Chuttamalle Song Lyrics – Devara: Part 1 (2024) | Shilpa Rao

చుట్టమల్లే పాట యొక్క లిరిక్స్‌ను (Chuttamalle Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన దేవర: పార్ట్ 1 (Devara: Part 1) అనే తెలుగు సినిమాలోని పాట. కొరటాల శివ దర్శకత్వం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. దీనికి ముందు ఎన్టిఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ (2018)’, తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్ (2022)’ సినిమాలో స్క్రీన్ పంచుకున్నాడు. అంటే మళ్ళి ఎన్టిఆర్ సోలో హీరోగా రావడానికి ఆరు సంవత్సరాల టైం పట్టింది. ఆర్.ఆర్.ఆర్ భారీ విజయం తర్వాత ఎంచుకునే కథల్లో ఆచీతూచీ అడుగేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఎక్కువ సినిమాలు కాకుండా మంచి సినిమాలను ఒప్పుకుంటు ఉండవచ్చు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట సృష్టించిన అరాచకం అంత ఇంత కాదూ ఏకంగా ఆస్కర్ వరకు వెళ్ళింది. అలాంటి కఠినమైన డ్యాన్స్ స్టెప్పులు వేసిన హీరో నుండి వచ్చే తరువాత చిత్రంలో కూడా ఇలాంటి స్టెప్పులను ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరుకోవడం సాధారణం. కానీ వీటన్నిటికి విరుద్ధంగా దేవర సినిమా నుండి విడుదలైన మొదచి పాట ‘ఫియర్ సాంగ్’ వినడానికి గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్న అందులో ఇంప్రెసింగ్ డ్యాన్స్ స్టెప్పులు లేవు. ఇక ఇప్పుడు వచ్చిన రెండవ పాట ‘చుట్టమల్లే’ కూడా రొమాంటిక్ క్లాసిక్ పాట అవ్వడంవల్ల ఇందులో చాలా సాధారణ స్టెప్పులు ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ కు ఇవి సరిపోవు కదా. ఈ పాటను చూస్తున్నప్పుడు ఇదేదో రెక్సోనా సోప్ యాడ్ లాగా అనిపించక మానదు. అలాగే ఎన్టిఆర్ ని ఈ పాటలో చూపించిన విధానం నాకైతే పర్సనల్ గా నచ్చలేదు.

అస్సలు ‘చుట్టమల్లే’ పాటలో మేన్ అట్రాక్షన్ జాన్వి కపూర్ అని చెబితే ఎవ్వరైన ఒప్పుకోవాల్సిందే. పాట విడుదలైన మొదట్లో ఈ పాట చాలా మందికి ఎక్కలేదు. కానీ జాన్వి అందాలు, ఒక సీన్లో ఆమె సిక్స్ ప్యాక్స్, థాయ్ లాండ్ బీచ్ లొకేషన్ ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మళ్ళీ మళ్ళీ వీడియోను చూసే వారి సంఖ్య పెరుగుతూ పోయింది. తర్వాత కాలంగడిచే కొద్ది ఈ పాట అందరికి డ్రగ్ లాగా ఎక్కడం మొదలైంది. ఎంతలా అంటే ప్రతీ సోషియల్ మీడియాలో, ప్రోగ్రామ్స్ లలో, ఫంక్షన్స్ లలో, స్కూల్స్ లలో, కాలేజస్ లలో ఇలా ఎక్కడ బడితే అక్కడ ఈ పాటే వినిపించేతలా. ముఖ్యంగా పాట మధ్య మధ్యలో వచ్చే ‘ఆ!’ అనే పదం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ పాట మొత్తానికి ఇదే ఆయువు పట్టులాగ మారేంతలా ‘ఆ!’ అనేది పదం నిలిచింది. పాట పాడేవారెవరైన పాట పాడుతూ ‘ఆ!’ అనే పదం ఆడియన్స్ కు వదిలేయాల్సిందే, దానిని ఆడియన్స్ (వీక్షించేవారు) ‘ఆ!’ అని అనాల్సిందే.

అనిరుద్ రవిచందర్ ఈ పాటకు సంగీతాన్ని అందిచారు. అనిరుధ్ కు ఇది నాలుగవ తెలుగు సినిమా. మొదటిది 2018లో భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ సినిమాగా నిలిచిన ‘అజ్ఞాతవాసి’. చూడడానికి బక్కోడే గాని ఇతని పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచేవే ఎక్కువ ఉన్నాయి. ఇక రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. శాస్త్రీగారి ప్రతి పాటల్లో తెలుగుదనం ఉట్టి పడుతూ ఉంటుంది. అది ఈ చుట్టమల్లే పాటలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ పాటకు గాత్రాన్ని అందించింది హిందీ గాయకురాలు శిల్పారావు. ఈమె ఈ పాటను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. తమిళంలో దీప్తీ సురేశ్ పాడారు. ‘చుట్టమల్లే’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: చుట్టమల్లే
  • సినిమా: దేవర: పార్ట్ 1
  • నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్
  • సినిమా దర్శకుడు: కొరటాల శివ
  • సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
  • గేయరచయిత: రామజోగయ్య శాస్త్రి
  • గాయకుడు: శిల్పారావు
  • సినిమా విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2024
  • లేబుల్: టీ-సిరీస్ తెలుగు

Chuttamalle Song Lyrics in Telugu

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
అస్తమానం నీలోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు

రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్దం చేశా, (ఆ!)

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది, (ఆ!)
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది, (ఆ!)
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది, హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది హా.. అరరరే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి

చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి
ముట్టడించే ముట్టేసుకోలేవా
ఓసారి చేజారి

రా ఈ బంగరు నెక్లేసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నన్ను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు, (ఆ!)

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది, (ఆ!)
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది, (ఆ!)
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది, హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది, హా.. అరరరే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు

Chuttamalle Lyrics in English

Chuttamalle Chuttesthaandi
Thuntari Choopu
Oorike Undadhu Kaasepu
Asthamaanam Neelokame
Naa Maimarapu
Chethanaithe Nuvve Nannaapoo

Raa Naa Niddara Kulaasaa
Nee Kalalakichheshaa
Neekosam Vayasu Vaakili Kaasha
Raa Naa Aashalu Pogesha
Nee Gundeku Achesha
Nee Raakaku Rangam
Siddham Cheshaa, Aa

Enduku Puttindho Puttindhi
Yemo Nuvvante
Muchhata Puttindhi Aa
Pudathaane Nee Pichhi Pattindhi
Nee Peru Pettindhi
Vayyaaram Oni Kattindhi
Gorinta Pettindhi Aa
Saamiki Mokkulu Kattindhi

Chuttamalle Chuttesthaandi
Aa Chuttesthaandi
Chuttamalle Chuttesthaandi
Ha.. Aara Ra Re
Chuttamalle Chuttesthaandi
Thuntari Choopu
Oorike Undadhu Kaasepu

Matthugaa Melesindhi
Nee Varaala Magasiri
Hatthukolevaa Mari
Sarasana Cheree
Vaasthugaa Penchaanittaa
Vandhakotla Sogasiri
Aasthigaa Allesuko
Kosaree Kosaree

Cheyyaaraa Muddhula Dhaadi
Ishtame Nee Sandhadi
Muttadinche Muttesukolevaa
O Saari Chejaaree

Raa Ee Bangaru Necklesu
Naa Ontiki Nachhatle
Nee Kougilitho Nannu Singaarinchu
Raa Ye Vennela Jolaali
Nannu Niddhara Puchhatle
Naa Thippalu Konchem
Aalochinchu Aa

Enduku Puttindho Puttindhi
Yemo Nuvvante
Muchhata Puttindhi Aa
Pudathaane Nee Pichhi Pattindhi
Nee Peru Pettindhi
Vayyaaram Oni Kattindhi
Gorinta Pettindhi Aa
Saamiki Mokkulu Kattindhi

Chuttamalle Chuttesthaandi
Aa Chuttesthaandi
Chuttamalle Chuttesthaandi
Ha.. Aara Ra Re
Chuttamalle Chuttesthaandi
Thuntari Choopu
Oorike Undadhu Kaasepu

చుట్టమల్లే చుట్టేస్తాంది Video Song


సినిమా థియేటర్స్ లలో చుట్టమల్లే పాట వచ్చినప్పుడు థియేటర్స్ మొత్తం మ్యూజిక్ కాన్సర్ట్ లాగా మారిపోతూ ఉన్నది. ముఖ్యంగా ‘ఆ!’ అనే పదం వచ్చినప్పుడు ప్రేక్షకులు చాలా హుషారుగా, కోలాహలంతో ఆ పాటను సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇటువంటి విజయవంతమైన పాటను డైరెక్ట్ చేసింది దర్శకుడు కొరటాల శివ కాదంటే దీనికి మీ స్పందన చాలా విచిత్రంగా ఉంటుందని నాకు తెలుసు. అయినా ఇది నిజం. అదేంటి సినిమా దర్శకుడే కదా ఆ సినిమాలోని మొత్తం సన్నివేశాలను తీయాల్సింది అని శాక్ అవుతారేమో. ఈ విషయాన్ని చెప్పింది ఎన్టిఆర్ మరియు జాన్వి కపూర్. దేవర సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా హింది షో అయిన ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ లో చిత్రబృందం భాగవహించినప్పుడు, ఈ ఆసక్తికర విషయం బయటపడింది.

ఈ ‘చుట్టమల్లే’ పాటను థాయ్ లాండ్ లో శూట్ చేశారు. ఈ పాట శూటింగ్ సమయంలో దర్శకుడు కొరటాల శివ సినిమాకు సంబంధించి వేరే పని మీద అక్కడకు చేరుకోవడం కుదరకపోవడంతో, కోరియోగ్రాఫర్ తోనే మొత్తం పాటను శూట్ చేయించారంటా. వినే మనకు ఇది కొత్త మరియు కొంచె విచిత్రంగా అనిపించవచ్చేమో గాని, ఇది చిత్ర పరిశ్రమలో సాధారణ విషయమంట. దర్శకుడు వేరే పని మీద ఉన్నప్పుడు పాటల్లాంటి కొన్నివాటిని ఇలా వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయిస్తారంట.

ఈ పాట ఆగస్ట్ 5, 2024న విడుదలైంది. వెంటనే ఇది తెగ ట్రోల్ కు గురైంది. ఎందుకంటే ఇది 2021లో విడుదలై చాలా పాపులారిటి సంపాదించుకున్న శ్రీలంకకు చెందిన ‘మనికే మాగే హితే’ పాటను పోలి ఉండడం. పాట విన్న ప్రతీ ఒక్కరు అనిరుద్ ఒక పాటను కాపీ చేశాడంటే నమ్మలేక పోయారు. సంగీత దర్శకుల్లో కాపీ పాటలు ఇచ్చేవారిలో ముందు వరుసలో తమన్.ఎస్ ఉంటారు. ఇప్పుడు అనిరుద్ కూడా కాపీ కొడుతూ ఆ వరుసల్లోకి వస్తాడేమోనని అనిరుధ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికి చుట్టమల్లే పాట మొదట్లో చాలామందికి నచ్చకపోయిన, మెల్లిగా నచ్చుతూ, ఇప్పుడు ఇష్టమైన పాటల జాబితాలో చేరిపోయి అని చెప్పవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top