Kalyani Vaccha Vacchaa Lyrics – The Family Star (2024) | Mangli, Karthik

కళ్యాణి వచ్చా వచ్చా పాట యొక్క లిరిక్స్‌ను (Kalyani Vaccha Vacchaa Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) అనే తెలుగు సినిమాలోని పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వెన్నెల కిషోర్, జగపతి బాబు, రోహిణి హట్టంగడి, అచ్యుత్ కుమార్, వాసుకి, అభిరామి తదితరులు నటించారు.

ఈ సినిమా ఒక కళాఖండం అనడంలో సందేహం లేదు. ‘గ్రేట్ ఆంధ్ర’ వైబ్సైట్ లో ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని మెరవని స్టార్ అని రివ్యూ పేరుతో ఈ సినిమాను రోస్ట్ చేశారు. రివ్యూని అలా రాయడం కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఆ సినిమా కథ, కథనం, హీరో క్యారెక్టర్, విచిత్రమైన హీరో కుటుంబ సభ్యులు, విలన్, హీరోయిన్ ఇలా చెప్పుకుంటు పోతే పాటలు మినహా ఈ సినిమాలోని ప్రతీది అంత వరెస్ట్ గా ఉంటాయి. దీని పూర్తి భాద్యత దర్శకుడు పరశురామ్ తీసుకోవాలి. ఇతను ఈ సినిమాకు ముందు మహేశ్ బాబుతో ‘సర్కారువారి పాట’ సినిమాను తెరకెక్కించాడు. అది మరో కళాకండం, దాని గురించి ఇప్పుడెందుకులే.

పరశురామ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ కు దగ్గరి బంధువు. ఇతను మొదట్లో పూరీ జగన్నాద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తర్వాత దర్శకుడిగా నిఖిల్ సిధ్దార్థ్ హీరోగా ‘యువత (2008)’ సినిమాను తీశాడు. ఇతను తీసిన సినిమాలు అన్నిటిలో ‘గీతా గోవిందం (2018)’ ఒక్కటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎందుకో ఏమిట్ పరుశురామ్ గారు కమ్ బాక్ ఇచ్చేటట్లు లేడు. ఇతని సినిమాలకు ఇతనే కథా రచయిత కూడా అవ్వడం వల్ల సినిమాలు బొక్కబోర్ల పడుతున్నాయి. గీతా గోవిందం సినిమా తర్వాత మహేశ్ బాబు గారికి ‘సర్కారువారి పాట’ రూపంలో పెద్ద రాడ్ సినిమాను అందించారు. ఇప్పుడు విజయ్ ఈ సినిమాతో కూడా దానికంటే కొంచెం పెద్ద రాడ్‌ను ఇచ్చాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఐనా ఊరట ఇస్తుందనుకుంటే మొత్తం రివర్స్ అయింది.

ఇక ఈ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలోని పాటల విషయానికి వస్తే, పర్లేదు పాటలు బాగానే ఉన్నాయి. మొత్తం ఐదు పాటలలో ఈ ‘కళ్యాణి వచ్చా వచ్చా’ పాట బాగుంది. దీనికి సంగీతాన్ని గోపిసుందర్ అందించారు. ఈయన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేసి ప్రసిద్ధిగాంచారు. అలాగే పాటను రాసింది అనంత శ్రీరామ్. ఇతను రాసిన ప్రతీ పాటలు ఆల్మోస్ట్ హిట్ టాక్ తెప్పించుకుంటున్నాయి. ఈ పాట కూడా సినిమాతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ పాటను మంగ్లీ మరియు కార్తీక్ పాడారు. ‘కళ్యాణి వచ్చా వచ్చా’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.

పాట సమాచారం:

Kalyani Vaccha Vacchaa Song Lyrics in Telugu

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
(నంనంతన నంనంతన
నంనంతన నంనంతన)

డుముకు డుమా డుమారి
జమకు జమా జమారి
ముస్తాబై ఉన్నా మరి
అదరగొట్టెయ్ కచేరీ

చిటికెలు వేస్తోంది
కునుకు చెడిన కుమారి
చిటికెన వేలిస్తే
చివరి వరకు షికారీ

ఎన్నో పొదలెరకా
ఎంతో పదిలముగా
ఒదిగిన పుప్పొడిని
నీకిప్పుడు అప్పగించా

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
(నంనంతన నంనంతన
నంనంతన నంనంతన)

హెయ్ హెయ్ హెయ్ హెయ్
సువ్వీ కస్తూరి రంగ
సువ్వీ కావీధి రంగ
సువ్వి బంగారు రంగ
సువ్వి సువ్వీరీ
పచ్చాని పందిరి వేసి
పంచావన్నెల ముగ్గులు పెట్టి
పేరాంటాలు అంతా కలిసి పసుపు పంచారే

సాహో సమస్తము ఏలుకొనేలా
సర్వం ఇవ్వాలని ముందర ఉంచా
ఎగబడి దండయాత్ర చెయ్‍రా

కలబడిపోతూ గెలిపిస్తా
నీ పడుచు కలనీ
బరిలో నిలిచే ప్రతిసారీ, ఆ ఆ
అలసటలోను వదిలెయ్‍కుండా
ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరీ, ఆ ఆ

తగువుల కధా, ఆ ఆ ఆ
ముగిసెను కదా, ఆ ఆ ఆ
బిగిసిన ముడి తెగదిక పదా, ఆ ఆఆ

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా (x2)

Kalyani Vaccha Vacchaa Lyrics in English

Kalyani Vaccha Vacchaa
Pancha Kalyani Techhaa Techhaa

Dhamaku Dhamaa Dhamaari
Chamaku Chamaa Chamaari
Sayyaari Sarasari
Modhalu Pettey Savaari

Dumuku Dumaa Dumaari
Jamaku Jamaa Jamaari
Musthaabai Unnaa Mari
Adharagottey Kacheri
(Namnamtan Namnamtan
Namnamtan Namnamtan)

Chitikelu Vesthondi
Kunuku Chedina Kumari
Chitikena Velisthe
Chivari Varaku Shikaari

Enno Podhalerakaa
Entho Padhilamugaa
Odhigina Puppodini
Neekippudu Appaginchaa

Kalyani Vaccha Vacchaa
Pancha Kalyani Techhaa Techhaa
Singari Cheyyamdhinchaa
Enugambaari Siddhamgunchaa

Dhamaku Dhamaa Dhamaari
Chamaku Chamaa Chamaari
Sayyaari Sarasari
Modhalu Pettey Savaari
(Namnamtan Namnamtan
Namnamtan Namnamtan)

Hey.. Hey..
Suvvi Kasturi Ranga
Suvvi kaaveedhi Vanka
Suvvi Bangaru Ranga
Suvvi Suvvuri
Pachhaani Pandiri Vesi
Panchavannela Muggulu Petti
Perantaalu Anthaa Kalisi
Pasupu Panchaare

Saaho Samasthamu Yelukonelaa
Sarwam Ivvaalani Mundara Unchaa
Egabadi Dhandayaathra Cheyraa

Kalabadi Pothu Gelipisthaa
Nee Paduchu Kalani
Barilo Niliche Prathisaari, Aa Aa
Alasatalonu Vadhileykundaa
Odisi Odisi Padathanu Choode
Ninu Kori, Aa Aa

Thaguvula Kadhaa, Aa Aa
Mugisenu Kadhaa, Aa Aa
Bigisina Mudi Tegadhika Padha, Aa Aa

Kalyani Vaccha Vacchaa
Pancha Kalyani Techhaa Techhaa
Singari Cheyyandhinchaa
Enugambaari Siddhamgunchaa (x2)

కళ్యాణి వచ్చా వచ్చా Video Song

Kalyani Vaccha Vacchaa Lyrical - The Family Star | Vijay Deverakonda, Mrunal |Gopi Sundar |Parasuram

ఈ పాట యూట్యూబ్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రజల ద్వారా విశేష స్పందన రాబట్టింది. వ్యూస్ కూడా మిలియన్ల కొద్ది వచ్చాయి. ఇక సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదలైంది. నేను సినిమాను థియేటర్ లో చూస్తున్నప్పుడు చిత్రవిచిత్ర ఎక్స్ ప్రెషన్స్ తో ఒపిక లేకపోయిన, ఆ కళాఖండాన్ని చూసి నా బాడీ సరిగ్గా స్పందిచక పోయిన కూడా కేవలం ఈ పాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నాను. కానీ సినిమా అయిపోవడానికి వస్తుంది కాని ఈ పాట మాత్రం రావడం లేదు. ఆ పాట లేకపోయిన పర్లేదులే, ఎందుకంటే అలాంటి హిట్ కాట్ తెచ్చుకున్న పాట కలిగి ఉండడానికి ఈ సినిమాకు అర్హత లేదు అనుకుని, సినిమా మొత్తం అయిపోయినాక నేను కూర్చున్న సీట్లో నుండి లేస్తున్నప్పుడు ఈ పాట వచ్చింది.

అంటే సినిమాలో ఆ పాటకు ఎక్కడా స్థానం కల్పించడకుండా శుభం కార్డు పడే సందర్భంలో వేశారేంట్రా అనుకుంటూ, సర్లే ఇప్పుడైన వేశారు చూసి వెళదామంటే మిగతా జనాలు అప్పటికే కళాకాండంలాంటి ఆ మొత్తం సినిమాని చూసి విసిగిపోయి, ఆ పాటను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. సర్లే వారు వెళితే వెళ్ళనీ నేను పాట మొత్తం చూసి వెళతా అని అలానే సీట్లో కూర్చున్న, అంతే సగం పాట కూడా కంప్లీట్ అవ్వలేదు థియేటరోడు బంద్ చేసేశాడు.

ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఎంత చెత్తగా చెప్పినా కూడా, ఈ కళ్యాణి వచ్చా వచ్చా పాటను మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. పాటలో మంచి జోష్ ఉంది, పండగ వాతారణాన్ని క్రియేట్ చేసే సత్తా ఉంది. ఈ పాటలో మృణాల్ ఠాకూర్ మరియు విజయ్ దేవరకొండ సంప్రదాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ ను ఇరగదీస్తుంటే (సింపుల్ స్టెప్సే అయిన చూడముచ్చటగా ఉంటుంది) చూడడానికి బలే అనిపిస్తుంటుంది.

Report a Lyrics Mistake / Share Your Thoughts