This post features the Elaagano song lyrics in Telugu and English from the Telugu movie Laggam (2024). This heartwarming melody, composed and written by Charan Arjun, is sung by Sahithi Chaganti, with backing vocals by Rachitha, Veeha, Krishna Laaya, Teju, and Srinika Mahathi. The song portrays the emotional turmoil of Manasa (played by Pragya Nagra) when her marriage to Chaitanya (Sai Ronak) is abruptly canceled. Chaitanya loses his software job, leading Manasa’s father to call off the wedding, despite the couple’s deep love for each other. Through this song, Manasa expresses her sorrow, frustration, and disappointment, even directing her anguish towards her father.
The lyrics beautifully depict Manasa’s pain and helplessness. The song captures her longing and the difficulty of navigating shattered dreams and unfulfilled love. It highlights her struggle to reconcile her emotions with the harsh reality, making it a deeply moving piece that resonates with the audience.
ఎలాగనో ఎలాగనో
ఎలాగ వేగనో
ఏమున్నదో నా లోపల
ఏ హృదయం అడగదేలనో
కనులు మూసి నడవమంటే
అడుగేలా సాగునో
కరిగి పోతుందని తెలిసి
కల ఎలా కందునో
వానోస్తే కాచే గొడుగే
వరదై ముంచేస్తే ఎలాగో
ఉయ్యాలలు ఊపిన చెయ్యే
ఊబి లోకి నెడితే ఎలాగో
ఎదురుంటే చాలదు వరుడు
ఎదన ఉంటేనే అవుతడు తోడు
ఎలాగనో ఎలాగనో
ఎలాగ వేగనో
ఆ ఇల్లు ఈ ఇల్లు
అందుకుంటే పూలు పళ్లు
అంతే చాలా బతకాలా
అతనితోనే నా నూరేళ్ళు
బాజా భజంత్రీలు
బంధువుల సంతోషాలు
తప్పా నా మౌన రోధనలు
వినవా ఇక్కడ ఏ చెవులు
నీ సంబరాల కోసం
ఆడంబరాల కోసం
నా పంటి బిగువనే దాచా
సంద్రమంత సోకం
ఇది ఉహించని బంధం
ఇక నటనే ప్రతి నిమిషం
గాఢాంధకారమవదా
నా అందమైన లోకం
ఏ కష్టమైన దేవుడితో
చెప్పుకుంటము
నాకు దేవుడంటే
నాన్న వల్లే ఇంత కష్టము
వానోస్తే కాచే గొడుగే
వరదై ముంచేస్తే ఎలాగో
ఉయ్యాలలు ఊపిన చెయ్యే
ఊబి లోకి నెడితే ఎలాగో