Hey Rangule Song Lyrics – Amaran (2024) | Anurag Kulkarni, Ramya Behara

హే రంగులే పాట యొక్క లిరిక్స్‌ను (Hey Rangule Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 31 అక్టోబర్ 2024న విడుదలైన అమరన్ (Amaran) అనే తెలుగు సినిమాలోని పాట. రాజ్‌కుమార్ పేరియసామి దర్శకత్వంలో, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం శివ్ అరూర్ మరియు రాహుల్ సింగ్ రచించిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడర్న్ మిలటరీ హీరోస్’ పుస్తకం ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ మాతృభూమి కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో మేజర్ ముఖుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా, సాయి పల్లవి, భువన్ అరోరా మరియు రాహుల్ బోస్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

ఇది ఒరిజినల్‍గా తమిళ చిత్రం. దీనిని మొదట తమిళంలో షూట్ చేసి తెలుగుతో సహా, హింది, మళయాళం, కన్నడ భాషలలో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా ముగ్గురు నిర్మాతల్లో కమల్ హాసన్ కూడా ఒకరు. ఇందులో ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తీకేయన్ మరియు అతని భార్య రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయిపల్లవి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 22వ రాజ్‌పుత్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ముకుంద్ వరదరాజన్ అంచలెంచలుగా కెప్టెన్ హోదాను మరియు చివరగా మేజర్ హోదాను పొందారు. ఈ అమరన్ సినిమా ముకుంద్ భార్య పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంటుంది.

ఇక ఈ సినిమాలోని పాటల విషయానికి వస్తే మొత్తం ఆరు పాటల్లో ఈ ‘హే రంగులే’ పాట సోషియల్ మీడియాలలో ట్రెడింగ్‍గా నిలిచింది. దీనికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించగా, సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రీ సాహిత్యాన్ని అందించారు మరియు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర ఈ పాటను తమ మధుర స్వరంతో ఆలపించారు. అదే తమిళంలో అయితే ‘హే మిన్నలే’ పేరుతో ఉన్న ఈ పాటను కార్తీక్ నేత రచించగా హరిచరణ్, శ్వేతా మోహన్ పాడారు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “హే రంగులే” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.


పాట సమాచారం:

  • పాట: హే రంగులే (Hey Rangule)
  • సినిమా: Amaran (అమరన్)
  • నటీనటులు: శివ కార్తీకేయన్, సాయిపల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు.
  • సినిమా దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి
  • సంగీత దర్శకుడు: జీవీ ప్రకాష్ కుమార్
  • గేయరచయిత: రామజోగయ్య శాస్త్రి
  • గాయకుడు: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా
  • సినిమా విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
  • లేబుల్: సరిగమ తెలుగు

Hey Rangule Song Lyrics in Telugu

హే రంగులే.. (రంగులే)
హే రంగులే.. (రంగులే)
నీ రాకతో లోకమే రంగులై పొంగెనే

వింతలే.. కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా ఆకసం అందెనే

స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే

ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం, అద్భుతం

సమయానికీ తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని

చిరుగాలిని (చిరుగాలిని)
నిలిపేదెలా (నిలిపేదెలా)
మన మధ్యలో చేరుకో వద్దనీ

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా

కలగనే వెన్నెల సమీపించెను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే.. (రంగులే)
హే రంగులే.. (రంగులే)
నీ రాకతో లోకమే రంగులై పొంగెనే

హే వింతలే, హే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా ఆకసం అందెనే

స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం, అద్భుతం

Hey Rangule Lyrics in English

Hey Rangule (Rangule)
Hey Rangule (Rangule)
Nee Rakato Lokame
Rangulai Pongenene

Vintale, Kerintale
Nee Chetillo Cheyiga
Aakasam Andene

Snehame Mellaga Geetale Daatene
Kalame Sakshiga Antharalu Cherige
Uhake Andani Sangatedho Jarige
Ee Kshanam Adbhutam, Adbhutam

Samayaniki Telipedela
Manavaipu Raaraadani
Dooramai Pommani

Chirugalini Nilipedela
Mana Madhyalo Cheruko Vaddani

Parichayam Ayinadi
Maro Sundara Prapancham Nuvuga
Madhuvanam Ayinadi
Manasse Cheli Chaitram Jataga

Kalagane Vennela
Samipichenu Nee Peruga
Hariville Na Medanallenu
Nee Premaga

Hey Rangule (Rangule)
Hey Rangule (Rangule)
Nee Rakato Lokame
Rangulai Pongenene

Hey Vintale, Hey Kerintale
Nee Chetillo Cheyiga
Aakasam Andhene

Snehame Mellaga Geetale Daatene
Kalame Sakshiga Antharalu Cherige
Uhake Andani Sangatedho Jarige
Ee Kshanam Adbhutam, Adbhutam

హే రంగులే వీడియో సాంగ్

Hey Rangule | Amaran | Sivakarthikeyan, Sai Pallavi | GV Prakash | Rajkumar| Kamal Haasan| Mahendran

పాట వచ్చే సందర్భం:

ఈ పాట వచ్చే సందర్భం ఏమిటంటే, హీరో ముకుంద్ వరదరాజన్ (శివకార్తికేయన్ పాత్ర) మరియు ఇందు రెబెకా వర్ఘీస్ (సాయి పల్లవి పాత్ర) మధ్య ప్రారంభమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. 2004లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో వీరు చదువుకుంటున్నప్పుడు, ఇందు జూనియర్ కాగా ముకుంద్ సీనియర్.

ఒక రోజు, కాలేజీలో ర్యాంప్ వాక్ పోటీ జరుగుతుంటే, ఇందు అక్కడి స్టేజ్ ఫియర్ వల్ల పాల్గొనడానికి వెనుకడుగు వేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె టీచర్ ఆమెను ప్రోత్సహిస్తూ, సీనియర్ అయిన ముకుంద్ వద్ద ర్యాంప్ వాక్ కోసం ట్రైనింగ్ తీసుకోవాలని సూచిస్తారు. ఇందు ముకుంద్‌ని కలుస్తుంది, అది వారి మొదటి పరిచయం. తనకు స్టేజ్ ఫియర్ ఉందని చెప్పినందుకు, ముకుంద్ ఇందును ధైర్యం చెప్పి, పోటీకి సిద్ధం చేస్తాడు. ముకుంద్ సహకారంతో ప్రాక్టీస్ చేసిన ఇందు, చివరికి పోటీలో పాల్గొని చీర కట్టులో సాంప్రదాయబద్దంగా ర్యాంప్ వాక్ చేస్తుంది. ఆ ర్యాంప్ వాక్ సందర్భంగా ముకుంద్, ఇందుని పట్ల ఆకర్షణతో ప్రేమలో పడతాడు. ఇదే సమయంలో “హే రంగులే” పాట వినిపిస్తుంది, ఈ పాటలో వీరిద్దరి అనుభూతులు ప్రతిఫలిస్తాయి, మరియు వారు కలిసి ఈ పాట పాడుతున్నట్లు ఉంటుంది.

ఈ పాట మొదలవుతున్నప్పుడు ముకుంద్ “హే రంగులే” అంటూ, అందమైన భావాలను ప్రదర్శిస్తూ, ఇందు తన జీవితంలోకి ప్రవేశించి తన లోకం మొత్తం రంగులతో నింపిందని అనిపిస్తున్నట్లు చెబుతాడు. ఇందు తన జీవితంలోకి రంగులు ప్రవేశించినట్లు అనుభూతి చెందుతూ తన సంతోషాన్ని “వింతలే, కేరింతలే” అంటూ వ్యక్తం చేస్తుంది. ఈ పాటలో, వీరిద్దరి మాటల్లో వారి ప్రేమ బంధం యొక్క సారాన్ని ప్రతిబింబిస్తుంది. పాటలోని ప్రతీ పదం వారు తమ జీవితంలో పరస్పర సహచర్యం ద్వారా ఎలా ప్రేరణ పొందారో, ప్రేమలో ఎలా మునిగిపోయారో తెలియజేస్తుంది.

పాటలోని మొదటి పదాలతోనే ముకుంద్, ఇందు తన మనసులో స్నేహం మెల్లగా ఎలా ప్రేమగా మారుతోందో అర్థం చేసుకుంటాడు. “స్నేహమే మెల్లగా గీతలే దాటెనే” అన్నట్లు, ఈ పాటలో ముకుంద్ చెప్పిన ప్రతీ మాటలో ప్రేమ భావాలు అంతర్భాగంగా ఉంచబడ్డాయి. అంటే ప్రారంభంలో కేవలం ఒక జూనియర్ మరియు సీనియర్ గానే మొదలైన వీరి సంబంధం మొల్లగా స్నేహితులుగా మారారు. అలాగే ఇలా ప్రయాణంలో స్నేహమనే భావం మెల్లిగా పోతూ అది ప్రేమ అనే భావాన్ని వ్యక్తం చేసే విధంగా మారుతున్నట్టు ఈ వ్యాక్యం ద్వారా మనకు వీరిరువురు చెబుతున్నారు. ఇలా ఈ పాట కొనసాగుతూ ఉంటుంది. “హే రంగులే” పాట వీరి ప్రణయయాత్రకు మొదటి అడుగు వేసిన ఆ మధురమైన క్షణాలను మధురంగా, మనసుకు హత్తుకునేలా అందిస్తుంది.

ముగింపు:

నాకు తెలిసి చాలామందికి ఈ పాట గురించి తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే సోషియల్ మీడియాలో చురుకుగా ఉంటారో వారికి కొద్దిగా ఈ పాట పరిచయం ఉంటుంది. అందులోను ఎవరికైతే మీమ్స్ నాలెడ్జ్ ఉంటుందో వారు ఖచ్చితంగా ఈ పాట అమరన్ సినిమాలోనిది అని తెలియక ముందే విని ఉంటారు. ఎందుకంటే ఈ పాటలోని ప్రారంభ పదాలను మీమర్స్ తమ నైపుణ్య కౌశల్యాన్ని ఉపయోగించి కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి. అదేలా అంటే ఈ పాట మొదలయ్యేది ‘హే రంగులే’ అనే కదా. కానీ మీమర్స్ “ర” తీసి “దె” పెట్టి పాడుకోండని తమ మీమ్స్ ద్వారా చెబుతున్నారు. ఇది కొంచెం డార్క్ కామీడి లాంటిది.

నాకు కూడా ఈ పాట పరిచయం ఇలానే జరిగింది. తర్వాత నేను ఈ పాట బాగుందే అస్సలు ఇది ఏ సినిమాలోనిది అని చూస్తే అప్పుడు తెలిసింది ఇది అమరన్ అనే శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమాలోనిది అని. అంటే చిత్రబృందాలు తమ సినిమా ప్రమోట్ చేయడానికి ఎందుకు సోషియల్ మీడియాకు అంత ప్రాముఖ్యం ఇస్తారో దీన్ని బట్టి తెలుస్తుంది.

ఈ ప్రారంభంలో సాయి పల్లవి ముచ్చటైన తన చిరునవ్వుతో అలా మళయాళ అమ్మాయిలు కట్టుకునే విధంగా చీర కట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తుంటే ఆహా కేక అసలు. సాధారణంగా అయితే ర్యాంప్ వాక్ చేసేవాళ్లు మోడ్రన్ బట్టలు వేసుకుంటారని మనకు తెలుసు. కానీ ఇలా చీరతో ర్యాంప్ వాక్ చేయడం చూస్తుంటే కమ్మగా ఉంటుంది. వాక్ సమయంలో సాయి పల్లవి ఎక్స్‍ప్రెషన్స్, దానిని చూసి శివ కార్తికేయన్ చిన్నగా నవ్వు ముఖంతో ఇచ్చే హావాభావాలు చూసే వారికి తెగ నచ్చేస్తాయి. దానికి తోడు బ్యాగ్రౌండ్‍లో వచ్చే ఈ ‘హే రంగులే’ పాట కలిసి ఆ సందర్భాన్ని చాలా గ్రాండ్‍గా మార్చేస్తాయి. మీరు ఈ పాటను వినకపోయుంటే ఒకసారి వినండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది మీకు నచ్చి, మీ హిట్ సాంగ్స్ లీస్ట్ లో చేరుతుంది.

Report a Lyrics Mistake / Share Your Thoughts