Nuvvu Navvukuntu Song Lyrics – MAD (2023) | Bheems Ceciroleo

నువ్వు నవ్వుకుంటు పాట యొక్క లిరిక్స్‌ను (Nuvvu Navvukuntu Song Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరిగింది. ఇది 2023లో విడుదలైన మ్యాడ్ (MAD) అనే తెలుగు సినిమాలోని పాట. హ్యాపీ డేస్ (2007) లాంటి యూత్‍ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కాలేజ్ బ్రాక్‍డ్రాప్‍లో జరిగే కథలతో కూడిన సినిమాలు ఇక రావేమో అనుకునే సమయంలోనే మ్యాడ్ సినిమా మన ముందుకు వచ్చింది. కోవిడ్ సమయంలో పనులేమి లేక ఇంట్లో కూర్చున్న చాలమందిని కడుపుబ్బ నవ్వించిన ‘జాతిరత్నాలు (2021)’ సినిమాలాగే, ఈ మ్యాడ్ సినిమా కూడా అంతే నవ్విస్తుంది. కళ్యాణ్ శంకర్ రచన, దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు వంటి ప్రముఖ నటులు ఉన్నారు.

కన్నడలో హిట్ అయిన ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె (2023)’ సినిమాను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిమేక్ చేశారు. కాని ఇది తెలుగు సరిగ్గా ఆడలేదు. ఈ బాయ్స్ హాస్టల్ సినిమాలో ఒక హీరో హీరోయిన్ లాగా ఉండకుండా కేవలం క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అదే విధంగా ఈ మ్యాడ్ సినిమాకు కూడా బాయ్స్ హాస్టల్ సినిమాకు కొన్ని సారూప్యతలు కనిపిస్తుండడంతో ఈ సినిమా కూడా ఎత్తిపోతల పథకమేమో అని అనుకున్నారు చాలామంది. కానీ ప్రమోషన్లలో చిత్రబృందం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. ఇది జాతిరత్నాలు సినిమా కన్నా కూడా ప్రేక్షకులను ఎక్కువగా నవ్విస్తుందని జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పించారు.

మొదట్లో నేను కూడా ఏంట్రా బాబు ఈ సినిమాకు జాతిరత్నాలు సినిమాతో పోల్చుతూ, జాతిరత్నాలు కంటే బాగుంటుందని చెబుతున్నారనుకున్నాను. ఎందుకంటే జాతిరత్నాలు ఒన్ ఆఫ్ మై ఫేవరేట్ సినిమాలలో ఒకటి. చిత్రబృందం టీజర్, ట్రైలర్, పాటలు అని ఒక్కోక్కటిగా విడుదల చేస్తు ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటు వెళ్ళారు. ఇక ఈ సినిమాలోని పాటలైతే అరాచకం అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అని తెలియగానే పక్కా పాటలు హిట్ అవుతాయనే నమ్మకం కలగడం సహజమే. ఎందుకంటే దీనకన్నా ముందు సినిమాలకు ఆయన ఇచ్చిన పాటలు మామూలుగా లేవు మరి. ఈ యూత్‍ఫుల్ ఎంటర్టైనర్ చిత్రానిక తగ్గట్టుగానే అన్ని పాటలను తన సంగీతంతో కుమ్మేశాడు మన బీమ్స్.

ఇక ఈ మ్యాడ్ సినిమాలోని “నువ్వు నవ్వుకుంటు” పాటను భాస్కర భట్ల రాశారు, కాగా ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. కపిల్ కపిలన్ తమిళ్, తెలుగు మరియు మలయాళ సినిమాలలో ప్లేబ్యాక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. 1992 నవంబర్ 4న కేరళలోని కట్టారక్కరలో జన్మించిన కపిలన్, ఆయన సంగీత ప్రియమైన విద్యను మరింత ముందుకు తీసుకోవాలని నిర్ణయించుకుని చెన్నైకి తరలించారు. 2017లో “నెను లోకల్” సినిమా నుండి “చాంపేసవే నన్ను,” “హ్యాపీ న్యూఇయర్” కన్నడ చిత్రంలో “బడుకే నీనంత నాటక,” మరియు “మరగధ నానాయం” టామిల్ చిత్రంలో “ఉసిరేడుక్కు కూటం” వంటి పాటలతో తన ప్రొఫెషనల్ కరీర్ ప్రారంభించారు. “నువ్వు నవ్వుకుంటు” పాటతో, ఆయన తన మాధుర్యంతో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడుస్తున్నాడు. మీరు పాడుకోవడానికి సులభంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో “నువ్వు నవ్వుకుంటు” పాట యొక్క సాహిత్యాన్ని (లిరిక్స్) యూట్యూబ్ వీడియోతో సహా క్రింద అందించడం జరిగింది.

పాట సమాచారం:

  • పాట: నువ్వు నవ్వుకుంటు (Nuvvu Navvukuntu)
  • సినిమా: MAD (మ్యాడ్)
  • నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు
  • సినిమా దర్శకుడు: కల్యాణ్ శంకర్
  • సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
  • గేయరచయిత: భాస్కరభట్ల
  • గాయకుడు: కపిల్ కపిలన్
  • సినిమా విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023
  • లేబుల్: ఆదిత్య మ్యూజిక్

Nuvvu Navvukuntu Song Lyrics in Telugu

నువ్వు నవ్వుకుంటు వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే

చిన్ని చిన్ని కళ్ళే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే

ముక్కు మీద కోపం అందం
మూతి ముడుచుకుంటే అందం
ఝంకాలలా ఊగుతు ఉంటే
ఇంకా అందమే

నీ పిచ్చి పట్టిందిలే
అది నీవైపే నెట్టిందిలే
ఏమైన బాగుందిలే
నువ్వు ఒప్పుకుంటే
జరుపుకుంట జాతరలే

నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే

ఈ తిరిగే తిరుగుడు
గుడి చుట్టూ తిరిగితే
దిగి వచ్చి దేవతే
వరమిస్తా నంటదే

నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే..ఏ
ఏ ఏ ఏ ఏ ఏ

నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే

అవునంటే అవునను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను

నీలాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగవాడెవ్వడు
ప్రేమంటే నమ్మడూ..ఊ

నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
అయ్ అయ్ అయ్ అయ్
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే
పిల్లా కొంచం కసురుకుంటు
ఉండి పోరాదే

Nuvvu Navvukuntu Lyrics in English

Nuvvu Navvukuntu Vellipomaake
Naa Gundenemo Gillipomaake

Chinni Chinni Kalle Andham
Muddhu Muddhu Maatalu Andham
Bujji Bujji Buggala Merupe
Yentho Andhame

Mukku Meedha Kopam Andham
Moothi Muduchukunte Andham
Jhumkaalalaa Ooguthu Unte
Inkaa Andhame

Nee Pichhi Pattindhile
Adhi Neevaipe Nettindhile
Yemaina Baagundhile
Nuvvu Oppukunte
Jarupukunta Jaatharale

Nuvvu Navvukuntu Vellipomaake
Naa Gundenemo Gillipomaake
Nuvvu Thappukuntu Vellipomaake
Pillaa Ninnu Hatthukuntu
Undi Pothaane

Ee Thirige Thirugudu
Gudi Chuttu Thirigithe
Dhigi Vachhi Devathe
Varamisthaa Nantadhe

Nuvvu Koncham Karigithe
Prapancham Munagadhe
Ee Pantham Vadhilithe
Yugaantham Raadhule Ye
Ye Ye Ye Ye Ye

Nuvvu Navvukuntu Vellipomaake
Naa Gundenemo Gillipomaake
Nuvvu Thippukuntu Vellipomaake
Pillaa Nenu Thittukuntu
Undi Polene

Avunante Avunanu
Kaadhante Kaadhanu
Nadi Madhya Oogithe
Nenettaa Saavanu

Neelaage Andharu
Visigisthe Ammadu
Magavaadevvadu
Premante Nammadoo Oo
Oo Oo Oo Oo Oo

Nuvvu Navvukuntu Vellipomaake
Ayy Ayy Ayy Ayy
Naa Gundenemo Gillipomaake
Choosi Choodanattu Vellipomaake
Pillaa Koncham Kasurukuntu
Undi Poraadhe

నువ్వు నవ్వుకుంటు Video Song

Nuvvu Navvukuntu Lyric Video | MAD | Kalyan Shankar | S. Naga Vamsi | Bheems Ceciroleo

ఈ పాట “మ్యాడ్” సినిమాలోని ఒక అందమైన మరియు సరదా ప్రేమ పాట. కాలేజ్ నేపథ్యంలో ఏర్పడిన అనేక ప్రేమకథల మధ్య, ఈ పాట అబ్బాయిల దృష్టికోణంలో ఉన్న ప్రేమను, కష్టాలను, ఆనందాలను తెలియజేస్తుంది. ఈ పాటలో నాలుగు యువకులు, మనోజ్, అశోక్, డీడీ, మరియు లడ్డు, అనేక రకాల అనుభవాలను పంచుకుంటారు, ముఖ్యంగా వారు ఇష్టమైన అమ్మాయిల గురించి ఎలా భావిస్తారో, వారి సంబంధాలలో ఎదురయ్యే కష్టాలు మరియు ఆనందాలను ఎలా ఎదుర్కొంటారో.

ఈ పాటకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు, గేయాలను భాస్కరభట్ల రాశారు, మరియు కపిల్ కపిలన్ పాడారు. వారి ప్రతిభ ఈ పాటలో గొప్పగా చూపబడింది, మధురమైన సాహిత్యం మరియు వినూత్నమైన సంగీతంతో ఈ పాట యువతను ఎంతో ఆకర్షిస్తుంది. “నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే” అనే పంక్తి ద్వారా, తమ హృదయాలను వ్యక్తం చేయడం, అమ్మాయిల అందాన్ని స్తుతించడం మరియు ప్రేమ అనుభవాలను పంచుకోవడం ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాలేజ్ జీవితంలో జరిగే అనేక సంఘటనలను అద్భుతంగా చిత్రించిన ఈ పాట, వినోదం మరియు భావోద్వేగాలను పండించేందుకు చాలా శ్రద్ధ వహించింది.

Report a Lyrics Mistake / Share Your Thoughts