‘అమ్మాయి‘ పాట యొక్క లిరిక్స్‌ను (Ammayi Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఈ పాట 2023లో విడుదలైన యానిమల్ (Animal) అనే తెలుగు సినిమాలోనిది. ఈ యానిమల్ సినిమాకి దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా. ఈ పేరు కేవలం పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. ఈయన తీసింది ఈ సినిమాతో కలిపి కేవలం మూడు సినిమాలు మాత్రమే. అందులో అర్జున్ రెడ్డి (2017) మరియు యానిమల్ (2023) మాత్రమే ఒరిజినల్ స్క్రిప్ట్స్. ఇక 2019లో హిందీలో విడుదలైన కబీర్ సింగ్, 2017లో తెలుగులో విడుదలై సంచలనమైన బారీ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమాకి రిమేక్. తీసింది కేవలం మూడు సినిమాలైన కూడా, ఇతనిపై అంచనాలు ప్రతీ సినిమాకు అంతకంతకు పెరుగుతూ పొతుంది. కారణం అతను సినిమా తీసే విధానం, ఎంపిక చేసుకునే కథ, కథనం, సంభాషణ, పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీదీ అతని స్టైల్ కు అనుగుణంగా, సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా ఉండడం.
ఇక యానిమల్ సినిమాకి వస్తే, ఇందులోని ప్రతీ పాట ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమాకి పనిచేసిన సంగీత దర్శకులు ఎంతమందో తెలుసా, దాదాపు 12మంది. శాక్ అయ్యారా అవునండి అందుకే కదా ఈ సినిమాలోని ప్రతీ పాట ఆణిముత్యం అన్నది. సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే ఒక్కొక్కరికి చాలానే గుర్తుకొస్తాయి, నాకు మాత్రం అన్నిటికంటే పాటలే ముందు గుర్తుకొస్తాయి.
ఇక పాటల విషయానికి వస్తే, ఇది ఒరిజినల్ హింది సినిమా కావడం వల్ల మొత్తం పాటలను ముందుగానే హింది రచయితలతో రాయించారు. తర్వాత వాటికి తగ్గట్టుగా తెలుగులో రాశారు. తెలుగులో అన్ని పాటలను రాసింది మన అనంత శ్రీరామ్. అన్ని హిట్ పాటలను ఒకే రచయితతో రాయించారంటేనే ఆ రచయిత ఎలాంటోడో తెలిసిపోతుంది కదూ. అనంత శ్రీరామ్ మన టాలీవుడ్ లో బిజీగా ఉండే రచయితలలో ఒకరు. ఈ మధ్యకాలంలో బాగా వినిపించే (ట్రెండింగ్) పాటలలో అనంత శ్రీరామ్ పాటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇతను కొన్ని టీవీ షోలలో భాగవహించడం వల్ల ఇతని వ్యక్తిత్వం కూడా చాలా మందికి తెలిసింది. చూడడానికి చాలా బక్కగా ఉన్నా కూడా చాలా తెలివి పరుడు, చలాకీ, కామీడి టైమింగ్ కూడా బాగుంటుంది. ఇక ఇతని డ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం చింపి ఆరేస్తాడు. అతను వేసే స్టెప్పులు, జిమ్నాస్టిక్స్, ఎగరడం, దుముకడం అయ్యబాబో చూసే ప్రేక్షకులు ఆశ్చర్యంలో మునిగిపోవడం గ్యారెంటీ.
అమ్మాయి పాటను పాడింది రాఘవ్ ఛైతన్య మరియు ప్రీతమ్. వీళ్ళలో రాఘవ్ ఛైతన్య హిందీ గాయకుడు, ఇక ప్రీతమ్ సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు. ఈ పాటకు సంగీతం అందించింది ఇతను స్థాపించిన ఒక సంగీత ప్లాట్ఫారమ్ మరియు స్టూడియో అయిన జామ్8. ఇది యువ మరియు ఆశావహ సంగీత దర్శకులకు వారి ప్రతిభ ప్రదర్శించడానికి మరియు ప్రతిష్టించిన కళాకారులతో సహకరించడానికి వేదికగా పనిచేస్తుంది. జామ్8 సంగీత నిర్మాణం, మార్గదర్శకత్వం మరియు సహకార అవకాశాలను అందిస్తుంది. జామ్8 భారతీయ సంగీత పరిశ్రమ యొక్క వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు కొత్త సంగీత ప్రతిభను పోషించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జామ్8 యువ సంగీత దర్శకులకు వారి కెరీర్‌లను ప్రారంభించడానికి మరియు భారతీయ సంగీత రంగంలో తమ స్థానాన్ని నిర్మించుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. ఈ అమ్మాయి పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: అమ్మాయి
- సినిమా: యానిమల్ (Animal)
- నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా
- సినిమా దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
- సంగీత దర్శకులు: జామ్8
- గేయరచయిత: అనంత శ్రీరామ్
- గాయకులు: రాఘవ చైతన్య, ప్రితమ్
- సినిమా విడుదల తేదీ: 01 డిసెంబర్ 2023
- లేబుల్: టీ-సిరీస్ తెలుగు
Ammayi Song Lyrics in Telugu
నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్ప
నీతో నాతో ఏదీ తోడురాలా
ఏంటీ వేళా ఇది మాయే
ప్రాణం చాటుల్లో ఉండే
ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే
పీ పీ సన్నాయి
అమ్మాయి అమ్మాయీ హాయి
మేఘమా మైకమా
కమ్మేటి ఈ హాయే లోకమా
అమ్మాయి
గీతాంజలి నా జాబిలి
నా శ్వాసతోనే
నీకు ఇలా ఇలా ముడేసిన పదే
ఉఛ్వాసలో నిఛ్వాసలో
నీ వెంట నేనే
చివరి శ్వాసకి ఇదే ఇదే స్థితే
హత్తుకోవే హల్లుకోవే నీ నన్నే
నేనే నీకన్నీ అవుతానే
ఏ మూడో మనిషే నీకు
గురుతే రాని సంతోషాన్నిస్తానే
అమ్మాయి అమ్మాయీ
అమ్మాయీ ఈ ఈ, ఈ రేయి
కాలమా కాలమా ఆ ఆ
సాగేటి ఈ రేయే స్వర్గమా
అమ్మాయీ అమ్మాయీ
Ammayi Lyrics in English
Neelaa Naalaa Kalisaaye
Ekaantham Thappa
Neetho Naatho Edhi Thoduraalaa
Enti Velaa
Idhi Maaye
Praanam Chatullo Unde
Ee Pranayam Paipaikochi
Pedavanchullo Moginchindhe
Pee Pee Sannaayi
Ammaayi Ammaayi
Ee Haayi
Meghama Maikamaa
Kammeti Ee Haaye Lokamaa
Ammayi
Geethanjali Naa Jabili
Naa Shwaasathone
Neeku Ilaa Ilaa Mudesina Padhe
Uchwasalo Nichwasalo
Nee Venta Nene
Chivari Shwasaki
Idhe Idhe Sthithe
Hatthukove Hallukove
Nee Nanne
Nene Neekanni Avuthaane
Moodo Manishe Neeku
Guruthe Raani Santoshaannisthaane
Ammayi Ammayi
Ammayi Ee Reyi
Kaalamaa Kaalamaa Aa Aa
Saageti Ee Reye Swargama
Ammayi Ammayi
అమ్మాయి Video Song
యానిమల్ దాని ట్రైలర్ విడుదలకు ఒక రోజు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి A (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ అందుకుంది, ఎందుకంటే ఈ సినిమాలో తీవ్రంగా హింస, అసభ్యత మరియు కొంత లైంగికత ఉంది కాబట్టి. లైంగికత ఏమేరకు ఉందో ఈ ఒక్క పాట చూసిన తెలిసిపోతుంది. ఈ పాట ఎలా మొదలవుతుందంటే, గీతాంజలీ (ఈ సినిమాలో రష్మికా మందనా పాత్ర పేరు) రణ్ విజయ్ సింగ్ (రణ్ బీర్ కపూర్) ని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి తీసుకుని వచ్చి ఉంటుంది.
విచిత్రం ఏమిటంటే దీనికి ముందే ఆ గీతాంజలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగి ఉంటుంది. అందువల్ల వాళ్ళ కుంటుంబ సభ్యులు రణ్ విజయ్ ని అంగీకరించరు. దాంతో మన ఆల్ఫా మెన్ రణ్ విజయ్ మరియు ఆల్ఫా ఉమెన్ గీతాంజలీ ఒకరికొకరు లిప్ కిస్ పెట్టుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే. అక్కడ చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఆ చిన్న పిల్లల కళ్ళను వాళ్ళ అమ్మలు తమ చేతితో మూసి పెడతారు. అదే సమయంలో నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి కూడా అక్కడికి వచ్చి దాన్ని చూసి శాక్ అవుతాడు. ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి పాట మొదలవుతుంది.
ఈ పాటలో ముఖ్య ఘట్టం ఏమిటంటే మన హీరో ప్రైవేట్ ఫ్లైట్ లో రొమాన్స్ అన్నమాట. కాసేపు ఫ్లైట్ ని నడుపుతూ రొమాన్స్, కాసేపు ఫ్లైట్ ని ఆటోమెటిక్ మోడ్ లో పెట్టి రొమాన్స్ ఇలా సాగుతూ వెళుతుంది పాట. అలాగే మన హీరోయిన్ గీతాంజలికి సప్రైజ్ ఇవ్వడానికి మంచు కురిసే ప్రాంతానికి కళ్ళు మూసుకుని హీరో తీసుకుని వెళతాడు. అక్కడ మంచు దుప్పటి కప్పుకున్న కొండలను చూసి గీతాంజలి ఆశ్చర్యంలో మునిగిపోతుంది. అక్కడే ఒక చిన్న గుడి ఉంటుంది. వాళ్ళు ఆ గుడి దగ్గరకు వెళ్ళి దేవుని ఆశిస్సులు తీసుకుని, పూలదండాలను ఒకరికొకరు మార్చుకుని, ఆ గుడి చుట్టూ చెయ్యి పట్టుకుని ప్రదక్షిణ చేస్తారు. ఈ పాటలో మంచి మంచి ప్రాంతాలు, వినసొంపైన సంగీతం, అర్థవంతమైన సాహిత్యం ఉంటుంది. కొంచెం రొమాన్స్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలతో కలిసి చూడడానికి ఇబ్బంది పడతారు కాస్త జాగ్రతా.