీకారం తెలిపిందంటే ఆమె గట్స్ కు రణ్ విజయ్ లాగా సెల్యూట్ చెయ్యాలి. ఎందుకంటే ఆమె ఆ సినిమా కథను మరియు దర్శకుడైన సందీప్ రెడ్డిని అంత నమ్మింది అని చెప్పొచ్చు.
ఇక ఈ ఎవరెవరో పాట విషయానికి వస్తే, ఈ పాటను రాసింది అనంత శ్రీరామ్. ఇతనికి బాడీపైన ఫ్యాట్ లేకపోయిన పాట రాసేదానిలో మాత్రం మంచి పట్టు ఉంది. బాడీ శేమింగ్ అనకండయ్యా ఏదో ప్రాసకు కక్కుర్తిపడి అలా వ్రాసాను అంతే. అనంత శ్రీరామ్ ఈ యానిమల్ చిత్రంలోని అన్ని తెలుగు పాటలకు సాహిత్యాన్ని అందించాడు. ఈయన రాసే పాటలలో తెలుగు సాహీత్యం బంగారంలా మెరుస్తూ ఉంటుంది. పాటల కోసం పదాలు సమకూర్చే విధానంలో విలక్షణత కనబడుతూ ఉంటుంది. అది ఈ పాటలో కూడా కనబడుతూ ఉంటుంది.
ఈ పాటకు సంగీతం మరియు గానం అందించింది ప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు అయిన విశాల్ మిశ్రా. ఇతను డిడి నేషనల్ ఛానల్ లో మొదట పని చేశాడు. అలాగే ఇండియన్ ఐడల్ కి కూడా ఆడిషన్స్ ఇచ్చాడు కానీ డిస్క్వాలిఫై అయ్యాడు. మిశ్రా 2016లో తమిళ చిత్రం దేవితో స్వరకర్తగా అరంగేట్రం చేశారు. ఇతను సోలో కంపోజర్ గా పనిచేసిన చిత్రం 2019లో సల్మాన్ ఖాన్ నిర్మించిన నోట్ బుక్. ఈ చిత్రానికి గాను పాటలు మరియు స్కోర్ ను అందించాడు. మిశ్రా సంగీతం అందించిన చాలా పాటలకి తనే గానం కూడా అందిస్తుంటాడు. అలాగే ఈ పాటకి కూడా తనే సంగీతం మరియు స్వరాన్ని కూడా అందించాడు. నిజానికి ఇతను హింది వ్యక్తి అయినప్పటికి తెలుగు పాటను ఇంత చక్కగా పాడటం అంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పొచ్చు. అదేంటి చాలామంది గాయకులు కూడా వేరే వేరే భాషలలో పాడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఆ భాషను మాట్లాడడం రాకపోయిన అని అంటారేమో అదీ నిజమే అనుకోండి. ఏదో మనం మంచిగా మంచి పాటకు సంగీతం అందించడమే కాకుండా స్వరకర్త కూడా ఈయనే అవ్వడం వల్ల పొగడాలనే ఉత్సుకత ఉప్పొంగిపోతుంది. ఎవరెవరో పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: ఎవరెవరో
- సినిమా: యానిమల్ (Animal)
- నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా
- సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
- సంగీత దర్శకుడు: విశాల్ మిశ్రా
- గేయరచయిత: అనంత శ్రీరామ్
- గాయకుడు: విశాల్ మిశ్రా
- సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Evarevaro Song Lyrics in Telugu
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మొదలైందే
ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మొదలైందే
ప్రపంచం తెలీదే
జతై నువ్వు ఉంటె
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాలకన్న సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే
కాల్చుతూ ఉన్నదే
కౌగిలే కొలిమిలా
ఇది వరకు మనసుకు లేని
పరవసమేదో మొదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మొదలైందే
ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మొదలైందే
Evarevaro Lyrics in English
Nuv Kalisaake Modalaindhe
Melakuvalo Kalalaa Thochi
Marujanmedho Modhalaindhe
Emo Em Chesthunnaano
Yinkaa Yemem Chesthaano
Chesthu Yemaipothaano Maree
Evarevaro Naakedhurainaa
Nuv Kalisaake Modalaindhe
Melakuvalo Kalalaa Thochi
Marujanmedho Modhalaindhe
Prapancham Theleedhe
Jathai Nuvvu Unte
Pramaadham Anedhe Ite Raadhe
Samudraalakanna
Sogasentha Lothe
Yelaa Eedhuthunna
Munchesthundhe
Kaalchuthu Unnadhe
Kougile Kolimilaa
Idhi Varaku Manasuku Leni
Paravasamedho Modhalaindhe
Melakuvalo Kalalaa Thochi
Marujanmedho Modhalaindhe
Emo Em Chesthunnaano
Yinkaa Yemem Chesthaano
Chesthu Yemaipothaano Maree
Evarevaro Naakedhurainaa
Nuv Kalisaake Modalaindhe
Melakuvalo Kalalaa Thochi
Marujanmedho Modhalaindhe
ఎవరెవరో నాకెదురైనా Video Song
ఈ పాట వీడియోను కుటుంబ సమేతంగా కూర్చుని చూడలేము కాని వినవచ్చు. ఇందుకుగాను సంగీత దర్శకుడు మరియు స్వరకర్త అయిన విశాల్ మిశ్రాకు అలాగే పాటకు సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్దిగా నన్ను మీరు ఓవర్ చేస్తున్నావురా అనుకున్న పర్లేదు ఇది మాత్రం నిజం. అసలు పాట ఉంటుందండి అబ్బా ఆ అర్థపూరితమైన చక్కని తీపి తెలుగు పదాలు దానికి తగ్గట్టుగా సంగీతం కలిసి శ్రోతలను మైకంలోకి తీసుకుని వెళుతాయి. ఇక వీడియో విషయానికి వస్తే ఒంటరిగా చూసే ప్రతీ ఒక్కరికి (చాలామందికి) నచ్చుతుంది ముఖ్యంగా టీనేజర్స్ కి. కానీ కుటుంబంతో చూస్తేనే కష్టం. ఎందుకంటే టీవీలలో ముద్దు సీన్ లాంటివి వస్తేనే అరే ఏంట్రా ఇది అంటారు. ఇక ఇందులోని బెడ్ రూమ్ సీన్ చూస్తే ఏమైన ఉందా. ఈ పాటను వీడియోతో సహా చూస్తూ ఉంటే కాస్త చుట్టుపక్కల ఎవ్వరైనా వస్తారేమే చూసుకోండి. ఏంటి అంత పాట మొత్తం ఇలానే ఉందా అంటే, మొత్తం కాదు లేండి ఆ ఒక్క బెడ్ రూమ్ సీన్ ఒక్కటే.
ఇక పాట ఎలా మొదలవుతుందో (వీడియో) మాట్లాడుకుందాం. మన కథానాయకుడు రణ్ విజయ్ (రణ్ బీర్ కపూర్) జోయా రియాజ్ ను కలవడానికి వచ్చి డోర్ బెల్ కొడతాడు. ఇంతకి ఈ జోయ రియాజ్ ఎవ్వరంటే రణ్ విజయ్ కు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగి ఉంటుంది. ఆ గుండె ఎవ్వరిదో కాదు మన జోయ పాప భర్తది. గుండె మార్పిడి జరిగిన తర్వాత తన భర్త గుండె ఉన్న మనిషిని చూడాలని జోయ పాప రణ్ విజయ్ ఇంటికి వస్తుంది. మొదటి చూపులోనే మన రణ్ విజయ్ జోయ పాపను చూడగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగ ఆమె అందానికి పడిపోతాడు. ఆమెను తన బంగ్లాలో కొద్ది రోజులు ఉంచుతాడు. అలా ఉంచిన జోయ పాపను చూడడానికి రణ్ విజయ్ చేతిలో పెద్ద పూల బుకేను పట్టుకుని వచ్చి డోర్ కాలింగ్ బెల్ కొడతాడు.
అప్పుడు జోయ వచ్చి తలుపు తీస్తుంది. రణ్ విజయ్ గుమ్మంలోనే నిలబడి క్యూట్ గా లైట్ స్మైల్ ఇస్తూ షర్ట్ కు ఉన్న గుండీలో విప్పుతాడు. తప్పుగా అనుకోకండి, రణ్ విజయ్ ఉద్దేశ్యం జోయ పాపకు తన భర్త హృదయాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. అయిన గుండె కనబడదు కదా అంటే నేనేమి చేయలేను అది అంతే. అప్పుడు రణ్ విజయ్ జోయ పాప చేతిని పట్టుకుని తన గుండెకు ఆనించి పెట్టుకుంటాడు. అంటే తన భర్త గుండె చప్పుడు స్పర్శను ఫీల్ అవ్వమని. అలాగే మెల్లిగా తల ముందుకు వాల్చి జొయాకు లిప్ కిప్ పెడతాడు. తర్వాత పైన మాట్లాడుకున్న బెడ్ రూమ్ సీన్ కూడా జరుగుతుంది. వీరు బెడ్ పై ఉన్నప్పుడు బైట నుండి అతని కజిన్స్ (బాడీగార్డ్ లాగా కూడా ఉంటారు) లో ఒకరు వచ్చి అయ్యిందా లేదా తాతయ్య ఇంక ఎంతసేపు అని అడుగుతున్నాడు అని చెప్తాడు. దానికి రణ్ విజయ్ ఒకసారి తాతయ్యను అడుగు ఆయనకి ఎంత సమయం పట్టిందని అని చెబుతాడు. ఇది నిజంగా బలే కామీడీగా ఉంటుంది. మొత్తానికి ఈ పాట మాత్రం మన హిట్ సాంగ్ ఫ్లే లీస్ట్ లో చేరడం ఖాయం.
Report a Lyrics Mistake / Share Your Thoughts