‘దర్శన‘ పాట యొక్క లిరిక్స్‌ను (Darshana Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఇది 2023లో విడుదలైన వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha) అనే తెలుగు సినిమాలోని పాట. మురళీ కిషోర్ అబ్బూరి రచనా దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి, మురళీ శర్మ, శరత్ లోహితశ్వ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 18 ఫిబ్రవరి 2023న థియేటర్లలో విడుదలైంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా కొనుగోలు చేసింది, అక్కడ ఇది 22 మార్చి 2023న ప్రదర్శించబడింది.
ఇంతకి ఈ సినిమా కథేంటంటే, విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతిలో నివసించే వ్యక్తి, హైదరాబాద్‌లోని సెంట్రల్ లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు. సహాయం చేయడంలో ముందుండే అతనికి “నంబర్ నైబర్” అనే కాన్సెప్ట్ ద్వారా దర్శన (కశ్మీరా) పరిచయమవుతుంది. యూట్యూబర్‌గా, తన ఛానల్‌కు గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో, దర్శన విష్ణు, శర్మ (మురళీ శర్మ)లతో కలిసి వీడియోలు చేస్తుంది. ఈ మధ్యలో విష్ణు, శర్మ ఇద్దరూ ఆమెను ప్రేమిస్తారు. ఒక రోజు, శర్మతో కలిసి చేసిన లైవ్ మర్డర్ ప్రాంక్ వీడియోలో, అనుకోకుండా శర్మకు తూటా తగలడంతో అతను మరణిస్తాడు, ఈ ఘటనతో దర్శనపై హత్య కేసు నమోదవుతుంది. విష్ణు ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ఆమె నిజంగా శర్మను హత్య చేసిందా అనే సందేహం ఇంకా ఉంది. ఈ హత్య కేసు వెనుక రాజకీయ నాయకుడు (కేజీఎఫ్ లక్కీ)కి ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో, ముంబయి గ్యాంగ్స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ)కు విష్ణు తన ప్రేమ కథ చెప్పి ఈ రాజన్ యొక్క రెండు గంటల అమూల్యమైన సమయాన్ని వృదా చేస్తాడు. ఇలా సాగుతూ ఉంటుంది ఈ సినిమా కథ.
బన్నీవాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ సూపర్ హిట్ చిత్రాలను అందించారు. బన్నివాస్, అల్లు అరవింద్ సమక్షంలో తమ కెరీర్‌ను ప్రారంభించారు. అల్లు అరవింద్‌తో కలసి జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి, విజయం సాధించేలా అనేక చిత్రాలను నిర్మించారు. బన్నీవాస్ నిర్మాతగా చేసిన తొలి చిత్రం “100% లవ్” వాణిజ్యంగా విజయం సాధించి, ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అయితే “గీతా గోవిందం” సినిమాతో ఆయనకు మైలురాయి లాంటి ఘనవిజయం లభించింది. ఈ సినిమా ఆయనను భారీ విజయాల నిర్మాతగా నిలబెట్టింది. గీతా గోవిందం తర్వాత, బన్నీవాస్ నిర్మించిన సినిమాలు అంత గొప్ప విజయాలను సాధించకపోయినా, ఆయన నిర్మాణ నైపుణ్యం ఇంకా ప్రేక్షకులలో ఆదరణ పొందుతోంది. “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకున్నా, గీతా గోవిందం స్థాయికి చేరలేకపోయింది.
బన్నీవాస్ ఇప్పటివరకు ఎక్కువగా చిన్న సినిమాలను నిర్మించడం ద్వారా మంచి కథలతో కూడిన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయన కొత్త కథా దారులతో పాటు టాలెంటెడ్ దర్శకులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. “వినరో భాగ్యము విష్ణు కథ” వంటి సినిమాను రూపొందించిన మురళీ కిషోర్ అబ్బూరు వంటి కొత్త దర్శకులకు ఆయన అవకాశం కల్పించడం, బన్నీవాస్ టాలెంట్ ప్రోత్సహించే విధానానికి నిదర్శనం. “వినరో భాగ్యము విష్ణు కథ” దర్శకుడైన మురళీ కిషోర్ అబ్బూరుకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ, ఆయన రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే కొత్తదనంతో కూడి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి ప్రయత్నంలోనే ఆయన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో కథను కొనసాగించి, ప్రేక్షకులు బోర్ అనిపించకుండా సినిమా తీశారు.
ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ ను చైతన్ భరద్వాజ్ అందించారు. ప్రత్యేకంగా, “దర్శన” పాటకు చాలా మంచి స్పందన లభించింది. ఈ పాట విడుదలైన వెంటనే సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. భాస్కరభట్ల రచనలో రూపొందిన ఈ పాటను అనురాగ్ కుల్కర్ణి తన స్వరంతో మరింత ఆదరణ పొందేలా పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “దర్శన” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: దర్శన (Darshana)
- సినిమా: Vinaro Bhagyamu Vishnu Katha
- నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరా
- సినిమా దర్శకుడు: మురళీ కిషోర్ అబ్బూరు
- సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
- గేయరచయిత: భాస్కరభట్ల
- గాయకుడు: అనురాగ్ కుల్కర్ణి
- సినిమా విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2023
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Darshana Song Lyrics in Telugu
అపుడే అపుడే
తొలిప్రేమలోన పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే
తనకా విషయం
మరి చెప్పలేక ఆగిపోయా కదా
ఎన్నో ఊసులు ఉన్నాయిలే
గుండే లోతుల్లో
అన్ని పంచేసుకుందామంటే
కళ్ళముందు లేదాయే
దర్శన దర్శన తన దర్శనానికింకా
ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
ఇష్టమైంది లాగేసుకుంటే
చంటిపిల్లాడల్లాడినట్టే
దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే
నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే
చక్కగా చెట్టాపట్టా
తిరిగాం అట్టా ఇట్టా
అరె లెక్క పెట్టుకుంటే
బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
దారులన్ని మూసేసినట్టే
చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే
నేను ఉన్నా లేనట్టే
చందమామ రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో
వెలుతురు కనబడదే
బెంగతో ఇల్లా ఇల్లా
పోయేలా ఉన్నానే పిల్ల
నువ్వొచ్చే దాకా పచ్చి గంగైనా
ముట్టనులే నీమీదొట్టే
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
Darshana Lyrics in English
Apude Apude
Tholipremalona Padipoya Kadha
Thanatho Nadiche Aduge Murise
Thanakaa Vishayam
Mari Cheppaleka Agipoyaa Kadaa
Yenno Oosulu Unnaayile
Gunde Lothullo
Anni Panchesukundhaamante
Kallamundhu Ledhaaye
Darshana Darshana
Thana Darshanaanikinka
Yennaallu Kanneellatho Undaalilaa
Thattukodam Kaadhe Naavalla
Vayyaari Pilla
Gukkapatti Yedusthundhe
Pranam Neevalla
Thattukodam Kaadhe Naavalla
Vayyaari Pilla
Gukkapatti Yedusthundhe
Pranam Neevalla
Ishtamaindi Laagesukunte Chantipilladallaadinatte
Dhikku Thochakundhe Naaku
Nuvve Lekunte
Nuvvugaani Naatho Unte Navvulerukuntaananthe
Nee Jathalo Kshanaalake
Dhorikenu Parimalame
Chakkaga Chetta Patta
Thirigam Atta Itta
Are Lekka Pettukunte
Boledu Unnaayile Cheppaalante
Thattukodam Kaadhe Naavalla
Vayyaari Pilla
Gukkapatti Yedusthundhe
Pranam Neevalla
Thattukodam Kaadhe Naavalla
Vayyaari Pilla
Gukkapatti Yedusthundhe
Pranam Neevalla
Daarulanni Moosesinatte
Cheekatesi Kappesinatte
Nuvvu Lekapothe
Nenu Unnaa Lenatte
Chandamama Raave Raave
Jaabilamma Raave Raave
Kammukunna Ee Meghaalalo
Veluthuru Kanabadadhe
Bengatho Illa Illa
Poyelaa Unnaane Pilla
Nuvvochhedaaka Pachhi Gangaina
Muttanule Neemeedotte
Thattukodam Kaadhe Naavalla
Vayyaari Pilla
Gukkapatti Yedusthundhe
Pranam Neevalla
Thattukodam Kaadhe Naavalla
Vayyaari Pilla
Gukkapatti Yedusthundhe
Pranam Neevalla
దర్శన Video Song
పాట వచ్చే సందర్భం:
ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, ముంబయి గ్యాంగ్స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ పాత్ర) ఒక బాక్స్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి దానిని వేరే వాళ్ళకి అప్పగించాలనుకుంటాడు. ఆ బాక్స్ లో ఉన్నదేమిటో సినిమాలో రివీల్ చెయ్యరు కానీ ఆ బాక్స్ ను తీసుకువ్చిన రాజన్ ను పట్టుకోవాలని అలాగే ఆ బాక్స్ ను ఇవ్వాలనుకున్న అడ్రస్ ను కనుక్కోవాలని పోలీస్ లు ప్రయత్నిస్తుంటారు. పోలీస్ ఆపరేషన్ లో భాగంగా హహైదరాబాద్‌లోని సెంట్రల్ లైబ్రరీలో పనిచేస్తూ ఉండే ఈ సినిమా హీరో విష్ణు (కిరణ్ అబ్బవరం) రాజన్ తో పరిచయం ఏర్పరుచుకుని ఆ బాక్స్ తో పాటు రాజన్ ను పోలీస్ లకు పట్టించాలని ప్రయత్నిస్తాడు. ఫోన్ నంబర్ నైబర్ గా ముంబాయిలో ఉన్న రాజన్ తో విష్ణు ఫోన్లో మాట్లాడుతు విసిగిస్తూ, పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఒకరోజు రాజన్ హైదరాబాద్ కు వచ్చాడని తెలుసుకున్న విష్ణు, రాజన్ కలవాలని ప్రయత్నిస్తాడు. ఇందుకు రాజన్ కూడా ఒప్పుకుని, రాజన్ మరియు అతని గ్యాంగ్ ఉండే శెడ్ కు విష్ణుని పిలిపించుకుని విష్ణు గురించి తెలుసుకోవాలని తన కథను చెప్పమని రాజన్ విష్ణుని అడగగా అప్పుడు విష్ణు తన కథను రాజన్ మరియు అతని గ్యాంగ్ కు తీరికగా కూర్చుని చెప్పడం మొదలు పెడతాడు. అతని కథలో అతను ప్రేమించిన అమ్మాయి దర్శన (కశ్మీరా పాత్ర)ను ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అక్కడి వరకు కథను చెప్తున్న విష్ణు అక్కడ ఆపి పోలీసులు తన లవర్ ను అరెస్ట్ చేయడంతో తను తలవంచుకుని పోలీసు జీపులో కూర్చుని ఉందని చాలా బాధపడుతూ రాజన్ మరియు అతని గ్యాంగ్ చెబుతాడు. అప్పుడు బాధపడుతున్న విష్ణుతో మందేమైన తాగుతావ, సిగరేట్ కావాలా అని రాజన్ గ్యాంగ్ అడుగుతారు, కాని వద్దు అంటాడు విష్ణు. అప్పుడు మనసులోని బాధను పాట ద్వారా తీర్చుకో అని రాజన్ సలహా మేరకు, విష్ణు ఈ పాటను పాడతాడు.
ముగింపు:
2019లో విడుదలైన “రాజావారు రాణిగారు” సినిమా ద్వారా నటుడిగా తెలుగు సినీరంగలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం మంచి నటుడిగా స్థిరపడినాడు. ఇతని నటనతో పాటు కొన్ని తన సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు. కిరణ్ అబ్బవరంకు రాజావారు రాణిగారు సినిమా చాలా ప్రత్యేకమనే చెప్పొచ్చు. ఎందుకంటే తనను హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఒకటైతే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్ ను 2024లో పెళ్ళి చేసుకున్నాడు. మన తెలుగు హీరోలలో కొంతమంది ట్రోలింగ్ బారిన పడుతుంటారు. దానికి కారణం వారి స్వయంకృతాపరాధం అయి ఉంటుంది. కాని కిరణ్ అబ్బవరం విషయం మాత్రం పూర్తి విరుద్ధంగా ఆయన చూడడానికి హీరోలా లేవంటూ ట్రోలింగ్ చేస్తుంటారు. ఈ విషయంపై కిరణ్ ఒకసారి ఏదో మూవి ప్రమోషన్లో మాట్లాడుతూ, “మీరు నాపై ఎన్ని ట్రోలింగ్స్ చేసినా, నాకు తెలిసిన నా పని సినిమానే, ఎంత ఫెయిల్యూర్ సినిమా వచ్చినా నేను సినీరంగాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను” అని చెప్పాడు.
ఆయన ప్రతి సినిమాకు తన నటనా శైలిని మార్చుకుని ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు. ఈ వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో ఆయన నటనపరంగా బాగా చేశాడు. అలాగే ఈ దర్శన పాటలో ఆయన బాధతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తో పాటు ఈ పాటకు వేసే సింపల్ డ్యాన్స్ మూవ్స్ చూడడానికి ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ పాటను అనురాగ్ కులకర్ణి చక్కగా ఆలపించారు, భాస్కరభట్ల రచించిన అర్థవంతమైన, కమ్మని సాహిత్యం మరియు చైతన్ భరద్వాజ్ యొక్క సంగీతం ఈ పాటను ఒక ఎవర్గ్రీన్ హిట్‌గా మార్చాయి.
Report a Lyrics Mistake / Share Your Thoughts