Aakaashame Pattanodu Song Lyrics | ఆకాశమే పట్టనోడు

Explore the lyrics of the Telugu Christian song ‘Aakaashame Pattanodu (ఆకాశమే పట్టనోడు)’.

Aakaashame Pattanodu Song Lyrics in Telugu

అవనిలో ఉద్భవించె
ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె
పసిబాలుని చూడగనే
పసిబాలుని చూడగనే

ఆకాశమే పట్టనోడు
ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై
వెలసినాడు రక్షకుడు (x2)

ఆనందమే మహా ఆనందమే
అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యేసు జననం అద్భుతమే (x2)

అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు (x2)
ఆదియందు వాక్యంబుగా
సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా
సృష్టి క్రమము నడిపించినాడు (x2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (x2)
|| ఆనందమే మహా ||

ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (x2)

పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (x2)
నిత్యముండు నీతి సూర్యుడు
సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు
పశుల పాకలో పవళించినాడు (x2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (x2)
|| ఆనందమే మహా ||

Akashame Pattanodu Lyrics in English

Avanilo Udbhavinche
Aadi Sambhuthuni Choodare
Pudamiye Paravshinche
Pasibaaluni Choodagane
Pasibaaluni Choodagane

Akashame Pattanodu
Dharanilo Puttinaadu
Daaveedu Puramunandu Deenudai
Velasinaadu Rakshakudu (x2)

Aanandame Mahaa Aanandame
Andariki Ilalo Santhoshame
Aascharyame Idi Adbhuthame
Yesu Jananam Adbhuthame (x2)

Adrushya Devuni
Mahima Swaroopudu
Aadi Anthamaina
Paraloka Naathudu (x2)
Aadiynadu Vaakyambugaa
Srushti Kaaryamu Jariginchinaadu
Anaadi Nundi Gnaanambugaa
Srushti Kramamu Nadipinchinadu (x2)
Annitini Kaliginchina Maharaaju
Kanneetini Thudachutaku
Digi Vachchinaadu (x2)
|| Aanandame Mahaa ||

Premanu Panche Premamayudu
Rakshana Ichche
Rakshinche Devudu (x2)

Paapame Leni Sugunala Sundarudu
Shaapamu Baapanu
Janminchenu Choodu (x2)
Nithyamundu Neethi Sooryudu
Sathya Saakshiga Ilakochchinadu
Premanu Panche Pavanathmudu
Pashula Paakalo Pavalinchinadu (x2)
Sarvaadhikaariyaina Maharaaju
Deenulaku Deevenagaa
Digi Vachchinaadu (x2)
|| Aanandame Mahaa ||

Aakashame Pattanodu Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top