‘అమ్మా నీకే‘ పాట యొక్క లిరిక్స్‌ను (Amma Neeke Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన మహారాజా (Maharaja) అనే యాక్షన్ థ్రిల్లర్ తెలుగు డబ్డ్ సినిమాలోనిది. ఈ సినిమాను నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్ ను రామ్ మురళితో కలిసి రాశారు. ఈ చిత్రాన్ని ది రూట్, థింక్ స్టూడియోస్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి నటించగా, అనురాగ్ కశ్యప్, మమతా మోహందాస్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, అభిరామి గోపికుమార్, దివ్యభారతి వంటి ఇతర ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇది ది రూట్ సంస్థ తమిళంలో చేసిన మొదటి సినిమా కావడం విశేషం. అదేవిధంగా, విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రం కావడం కూడా ప్రత్యేకత.
మహారాజా కథ చెన్నైలోని ఒక సాధారణ సెలూన్ దుకాణం నడిపే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన దొంగిలించిన డస్ట్‌బిన్ తిరిగి పొందేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు అతని అసలైన ఉద్దేశం మరోటి అని గ్రహిస్తారు. ఈ సినిమా 2024 జూన్ 14న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. తమిళంలో విడుదలైన ఈ చిత్రం, తెలుగులో కూడా డబ్ చేయబడింది, మరియు నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేయబడ్డాయి. సినిమా విడుదలైన కొన్ని వారాల తరువాత, 2024 జూలై 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇదే కాక, టెలివిజన్ హక్కులను స్టార్ విజయ్ పొందడంతో సినిమా మరింత మంది ప్రేక్షకులను చేరువైంది.
ఈ మహారాజా సినిమాన కథ చాలా సింపుల్ అండ్ రొటీన్. కానీ నితిలన్ సామినాథన్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే మాత్రం అరాచకం. ఈ మధ్య ఇంతటి గొప్ప స్క్రీన్ ప్లే ఉన్న సినిమాను విరూపాక్ష మూవీలో చూశాము. అప్పుడు ఎలా అయితే ఆ కథతో పాటుగా స్క్రీన్ ప్లే ను చూసి చాలా గొప్పగా ఉందని మెచ్చుకున్నామో, అలాంటి గొప్ప స్క్రీన్ ప్లే ను ఈ మహారాజా సినిమాలో కూడా చూస్తాము. అస్సలు సినిమా కథ కన్నా స్క్రీన్ ప్లే చేసిన మ్యాజిక్కే ఎక్కువ ఈ సినిమాలో. ఇంత మంచి సినిమాను మాకు అందించిన నితిలన్ సామినాథన్ తమిళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ దర్శకుడు మరియు కథా రచయిత. 2017లో విడుదలైన ‘కురంగు బొమ్మై’ సినిమా ద్వారా ఆయన దర్శకత్వ రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమా కథన శైలి, దర్శకత్వం కోసం ప్రత్యేకంగా ప్రశంసలు పొందింది. ఏడేళ్ల విరామం తరువాత, ఆయన రెండవ చిత్రం ‘మహారాజా’ (2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు సంగీతాన్ని మరియు నేపథ్య సంగీతాన్ని అందించిన B. అజనీష్ లోక్‌నాథ్, భారతీయ సినీ సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయన ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ, తమిళం మరియు తెలుగు సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 2009లో “శిశిర” చిత్రంతో సినీ సంగీతంలో అడుగుపెట్టిన ఆయన, 2015లో “ఉలిదవరూ కందంతే” చిత్రంతో గుర్తింపు పొంది, ఉత్తమ సంగీత దర్శకుడిగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు పొందారు. అజనీష్ “కిరిక్ పార్టీ,” “దియా,” “విక్రాంత్ రోణ,” మరియు “కాంతారా” వంటి హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఈ సినిమాలోని “అమ్మా నీకే” పాటను ప్రముఖ రచయిత శ్రీ వసంత్ రాశారు, మరియు ఈ పాటను సుమధురమైన స్వరంతో రితేష్ జి రావ్ పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “అమ్మా నీకే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: అమ్మా నీకే (Amma Neeke)
- సినిమా: Maharaja (మహారాజా)
- నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామ్
- సినిమా దర్శకుడు: నితిలన్ సామినాథన్
- సంగీత దర్శకుడు: బి అజనీష్ లోకనాథ్
- గేయరచయిత: శ్రీ వసంత్
- గాయకుడు: రితేష్ జి రావ్
- సినిమా విడుదల తేదీ: జూన్ 14, 2024
- లేబుల్: జంగ్లీ మ్యూజిక్ తెలుగు
Amma Neeke Song Lyrics in Telugu
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా
నీలో చూసా దైవం పూజించనా
కన్నది నేనే అయినా
నా తల్లివి నువ్వమ్మా
అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
రాకుమారివే నా రాజ్యం నీవమ్మా
దిశను చూపెడీ దిక్సూచి నీవమ్మా
సిసిరానా వాసంతమా
నిశిలోనా చిరుదీపమా
యే బంధము లేని బ్రతుకులోకొచ్చి
అన్నే నీవయ్యావమ్మా
అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
ఆస్తి లేదులే ఐశ్వర్యం లేదులే
పచ్చ నోటులో ఈ పాశముండధే
అమ్మంటి నీ రాకతో
అంబానీ అయ్యానులే
సంతోష మహారాజా కన్నా ఈ రోజా
ఎలిజబెత్ రాణి మనవరాలే
అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా
నీలో చూసా దైవం పూజించనా
కన్నది నేనే అయినా
నా తల్లివి నువ్వమ్మా
అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
Amma Neeke Lyrics in English
Malli Nene Ninnu Kannaana
Nuvve Lokam Naaku
Thelusa Chinna
Neelo Choosa Dhaivam
Poojinchana
Kannadi Nene Ayina
Naa Thallivi Nuvvamma
Amma Neeke Naannayanaa
Malli Nene Ninnu Kannaana
Raakumarive
Naa Rajyam Neevamma
Disanu Choopedi
Diksoochi Neevamma
Sisiraana Vaasanthama
Nisilonaa Chirudeepama
Ye Bandhamu Leni Brathukolokochi
Anne Neevayyaavamma
Amma Neeke Naannayanaa
Malli Nene Ninnu Kannaana
Aasthi Ledule
Aishwaryam Ledule
Pachcha Notulo
Ee Paasamundadhe
Ammanti Nee Raakatho
Ambani Ayyanule
Santosha Mahraaja
Kanna Ee Roja
Elizabeth Raani Manavaraale
Amma Neeke Naannayanaa
Malli Nene Ninnu Kannaana
Nuvve Lokam Naaku
Thelusa Chinna
Neelo Choosa Dhaivam
Poojinchana
Kannadi Nene Ayina
Naa Thallivi Nuvvamma
Amma Neeke Naannayanaa
Malli Nene Ninnu Kannaana
అమ్మా నీకే Video Song
మన తెలుగు హీరోల్లో చాలామంది కేవలం కమర్షియల్ సినిమాలను తీయడంలో చూపె ఆసక్తి మంచి కథలున్న సినిమాలను తీయడంలో చూపడం లేదు. యాబై సంవత్సరాలు పైబడిన మన తెలుగు హీరోల సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్, డ్యాన్స్, ఐటమ్ సాంగ్స్, గ్రావిటీ నియమాలకు వ్యతికేఖమైన ఫైట్లు ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నెన్నో ఉండి తీరాల్సిందే. అరె బాబు కొెెెంచెం మలయాళ, తమిళు సినిమాలను చూసి నేర్చుకోండి. అక్కడ మెజారిటి సినిమాలలో హీరో ఉండడు, కేవలం క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ కూడా మనలాగే సాధారణ వ్యక్తుల్లాగే ఉండి సమస్య వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ, వాటిని పరిష్కరిస్తూ ఉంటారు. అక్కడ మంచి కథలకు ప్రాముఖ్యత ఇస్తారు.
విజయ్ సేతుపతిని చూసి కొంత మందైనా మన తెలుగు నటుల్లో మార్పు రావాలి. విజయ్ సేతుపతి ఒక విలక్షణమైన నటుడు అనడంలో సందేహం లేదు. ఆయన ఏ పాత్రలోనైనా సులభంగా పరకాయ ప్రవేశం చేయగలడు ప్రేక్షకులను మెప్పించగలడు. ఈ మహారాజా సినిమాలో ఆయన నటన చాలా పీక్ లెవల్‍లో సెటిల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మా నీకే పాటలో ఒక తండ్రిగా తన కూతురిపై ఉండే ప్రేమను వ్యక్తం చేస్తాడు. కొన్ని జోనర్ పాటలు ఎక్కువగా మనకు కనిపించవు. అందులో తండ్రి కూతురికి సంబంధించిన పాటలైతే చాలా తక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ ఒక్క పాట ఆ లోటును తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఒక తండ్రి తన చిన్నారి కూతురికి ఈ పాటను డెడికేట్ చెయ్యవచ్చు. ఎందుకంటే కూతురిపై ఉండే ప్రేమంతా ఈ పాటలోని లిరిక్స్ లో మనకు కనబడతాయి.
Report a Lyrics Mistake / Share Your Thoughts