Andala Tara Arudenche Nakai Song Lyrics | అందాలతార అరుదెంచె

Explore the lyrics of the Telugu Christian song ‘Andala Tara Arudenche Nakai (అందాలతార అరుదెంచె నాకై)’.

Andala Tara Arudenche Nakai Song Lyrics in Telugu

అందాలతార అరుదెంచె నాకై
అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి
అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో
అమరకాంతిలో
ఆది దేవుని జూడ
ఆశింప మనసు పయనమైతిని
|| అందాల తార ||

యెరూషలేము రాజనగరిలో
యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ
ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె
ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు
విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు
|| అందాల తార ||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని
పరలోక సౌధమే
బాలుని జూడ జీవితమంత
పావనమాయెను (2)
ప్రభుపాదపూజ దీవెనకాగా
ప్రసరించె పుణ్యమే
బ్రతుకే మందిరమాయె
అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన
|| అందాల తార ||

విశ్వాసయాత్ర దూరమెంతైన
విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో
విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని
వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె
ప్రేమ విశ్రాంతి నొసగుచున్
|| అందాల తార ||

Andala Tara Arudenche Nakai Lyrics in English

Andala Tara Arudenche Nakai
Ambara Veedhilo
Avatharamurthy Yesayya Keerthi
Avani Chaatuchun
Aanandasandra Mupponge Naalo Amarakaanthilo
Aadi Devuni Jooda
Aashimpa Manasu Payanamaithini
|| Andala Tara ||

Yerushalemu Raajanagarilo
Yesunu Vedakuchu
Erigina Daari Tholagina Vela
Edalo Krungithi
Yesayya Thaara Eppativole
Eduraaye Throvalo
Entho Yabburapaduchu
Vismayamonduchu
Aegithi Swaami Kadaku
|| Andala Tara ||

Prabhu Janmasthalmu
Paakaye Gaani Paraloka Soudhame
Baaluni Jooda Jeevithamentha Paavanamaayenu (2)
Prabhu Paada Pooja
Deevena Kaagaa
Prasarinche Punyame
Brathuke Mandiramaaye
Arpanale Sirulaaye
Phaliyinche Praarthana
|| Andala Tara ||

Vishwasa Yaathra Dooramenthaina
Vindugaa Dochenu
Vinthaina Shaanthi Varshinche Naalo Vijayapathamuna
Vishwaala Neledi Deva Kumaaruni
Veekshinchu Deekshatho
Virajimme Balamu
Pravahinche Prema
Vishraanthi Nosaguchun
|| Andala Tara ||

Andala Tara Arudenche Nakai Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Share Your Thoughts / Comments / Lyrics Mistake