Anuvanuvuu Song Lyrics – Om Bheem Bush (2024) | Arijit Singh

అణువణువు పాట యొక్క లిరిక్స్‌ను (Anuvanuvuu Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) అనే తెలుగు సినిమాలోని పాట. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇతను దర్శకుడిగా ‘హుషారు (2018)’ అనే సినిమాను తీశాడు. ఇది అసాధారణమైన విజయాన్ని అందుకుంది. ఈ హుషారు సినిమాలోని ‘ఉండిపోరాదే’ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. చాలా మంది ఈ పాట కోసమే ఈ సినిమాను వీక్షించారు, అందులో నేను ఒకడ్ని. తర్వాత ఈయన ‘రౌడీ బాయ్స్ (2022)’ అనే సినిమా తీసి, ఇప్పుడు ఈ ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి త్రయం ‘బ్రోచేవారెవరురా (2019)’ సినిమా తర్వాత మళ్లీ ఈ ఓం భీమ్ బుష్ సినిమాలో కలిసి నటించారు. శ్రీవిష్ణు మిగతా తెలుగు హీరోలతో పోల్చితే అతని హ్యూమర్ మరియు కామిడి టైంమింగ్ తో ప్రత్యేకంగా నిలిస్తారు. అతని కొన్ని సినిమాలలో వాడిని వినిపించి వినిపించని, అర్థమై అర్థంకాని బూతు పదాలను సెన్సర్ బోర్డు కూడా పసిగట్టలేని విధంగా ఉంటాయి. ఆ బూతు పదాలను అతను చెప్పే విధానం (వాయిస్ మాడ్యులేషన్) చాలా ఫన్నీగా ఉంటుంది. అతను ఎంచుకునే కథలు ఎక్కువగా కామిడి జోనర్ కు సంబంధించినవే ఎక్కువ ఉంటాయి. ఓం భీమ్ బుష్ కన్నా ముందు వచ్చిన ‘సామజవరగమన (2023)’ కూడా కామిడి జోనర్ కు చెందిన సినిమాయే. ఇది కూడా మంచి హిట్ సాధించింది.

ఇక ఈ అణువణువు పాట విషయానికి వస్తే, ఈ పాట విడుదలైన మొదట్లో చాలామంది జలస్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక దెయ్యానికి ఇంత మంచి మెలోడి పాట పడడమేమిటని. సినిమాలో సంపంగి అనే ఆడ దెయ్యానికి మన హీరో క్రిష్ (శ్రీవిష్ణు) కు మధ్య ఈ పాట జరుగుతుంది. ఈ పాటకు సంగీతాన్ని అందించింది సన్ని ఎం ఆర్. ఇతను ‘స్వామీరారా (2013)’ మరియు ‘ఉయ్యాలా జంపాలా (2013)’ సినిమాలకు సంగీతాన్ని ఇవ్వడం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందిచారు. ఈయన 2012లో విడుదలైన ‘అందాల రాక్షసి’ సినిమాకు పాటలు రాయడం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తన యూనిక్ పాటలతో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ అణువణువు పాటను బాలీవుడ్ ప్రఖ్యాత గాయకుడైన అరిజిత్ సింగ్ చే పాడించారు. ‘అణువణువు’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: అణువణువు
  • సినిమా: Om Bheem Bush (ఓం భీమ్ బుష్)
  • నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
  • సినిమా దర్శకుడు: శ్రీహర్ష కొనుగంటి
  • సంగీత దర్శకుడు: సన్నీ ఎం.ఆర్
  • గేయరచయిత: కృష్ణ కాంత్
  • గాయకుడు: అరిజిత్ సింగ్
  • సినిమా విడుదల తేదీ: మార్చి 22, 2024
  • లేబుల్: ఆదిత్య మ్యూజిక్

Anuvanuvuu Song Lyrics in Telugu

అణువణువు అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే

కాలాలు కల్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే

అణువణువు అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా
కలవమనీ
నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా
పిలవమనీ

తారలైనా తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కల్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపెనుగా
జన్మాల బంధమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో ఇంత సంతోషమే
తీరే ఇపుడే పాతా సందేహమే
నాలో లేదే మనసే నీతో చేరే
మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే

అణువణువు అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే

Anuvanuvu Lyrics in English

Anuvanuvu Alalegase
Theliyani O Aanandhame
Kanuledhute Nilichenugaa
Manasethike Naa Swapname

Kaalaalu Kallaara Choosenule
Vasanthaalu Vechindhi Ee Rojuke
Bharinchaanu Ee Dhoora
Teeraalu Neekosame

Anuvanuvu Alalegase
Theliyani O Aanandhame
Kanuledhute Nilichenugaa
Manasethike Naa Swapname

O Chote Unnaanu
Vechaanu Vedaanugaa Kalavamani
Naalone Unchaanu
Premantha Daachaanugaa
Pilavamani

Taaralainaa Thaakaleni
Thaahathunna Premani
Kashtamedhi Kaanaraani
Edhi Emaina Untaanani

Kaalaalu Kallaara Choosenule
Vasanthaalu Vechindhi Ee Rojuke
Bharinchaanu Ee Dhoora Teeraalu
Neekosame

Kalisenugaa Kalipenugaa
Janmaala Bandhame
Karigenuga Mugisenugaa
Innaalla Vedhane

Marichaa Yenaado Intha Santoshame
Teere Ipude Patha Sandehame
Naalo Ledhe Manase Neetho Chere
Maate Aagipoye Poye Poye Ee Velane

Anuvanuvu Alalegase
Theliyani O Aanandhame
Kanuledhute Nilichenugaa
Manasethike Naa Swapname

అణువణువు అలలెగసే Video Song

Anuvanuvuu Lyrical (Telugu) | Om Bheem Bush | Sree Vishnu| Arijit Singh | Harsha Konuganti |Sunny MR

2024లో విడుదలైన పాటలలో ఒన్ ఆఫ్ ది బెస్ట్ పాటల జాబితాలో ఈ ‘అణువణువు’ పాట నిలవడం ఖాయం. పాట ఎంత బాగుందంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత జనరేషన్ వారు ఈ పాటను వింటూ ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఈ పాట గురించి మాట్లాడుకుంనేంతలా. అరిజిత్ సింగ్ హింది గాయకుడు అయిన కూడా ఆయన ఈ పాటను ఎంతో చక్కగా పాడారు. మెలోడీలలో తనను మించినవారు లేదన్నట్టుగా ఆయన ఈ పాటను పాడిన విధానం కేక అంతే. మన తెలుగులో ఎందరో గాయకులు ఉన్నా కూడా, అరిజిత్ సింగ్ తోనే ఈ పాటను పాడించారంటే, చిత్రబృందం ఆ పాట ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో ముందుగానే అంచనా వేశారు. మన తెలుగు గాయకులు కూడా మంచిగానే పాడేవారు, కానీ ఈ పాటను అరిజిత్ సాంగ్ చే పాడిస్తే తమ చిత్రానికి మంచి ప్రచారంగా ఉపయోగపడుతుందని చిత్రబృందం అనుకోవడంవల్ల అతనిచే పాడించారు. ఎవ్వరు పాడిన మంచి పాటయ్యే లక్షణం కలిగింది ఈ పాట.

ఈ పాట ఈ సినిమాలోని హీరో క్రిష్ మరియు సంపంగి అనే ఆడ దెయ్యం మధ్య జరుగుతుంది. ఒక విధంగా ఆ దెయ్యం మనోడిని ఇష్టపడుతూ ఉంటుంది. వారి మధ్య ఇది ఒక మెలోడి ప్రేమ పాటలా ఉంటుంది. ఈ పాట విడుదలైన తర్వాత సోషియల్ మీడియా చాలామంది దెయ్యానికి ఇంత మంచి పాట పడిందేమిట్రా అని ఆశ్చర్యపోతు తమ అభిప్రాయాలను ఫన్నీగా వ్యక్తం చేస్తున్నారు.

Report a Lyrics Mistake / Share Your Thoughts