College Papa Song Lyrics – MAD (2023) | Bheems Ceciroleo

కాలేజీ పాప పాట యొక్క లిరిక్స్‌ను (College Papa Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఈ పాట అక్టోబర్ 6, 2023న విడుదలైన మ్యాడ్ (MAD) అనే తెలుగు సినిమాలోనిది. కల్యాణ్ శంకర్ కు ఇది దర్శకుడిగా మొదటి సినిమానే కాని ఈ సినిమా చూస్తున్నప్పుడు అస్సలు కొత్త దర్శకుడేనా ఇంత మంచిగా సినిమాని తీసింది అని ఆశ్చర్యపోవడం గ్యారెంటి. సినిమా మొత్తంలో ఎంత ఫన్ ఉంటుందంటే ఊహించలేము. చాలా రోజుల తర్వతా మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కోవిడ్ లాక్‍డౌన్ సమయంలో విడుదలైన జాతిరత్నలు (2021) సినిమా చూసి ఎంతలా అయితే నవ్వుకున్నామో దాని సరిసమానంగా నవ్వుకోవడం పక్కా. అసలు ఈ సినిమాలో నటించిన చాలామంది కొత్తగా పరిచయమౌతున్న నటీనటులే ఎక్కువ ఉన్నారు. వారికి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపే వచ్చింది. దీని ద్వారా వారికి మంచి మంచి సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

ఈ సినిమాలో చాలా సంభాషణలు కొంత అనుదీప్ కేవీ రాసినవిధంగా, అతని ప్రత్యేకమైన కామెడీ శైలిని చూసినట్లు అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అనుదీప్ మరియు ఈ ‘మ్యాడ్’ సినిమా దర్శకుడు కల్యాణ్ శంకర్ మంచి స్నేహితులు కావడమే. వీరిద్దరి స్నేహం కారణంగా, కొద్దిగా అనుదీప్ ప్రభావం కల్యాణ్ మీద పడిందని అనిపిస్తోంది. ఈ ‘మ్యాడ్’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించగా, చిత్రాన్ని నాగవంశి సమర్పించారు. ఇంత పెద్ద నిర్మాణ సంస్థలు ఈ సినిమాను తీసుకురావడానికి ప్రధాన కారణం అనుదీప్ గారేనని చెప్పవచ్చు.

కథ ప్రక్రియలో కల్యాణ్ శంకర్ తొలిసారి ఈ కథను అనుదీప్‌కు చెప్పగా, అనుదీప్ కు కథ బాగా నచ్చింది. అందుకే తన పరిచయంతో అగ్ర నిర్మాత నాగవంశి వద్దకు కల్యాణ్ శంకర్‌ను తీసుకెళ్ళి, వారికి ఈ కథను వినిపించారు. నిర్మాతలకు ఈ కథ నచ్చడంతో, వారు వెంటనే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ విధంగా, ఈరోజు ‘మ్యాడ్’ సినిమా మన ముందుకు ఈ అద్భుతమైన అవుట్‌పుట్‌తో వచ్చిన కారణాల్లో ఒకటి అనుదీప్ అని చెప్పుకోవచ్చు.

ఇక ఇందులోని యాక్టర్స్ విషయానికి వస్తే తన మాటల ద్వారా నవ్వులను పండించిన సంగీత్ శోభన్ చిన్నతనంలోనే తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి, కొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఇతను ప్రముఖ దర్శకుడు శోభన్ మరియు గృహిణి సౌజన్య కుమారుడు. సంగీత్‌కు సంతోష్ శోభన్ అనే అన్న ఉన్నాడు, అతనూ కూడా నటుడే. 2011లో వచ్చిన ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రం ద్వారా వరుణ్ పాత్రలో సంగీత్ తన నటనా జీవితం ప్రారంభించాడు. సంగీత్ 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ ‘పిట్ట కథలు’లో నటించి మరింత గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అతను తెలుగు ప్రధాన స్రవంతి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. 2023లో విడుదలైన ‘MAD’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో, అతని నటనా ప్రతిభకు గణనీయమైన ప్రశంసలు లభించాయి.

అలాగే చాలా సెలిట్ గా మరియు రిజర్వ్డ్ గా నటించిన నార్నె నితిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో చాలా సెలిట్ గా మరియు రిజర్వ్డ్ గా నటించిన నార్నె నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మ్యాడ్ సినిమా ప్రమోషన్లలో అతను పెద్దగా చర్చకు వస్తూ హైలైట్ అయ్యాడు. నార్నె నితిన్ జూనియర్ ఎన్టీఆర్‌కు బావమర్ధి కావడం వల్ల, ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో చాలామంది ఎన్టీఆర్‌కి, నార్నె నితిన్‌కు ఉన్న బాండింగ్ గురించి ప్రశ్నలు అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి స్వయానా తమ్ముడు నితిన్, అందుకే అతను ప్రమోషన్లలో ప్రత్యేకంగా నిలిచాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, ఇందులోని ముగ్గురు హీరోయిన్స్ కిరాక్ అని చెప్పుకోవచ్చు. చూసే ఆడియన్స్‌కు వారిని చూడగానే ఎంత ముచ్చటగా ఉన్నారో అనిపించడంతో, మన దిష్టే తగులుతుందేమో అనిపించేలా కనిపిస్తారు.

ఇక మ్యాడ్ సినిమాలోని పాటలంటార భీమ్స్ సిసిరోలియో ఇచ్చి పడేశాడు. ప్రతీ పాట కూడా వినసొంపుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ‘కాలేజీ పాప’ పాటైతే మంచి పొంగుమీద అదే మంచి ఊపుమీద ఉంటుంది. ఈ పాటను విన్నవారెవరైన లేచి డ్యాన్స్ చేయాలనిపించేలా ఉంటుంది. ఈ పాటకు సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించగా, భీమ్స్ సిసిరోలియో, వరం, కీర్తన శర్మ పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “కాలేజీ పాప” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: కాలేజీ పాప (College Papa)
  • సినిమా: MAD (మ్యాడ్)
  • నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు
  • సినిమా దర్శకుడు: కల్యాణ్ శంకర్
  • సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
  • గేయరచయిత: కాసర్ల శ్యామ్
  • గాయకులు: భీమ్స్ సిసిరోలియో, వరం, కీర్తన శర్మ
  • సినిమా విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023
  • లేబుల్: ఆదిత్య మ్యూజిక్

College Papa Song Lyrics in Telugu

హే.. కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది

హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా
ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా
లెక్కనన్నజేయడు

ఓకే అని అంటిమా
ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా
లెక్కనన్నజేయడు

అరెరెరే
పడేదాకా పరేశాను జేస్తడు వాడు
ఓకే అని అంటిమా
ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా
లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఆ, ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

College Papa Lyrics in English

Hey..
Kallajodu College Papa Joodu
Yellareddi Gooda Kaada Aapi Joodu
Erraroju Puvvu Sethikichhi Joodu
Andarimundhu I Love You Seppijoodu

Arey Padithe Line Lo Padathadi
Lekapothe Thidathadi
Pothe Ijjath Pothadhi
Adhibothe Inkotosthadhi

Hey Nallakandla Addhaalu
Thodigina Pori
Arey Padithe Line Lo Padathadi
Lekapothe Thidathadhi
Pothe Ijjath Pothadhi
Adhibothe Inkotosthadhi

Hero Honda Bandi Meeda
Poradu Joodu
Cooling Glass Petti
Cutting Isthadaadu
Shah Rukh Khan Lekka
Propose Chesthadaadu
Reply Kosam Cheppularaga
Thiruguthaadu

Are Okay Ani Antimaa
OYO Ku Rammantadu
Okkasaari Padithimaa
Lekkanannajeyadu
Okay Ani Antimaa
OYO Ku Rammantadu
Okkasaari Padithimaa
Lekkanannajeyadu

Arerere
Padedhaaka Pareshanu
Jesthadu Vaadu
Okay Ani Antimaa
OYO Ku Rammantadu
Okkasaari Padithimaa
Lekkanannajeyadu

Hey Goketodni Meeru
Gokanisthuntaaru
Pichhigaa Mee Yenakabadithe
Phojisthaaru
Statuslo Single Ani Pettesthaaru
Lavvaru Unna
Dhaani Friendunu Try Chestaaru

Nadisinanni Rojulu
Nadipisthane Untaru
Avva Ayyanu Joopi
Vere Pelli Jesukuntaru

Nadisinanna Rojulu
Nadipisthane Untaru
Avva Ayyanu Joopi
Vere Pelli Jesukuntaru

Aa, Yeddi Poralla Chesi
Aadipistharu
Nadisinanni Rojulu
Nadipisthane Untaru
Career Lantu Jeppi
Vere Pelli Jesukuntaru

Nadisinanna Rojulu
Nadipisthane Untaru
Avva Ayyanu Joopi
Vere Pelli Jesukuntaru

కాలేజీ పాప Video Song


పాట వచ్చే సందర్భం:

“కాలేజీ పాప” పాట ‘మ్యాడ్’ (MAD) సినిమాలోని ఒక ఉత్సాహపూర్వకమైన మరియు సరదా పాట. ఈ పాట కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా వస్తుంది, కాబట్టి ఇది చాలా కష్టపడిన విద్యార్థుల ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. కథ ప్రకారం, మేన్ క్యాస్ట్ అయిన అశోక్ (నార్నె నితిన్ పాత్ర), సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్, తదితర విద్యార్థులు తమ కాలేజ్ యానివర్సరీ ఫెస్ట్ కోసం పెద్ద మొత్తంలో ఫండ్ సేకరించడానికి ప్రయత్నిస్తారు. ఫ్రిన్సిపల్ ఫండ్స్ లేవని చెప్పినా, వారు పెద్ద దాతల నుండి 40 లక్షల ఫండ్ సేకరిస్తారు. అయితే, చివరికి ఆ ఫండ్ ఇచ్చింది అశోక్ అని తెలిసి, అందరూ ఆశ్చర్యపోతారు. అశోక్ నిజం దాచాడని అతనిపై అలకపడి ఉన్న అమ్మాయి, ఈ సమయంలో అతనిపై తన కోపం చూపిస్తుంది, కానీ అశోక్ ఆమెను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు.

అంతా ఈ పరిస్థితిలో ఉంటే, కాలేజ్ ఫెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ సందర్బంలో అన్ని పాత్రలు కలిసి సరదాగా పాట పాడుతారు, ఈ “కాలేజీ పాప” పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తారు. ఈ పాట కాలేజీ విద్యార్థుల మధ్య ప్రేమ, సరదా, చిన్న చప్పట్లను చూపిస్తుంది. పాట లిరిక్స్ యువత ఉత్సాహానికి, వారి స్టైల్‌కు తగినట్లుగా సరదాగా మరియు సమకాలీన ధోరణిలో ఉంటాయి. ఈ పాటలో అబ్బాయి మరియు అమ్మాయి మధ్య సాహసోపేతమైన మాటలు వినిపిస్తాయి, వాటిలో ప్రతి లైన్ కాలేజీ ప్రేమ, సరదా గీతలుగా ఉంటుంది. అబ్బాయి పాటలో కాలేజీ పాపలను గురించి సరదాగా చెప్పడం, అబ్బాయిలు వారి ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారో, స్నేహితుల మధ్య ఎలాంటి ఫన్ సీన్స్ జరుగుతాయో చూపుతుంది.

“కళ్ళజోడు కాలేజీ పాప జూడు, ఎర్ర రోజా పువ్వు సేతికి ఇచ్చి జూడు” అనే లిరిక్స్ కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలపై ఉన్న ప్రేమను మరియు ఆకర్షణను సరదాగా చూపిస్తాయి. ఇక్కడ “లైన్లో పడితే” అని చెప్పడం, అంటే ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమను అంగీకరిస్తే, లేదా అంగీకరించకపోతే అతని ఇజ్జత్ పోతుందని సరదాగా చూపుతుంది. పాటలో అమ్మాయి కూడా అబ్బాయిల గురించి ఫన్నీగా మాట్లాడుతుంది. “హీరో హోండా బండి మీద పోరడు జూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కట్టింగ్ ఇస్తడాడు” వంటి లిరిక్స్ అబ్బాయిలు ఎలా స్టైల్ గా ఉంటారో, అమ్మాయిలను ఎలా ప్రపోజ్ చేస్తారో సరదాగా వివరిస్తుంది. “ఒక్కసారి పడితిమా, లెక్కనన్న జేయడు” అంటూ అమ్మాయి కూడా ఫన్నీగా అబ్బాయిల ప్రవర్తనను చూపిస్తుంది. అంటే అబ్బాయిలతో ఒక్కసారి అమ్మాయిలు ప్రేమలో పడితే అబ్బాయిలు ఇక వాళ్ళను సరిగ్గా పట్టించుకోరు అంటున్నారు.

పాట మొత్తంలో అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ ఒకరిపై ఒకరు సరదా మాటలతో సెటైర్ వేస్తారు. ఇది కాలేజీ రోజుల సరదా, ప్రేమ, మరియు యువత మధ్య ఉండే సరదా ఆటలు అన్నీ పాటలో ప్రతిబింబిస్తాయి. “గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు” అనే లిరిక్స్ కూడా, అమ్మాయిలు ఎలా అబ్బాయిలపై సరదాగా ఫన్ చేస్తారో చూపిస్తుంది. ఈ పాట ఒకటా కాలేజీ ప్రేమ కథలను మాత్రమే కాకుండా, కాలేజీ రోజుల సరదా, ఫ్రెష్ ఎమోషన్స్, యూత్ ఎనర్జీ అన్నీ కలిపి సరదాగా వినిపిస్తుంది.

ముగింపు:

“కాలేజీ పాప” పాట మ్యాడ్ సినిమాలో ముఖ్యమైన మలుపులో వచ్చే ఒక హుషారైన పాట. ఈ పాట కాలేజీ ఫెస్ట్ సందర్భంగా ఆడి పాడే సన్నివేశంలో వస్తుంది, ఇక్కడ కాస్ట్ మొత్తం కలిసి పాటలో పాల్గొంటుంది. సాంగ్ సీక్వెన్స్‌లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ, పాటను మరింత ఉల్లాసంగా, సరదాగా మలచడం కనిపిస్తుంది. ఈ పాటలో కాలేజీ విద్యార్థుల మధ్య ఉండే సరదా క్షణాలు, అల్లరికి, బోలెడంత ఉల్లాసానికి ప్రతీకగా నిలుస్తుంది.

ఈ పాటలోని లిరిక్స్ పూర్తిగా యువతకు నచ్చే విధంగా ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే సరదా పోటీలను సాహిత్య రూపంలో చూపించారు, ముఖ్యంగా కాసర్ల శ్యామ్ రాసిన పదాలు చాలా సరదాగా, సరసంగా ఉంటాయి. భీమ్స్ సిసిరోలియో, వరం, కీర్తన శర్మ ఆలపించిన ఈ పాట సాగే విధానం ఉత్సాహపూర్వకంగా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. కాలేజీ నేపథ్యంలో నడిచే ఈ పాట యూత్‌కి కనెక్ట్ అయ్యేలా, వారి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సరదాలను ప్రతిబింబించేలా ఉంది. అలాగే అబ్బయిలు అమ్మాయిలు ప్రేమ విషయంలో ఎలా స్పందిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో కూడా ఒకరికొకరు చెప్పుకుంటారు. అంటే మీ అబ్బాయిలు ఇలా చేస్తారంటే, మీరేమి తక్కువనా మీరు (అమ్మాయిలు) కూడా ఇలాగే చేస్తారు కదా అని ఒకరి లోపాలను ఒకరు చూపుకుంటున్నట్టుగా పాట సాగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top