అయ్యయ్యో ఫిమేల్ వెర్షన్ పాట యొక్క సాహిత్యాన్ని (Ayyayyo Female Version Lyrics) ఈ ఆర్టికల్ లో క్లుప్తంగా విశ్లేసిద్దాం. ఇది 2023లో విడుదలైన మేమ్ ఫేమస్ (Mem Famous) అనే తెలుగు సినిమాలోని పాట. ఈ సినిమాలో మొత్తం 10 పాటలు ఉన్నాయి. శాక్ అయ్యారా, అరే ఏంట్రా ఇది ఇన్ని పాటలు ఉన్నాయి అని. ఒక్కోసారి ఆలోచించండి హాలిహుడ్ సినిమాలలో అస్సలు పాటలే ఉండవు ( కొన్ని సినిమాలలో ఉంటాయి అనుకోండి అది వేరే విషయం). అయిన కూడా ఆ సినిమాలను చూస్తున్నప్పుడు అస్సలు బోర్ కొట్టదు. కాని మన సినిమాలలో అదే నండి భారతీయ సినిమాలలో అయితే అస్సలు ఒక్క పాటలు లేకుండా సినిమాలను ఊహించే సాహసం కూడా చేయలేము. అది మన భారతీయ సంస్కృతి నుండే వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చేసే పనులలో కూడా పాట ఉండి తీరాల్సిందే, అదే నండి ముఖ్యంగా పూర్వ కాలంలో (ముఖ్యంగా పల్లెటూర్లో) బట్టలు పిండేటప్పుడు, పొలంలో పని చేస్తున్నప్పుడు, పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు, ఇలా ప్రతీదాంట్లో పాట ఉండి తీరాల్సిందే. అంటే దీనివల్ల ఏమి అర్థం అవుతుందంటే పాట ప్రాముఖ్యత మనలో, మన సంస్కృతి సంప్రదాయలలో ఎలా ముడిపడిందో తెలుస్తుంది కదూ.
మనం ఇప్పుడు అయ్యయ్యో (ఫిమేల్ వెర్షన్) పాట గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా ఇది మేమ్ ఫేమస్ అనే తెలుగు సినిమాలోనిది. ఈ సినిమా 26 మే 2023లో థియేటర్స్ లో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్నే సాధించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే మొత్తం 10 పాటలలో ఎక్కువ మందికి ఇష్టమైన పాట మాత్రం అయ్యయ్యో. ఎందుకంటే ఈ పాటయొక్క ట్యూన్ మరియు సాహిత్యం అలాంటిది మరి. అందుకే ఇదే ట్యూన్ తో ఇంక రెండు పాటలను కంపోజ్ కూడా చేశారు. ఆ పాటల యొక్క పేర్లు కూడా అయ్యయ్యో తోనే మొదలవుతాయి. ఉదాహరణకు మొదటి పాట అయ్యయ్యో, రెండవది అయ్యయ్యో (స్యాడ్ సాంగ్), ఇక మూడవది అయ్యయ్యో (ఫిమేల్ వెర్షన్). ఇలా మొత్తం మీద ఇంచుమించు ఒకే ట్యూన్ తో మూడు పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూడు పాటలలో అయ్యయ్యో ఫిమేల్ వెర్షన్ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
Mem Famous Songs Lyrics:
- Dosthulam (దోస్తులం)
- Ayyayyo (అయ్యయ్యో)
- Ayyayyo Sad Version (అయ్యయ్యో సాడ్ వెర్షన్)
- Ayyayyo Female Version (అయ్యయ్యో ఫిమేల్ వెర్షన్)
- Minimum (మినిమమ్)
- Dhinkachika (డింకచిక)
- Mem Famous Title Song (మేమ్ ఫేమస్ టైటిల్ సాంగ్)
- Bangarulokam (బంగారులోకం)
- Galli Chinnadi (గల్లి చిన్నది)
- Success Song (సక్సెస్ సాంగ్)
Song Info:
- పాట: అయ్యయ్యో (ఫిమేల్ వెర్షన్)
- చిత్రం: Mem Famous (మేమ్ ఫేమస్)
- నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య, సార్య, సిరి రాశి, శివ నందన్, అంజి మామ, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చా తదితరులు
- దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
- సంగీతం: కల్యాణ్ నాయక్
- సాహిత్యం: కోటి మామిడాల
- గానం: మోహన భోగరాజు
- సినిమా విడుదల తేది: 26 మే 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Ayyayyo Female Version Lyrics in Telugu
ఏందిరయ్యో పిల్లగాడ
నువ్వు నన్ను ముట్టకుండ
నాలోన లేకుండ
మార్చవయ్యో గుండె జాడ
నా నవ్వుల బుగ్గలోడ
నవ్వుతుంటే మస్తుంది
నిన్ను సూడ
ఉంగరాల జుట్టోడా
గింగిరాలు తిప్పిస్తావు నీ కాడ
అరే ముందు లేదు
మరి నా చిన్నోడ
నీ వల్లేరా నాలో తేడా
అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏందిరయ్యో పిల్లగాడ
నువ్వు నన్ను ముట్టకుండ
నాలోన లేకుండ
మార్చవయ్యో గుండె జాడ
నా సెంపల్లో సిగ్గంత నీదిర
నా కళ్ళకు నిద్ధుర రాదుర
నా కన్నుల ముందర నువ్వుంటే
రెప్పైన కొట్టనురా
నా పక్కన నువ్వుంటే చాలుర
నాకు రెక్కలు మోలిచినట్టుందిర
నీ గుండెకి పక్కన
చోటులో నేనుంటానురా
నిమిషం ఉండదురా
కుదురే నిన్ను చూడక
ప్రాణం ఆగదురా
ఎదురై వచ్చేదాకా
అరే నేను మెచ్చినోడు
నాతో వున్న
చూసానయ్యో ఆడ ఈడ
అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏందిరయ్యో పిల్లగాడ
నువ్వు నన్ను ముట్టకుండ
నాలోన లేకుండ
మార్చవయ్యో గుండె జాడ
నువ్వు కానరాక పొతే కాదుర
నిన్ను చూడలంటు రోజు తొందర
నీతో ఉంటే చాలు నిండు రోజైన
నిమిషంలా ఉంటాదిరా
నువ్వంటే నాకు ఎంతో పిచ్చిరా
నువ్వు కాదంటే నేను ఉండలేనురా
నీ చేతిని పట్టుకు నేనోస్త
నన్నిడిసి పోమాకురా
చిన్నపాటి చూపుకే
నీ చుట్టూ తిరుగుతుంట పిల్లగా
సన్న తీగ నవ్వుతో
నన్ను సుట్టుకెళ్ళినావు జంటగా
అరే ముందు లేదు
మరి నా చిన్నోడ
నీ వల్లేరా నాలో తేడా
అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏందిరయ్యో పిల్లగాడ
నువ్వు నన్ను ముట్టకుండ
నాలోన లేకుండ
మార్చవయ్యో గుండె జాడ
Ayyayyo (Female Version) Song Lyrics in English
Yendhirayyo Pillagada
Nuvvu Nannu Muttakunda
Naalona Lekunda
Marchavayyo Gunde Jaada
Naa Navvula Buggaloda
Navvuthunte Masthundhi
Ninnu Sooda
Ungaraala Juttodaa
Gingiraalu Thippisthaavu Nee Kaada
Arey Mundhu Ledhu
Mari Naa Chinnoda
Nee Valleraa Naalo Theda
Ayyayyayyayyo Ayyayyayyayyo
Yendhirayyo Pillagada
Nuvvu Nannu Muttakunda
Naalona Lekunda
Marchavayyo Gunde Jaada
Naa Sempallo Siggantha Needhira
Naa Kallaku Niddhura Raadhura
Naa Kannula Mundhara Nuvvunte
Reppaina Kottanuraa
Naa Pakkana Nuvvunte Chaalura
Naaku Rekkalu Molichinattundhira
Nee Gunde Ki Pakkana
Chotulo Nenutanuraa
Nimisham Vundadhura
Kudhure Ninnu Choodaka
Praanam Aagadhura
Yedhurai Vache Daaka
Arey Nenu Mechinodu
Naatho Vunna
Chusaanayyo Aada Eeda
Ayyayyayyayyo Ayyayyayyayyo
Yendhirayyo Pillagada
Nuvvu Nannu Muttakunda
Naalona Lekunda
Marchavayyo Gunde Jaada
Nuvvu Kaanaraaka Pothe Kaadhura
Ninnu Chudalantu Roju Thondhara
Neetho Vunte Chaalu Nindu Rojaina
Nimisham La Vuntadhiraa
Nuvvante Naaku Yentho Pichiraa
Nuvvu Kaadante Nenu Undalenuraa
Nee Chethini Pattuku Nenostha
Nannidisi Pomakuraa
Chinnapaati Choopuke
Nee Chuttu Thiruguthunta Pillagaa
Sanna Theega Navvutho
Nannu Suttukellinaavu Jantagaa
Are Mundu Ledu Mari
Naa Chinnoda
Nee Valleraa Naalo Theda
Ayyayyayyayyo Ayyayyayyayyo
Yendhirayyo Pillagada
Nuvvu Nannu Muttakunda
Naalona Lekunda
Marchavayyo Gunde Jaada
అయ్యయ్యో ఫిమేల్ వెర్షన్ Video Song
అయ్యయ్యో (ఫీమేల్ వెర్షన్) పాటను పాడింది మోహన్ భోగరాజు. ఈమె ఎవరో మీకు తెలిసే ఉంటుంది. తెలియక పోతే నేను చెబుతాను లేండి. 2015లో విడుదలై తెలుగు సినిమానే కాదూ ఏకంగా భారతీయ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసి, రెబల్ స్టార్ ప్రభాస్ ని మొదటి ప్యాన్ ఇండియా స్టార్ ని చేసిన సినిమా బాహుబలి: ది బిగినింగ్ లోని మనోహరి పాటను పాడింది ఎవ్వరో కాదు ఈమెనే. అలాగే 2021లో యూట్యూబ్ లో విడుదలైన బుల్లెట్ బండి పాటను పాడింది కూడా ఈమెనే. ఈ బుల్లెట్ బండి పాట మొదట్లో అంతగా ఎవ్వరికి తెలియని, మామూలు పాటలాగానే విడుదలైంది. కానీ ఒక పెళ్లీ ఊరేగింపు సమయంలో ఆ వదువు రోడ్డుపై ఈ పాటకు చేసిన డ్యాన్స్ తే ఈ పాట రాత్రికి రాత్రే ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఎక్కడ పెళ్ళికి సంబంధించి డ్యాన్స్ జరిగిన వదువు ఆడే డ్యాన్స్ లో ముఖ్యంగా ఈ పాట ఉండేది. బాహుబలి సినిమాలో మనోహరి పాటకు రాని గుర్తింపు ఈమెకు బుల్లెట్ బండి పాట ద్వారా వచ్చింది అనడంలో తప్పులేదు. అలాంటి పాటలు పాడిన గాయకురాలు ఈ అయ్యయ్యో (ఫిమేల్ వెర్షన్) పాటను పాడి తన స్వరంతో స్రోతలను మంత్రముగ్దులను చేసింది. ఈ పాటలోని ఫీల్ ఫీల్ అవుతున్నామంటే ఈ పాటను పాడిన ఈమె కూడా కారణం అని చెప్పాలి.
ఈ పాటను మనం తరుచూ వింటున్నాం అంటే, ఎన్నో విషయాలు ముడిపడి ఉంటాయి. అంటే అది సంగీతం, సాహిత్యం, గాయనం, నేపథ్యం, నటీనటుల నటన ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ఉంటాయి ఒక పాట మనకు నచ్చిందంటే. వీటిలో సాహిత్యం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా ఒక గ్రామంలో జరుగుతుంటుంది. అందువల్ల ఆల్ మోస్ట్ అన్ని పాటలు కూడా అచ్చమైన తెలుగులోనే ఉంటాయి. ఈ అయ్యయ్యో (ఫిమేల్ వెర్షన్) పాటలో కూడా వినసొంపైనా పదాలు ఉన్నాయి. పాట సాహిత్యం రాసింది కోటి మామిడాల.
ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించింది కల్యాణ్ నాయక్. ఈయన పేరు చాలా మందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఇతను చాలా తక్కువ సినిమాలకి సంగీతం వహించాడు కాబట్టి. ఈయన 2024లో విడుదలైన “మారుతీ నగర్ సుబ్రమణ్యం” సినిమాకు సంగీతం అందించారు. మేమ్ ఫేమస్ సినిమాకు అంత మంచి బజ్ క్రియేట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది పాటలే అని చెప్పవచ్చు. ఈ సినిమాలోనే కాదూ, ఏ సినిమాకైన ప్రజల్లో బజ్ క్రియేట్ అవ్వడంలో పాటలే కీలకం. ఉదాహరణకు చెప్పాలంటే “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాలోని “నీలి నీలి ఆకాశం” పాట గుర్తే ఉంటుంది. ఇది ఏ సినిమాలోనిదో తెలియక పోయిన కూడా పాట మాత్రం ఆ మద్యకాలంలో ప్రతీ ఒక్కరికి తెలిసింది అని చెప్పడంలో సందేహించవలసిన పని లేదు. నాకు తెలిసిన కన్నడ వ్యక్తి ఫోన్లో ఆ పాట వింటూ ఏంట్రా ఎక్కడ చూసిన ఈ పాటే కనిపిస్తుంది, వినిపిస్తుంది అన్నాడు. అంటే ఆ పాట ఏ సినిమాలోనిదో తెలియక పోయిన తెలుసుకునే ఆసక్తిని రేపిస్తుంది. అది పాటకు ఉండే శక్తి. అలాగే ఈ మేమ్ ఫేమస్ సినిమాలోని పాటలు కూడా తెగ ట్రెండింగ్ లో ఉండేవి. చిన్న సినిమాలకు బజ్ క్రియేట్ చేయడంలో పాటలే ముఖ్యం.