‘డేంజర్ పిల్లా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Danger Pilla Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 2023లో విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) అనే తెలుగు యాక్షన్ కామెడీ సినిమాలోనిది. వక్కంతం వంశీ దర్శకత్వంలో, శ్రేష్ట్ మూవీస్ మరియు రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించగా, రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన చిత్రీకరణ 2023 జూన్‌లో ప్రారంభమైంది. 60 రోజుల్లో అంటే ఆగస్టు 2023నాటికి షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా 2023 డిసెంబర్ 23న విడుదల చేయాలని భావించారు, కానీ విడుదల తేదీని ముందుకు జరిపి 2023 డిసెంబర్ 8న థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ చిత్రం 2024 జనవరి 19న డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగు మరియు తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలు ఎదురుకున్నది అలాగే బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం 10.25 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది.
ఇంతకి ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కథ ఏమిటంటే, అభయ్ అలియాస్ అభి (నితిన్) తన చిన్నప్పటి నుంచి విభిన్నమైన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాడు, అదే కారణంగా అతను జూనియర్ ఆర్టిస్ట్‌గా మారాడు. తనలోని నటుడిని బయటపెట్టాలనే కోరికతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ, అవకాశాలు మాత్రం అతనికి దూరంగానే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అతని జీవితంలోకి లిఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది. లిఖిత ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓ కాగా, అభి ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ పరిచయం ద్వారా అభి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాడు, అతను కూడా కంపెనీలో సీఈఓ స్థాయికి చేరుకుంటాడు.
ఈ సమయంలోనే అభికి హీరోగా నటించే ఒక అరుదైన అవకాశం వస్తుంది, ఆ సినిమా కథ కోటియా గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఉంటుంది. ఈ కథలో నీరో అనే దుర్మార్గమైన ప్రతినాయకుడి పాత్రలో నటించేందుకు సాహసాలు చేసే పోలీస్ గురించి ఉంటుంది. అభి తొలుత ఈ సినిమా చేయడం ఇష్టపడకపోయినా, తర్వాత మనసు మార్చుకుని తన ఉద్యోగాన్ని, ప్రేమను వదులుకుని సినిమా కోసం కృషి చేస్తాడు. అయితే, చివరిదశలో దర్శకుడు అభిని వదిలేసి మరో హీరోతో సినిమా చేయాలని నిర్ణయిస్తాడు. అదే సమయంలో, అభి నిజమైన నీరోతో తలపడాల్సిన అనుకోని పరిస్థితిలో చిక్కుకుంటాడు, ఇక్కడి నుంచి కథ మరింత ఉత్కంఠతో కొనసాగుతుంది.
ఇక ఈ సినిమాకు సంగీతాన్ని మరియు నేపథ్య సంగీతాన్ని హారిస్ జయరాజ్ అందించారు. ఇందులోని మొదటి పాట “డేంజర్ పిల్లా” 2 ఆగస్ట్ 2023న విడుదలైంది. సాధారణంగా, ఒక సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేయాలంటే, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక మంచి పాటను ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం. మంచి మొదటిపాటను విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతారు. “డేంజర్ పిల్లా” పాట విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో విపరీతమైన స్పందన లభించింది. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు, ఇది చాలా మందిని ఆకట్టుకుంది. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “డేంజర్ పిల్లా” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: డేంజర్ పిల్లా (Danger Pilla)
- సినిమా: Extra Ordinary Man (ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్)
- నటీనటులు: నితిన్, శ్రీలీల
- సినిమా దర్శకుడు: వక్కంతం వంశీ
- సంగీత దర్శకుడు: హరీశ్ జయరాజ్
- పాట రచయిత: కృష్ణకాంత్
- గాయకుడు: అర్మాన్ మాలిక్
- సినిమా విడుదల తేదీ: 08 డిసెంబర్ 2023
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Danger Pilla Song Lyrics in Telugu
చీకట్లో తిరగని మిణుగురు తళుకువా
ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా
రేరు పీసే నువ్వా
కలలు కనదట కన్నెత్తి కనదట
కరుకు మగువట హొయ్
నగలు బరువట గుణమే నిధి అట
ఎగిరి పడదట హోయ్
డేంజర్ పిల్లా, డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియకుండా
హార్టే మాయం చేసావెల్లా
టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెల్లా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే
స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే
రేరు కేసే నేనే
హో ఓ నచ్చిందే చేస్తు ఉంటా
అందాకా తింటా పంటా
మంతోటి కష్టం అంటా హోయ్
టెన్షన్లు మోసే తంటా
లేదంటా ఇంటావంటా
షోమాను అంటారంతా హోయ్
డేంజర్ పిల్లా, డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెల్లా
టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా మునుపులా
ఓ ముద్దు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డీగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే
అమ్మాయి హగ్గిస్తావా
దూరాన్నే తగ్గిస్తావా
దునియానే ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే
రాసేసుకుంటాలే వందేళ్లకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ
ప్రేమ ప్రేమ, రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్నా
చాలా చిన్న మాటేనమ్మా
నీతో ఉండాలన్నా
సరిపోతుందా నాకో జన్మా
పెట్టెయ్ పేరేదైనా
పోదీ ప్రేమ నమ్మాలమ్మా
హత్తెరీ ఒంటరితనమే
అంతం చేసే హంతకీ
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెల్లా
టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెల్లా
నిండావెల్లా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
ఓహొ హో ఓ… అ…
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
Danger Pilla Lyrics in English
Seethakoka Chilukava
Cheekatlo Thiragani
Minuguru Thalukuvaa
Okka Mullu Kooda
Lene Leni Roja Puvva
Rare-u Peace Ye Nuvvaa
Kalalu Kanadhata
Kannetthi Kanadhata
Karuku Maguvata, Hoi
Nagalu Baruvata
Guname Nidhi Ata
Yegiri Padadhata, Hoi
Danger Pilla, Danger Pilla
Danger Pilla Pillaa
Angel Laaga Dual Role Aa
Jebuki Theliyakunda
Heart Ye Maayam Chesaavellaa
Touch Ye Cheyyakunda
Naalo Mottham Nindaavellaa
Arey Nuvvochaaka
Yedhee Ledhe Munupulaa
Arey Naake Nenu
Bore Ye Kotte Manishine
Yemaindho First-u Lookkulone
Neeke Padithine
Sleepu Walk-u Lona
Follow Chese Position Ye
Rare-u Case Ye Nene
Ho Oo Nachhindhe Chesthuntaa
Andhaaka Thintaa Pantaa
Manthoti Kashtam Antaa, Hoi
TensionLu Mose Thantaa
Ledhanta Intaavantaa
Show Man-u Antaarantha, Hoi
Danger Pilla, Danger Pilla
Danger Pilla Pillaa
Angel Laaga Dual Role Aa
Jebuki Theliyakunda
Heart Ye Maayam Chesaavellaa
Touch Ye Cheyyakunda
Naalo Mottham Nindaavellaa
Arey Nuvvochaaka
Yedhee Ledhe Munupulaa
Munupulaa
O Muddhu Appisthaava
Poddhunne Chellisthaale
Vaddeega Inkotisthaa
Pedhavulu Adigithe
Ammaayi Huggisthaava
Dhooraanne Thaggisthaava
Duniyaane Yelesthaane
Neeku Naaku Kudirithe
Raasesukuntaale Vandhellaki
Katha Yedhaina Nuvvele Naa Naayaki
Kaavyaalu Chaalenaa Nee Kallaki
Kanipinchaali Vaatillo Naa Bomma
Prema Prema, Raave Prema
Praanam Isthaanannaa
Chaala Chinna Maatenamma
Neetho Undaalannaa
Saripothundhaa Naako Janmaa
Pettey Peredhainaa
Podhee Prema Nammaalammaa
Hattheri Ontarithaname
Antham Chese Hanthaki
Danger Pilla Pillaa
Angel Laaga Dual Role Aa
Jebuki Theliyakunda
Heart Ye Maayam Chesaavellaa
Touch Ye Cheyyakunda
Naalo Mottham Nindaavellaa
Arey Nuvvochaaka
Yedhee Ledhe Munupulaa
Oho Ho Oo… Aa…
Arey Nuvvochaaka
Yedhee Ledhe Munupulaa
డేంజర్ పిల్లా Video Song
నితిన్‌కు 2020లో విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న “భీష్మ” సినిమా తర్వాత, 2021లో “చెక్,” “రంగ్ దే,” “మాస్ట్రో” మరియు 2022లో “మాచర్ల నియోజకవర్గం” వంటి సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఈ సినిమాల్లో చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇలా వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నా నితిన్‌కు “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమా గట్టెక్కిస్తుంది అనుకుంటే అది కూడా నితిన్ ముంచేసింది. ఈ చిత్రం యాక్షన్-కామెడీ జోనర్‌లో బాగున్నప్పటికీ, ఇది సరిపోలేదు. ఇకపై, నితిన్ తీయబోయే సినిమాలకు సరైన, బలమైన కథలు ఉండేలా చూసుకోవాలి, లేదంటే కష్టమే.
ఇక ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలోని డేంజర్ పిల్లా పాట విషయానికి వస్తే ఇది అభికి లిఖిత పై ఉన్న గాఢమైన ప్రేమను చాలా కవితాత్మకంగా చిలిపిగా వ్యక్తం చేస్తాడు. ముఖ్యంగా ఈ పాటలో శ్రీలీల ఉండడంతో శ్రీలీలాతో మంచి డ్యాన్స్ మూవ్స్ ఆశిస్తాము. కాని ఈ పాటలో చాలా సింపుల్ అండ్ ఇంప్రెసివ్ డ్యాన్స్ స్టెప్స్ ను నితిన్ వేయడం చూస్తుంటే వావ్ అనిపిస్తుంటుంది. అలాగే ఈ పాట ఫారెన్ లోని ఏదో పెద్ద సిటిలో జరుగుతున్నట్టు ఉండి ఆ ప్రదేశాలు చూడాడానికి చాలా బాగుంటాయి. మరియు నితిన్ పక్కన, వెలక చాలామంది ఫారిన్ డ్యాన్సర్స్ నితిన్ కలిసి డ్యాన్స్ చేస్తూ కనబడతారు. వాళ్ళు అందరు వేసుకన్న ఒకేలాంటి బ్లాక్ డ్రెస్ చూడడానికి ముచ్చటగా కనిపిస్తుంటుంది. అలాగే పాట మాత్రం చాలా బాగుంటుంది, ఈ పాట మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకుని వెళుతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉండే అబ్బాయిలకు తమ ప్రేయసి గురించి పాడుకోవడానికి బలే ఉంటుంది.
Report a Lyrics Mistake / Share Your Thoughts