This post features the Ambaraala Veedhilo song lyrics in Telugu and English from the Telugu movie ARM (2024). This soulful and melodious track is composed by Dhibu Ninan Thomas, with beautifully written lyrics by Krishna Kanth. Sung by Sinduri Vishal, with exceptional backing vocals by Pavithra Chari, Aravind Sreenivas, Shenbagaraj G, Narayanan Ravishankar, and Sarath Santosh, the song exudes a magical charm. In the film, Young Ajayan (played by Sreerang) listens intently as his grandmother Manikyam (Surabhi Lakshmi) narrates fascinating stories, adding an emotional depth to the song.
The lyrics beautifully weave imagery with soothing melodies, making the song a unique listening experience. It’s a track that leaves listeners spellbound and gives goosebumps, especially upon hearing it for the first time. With its poetic narration and emotional resonance, this song is crafted to perfection, leaving an everlasting impact.
అంబరాల వీధిలో
చిన్ని చందమామ రా
అందునా ఒదిగుంది రా
చెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసేరా
ఆ వెన్నెల కాంతిలో
కూర్మముందిరా
ఆ మాయ తాబేలుకి తాంబూల
పేటిక కట్టుంది రా
తాపీగా ఈదుకుంటూ నీళ్లల్లో
ఏమూలో దాకుంది రా
తార లాంటి ఆకారం
తాళమే దానికి వేసుంది రా
లెక్కనే పెట్టలేని వక్కలే
అందులో ఉన్నాయి రా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో
నాన్నా సరదాగ ఆడు
మురిపెంగా ఆడు
ఎదుగింక ఎదుగు ఎదుగు
లాలీ జో లాలీ జో
లాలీ జో లాలీ జో
నీ సుధూర దారిలో
ఆగకుండా సాగిపో
చెయ్యి పట్టి చూపగా
తోడులేరని ఆఆ..
ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే
నీటి అలలివే
నిశ్చింత గానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్ట వచ్చులేరా
నీ ముందు అగ్గి పుట్టే
చీకట్లే పారదోల కదిలే
నువ్వొక్క విత్తు వేస్తే
ఈ మన్ను అడవల్లే మార్చేయదా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో
నాన్నా సరదాగ ఆడు
మురిపెంగా ఆడు
ఎదుగింక ఎదుగు ఎదుగు
నిలవరా నిలవరా
పరుగున లే కదలరా
నిలవరా నిలవరా
జగమునే నువ్ గెలవరా