Ayudha Pooja Song Lyrics – Devara Part 1 (2024) | Kaala Bhairava

ఆయుధ పూజ పాట యొక్క లిరిక్స్‌ను (Ayudha Pooja Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 27 సెప్టెంబర్ 2024న విడుదలైన దేవర: పార్ట్ 1 (Devara: Part 1) అనే తెలుగు సినిమాలోనిది. ఈ పాటను 26 సెప్టెంబర్ 2024న విడుదల చేశారు. అంటే ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు మాత్రమే దీనిని రిలీజ్ చేశారు. మొదట 1 నిమిషాల 6 సెకన్ల ప్రోమోను విడుదల చేశారు. ఇక అంతే ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీఎఫ్‍ఐ కట్టు బానిసలంతా ఉర్రూతలూగారు. ఆ ప్రోమోలో ఎనర్జిటిక్ పాటతో పాటు ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్‍ల మధ్య జరిగే హోరా హోరి ఫైట్ సీన్స్ కూడా సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశాయి.

అనిరుధ్ రవిచందర్ పనిచేసే సినిమాలు చాలా ఆసక్తిని నెలకొల్పుతాయి. ఎందుకంటే సినిమా హిట్ ఫెయిల్‍తో సంబంధం లేకుండా ఈయన ఇచ్చిన పాటలు మాత్రం వేరే రేంజ్‍లో ఉంటాయి. వాటి ద్వారానే సినిమాకు రావాల్సిన కొంత బజ్ క్రియేట్ అయిపోతుంది. ఈ దేవర సినిమాలో కూడా అన్ని పాటలను బెస్ట్ గా ఇచ్చాడు. వాటిలో ఫియర్ సాంగ్ మరియు చుట్టమల్లే పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే కదా. వీటిలో ముఖ్యంగా చుట్టమల్లే పాటైతే దీనమ్మ సోషియల్ మీడియాను షేక్ షేక్ చేసేసింది. అదే రేంజ్‍లో ఈ ఆయుధ పూజ పాట కూడా ఉంది అనడంలో సందేహమే లేదు.

ఈ పాటను వింటున్నప్పుడు ఏదో వార్ సాంగ్ వింటున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఊపుమీద ఉంటుంది కాబట్టి. వినే మనకే లేచి ఒక స్టెప్ వేయాలనిపించే విధంగా ఉంటుంది. దీనికి కారణం సంగీతం మాత్రమే కాదు సాహిత్యం కూడా. కేవలం ఇందులోని లిరిక్స్ ను విన్నా కూడా వావ్ అనిపించక మానదు. రామజోగయ్య శాస్త్రీగారు ఏమి తాగి రాశారో కానీ వారికి అందరూ సలాం కొట్టాలి. సినిమా చూసిన వారికి ఆ ఆయుధ పూజ ఎందుకోసం చేస్తారో తెలిసి ఉంటుంది. కానీ సినిమా చూడని వారు కూడా ఈ పాట ద్వారా దాని ఉద్దేశ్యం ఏమిటో అవగతం చేసుకోవచ్చు. అంటే పాటలో ఏవో పదాలు తీసుకువచ్చి ఇరికించకుండా సినిమా సాగే విధానంలోని కథను చెప్పే ప్రయత్నం ఈ పాట ద్వారా చేశారనుకోవచ్చు.

అలాగే ఆ హోరెత్తే సంగీతంతో సాగే ఈ పాటను పాడింది కాల భైరవ అని చాలామందికి తెలియక పోవచ్చు. ఎందుకంటే నాకు కూడా సింగర్ ఎవరో మొదట్లో తెలియలేదు. తీర పాట విన్నాక ఎవరబ్బా అని చూస్తే అప్పుడు తెలిసింది కాల భైరవ దీనిని పాడారని. ఈ ఆయుధ పూజ పాటను చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ వేసే ఊర మాస్ డ్యాన్స్ స్టెప్పులతో పాటు సంగీతం మాత్రమే కనబడుతుంది కానీ మిగతా వేరే విషయాలు అంతగా తెలియవు. అదే ఈ సింగర్ విషయంలో కూడా జరిగింది అనిపిస్తుంది. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “ఆయుధ పూజ” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: ఆయుధ పూజ (Ayudha Pooja)
  • సినిమా: దేవర: పార్ట్ 1
  • నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్
  • సినిమా దర్శకుడు: కొరటాల శివ
  • సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
  • పాట రచయిత: రామజోగయ్య శాస్త్రి
  • గాయకుడు: కాల భైరవ
  • సినిమా విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2024
  • లేబుల్: టీ-సిరీస్ తెలుగు

Ayudha Pooja Song Lyrics in Telugu

ఎర్రటి సంద్రం ఎగిసిపడే
హట్లర్ ఇట్లర్ అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు

హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగ ఆడెను సూడు

హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే
హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే
పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే
పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె

హైలా హైల ఇయ్యాల
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాలా
జరుపుకోవాలా జాతర

వీరాధి వీరుల జాతి తిరణాల
ఉడుకు రకతాలా
హారతులియ్యాలా రార ధీర, హో

హైల, ఇది అలనాటి ఆచారమే
ఇదిలా కొనసాగందే అపచారమే
బతుకే నేడు రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే

మన తల్లుల త్యాగాలే
చనుబాలై దీవించే
కనుకే ఈ దేహం
ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే
పొలిమేరలు దాటించే
మన తాతల శౌర్యం
చరితలుగా వెలిగింది

ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం
మెలితిప్పిన మీసం
మనమిచ్చే సందేశం

హైలా హైల ఇయ్యాల
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాలా
జరుపుకోవాలా జాతర

వీరాధి వీరుల జాతి తిరణాల
ఉడుకు రకతాలా
హారతులియ్యాలా రార ధీర, హో

ఎర్రటి సంద్రం ఎగిసిపడే
హట్లర్ ఇట్లర్ అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు

హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగ ఆడెను సూడు

Ayudha Pooja Lyrics in English

Errati Sandram Egisipade
Hatler Itler Adiripade Horu
Ranadheerula Pandaga Nedu

Hey Kathula Netthuta Alala Tade
Uppena Bettuga Ulikipade Joruu
Mana Jattuga Adenu Soodu

Hey Uppu Kale
Nipullo Segaletthe
Hey Dappu Mothalu
Dikkullo Velugetthe
Puli Bidala Ontlo
Poonakame Moolaketthe
Ooru Gatte Atta
Shirasetthi Shivametthe

Haila Haila
Yiyyala Aayudha Pooja Cheyyala
Jabbalu Charachaala
Jarupukovala Jathara
Viradhi Veerula Jathi Tiragala
Uduku Rakathala
Harathuliyyaala Dhaara Dheera Ho

Haila, Idi Alanati Acharame
Idi La Konasagande Apacharame
Batuke Nedu Ranamaina Parivaarame
Kadali Kaalam Saakshyame

Mana Tallula Tyagale
Chanubalai Deevinche
Kanuke Ee Deham
Aayudhamaai Edigindi
Taala Vanchani Roshale
Polimeralu Saadhinche
Mana Thathala Sauryam
Charitaluga Veligindi

Eeteta Vacche Ee Roje Manakosam
Meli Tippi Meesam
Manamichche Sandesam

Haila Haila
Yiyyala Aayudha Pooja Cheyyala
Jabbalu Charachaala
Jarupukovala Jathara
Viradhi Veerula Jathi Tiragala
Uduku Rakathala
Harathuliyyaala Dhaara Dheera Ho

Errati Sandram Egisipade
Hatler Itler Adiripade Horu
Ranadheerula Pandaga Nedu

Hey Kathula Netthuta Alala Tade
Uppena Bettuga Ulikipade Joruu
Mana Jattuga Adenu Soodu

ఆయుధ పూజ వీడియో సాంగ్


పాట వచ్చే సందర్భం:

ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, నాలుగు ఊళ్ళకు చెందిన వారు ఆయుధ పూజ అనే సంప్రాదాయాన్ని ప్రతీ ఏటా జరుపుకునే సమయంలో కుస్తీ పోటీల్లాంటి ఫైట్ ని కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే విజేతలు అవుతారో వారికి సంబంధించిన ఊరికే ఆ ఆయుధాలు ఒక ఏడాది పాటు చెందుతాయి. ఆ ఆయుధాలు తమ ఊరికి రావడంవల్ల తమకు మంచి జరుగుతుందని ఆ ఊరి వాళ్ళు భావిస్తూ ఉంటారు.

ఇది ఇలాగ ఉండగా ఈసారి కూడా ఈ ఆయుధ పూజ జరుపుకునే పండగ వస్తుంది. ఇక దేవర ఊరితో పాటు మిగిలినా మూడు ఊరివాళ్ళు ఈ కార్యక్రమం జరిగే స్థలానికి వస్తారు. ఈ నాలుగు ఊళ్ళలో రాయప్ప (శ్రీకాంత్) ఊరివారికి చాలా ఏళ్ళ నుండి ఆయుధాలు వెళ్ళి ఉండవు. ఎందుకంటే రాయప్ప ఊరివారికి యుద్ధ విధ్యలు తెలిసి ఉండవు. వారికి కేవలం పడవలు నడుపుకునే నైపుణ్యం మాత్రమే ఉంటుంది. కావున ఈ కుస్తీ లాంటి పోటీలు లేకుండా ప్రతీ సంవత్సరం ఒక ఊరి లెక్క ఆ ఆయుధాలను తీసుకునే విధంగా ఒప్పందం చేసుకుందాం అని దేవర సిఫారస్సు చేస్తాడు.

కానీ దీనికి భైరవ (సైఫ్ అలీ ఖాన్) ఒప్పుకోక, మన పూర్వికులు బుద్ధి లేకుండా ఈ పోటీలు పెట్టారుకున్నావా, ఈ ఆచారాన్ని కొనసాగించాల్సిందే అని ఖరాఖడింగా చెబుతాడు. దేవర ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఇక తప్పక కుస్తీ పోటీల ద్వారానే ఆయుధాలు తీసుకునే విధానం మొదలవుతుంది. ఇందులో పాల్గొన్న రెండు ఊరి వాళ్ళు ఓడిపోగ చివరకి భైరవ మరియు దేవర పోటీలో తలబడతారు. వీరిరువురు బలవంతులు కావడంతో వీరి మధ్య రాత్రంతా ఫైట్ కొనసాగి తెల్లవారు జామున భైరవ ఓటమితో ముగిస్తుంది. ఇక దేవర తాను తమ ఊరి కోసం సంపాదించుకున్న ఆయుధాలను రాయప్ప ఊరివాళ్ళకి ఇచ్చి తన మంచి మనసును చాటుకుంటాడు.

ముగింపు:

కొంతమంది కొన్ని పాటలను విపరీతంగా తరుచుగా వింటూ కొన్ని రోజులు ఆ పాటలకు అడిక్ట్ అయిపోతారు. నేను కూడా అదే కోవలోకి వచ్చే అడివి మనిషిని. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే విడుదలైన ఈ పాటను నేను చూడకుండానే థియేటర్ కి వెళ్ళాను. అక్కడ పెద్ద స్క్రీన్ లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్ల మధ్య ఈ ఆయుధ పూజ పాటను చూస్తుంటే గూజ్ బమ్సే వచ్చేసాయి నాకైతే. అయ్యా అనిరుధ్, ఏమి కొట్టుడు కొట్టావయ్యా మ్యూజిక్‍ని, అసలు అరాచకం అని చెప్పవచ్చు.

ఈ పాటలో సీనియర్ ఎన్టీఆర్ యొక్క సిగ్నేచర్ స్టెప్‍ను జూనియర్ ఎన్టీఆర్ వేయడం చాలా బాగా అనిపించింది. ఇదే విషయాన్ని సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా, దానికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ, తాము షూటింగ్ సమయంలో అసలు తమకు ఈ విషయమే తెలియదని, పాట విడుదలయ్యాక ఎవరో చెబితే అప్పుడు అవును కదా, అనుకోకుండా అయిన కూడా ఎలా సింక్ కుదిరిందని ఆశ్చర్యపోయారని చెప్పారు. అదే విధంగా ఈ పాట షూటింగ్ సమయంలో కత్తి తిప్పే సీన్‍లో తన చెయ్యి బెణికిందని, అయినా కూడా ఏదోలా కట్టు కట్టిన ఆ చెయ్యిని కనబడకుండానే షూటింగ్ కొనసాగించినట్టు చెప్పుకొచ్చారాయన.

మీరు ఈ అఫీషియల్ పాటను విన్నాక, యూట్యూబ్లోనే ఉన్న డీజే మిక్స్ చేసిన ఇదే పాటను కూడా వినండి. అదీ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రమే వినండి. ఈ పాట ఒక కొత్త వెర్షన్లో వినబడుతుంది. నేనైతే మొదట డిజీ మిక్స్ చేసిన పాటనే విన్నాను. నాకు బలే అనిపించింది. ఈ పాటను నేను చాలా రోజుల పాటు విన్నాను. ఇంతలా నాకు ఎక్కేసింది ఈ పాట. మీరు కూడా ఒకసారి వినండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top